Thursday, May 31, 2012

కన్నీటికి ఓట్లు రాలేనా...

విశాఖపట్నం, మే 31:   వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ గురువారం తన ప్రచారంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె తన కూతురు షర్మిళతో పాటు పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారానికి వచ్చే ముందు తాను జైలులో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చానని, జగన్ చాలా ధైర్యంగా, నమ్మకంగా ఉన్నాడని, తాను ఏ తప్పు చేయలేదని తనతో చెప్పాడని అన్నారు. ధైర్యంగా ఉండమని తనకూ చెప్పాడన్నారు.ఉప ఎన్నికలలో అభ్యర్థులను గెలిపించాలని చెప్పాలని తనకు సూచించాడన్నారు. వైయస్ కాంగ్రెసును కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకు వచ్చి, ప్రజల కోసం పథకాలు ప్రవేశపెడితే ఇప్పుడు ఆయనను దోషిగా చిత్రీకరించే కుట్ర జరుగుతోందన్నారు. హెలికాప్టర్ ప్రమాదంపై తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. సిబిఐ విచారణ సజావుగా సాగిందని తాను భావించడం లేదన్నారు. తన సోదరుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలుకు పంపించారని షర్మిళ ఆరోపించారు. కుట్ర రాజకీయాలకు ఉప ఎన్నికలలో బుద్ధి చెప్పాలన్నారు.

రాష్ట్రంలో బారత్ బంద్ పాక్షికం

హైదరాబాద్, మే 31:  పెట్రోల్ ధరల పెంపును  నిరసిస్తూ కాంగ్రెసేతర పార్టీలు చేపట్టిన భారత్ బంద్‌కు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అన్ని జిలాల్లలో ఆర్టీసి డిపోల ఎదుట తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘనటలు జరకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.  వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్చంధంగా బంద్ లో పాల్గొంటున్నారు. హైదరాబాదులో బంద్ పాక్షికంగా కొనసాగుతోంది.  మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్ద  సిపిఎం ఆందోళన కారణంగా ఒక్క బస్సు కూడా బయటకు వెళ్లలేదు.  నగరంలో కొన్నిచోట్ల పెట్రోల్ బంకులను మూసివేశారు. ఇతర జిల్లాల నుంచి నగరానికి వచ్చే యాభై బస్సు సర్వీసులను నిలిపివేసినట్లు ఆర్టీసి అధికారులు చెప్పారు. నగరంలో లోకల్ బస్సులు యథావిథిగా తిరుగుతున్నాయి. దక్షిణ భారత దేశంలో బంద్ ప్రభావం పెద్దగా  లేదు. తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలలో బంద్ ప్రభావం చాలా తక్కువగా ఉంది. అయితే ఉత్తర భారత దేశంలో బంద్ ప్రభావం ఎక్కువగా ఉంది. ముంబయి, లక్నో, పాట్నాలలో శివసేన, బిజెపి, బిజెడి కార్యకర్తలు రోడ్ల పైకి, రైలు పట్టాల పైకి వచ్చి వాహనాలను, రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. 

వివాదాస్పద సైన్యాధిపతి జనరల్ వికె సింగ్‌ పదవీ విరమణ

న్యూఢిల్లీ, మే 31:  అత్యంత వివాదాస్పద సైన్యాధిపతిగా పేరొందిన జనరల్ వికె సింగ్‌ గురువారం పదవీ విరమణ చేశారు. తన పదవి విరమణ వయస్సు విషయంలో ప్రభుత్వాన్నే కోర్టుకీడ్చి రికార్డు సృష్టించిన ఆయన ప్రభుత్వం పట్టుదల, కోర్టు తీర్పులకు మెట్టుదిగి, బెట్టువీడి చివరకి పదవి విరమణ చేయక తప్పలేదు. అటు అత్యంత సమర్థుడుగా, ఇటు అతి వివాదాస్పదుడిగా జనరల్‌ వికె సింగ్ చరిత్రలో నిలిచిపోయారు. తనకే తోటి అధికారులు లంచం ఇవ్వజూపారని వెల్లడించి, సుక్నా భూ కుంభకోణంలో నిందితులకు శిక్షలు వేసి ఆయన ఆర్మీలో అవినీతి వ్యతిరేక పోరాట యోధుడిగా వార్తల్లో నిలిచారు. మరో వైపు ఆర్మీలో వర్గపోరుకు తెరతీసిన వ్యక్తిగా, రక్షణశాఖతో బాహీబాహీకి దిగిన వ్యక్తిగా ఆయన మిగిలిపోయారు. మొత్తం మీద ప్రత్యక్ష యుద్ధాల్లో స్వయంగా పాల్గొని, సేనలను నడిపించిన అనుభవం ఉన్న వికె సింగ్ సైనిక జీవన చరమాంకం వివాదాస్పదంగా మిగిలిపోయింది. చిట్టచివరి అధికారిక కార్యక్రమంలో జనరల్‌ వికె సింగ్‌ అమరజవాన్లకు నివాళి అర్పించారు. ఆయన స్థానంలో జనరల్‌ విక్రమ్ సింగ్‌ సేనాధ్యక్షుడిగా రెండేళ్లపాటు బాధ్యతలు నిర్వహిస్తారు.

Wednesday, May 30, 2012

నర్సన్నపేటలో విజయమ్మ రోడ్ షో

మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకోవాలని తళ్ళీకూతుళ్ళ పిలుపు 
శ్రీకాకుళం,మే 30:   వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మశ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలోరోడ్ షో నిర్వహిస్తూ తొలి ఎన్నికల ప్రసంగం చేశారు,  జగన్‌కు జరిగిన అన్యాయాన్ని,  రాజశేఖర రెడ్డిపై జరిగిన కుట్రను, తన కడుపు మంటను  గుర్తు పెట్టుకుని ఓటు వేయాలని పిలుపు ఇచ్చారు.    వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆమె పిలుపు ఇచ్చారు. పాదయాత్ర అనుభవాలను, అంతకు ముందటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి అయిన తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, పార్టీలకూ మతాలకూ కులాలకూ అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలని వైయస్ ఆశించారని, ఆ పథకాలు ఎలా అమలవుతున్నాయో చూడడానికే రచ్చబండ కార్యక్రమానికి ఆ రోజు బయలుదేరారని అన్నారు. రైతుల కోసమే అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చి కాంగ్రెసు నుంచి బయటకు వచ్చిన తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. ప్రతి అన్యాయానికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ప్రస్తుత ఉప  ఎన్నికలు  రాష్ట్ర రాజకీయాలను మార్చే ఎన్నికలని అన్నారు. ఆమె పక్కనే కూతురు షర్మిళ పార్టీ గుర్తు ఫ్యాన్‌ను ప్రదర్సిస్తూ ,జగనన్నను అన్యాయంగా అరెస్టు చేశారని అన్నారు. తమ కన్నీటిని చూసి నవ్వుతున్నవారికి గుణపాఠం చెప్పాలని ఆమె ప్రజలను కోరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేసి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు బుద్ధి చెప్పాలని,   మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకోవాలని, జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆమె పిలుపు ఇచ్చారు. 

బొబ్బిలి కాంగ్రెస్ కోటకు బీట

జగన్  పార్టీలో చేరిన  ఎమ్మెల్యే  రంగారావు 
విజయనగరం,మే 30:  బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ వెంకట రంగారావు బుధవారం తన శాసన సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనితో విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకిఎదురుదెబ్బ తగిలినట్లయింది. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు పట్టున్న ఈ జిల్లా నుంచి ఓ శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీని వీడి వైరివర్గంలో చేరడం ఇదే ప్రథమం. దీనితో జిల్లాలో రాజకీయ సమీరకణాలు మారే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న బొబ్బిలి నియోజకవర్గం నుంచి రంగారావు వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. మంత్రి పదవిని ఆశించారు. అయితే బొత్స కుటుంబ హవా నేపథ్యంలో రంగారావుకి మంత్రివర్గంలో చోటు దక్కలేదు.దీనితో అసంతృప్తితో ఉన్న రంగారావు కొద్ది రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు దృష్టి సారించారు. రంగారావు ఇటీవల హైదరాబాదు వచ్చి వైయస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు.  తాను జగన్‌కు సంఘీభావం తెలియజేయడానికి మాత్రమే వచ్చానని ఆయన అప్పట్లో చెప్పారు.

Monday, May 28, 2012

తమిళనాడు లోని ఇరోడ్ లో ఒక ప్రైవేటు ఫెర్టిలిటీ ఆస్పత్రిలో ఈ నె ల 23న ఒకేరొజున పుట్టిన బేబీలు వీళ్ళంతా...   వీళ్ళు మొత్తం 26 మంది కాగా, వీరిలో ఏడుగురు కవలలు ఉన్నారు.

ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలకు ఇక కామన్ ఎంట్రన్స్...

ఇంటర్ మార్కులకు 50 శాతం వెయిటేజీ  
న్యూఢిల్లీ,  మే 28: ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు వంటి కేంద్ర నిధులతో నడిచే ఇంజనీరింగ్ విద్యా సంస్థలకు 2013 విద్యా సంవత్సరం  నుంచి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు.మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబల్ ఆధ్వర్యంలో జరిగిన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల పాలక మండళ్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటి పరిధిలోకి వచ్చే ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించాలని తీర్మానించారు. అదే సమయంలో 12వ తరగతి (ఇంటర్మీడియెట్) పరీక్షలను కూడా ప్రవేశార్హతలో పరిగణనలోకి తీసుకోవాలని.. ఇంటర్ మార్కులకు 50 శాతం వెయిటేజీ, ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 50 శాతం వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షలో భాగంగా మెయిన్ టెస్ట్, అడ్వాన్స్ డ్  టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఈ రెండు టెస్టులూ ఒకే రోజు జరుగుతాయి. మెయిన్ టెస్టులో అత్యధిక మార్కులు సాధించిన 50,000 మందికి చెందిన అడ్వాన్స్ టెస్ట్ పేపర్లను మూల్యాంకనం చేసి.. మెరిట్ ప్రాతిపదికన ఐఐటీ ప్రవేశాలకు ర్యాంకులు ఇస్తారు. ఐఐటీలు మినహా ఇతర కాలేజీలకు.. బోర్డు పరీక్షల మార్కులకు 40 శాతం, మెయిన్ టెస్టుకు 30 శాతం, అడ్వాన్స్ టెస్ట్ కు 30 శాతం వెయిటేజీ ఇస్తారు. మెయిన్ టెస్ట్ కు మల్టిపుల్ చాయిస్ పేపర్ ఉంటుందని, అడ్వాన్స్ డ్  టెస్ట్ విధివిధానాలను ఐఐటీల జాయింట్ అడ్మిషన్ బోర్డు రూపొందిస్తుంది. ప్రశ్నపత్రాల రూపకల్పన, మూల్యాంకనం, మెరిట్ లిస్టుల తయారీ వంటి అంశాల్లో జేఏబీకి పూర్తి నియంత్రణ ఉంటుందని, ఈ పరీక్షల నిర్వహణకు సీబీఎస్‌ఈ పాలనాపరమైన సహాయాన్ని అందిస్తుందని కపిల్ సిబల్  వివరించారు.

టైమ్స్ మ్యాగజైన్‌లో ’ఆవారా’

వాషింగ్టన్, మే 28: : 1950 దశకంలో  భారత సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ’ఆవారా’ చిత్రానికి అమెరికాలోని ప్రముఖ పత్రిక టైమ్స్ మ్యాగజైన్‌లో చోటు దక్కింది. 1951 సంవత్సరంలో ఆవారా చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజ్ కపూర్ నిర్మించారు. 1923 నుంచి నిర్మించిన 100 గొప్ప చిత్రాల జాబితాను టైమ్స్ మ్యాగజైన్ రూపొందిస్తోంది. చార్లీ చాప్లిన్ చిత్రం ‘ది ట్రాంప్’ను స్పూర్తిగా తీసుకుని ఆవారా చిత్రాన్ని నిర్మించారు. ఆవారా చిత్రంలో నర్గీస్‌తో కలిసి రాజ్ కపూర్ మెరుపులు మెరిపించారు. ఈ చిత్రంలో శంకర్-జైకిషన్ అందించిన ‘ఆవారా హూ’ పాట సంగీత ప్రపంచంలో  టాప్‌గా నిలిచింది. 

ఉప ఎన్నికల బరిలో 255 మంది

åహైదరాబాద్,  మే 28þ: ªÃ†¾Z¢©ð 18 Æ客Hx, ŠÂ¹ ¤Äª½x-„çÕ¢{Õ ²Än¯Ã-EÂË •Jê’ …X¾ ‡Eo-¹©ðx Ʀµ¼u-ª½Õn© ÅŒÕC èÇG-ÅÃÊÕ ‡Eo-¹© ¹NÕ-†¾¯þ “X¾Â¹-šË¢-*¢C. „çáÅŒh¢ 255 «Õ¢C …X¾ ‡Eo-¹© ¦J©ð EL-Íê½Õ. ¯ç©Öxª½Õ ¤Äª½x-„çÕ¢{Õ ²Än¯Ã-EÂË 13 «Õ¢C, 18 Æ客Hx ²Än¯Ã-©Â¹× 242 «Õ¢C ¤òšÌ©ð …Êo{Õx “X¾ŸµÄÊ ‡Eo-¹© ÆCµ-ÂÃJ ¦µ¼Êy-ªý-©Ç©ü ÅçL-¤Äª½Õ. Š¢’î-©Õ©ð ÆÅŒu-Cµ-¹¢’à 23 «Õ¢C ¤òšÌ©ð …¢œ¿’à ªÃ•¢-æX{, Aª½Õ-X¾-A©ðx 19 «Õ¢C ÍíX¾ÛpÊ …X¾ ‡Eo-¹© ¦J©ð EL-Íê½Õ. ʪ½q-Êo-æX{, ¤ò©-«-ª½¢-©©ð ÆÅŒu-©p¢’à ‚êª®Ï «Õ¢C ÍíX¾ÛpÊ ¤òšÌ©ð …¯Ãoª½Õ. Š¢’î©Õ, Aª½Õ-X¾A, ªÃ•¢-æX-{©ðx ‡Â¹×ˆ-«-«Õ¢C …Êo¢-Ÿ¿ÕÊ éª¢œä®Ï ¨O‡¢ §ŒÕ¢“ÅÃ©Õ …X¾-§çÖ-T¢-ÍŒ-ÊÕ-Êo{Õx “X¾ŸµÄÊ ‡Eo-¹© ÆCµ-ÂÃJ ¦µ¼Êy-ªý-©Ç©ü ÅçL-¤Äª½Õ. 

ఓదార్పు కావలెను...

హైదరాబాద్, మే 28: రాష్త్ర వ్యాప్తంగా విస్తృతంగా ఓదార్పు యాత్రలు జరిపిన జగన్ కు ఇప్పుడు ఓదార్పు కావాలి. అక్రమాస్తుల కేసులో సీబీఐ అరెస్టు చేసిన జగన్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జగన్ తరపున దాఖలైన బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అలాగే జగన్‌ను కస్టడీకి కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీనితో జగన్‌ను చంచల్‌గూడ జైలుకి తరలించారు. జగన్ కస్టడీకి సంబంధించి హైకోర్టుని ఆశ్రయించాలని  సీబీఐ నిర్ణయించింది. కాగా, జగన్, విజయసాయి రెడ్డి మినహా తొలి చార్జ్‌షీటలో సీబీఐ పేర్కొన్న పదకొండు మంది నిందితులకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే రెండవ చార్జ్‌షీట్‌లోని నిందితుల జాబితాలో సైతం జగన్, విజయసాయి రెడ్డి పేర్లు పొందుపరచడంతో వారికి బెయిలు ఇవ్వజాలమని కోర్టు స్పష్టం చేసింది.
 30 నుంచి విజయమ్మ ఉప ఎన్నికల ప్రచారం
 కొడుకు అరెస్ట్ తో ఓ రోజు నిరాహార దీక్ష చేసిన విజయమ్మ  అతగాడికి జైలు తప్పక పోవడంతో  దీక్ష విరమించి గుండె నిబ్బరం చెసుకుని ఉప ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. విజయమ్మ ఈ నెల 30 నుంచి ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు.  30వ తేది మధ్యాహ్నం నర్సన్నపేట నుంచి ఆమె ప్రచారం ప్రారంభిస్తారు. 30, 31వ తేదీల్లో పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటిస్తారు. 31వ తేదీ సాయంత్రం రామచంద్రాపురం నియోజకర్గంలో పర్యటిస్తారు. జూన్ 1న నర్సాపురం, 2న పోలవరం, 3న పత్తిపాడులో వైఎస్ విజయమ్మ ప్రచారం చేస్తారు. 
 పెట్టుబడుల రూపంలో వచ్చినవన్నీ లంచాలే: సిబిఐ
 వైయస్ జగన్ కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో వచ్చినవన్నీ లంచాలేనని సిబిఐ పేర్కొంది. వైయస్ జగన్ రిమాండ్ రిపోర్టులో ఆ విషయాన్ని సిబిఐ స్పష్టంగా పేర్కొంది.  వైయస్ జగన్ కంపెనీల్లో లంచాలను పెట్టుబడులుగా పెట్టడానికి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పూర్తిగా సహకరించారని సిబిఐ ఆరోపించింది. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందాయని చెప్పింది. జగతి పబ్లికేషన్స్ స్థాపనకు అయ్యే ఖర్చును కూడా జగన్ దాచి పెట్టారని, రెండేళ్లు సాక్షి నష్టాల్లో ఉన్నా భారీగా పెట్టుడులు వచ్చాయని, సాక్షి లాభాల్లో వాటాలను గానీ షేర్లను గానీ వెనక్కి తీసుకునే అవకాశం కల్పించలేదని సిబిఐ తెలిపింది. కోల్‌కత్తా, ముంబైలకు చెందిన బ్రీఫ్ కేసు కంపెనీల నుంచి జగన్ సంస్థల్లోకి వంద కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, అవి ఎక్కుడున్నాయో కూడా కూడా తెలియదని సిబిఐ తెలిపింది. జగన్ విదేశాలకు డబ్బులు తరలించి, అక్కడి నుంచి సండూర్ పవర్ కంపెనీలోకి మళ్లించి, దాని ద్వారా జగతిలోకి పెట్టుబడులను మళ్లించారని ఆరోపించింది. మారిషిస్‌కు చెందిన రెండు కంపెనీల నుంచి 120 కోట్ల రూపాయలు జగన్ కంపెనీల్లోకి వచ్చాయని చెప్పింది. దాల్మియా, పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, తదితర సంస్థల వ్యవహారాలను సిబిఐ రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా తెలిపింది. ఇండియా సిమెంట్స్ జగతిలో 40 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిందని చెప్పింది. దాల్మియా సిమెంట్స్ 90 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందని తెలిపింది. అందుకు ఆ కంపెనీలు వైయస్ ప్రభుత్వం నుంచి పొందిన ప్రతిఫలాలను కూడా సిబిఐ వివరించింది. ఈ వివరాలన్నీ రాబట్టాల్సి ఉందని సిబిఐ తెలిపింది. జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చిన తీరుపై జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డికి పూర్తిగా తెలుసునని సిబిఐ తెలిపింది. పెట్టుబడిదారులను జగన్ మోసం చేశారని సిబిఐ ఆరోపించింది. 

Sunday, May 27, 2012

జగన్‌ అరెస్టు : రేపు సీబీఐ కోర్టులో హాజరు

హైదరాబాద్,మే 27: అక్రమాస్తుల కేసులో  అనుకున్నట్టే  జగన్‌ను సి.బి.ఐ. అరెస్టు చేసింది. ఆదివారం నాడు  మూడో రోజు విచారణ అనంతరం  రాత్రి 7.20 గంటలకు జగన్‌ను అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రకటించింది. అక్రమాస్తుల కేసులో జగన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. జగన్‌పై ఆర్‌సీ 19 (ఏ) నిబంధన ప్రకారం ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేయనున్నట్లు చెప్పారు. అలాగే అవినీతి నిరోధక చట్టంలోని 13(1), 13(2)తో పాటు 120 (బీ), రెడ్‌విత్ 420, 409, 477 (ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సోమవారం నాడు  జగన్‌ను సీబీఐ కోర్టులో హాజరు పరుస్తామన్నారు. ఈ రాత్రికి జగన్‌ను దిల్‌కుషాలోనే నిర్బంధంలో ఉంచనున్నట్లు స్పష్టం చేశారు.జగన్ అరెస్టు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా పెద్ద సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు. జగన్ అరెస్టు తర్వాత పలు జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ విధ్వంసానికి పాల్పడినట్లు సమాచారం అందింది. విజయవాడలో జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. పడమటలో ఒక ఆర్టీసీ బస్సుని ధ్వంసం చేశారు. అనంతపురంలో కార్యకర్తలు రిలయన్స్ టవర్‌కు నిప్పుపెట్టారు. కొన్ని జిల్లాలో రాజీవ్ గాంధీ విగ్రహాలు ధ్వంసం చేసినట్లు తెలిసింది. మరోవైపు జగన్మోహన్‌రెడ్డి అరెస్టును  నిరసిస్తూ    వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్హింది.
విజయమ్మ ఆక్రోశం
జగన్ అరెస్టుకు నిరసనగా విజయమ్మ కుటుంబ సభ్యులతో దిల్ కుశ అతిథి గృహం ముందు బైఠాయించారు.జగన్ చేసిన తప్పేంటని  విజయమ్మ ప్రశ్నించారు.  ఓదార్పుయాత్ర చేయడమే జగన్ చేసిన తప్పా, ప్రజలకు ఇచ్చిన మాటపై నిలబడడం కోసం సోనియాను ధిక్కరించడం తప్పా, ప్రజా నాయకుడిగా ఎదగడం జగన్ చేసిన తప్పా అంటూ నిలదీశారు. సీబీఐ ఎందుకు హడావుడిగా జగన్ ను అదుపులోకి తీసుకుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు వైఎస్సార్ అందించిన సేవలకు ఇదా ప్రతిఫలం అంటూ నిలదీశారు. ఈ పరిణామాలు చూస్తుంటే వైఎస్సార్ మరణంపై కూడా అనుమానాలు కలుగుతున్నాయన్నారు. తన బిడ్డను ఏం చేయదలుచుకున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, మరెక్కడైనా ఉన్నామా అంటూ వాపోయారు. మహానేత చనిపోయిన నాటి నుంచి నరకం చూపించారన్నారు. వీటన్నింటినీ దేవుడు చూస్తున్నాడన్నారు.

.






జగన్ అరెస్టుపై జోరుగా ఊహాగానాలు ...

హైదరాబాద్,మే 27:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుపై ఆదివారం  ఊహాగానాలు జోరందుకున్నాయి.  ఆదివారం మూడవ రోజు కూడా  జగన్ సిబిఐ విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం సమయంలో ఉన్నతాధికారులు.. హైదరాబాదులో సెలవులలో ఉన్న పోలీసులను తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. విచారణ నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. విధులలో ఉన్న సిబ్బంది అలెర్ట్ కావాలంటూ ప్రత్యేక ఆదేశాలు వెలువడినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో పోలీసులు బలగాలు మరింత అప్రమత్తమయ్యాయని తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం ఈ సమాచారాన్ని ధృవీకరించలేదు. మరోవైపు . దిల్‌కుషా అతిథి గృహం వద్ద బయట ఉన్న జగన్ వర్గం నేత హడావుడిగా తిరగడం ఆసక్తి రేకెత్తించింది. అయితే ఈ అప్రమత్తత, హడావుడి సోమవారం జగన్ కోర్టుకు హాజరయ్యేందుకు కూడా కావొచ్చునని, అరెస్టు కోసమే కాదనే వాదనలూ వినిపిస్తున్నాయి. కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో జగన్ సోమవారం  కోర్టుకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా పోలీసులను రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తం చేసి ఉండవచ్చునని అంటున్నారు. పలు కూడళ్లలో, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం వద్ద, జగన్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. జడ్జిల ఇళ్ల వద్ద భద్రత ఏర్పాటు చేశారు. కాగాఆదివారం  కూడా జగన్‌ను సిబిఐ  సాయంత్రం పొద్దు పోయేవరకు  విచారించింది. జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని కూడా విచారించారు. నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలను జగన్ సమక్షంలో పెట్టుబడులకు సంబంధించి ముఖాముఖి ప్రశ్నలు వేసినట్లుగా సమాచారం.

Saturday, May 26, 2012

డే -2---మరో ఏడున్నర గంటలు

ఆదివారం కూడా విచారణ 
హైదరాబాద్ , మే 26:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ని  శనివారం రెండో రోజు కూడా  సిబిఐ అధికారులు ఏడున్నర గంటల పాటు ప్రశ్నించారు. సిబిఐ విచారణ ముగిసిన తర్వాత దిల్‌కుషా అతిథి గృహం నుంచి బయటకు వచ్చిన జగన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆదివారం మళ్లీ విచారణకు రమ్మన్నారని ఆయన చెప్పారు. పలు విషయాలపై వివరణలు అడిగారని, సిబిఐ వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని ఆయన అన్నారు. బై బై బై అంటూ వాహనంలో వెళ్లిపోయారు. ఆదివారం  మోపిదేవి వెంకటరమణతో కలిపి జగన్‌ను విచారించే అవకాశం ఉందని అంటున్నారు.  సోమవారం ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.

బిజెపి గూటికి జయప్రద ?

న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటి, పార్లమెంటు సభ్యురాలు జయప్రద బిజెపి గూటికి చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకుగాను ఆమె పదిహేను రోజుల క్రితం బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీతో రహస్యంగా సమావేశమై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఆమె తన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు బిజెపి నుంచి సానుకూల సంకేతాలు వచ్చినట్లు సమాచారం.  ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్ నియోజక వర్గం నుంచి రెండు సార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైన జయప్రద సమాజ్‌వాదీ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. అమర్ సింగ్‌కు సమాజ్‌వాదీ పార్టీతో సంబంధాలు తెగిపోవడంతో జయప్రద పరిస్థితి కూడా సందేహంలో పడింది. ఈ స్థితిలో బిజెపి ఆమెకు ఆలంబనగా నిలిచింది. ఆమె రాంపూర్ లోకసభ స్థానాన్ని అడుగుతున్నట్లు సమాచారం. అయితే, బిజెపి రాంపూర్ సీటు ఇస్తుందా, రాజ్యసభకు ఎంపిక చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

Friday, May 25, 2012

జీడిగుంట రామచంద్రమూర్తి కథల సంపుటి ' నిన్నటి కొడుకు ' ఆవిష్కరణ

హైదరాబాద్,మే 25: ప్రముఖ రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి కథల సంపుటి ' నిన్నటి కొడుకు ' ఆవిష్కరణ సభ శుక్రవారం సాయంత్రం సిటీ సెంట్రల్ లైబ్రరీలో అభిమానులు, ఆత్మీయులు, బంధుమిత్రుల సమక్షంలో ఆహ్లాదకర వాతావరణం లో జరిగింది. కిన్నెర సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో తెలుగు విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య ఎన్. శివారెడ్డి  ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయనతో పాటు దూరదర్శన్ కార్యక్రమ నిర్వహణాధికారి ఓలేటి పార్వతీశం,  నటుడు సుబ్బరాయ శర్మ, ఆచార్య నిర్మల, తెలుగు విశ్వ విద్యాలయం పౌర సంభందాల అధికారి జె.చెన్నయ్య, కిన్నెర అధినేత ఎం. రఘురాం తదితరులు రామచంద్ర మూర్తి కధా రచనా శైలిని  కొనియాడారు.  రామ చంద్ర మూర్తి ధన్య వాదాలు తెలియ చేస్తూ, తిరిగే కాలు, తిట్టే నోరూ మాదిరి, రాసే కలం తన చేత మరిన్ని మంచి కథలు రాయించ గలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తన తాజా కథల సంపుటి ' నిన్నటి కొడుకు ' ను  ఆయన కిన్నెర రఘురాం కు అంకిత మిచ్చారు.   

ఎనిమిది గంటల సేపు జగన్ విచారణ

హైదరాబాద్,మే 25: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని సిబిఐ  శుక్రవారం నాడు  దాదాపు ఎనిమిది గంటల సేపు విచారించింది. బయటకు వచ్చిన తరువాత జగన్ విలేకరులతో మాట్లాడుతూ సిబిఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు తెలిపారు. వారు అడిగిన వివరాలను ప్రశాంతంగా వివరించినట్లు చెప్పారు. శనివారం  మళ్లీ విచారణకు రమ్మన్నట్లు ఆయన తెలిపారు. శనివారం  ఉదయం 10.30 గంటలకు జగన్ మరోసారి సిబిఐ ఎదుట హాజరవుతారు. వైయస్ జగన్ సిబిఐ విచారణ ముగిసి బయటకు వచ్చే వరకు కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలను విచారణ అనంతరం ఐదు గంటలకు చంచల్‌గుడా జైలుకు తరలించారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ విచారణను కూడా ముగించారు. ఆ తర్వాత కూడా జగన్‌ను విచారించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయనను అరెస్టు చేస్తారా అనే సందేహం తలెత్తింది.

జగన్ తో చేతులు కలపిన మైసూరా...టి.డి.పి. నుంచి సస్పెన్షన్

హైదరాబాద్,మే 25:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోసం తాను ఏమైనా చేస్తానని మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యుడు ఎం. వి మైసురా రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం ఉదయం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. దీంతో ఆయనను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. తనకు వైయస్ జగన్ చిన్నప్పటి నుంచీ తెలుసునని, రాజకీయంగా ఎదుగుతున్న వ్యక్తి అని, జగన్ ఎదుగుదలను చూసి ఓర్వలేక మూకుమ్మడి దాడి చేస్తున్నారని ఆయన అన్నారు. చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి కావడంతో పలకరించడానికి వచ్చానని ఆయన అన్నారు. తనకు సాయం చేయాలని వైయస్ జగన్ కోరారని, అందుకు తాను సమ్మతించానని ఆయన చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భవిష్యత్తు కోసం, జగన్ శ్రేయస్సు కోసం ఎలాంటి పనైనా చేస్తానని ఆయన అన్నారు. జగన్‌ను అరెస్టు చేయడానికే  మంత్రి మోపిదేవి వెంకటరమణను అరెస్టు చేశారని ఆయన అన్నారు. మోపిదేవిని బలిపశువును చేస్తున్నారని ఆయన అన్నారు. చట్టం తన పని చేస్తుంటే సంతోషించేవాడినని, ఒత్తిళ్లు పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోసం పనిచేస్తానని, అందులో చేరడం చేరకపోవడం అనేది సమస్య కాదని ఆయన అన్నారు. కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సలహాదారుగా ఎంవి మైసురా రెడ్డిని నియమించుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

Thursday, May 24, 2012

జగన్ ఆస్తుల కేసులో మంత్రి మోపిదేవి అరెస్ట్

హైదరాబాద్, మే 24: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అస్తుల కేసులో ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు.  వాన్‌పిక్ భూముల కేటాయింపులో ఆయన అరెస్టయ్యారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల మంత్రిగా పనిచేసిన మోపిదేవి వాన్‌పిక్ భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.  నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలతో కలిపి గంటన్నర పాటు విచారించిన తర్వాత మోపిదేవిని సిబిఐ అరెస్టు చేసింది. మోపిదేవి వెంకటరమణ ఇష్టానుసారం జీవోలు జారీ చేశారని, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సిబిఐ ఆరోపిస్తోంది.  బుధవారం  ఏడు గంటల పాటు మోపిదేవిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు గురువారం కూడ్ కూఆడా విచారణ జరిపిన అనంతరం  అదుపులోకి తీసుకున్నారు. కాగా, అరెస్టయిన నేపథ్యంలో  మోపిదేవి తన మంత్రి పదవికి రాజీనామా చశారు.
ఇతర మంత్రుల్లో గుబులు...
జగన్ ఆస్తుల కేసులో ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టు కావడంతో సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న ఇతర మంత్రుల్లో గుబులు ప్రారంభమైంది. ఆరుగురు మంత్రులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన తొలి మంత్రి మోపిదేవి వెంకటరమణ. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ చేసిన 26 వివాదాస్పద జీవోలపై సుప్రీంకోర్టు ఆరుగురు మంత్రులకు నోటీసులు జారీ చేసింది. వీరిలో మోపిదేవితో పాటు  గీతారెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ధర్మాన ప్రసాద రావు, కన్నా లక్ష్మినారాయణ ఉన్నారు. సబితా ఇంద్రా రెడ్డిని సిబిఐ అధికారులు ఇప్పటికే రెండు సార్లు ప్రశ్నించారు. గీతా రెడ్డికి, పొన్నాల లక్ష్మయ్యకు సిబిఐ నోటీసులు జారీ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ తమకు నోటీసులు రాలేదని వారిద్దరు చెప్పారు. సిబిఐ అడిగే ప్రశ్నలకు తాను సమాధానం చెప్తానని, పిలిస్తే సిబిఐ విచారణకు హాజరవుతానని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో సబితా ఇంద్రా రెడ్డి గనుల శాఖను, గీతా రెడ్డి భారీ పరిశ్రమల శాఖను నిర్వహించారు. మోపిదేవి వెంకటరమణ అరెస్టుతో మంత్రివర్గంలో కలకలం ప్రారంభమైంది. మంత్రివర్గ సభ్యులను ఎందుకు వదిలేస్తున్నారంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, ఐఎఎస్ అధికారులు వేసిన ప్రశ్నకు మోపిదేవి అరెస్టు ద్వారా సిబిఐ సమాధానం చెప్పినట్లయింది. మంత్రుల అరెస్టు మోపిదేవి అరెస్టుతో ఆగిపోయే పరిస్థితి లేదని అంటున్నారు.


Wednesday, May 23, 2012

భగ్గుమన్న పెట్రోల్: ఏకంగా లీటరుకు రూ.7.50 పెంపు

న్యూఢిల్లీ,మే 23: కేంద్రం మరోసారి పెట్రోలు ధరలను భారీగా  పెంచింది. ఏకంగా లీటరుకు రూ.7.50 రూపాయలు పెరిగింది. రాష్ట్రంలో పన్ను రూపేణా మరికొంత అదనపు బాదుడు తప్పకపోవడంతో ఈ పెంపునకు మరికొంత మొత్తం చేరి అది రూ.9కి చేరుకుంటుంది. మొత్తంగా రాష్ట్రంలో లీటరు పెట్రోలు ధర రూ.82కు చేరుకోనుంది. రాష్ట్రీయ ఆయిల్ ఉత్పత్తి కంపెనీలు లీటరుకి పెంచమని కోరిన రూ.6.28 కంటే ఇది ఎక్కువ మొత్తం కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ క్షీణించడంతో డాలర్‌కు డిమాండ్ పెరిగింది.  డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.56కు చేరుకుంది. ఈ పరిణామంతో వేల కోట్ల రూపాయల నష్టం వస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయి. పెట్రో ధరలపై నియంత్రణ లేకపోవడంతో ఆయా కంపెనీలు ప్రతిపాదించిన మొత్తం పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

కాంగ్రెస్ పార్టీకి వైఎస్ వివేకా గుడ్‌బై

పులివెందుల: కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తీసుకువచ్చిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని దూషిస్తున్న తీరుపై కలత చెంది కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్టు వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి ప్రకటించారు. పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైస్‌ను విమర్శిస్తే సహించలేమని వివేకానంద రెడ్డి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండలేకపోతున్నానని , కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నానని ఆయన తెలిపారు. భవిష్యత్ కార్యచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని వివేకానంద అన్నారు. పులివెందులలో కార్యకర్తలతో, వైఎస్ అభిమానులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం.. పార్టీని వీడుతున్నట్టు వైఎస్ వివేకానందరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.

Tuesday, May 22, 2012

        యు.పి.ఎ-2 ప్రభుత్వానికి మూడేళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రగతి నివేదిక విడుదల

అనంతపురం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం: 18మంది దుర్మరణం

అనంతపురం, మే 22: అనంతపురం జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 18మంది దుర్మరణం చెందారు. ఘటనాస్థలంలోనే పదిమంది సజీవ దహనం కాగా రైలు డ్రైవర్ కూడా మృతి చెందాడు. మరో 40 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం బెంగళూర్, పుట్టపర్తి, అనంతపురం  ఆసుపత్రులకు తరలించారు. హుబ్లీ నుంచి బెంగళూరు వెఉతున్న  హంపి ఎక్స్ ప్రెస్ పెనుగొండ రైల్వే స్టేషన్‌లో ఆగివున్న గూడ్స్రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్‌ను ఢీకొన్న వెంటనే హంపి ఎక్స్ప్రెస్‌కు చెందిన నాలుగు బోగీలు పట్టాలు తప్పగా రెండు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రయాణికులందరూ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

Sunday, May 20, 2012

సరికొత్త కంప్యూటర్ చిప్‌...

లండన్ ,మే 20: అత్యంత వేగంతో, అత్యధిక సామర్థ్యంతో పనిచేసే ఓ సరికొత్త కంప్యూటర్ చిప్‌ను తాము తయారుచేశామని యూనివర్సిటీ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ‘మెమ్రిస్టర్’ అని నామకరణం చేసిన ఈ చిప్‌కు మెమరీ సామర్థ్యం కూడా అధికంగా ఉంటుందని వారు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న సెమీకండక్టర్ల తయారీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి దీనిని అభివృద్ధిపర్చామని, దీని ధర కూడా చౌకగానే ఉంటుందని పరిశోధన బృందం నాయకుడు  ఆంథోనీ కెన్యన్ తెలిపారు. చిప్‌లోకి ఎంత విద్యుత్ వస్తోందన్న దాన్ని బట్టి దాని నిరోధక శక్తి మారుతూ ఉంటుందన్నారు. ప్రస్తుతం దీనిని వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తొలి రకం మెమ్రిస్టర్ డిజైన్లను మార్కెట్లోకి తెచ్చేందుకు హెవ్‌లెట్-ప్యాకార్డ్ కంపెనీ కూడా సన్నాహాలు చేస్తోందని తెలిపారు. అయితే సిలి కాన్ మెమ్రిస్టర్లను ఇదివరకే కొందరు తయారుచేసినా, అవి సున్నితంగా ఉన్నాయని  తాము కొత్త విధానంలో తయారుచేసిన సిలికాన్ మెమ్రిస్టర్‌లు వాటి కన్నా సమర్థంగా పనిచేస్తాయని పేర్కొన్నారు.

ఓ ఇంటివాడైన ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్

న్యూయార్క్,మే 20: సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ (28) ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల స్నేహితురాలు ప్రిస్ సిల్లా చాన్ (27) ను వివాహమాడారు. కాలిఫోర్నియాలోని తన నివాసంలో వీరి పెళ్లి జరిగింది. ఈ విషయాన్ని జుకర్ బర్గ్ తన పేస్ బుక్ పేజీలో వెల్లడించారు. పెళ్లి ఫోటోను కూడా అప్ డేట్ చేశారు. అరగంటలోనే ఈ ఫోటోను 1,31,000 మంది నెటిజన్లు వీక్షించడం విశేషం. జుకర్ బర్గ్ ముదురు నీలం రంగు సూటు, తెల్ల చొక్కా, టై ధరించగా, చాన్ స్లీవ్ లెస్ లేసెడ్ తెల్లటి పెళ్లి గౌనులో మెరిసింది.
హార్వర్డ్ వర్సిటీలో పరిచయమైన వీరు గత తొమ్మిదేళ్లుగా కలిసుంటున్నారు. ఫేస్ బుక్ ఐపీఓకు వెళ్లిన తర్వాత రోజే జుకర్ బర్గ్ పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఇదే వారంలో శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి చాన్ మెడిసిన్ లో గ్రాడ్యయేషన్ పట్టా అందుకున్నారు. 

Saturday, May 19, 2012

పబ్లిక్ ఇష్యూలో ఫేస్ బుక్ రికార్డ్...

న్యూయార్క్,మే 19: ప్రపంచ ఖ్యాతి గాంచిన చెందిన సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్... 16 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని సమీకరించేందుకుగాను పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ను ప్రారంభించింది. దీనిద్వారా టెక్నాలజీ రంగంలోని అతిపెద్ద పబ్లిక్ ఆఫర్స్ (ఐపీఓ )లో ఒకటిగా చరిత్ర సృష్టించింది. మార్క్ జకర్‌బర్గ్కు చెందిన ఫేస్‌బుక్ విలువ ఈ ఇష్యూ ప్రకారం 104 బిలియన్ డాలర్లుగా నిలుస్తోంది. ప్రమోటర్లు, కంపెనీ తరపునమొత్తం 42.1 కోట్ల షేర్లను 38 డాలర్ల ఇష్యూ ధర చొప్పున ఆఫర్ చేసినట్లు ఫేస్‌బుక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇతర ఆప్షన్‌లతో కలిపి ఫేస్‌బుక్ సమీకరణ మొత్తం 16-18 బిలియన్ డాలర్ల వరకూ ఉండొచ్చని అంచనా. ఈ పబ్లిక్ ఆఫర్ ఈ నెల 22న ముగియనుంది. ది. ఈ ఐపీఓ... అమెరికాలో మూడో అతిపెద్ద ఇష్యూగా కూడా రికార్డు సృష్టించింది. 2008లో ఐపీఓకి వచ్చిన వీసా... 17.9 బిలియన్ డాలర్లతో టాప్‌లో నిలిచింది. రెండో స్థానంలో జనరల్ మోటార్స్ ఐపీఓ ఉంది.

రుణ భారానికి విరుగుడు చర్యలు

న్యూఢిల్లీ,మే 19: ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో కేంద్రం పలు పొదుపు చర్యలు ప్రకటించింది.   మంత్రులు, అధికారుల విదేశీ ప్రయాణాలకు కోత, ఫైవ్‌స్టార్ హోటళ్లలో సమావేశాలకు స్వస్తి, వర్క్ షాపులు, సెమినార్ల బడ్జెట్‌లో 10 శాతం తగ్గింపు, రక్షణ బలగాలకు మినహా ఇతర విభాగాలకు వాహనాల కొనుగోళ్లపై నిషేధం.. మొదలైన  పొదుపు చర్యలనుఆర్థిక శాఖ సహాయ మంత్రి నమోనారాయణ్ మీనా  లోక్‌సభలో వీటిని ప్రకటించారు.  ఈ పొదుపు చర్యలు గత ఏడాది సమర్థంగా అమలుకాకపోవడంతో సర్కారు వీటిని మరింత పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ చర్యలను వ్యవస్థాగత వ్యయాల్లో కోత, పథకాలవారీ వ్యయాల తగ్గింపు అనే రెండు రకాలుగా చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.   దేశీ, విదేశీ రుణాలు భారీగా పెరిగిన నేపథ్యంలో సర్కారు పొదుపు చర్యలకు సిద్ధమైంది. 2010-11 ఆర్థిక సంవత్సరం ఖాతాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం రూ.37 లక్షల కోట్ల దేశీ రుణాలను, రూ.1.5 లక్షల కోట్ల విదేశీ రుణాలను చెల్లించాల్సి ఉంది. 

Wednesday, May 16, 2012

పరకాలపై బిజెపి, తెరాసల చెలగాటం...జేఏసీ కి సంకటం

 హైదరాబాద్ ,మే 16:  : వరంగల్ జిల్లా పరకాల శానససభ నియోజకవర్గం అభ్యర్థిని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించింది. పరకాలకు బిక్షపతిని తమ అభ్యర్థిగా తెరాస అధికారికంగా ప్రకటించింది. బిజెపి కూడా పోటీకి సిద్ధమవుతుండడంతో ఈ రెండు పార్టీల్లో తెలంగాణ రాజకీయ జెఎసి ఏ పార్టీకి మద్దతు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా,  బిజెపి, తెరాసల తీరు పట్ల తెలంగాణ జేఏసీలోని మెజారిటీ సభ్యులు అసహనం ప్రదర్శిస్తున్నారు.  రాజకీయ పార్టీల నుంచి దూరం జరిగి స్వతంత్రంగా ఎదుగుదామని,  అందుకు పరకాల ఉప ఎన్నికనే వేదిక చేసుకుందామని జేఏసీ నాయకత్వానికి ప్రతిపాదించారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వానికే వారంతా మద్దతు పలుకుతున్నారు.  అభ్యర్థుల ఖరారుపై ఏ దశలోనూ తమను సంప్రదించని ఆయా పార్టీల అధినాయకత్వాలు, ఓటమిపాలైతే మాత్రం నిందిస్తున్నాయని మెజారిటీ సభ్యులు అన్నట్లు తెలుస్తోంది.  ఏమైనా, మెజార్టీ ప్రజలు కోరుకున్న పార్టీకే మద్దతు ఇవ్వాలని  జేఏసీ అభిప్రాయ పడుతున్నట్టు సమాచారం.  

జెనీవాలో 50 కోట్లు పలికిన గోల్కొండ వజ్రం

జెనీవా,మే 16:  చారిత్రక ప్రాధాన్యం గల హైదరాబాద్  గోల్కొండ కు చెందిన బుయో సాన్సీ వజ్రం జెనీవా వేలం పాటలో 9.7 మిలియన్ల అమెరికా డాలర్లు పలికింది. ఇది రూ. 50 కోట్ల విలువ ఉంటుందని అంచనా. తరం నుంచి తరానికి మారుతూ ఆ వజ్రం ఐరోపా రాజవంశానికి చేరింది. 1610లో 35 క్యారట్ల ఆ వజ్రాన్ని  నాలుగో హెన్రీ సహవాసి మేరీ డీ మేడిసి ధరించారు. సోత్ బై వేలం పాటలో ఈ వజ్రాన్ని ఉంచారు. ఇది అత్యంత అరుదైన, అత్యంత సుందరమైన వజ్రమని సోత్‌బై ఇండియా డైరెక్టర్ మైథిలీ పరేఖ్ అన్నారు. గోల్కొండపరిసరాల్లోని గనుల్లోనే ఈ వజ్రం జనించి ఉంటుందని అన్నారు. హోప్, కోహినూర్, రీజెంట్ వజ్రాల స్థాయి దీనికి ఉంటుందని భావిస్తున్నారు.సోత్‌బై వేలం పాటలో ఐదుగురు ఆ వజ్రం కోసం పోటీ పడినట్లు తెలుస్తోంది. వీరు మూడు వేర్వేరు ఖండాలకు చెదినవారని తెలుస్తోంది. దాన్ని ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. అయితే, వ్యక్తి  వివరాలు  తెలియలేదు.

Tuesday, May 15, 2012

జగన్‌ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో -నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టు

హైదరాబాద్, మే 15: మ్యాట్రిక్స్ లాబొరేటరీస్ వ్యవస్థాపకుడు, మా టీవీ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ ను.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకు గాను మంగళవారం రాత్రి సీబీఐ అరెస్టు చేసింది. సోమ, మంగళవారాల్లో నాలుగు దఫాలుగా ప్రసాద్‌ను విచారించిన సీబీఐ అధికారులు.., ఆయన్ను అరెస్టు చేసినట్టుగా రాత్రి 10.30 సమయంలో ప్రకటించారు. నిమ్మగడ్డ ప్రసాద్‌ను, ఐఆర్‌టీఎస్ (ఇండియన్ రైల్వే ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్) అధికారి బ్రహ్మానందరెడ్డిని అరెస్టు చేశామని,  బుధవారం  న్యాయమూర్తి ఎదుట హాజరు పరుస్తామని చెప్పారు.
జగతి పబ్లికేషన్స్ లో నిమ్మగడ్డ ప్రసాద్ తనకు చెందిన నాలుగు కంపెనీల ద్వారా రూ.450 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దీనికి గాను 11.77 శాతం వాటా పొందారు.

తీహార్ జైలు నుంచి రాజా విడుదల

న్యూఢిల్లీ,మే 15: : 2జీ స్పెక్ట్రమ్  కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర టెలికం మాజీ మంత్రి ఎ. రాజా తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. పాటియాల కోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి బయట పడ్డారు. 15 నెలల పాటు ఆయన జైలు జీవితం గడిపారు. కోర్టు అనుమతి లేకుండా ఢిల్లీ విడిచి వెళ్లరాదని న్యాయస్థానం రాజాను ఆదేశించింది. బెయిల్ మంజూరు ఆదేశాలు రావడానికి గంట ముందు కోర్టులో రాజా డిఎంకె నాయకురాలు, కరుణానిధి కూతురు కనిమొళి‌తో జోక్ చేస్తూ మాట్లాడడం కనిపించారు. కనిమొళి కూడా ఈ కేసులో జైలులో ఆరు నెలల పాటు ఉన్నారు. ఆమెకు 2011 నవంబర్‌లో బెయిల్ మంజూరైంది.కనిమొళిలతో పాటు 12 మంది నిందితులకు 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో బెయిల్ మంజూరైంది. రాజా మాత్రమే ఇప్పటి వరకు జైలులో ఉన్నారు. అర్హత లేని సంస్థలకు తక్కువ ధరలకు లైసెన్సులు మంజూరు చేశారని రాజాపై ఆరోపణలున్నాయి. తాను నిర్దోషినని ఆయన కోర్టులో చెప్పుకున్నారు. తాను 2008లో విధానాన్ని అమలు చేసిన విషయం ప్రధాని మన్మోహన్ సింగ్‌కు, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి పి. చిదంబరానికి కూడా తెలుసునని ఆయన వాదించారు. రాజా 2008లో ఇచ్చిన 122 మొబైల్ నెట్‌వర్క్ లైసెన్సులను సుప్రీంకోర్టు ఈ ఏడాది ప్రారంభంలో రద్దు చేసింది. ముందు వచ్చినవారికి ముందు విధానాన్ని పాటించడం వల్ల రాజా తనకు నచ్చిన కంపెనీలకు లైసెన్సులు ఇవ్వడానికి ఉపయోగించుకున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.  

Sunday, May 13, 2012

మన పార్లమెంట్ కు నేడు (ఆదివారం) షష్టిపూర్తి పండగ...

కర్ణాటకలో మళ్లీ రాజకీయ సంక్షోభం

బెంగళూరు,మే 12:   కర్ణాటకలో మళ్లీ రాజకీయ సంక్షోభం తలెత్తింది. రాష్ట్ర అధికార బి.జె.పి.లో నాయకత్వంపై మరో తిరుగుబాటు మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అనుచరులైన ఏడుగురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా పదవీ త్యాగాలకు సిద్ధపడ్డారు. తమ రాజీనామా లేఖలను  వారు యడ్యూరప్పకే అప్పగించారు. కొందరు మంత్రులు సహా పలువురు నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ముఖ్యమంత్రి సదానంద గౌడ ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నాయకత్వ మార్పు కోసం అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు పదవులు వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు యడ్యూరప్ప వర్గం నేతలు తెలిపారు.  తమ రాజీనామాలపై తమ నాయకుడే నిర్ణయం తీసుకుంటారని వారు  చెప్పారు. తాము ఏమీ చేయకున్నా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తమపై ఆరోపణలు వచ్చాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మరోవైపు కొందరు మంత్రులు సహా 38 మంది ఎమ్మెల్యేలు అత్యవసర శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి సదానంద గౌడకు లేఖలు రాశారు. ఇదిలా ఉండగా, అక్రమ మైనింగ్ కేసులో యడ్యూరప్పపై సీబీఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించడంతో, ఆయన తన మద్దతుదారులతో మంతనాలు ప్రారంభించారు. ఇదే సమయంలో ఆయన మద్దతుదారులైన మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధపడటం బీజేపీ వర్గాల్లో కలకలం రేపింది. కర్ణాటక హైకోర్టు యడ్యూరప్పపై అక్రమ మైనింగ్ కేసును కొద్దినెలల కిందట కొట్టివేసినప్పటి నుంచి ముఖ్యమంత్రి పదవిని తిరిగి సాధించుకునేందుకు ఆయన తన శైలిలో ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, తొలుత అవినీతి ఆరోపణల నుంచి బయటపడాలని పార్టీ నాయకత్వం ఆయనకు స్పష్టం చేసింది. ఈలోగా, సదానంద గౌడను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడమే లక్ష్యంగా యడ్యూరప్ప పావులు కదుపుతున్నారు. కాగా, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తనకు తెలియదని ముఖ్యమంత్రి సదానంద గౌడ చెప్పారు. మం ఇంతవరకు తనకు ఎవరి నుంచి రాజీనామా లేఖలు అందలేదని చెప్పారు.

Friday, May 11, 2012

ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లిదండ్రులకు వారి పెంపకం పై అవగాహన కల్పించేందుకు తమిళనాడు ప్రభుత్వం దేశంలోనే మొదటి  సారిగా ఏర్పాటు చేసిన రిసోర్స్ కేంద్రం...

గద్దర్ కొత్త గళం...

హైదరాబాద్ మే 11:  తెలంగాణ ప్రజా ఫ్రంట్ చైర్మన్ పదవికి ప్రజా గాయకుడు గద్దర్ రాజీనామా చేశారు.  18 నెలల క్రితం గద్దర్ చైర్మన్‌గా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పడింది. రాజ్యానికి, రాజ్య హింసకు వ్యతిరేకంగా తాను దేశవ్యాప్తంగా ప్రచారం సాగిస్తానని గద్దర్ చెప్పారు. దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాలు కోరుకునేవారిని ఏకం చేయడానికి ప్రయత్నిస్తానని ఆయన అన్నారు.ఈ నెల 20వ తేదీన జరిగే ప్రజా ఫ్రంట్ కార్యవర్గ సమావేశంలో కొత్త చైర్మన్‌ను ఎన్నుకుంటారు. రాజ్యానికి, రాజ్య హింసకు వ్యతిరేకంగా తాను దేశవ్యాప్తంగా ప్రచారం సాగిస్తానని గద్దర్ చెప్పారు. దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాలు కోరుకునేవారిని ఏకం చేయడానికి ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. దోపిడీని ఎదిరించడానికి తాను ఎంతకైనా తెగిస్తానని ఆయన అన్నారు. ఇప్పటివరకు చేపట్టిన ఉద్యమం వల్ల తెలంగాణ సాధించలేకపోయామని, తెలంగాణ సాధనకు ఉద్యమ రూపం మారాల్సి ఉందని, ఉద్యమాన్ని యుద్ధంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఇప్పటి వరకు జరిగినవి నిరసన ఉద్యమాలు మాత్రమేనని, అవి తెలంగాణ సాధనకు సరిపోలేదని ఆయన అన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలను భాగస్వాములను చేయకుండా తెలంగాణ రాదని, తెలంగాణకు అనుకూలంగా జరుగుతున్న ఉద్యమంలో వారిని భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని, అందుకు తాను ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు.

చంద్రబాబు ఆస్తులపై సుప్రీంకోర్టులో వైఎస్ విజయమ్మ పిటిషన్

హైదరాబాద్ మే 11:  ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అక్రమ ఆస్తుల వ్యవహరంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుతో సహా 17 మందికి సంబంధించిన అక్రమ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని పిటిషన్‌లో విజయమ్మ పేర్కోన్నారు. 45 పేజీలు ఉన్న పిటిషన్‌ను విజయమ్మ దాఖలు చేశారు. 14 పేజిలలో కారణాలను వివరించారు. శనివారం నుంచి సుప్రీం కోర్టుకు వేసవి సెలవులు కావడంతో.. సెలవుల అనంతరం వైఎస్ విజయమ్మ పిటిషన్ విచారణకు రానుంది. చంద్రబాబు ఆస్తుల అంశంలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఒక బెంచ్ విచారణకు ఆదేశించగా.. అదే తరుణంలో మరో బెంచ్ కొట్టివేసిందని.. ఇది సరైనదేనా అని విజయమ్మ ప్రశ్నించారు.

Thursday, May 10, 2012

దాహం...దాహం...

దేశ రాజధాని ఢిల్లీలో ఎండ తీవ్రత పెరగడం తో చలివేంద్రం వద్ద సేద తీరుతున్న జనం...

Tuesday, May 8, 2012

రాష్టప్రతిగా ప్రతిభాపాటిల్ చివరి విదేశీ పర్యటన పూర్తి

న్యూఢిల్లీ, మే 8:  రాష్టప్రతి ప్రతిభాపాటిల్ తొమ్మిది రోజుల విదేశీ పర్యటన ముగించుకుని మంగళవారం స్వదేశం చేరుకున్నారు. ప్రతిభాపాటిల్ రాష్టప్రతి హోదాలో చేసిన చివరి విదేశీ పర్యటన ఇదే. జూలై 25తో ఆమె పదవీకాలం ముగియనుంది. ప్రతిభాపాటిల్ విదేశీ పర్యటన అనేక వివాదాలకు దారితీసిన సంగతి తెలిసిందే. గత నెల 29న ఆఫ్రికాదేశమైన సెచెల్లస్, దక్షిణాఫ్రికాలో పర్యటనకు వెళ్ళారు. ఈ సందర్భంగా భారత్- దక్షిణాఫ్రికా మధ్య పలు ఒప్పందాలు చేసుకున్నారు. సెచెల్లస్‌తో రెండు కీలకమైన ఎంఓయులపై రాష్టప్రతి సంతకాలు చేశారు. ఇరవై రెండేళ్ళ తరువాత ఆ దేశంలో పర్యటించిన రెండో భారత రాష్టప్రతి ప్రతిభాపాటిలే. ఇండియన్ బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చ్ డెవలప్‌మెంట్‌లో సెచెల్లస్ పోలీసులకు శిక్షణతో పాటు యువజన సర్వీసులు, క్రీడలకు సంబంధించి ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. సౌతాఫ్రికాతో 15 యుఎస్‌టి బిలయన్ల విలువైన వాణజ్య ఒప్పందం చేసుకున్నారు. జొహెనె్సస్‌బర్గ్‌లోని ఓల్డ్ పోర్టు జైలులో గాంధీ విగ్రహాన్ని రాష్టప్రతి ప్రతిభాపాటిల్ ఆవిష్కరించారు.

హజ్‌ సబ్సిడీరద్దుకు సుప్రీం ఆదేశం...

న్యూఢిల్లీ, మే 8: హజ్‌యాత్రకు వెళ్లే యాత్రికులకు ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేయాలని సుప్రీంకోర్టు  ఆదేశించింది. హజ్ యాత్రకు రాయితీ కల్పిస్తున్న ప్రభుత్వం విధానాన్ని న్యాయస్థానం రద్దుచేసింది. అలాగే పదేళ్లలోగా ఈ రద్దు ప్రక్రియను పూర్తిచేయాలని జస్టిస్ అల్టమస్ కబీర్, రంజన ప్రకాష్‌దేశాయ్‌తో కూడిన బెంచ్ కేంద్రాన్ని ఆదేశించింది. హజ్ యాత్రకు కేంద్ర ప్రభుత్వం తరఫున వెళ్లే బృందంలో సభ్యుల సంఖ్యను రెండుకు పరిమితం చేయాలని సూచించింది. ఇప్పటివరకు ఈబృందంలో 30వరకు సభ్యులు మక్కా వెళుతున్నారు. భారత్ హజ్ కమిటీ పనిచేసే విధానం.. హజ్ వెళ్లే యాత్రికుల ఎంపిక ప్రక్రియను పరిశీలించనున్నట్లు బెంచ్ పేర్కొంది. ప్రభుత్వం తరఫున సబ్సిడీతో వెళ్లే 1100 మందిలో 800 మంది యాత్రికుల బాధ్యతల నిర్వహణకు కొందరు ప్రైవేట్ ఆపరేటర్లను అనుమతించాలని విదేశాంగ శాఖను ఆదేశిస్తూ బొంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్రం సుప్రీంకోర్టులో సవాలుచేసింది.ఈ అప్పీల్‌పై విస్తృత పరిధిలో విచారణ జరిపిన బెంచ్, హజ్ యాత్రికులకు సబ్సిడీ ఇచ్చే ప్రభుత్వ విధానంలో న్యాయబద్ధతను పరిశీలించాలని నిర్ణయించింది. కేసు విచారణలో హజ్ యాత్రికులకు సబ్సిడీ ఇస్తున్న విధానాన్ని ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్రికుడు తన జీవితకాలంలో ఒకసారి హజ్‌యాత్రకు సబ్సిడీపై అనుమతించాలన్న మర్గాదర్శకాలు రూపొందించినట్లు కోర్టుకు తెలిపింది. అలాగే హజ్ వెళ్లే ముస్లిం యాత్రికులకు జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే సబ్సిడీ కల్పించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తన అఫిడవిట్‌లో వివరించింది. ప్రస్తుతం ప్రతి ఐదేళ్లకోసారి సబ్సిడీపై హజ్‌యాత్రకు అనుమతిస్తున్నారు. 

ఆస్తుల కేసులో జగన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..

జగన్ మీడియా సంస్థల బ్యాంక్ ఖాతాల స్తంభన 
హైదరాబాద్,మే 8: : వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు  జగన్ . ఆస్తుల కేసులో ఈ నెల 28వ తేదీన తమ ముందు హాజరు కావాలని కోర్టు వైయస్ జగన్‌కు సమన్లు జారీ కాగా, తాజాగా మంగళవారం సిబిఐ జగన్ మీడియా సంస్థలకు చెందిన బ్యాంక్ ఖాతాల లావాదేవీలను నిలిపేసింది. సాక్షి దినపత్రికను ప్రచురించే జగతి పబ్లికేషన్స్, సాక్షి టెలివిజన్‌ను నడిపే ఇందిరా టెలివిజన్, జననీ ఇన్‌ఫ్రా బ్యాంకు ఖాతాలను సిబిఐ స్తంభింపజేసింది. సిఆర్‌పిసి 102 సెక్షన్ కింద సంక్రమించిన అధికారాలతో సిబిఐ ఆ ఖాతాలను స్తంభింపజేసింది. కొత్త ఖాతాలను తెరిచి, కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చునని ఆ సంస్థలకు తెలిపింది.  జగన్ ఆస్తుల కేసులో సిబిఐ చాలా వేగంగా ముందుకు కదులుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైయస్ జగన్‌ను సిబిఐ దర్యాప్తు కష్టాలు ముట్టడిస్తున్నాయి. కోర్టు జగన్‌కు సమన్లు జారీ చేయడం, మీడియా సంస్థల ఖాతాలను స్తంభింపజేయడం వంటి పరిణామాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఆందోళన చోటు చేసుకుంది. జగన్ ఆస్తుల జప్తునకు సిబిఐ కోర్టు నుంచి అనుమతి పొందేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.ఈ నెల 28వ తేదీన వైయస్ జగన్‌ను అరెస్టు చేస్తారనేఅనుమానాలు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో వ్యక్తమవుతున్నాయి.  ఆ రోజు జగన్ గానీ, ఆయన తరఫు న్యాయవాదులు గానీ కోర్టుకు హాజరు కాకపోతే, కోర్టు జగన్ అరెస్టుకు వారంట్ జారీ అవకాశాలు కూడా లేకపోలేదని న్యాయనిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఉప ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్ తీరిక లేకుండా తిరుగుతున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్‌లో ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్ ఖాతాల స్తంభనపై స్పందిస్తూ, ఖాతాలను నిలిపివేయడాన్ని ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని ఆయన అన్నారు.   తనను ఎదుర్కోలేకనే ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని ఆయన అన్నారు.








Monday, May 7, 2012

ఎయిర్ ఇండియా పైలెట్లు మెరుపు సమ్మె

న్యూఢిల్లీ ,మే 8:  ఎయిర్ ఇండియా పైలెట్లు మంగళవారం మెరుపు సమ్మెకు దిగారు. దీంతో ఢిల్లీ నుంచి చికాగో, టొరొంటో వెళ్లే విమానాలు రద్దు అయ్యాయి. సమ్మెలో 250మంది పైలెట్లు పాల్గొన్నారు. ముంబై నుంచి న్యూజెర్సీ, హాంగ్ కాంగ్ వెళ్ళే విమానాలు కూడా రద్దయ్యాయి.
                     భారత పర్యటనలో భాగంగా సోమవారం నాడు ఢిల్లీలో సోనియాను కలసిన 
                                       అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్  

రష్యా అధ్యక్షుడిగా పుతిన్ హ్యాట్రిక్

ప్రస్తుత అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదెవ్ తో పుతిన్ కరచాలనం... 
మాస్కో ,మే 7:   రష్యా అధ్యక్షుడిగా పుతిన్ వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. పుతిన్ సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో ఆయన 2018 వరకు కొనసాగుతారు. అయితే ఆయనకు వ్యతిరేకంగా రష్యాలో నిరసనలు వెల్లువెత్తాయి. పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జీ జరిపి చెల్లాచెదురుచేసి, కొందరి అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈసారైనా పుతిన్ పాలనలో రష్యా ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందనే   అభిప్రాయం తినవస్తోంది. .

విధ్యార్థిపై రాందేవ్ అనుచరుల వీరంగం

భోపాల్,మే 7:  మధ్యప్రదేశ్‌లోని భిండ్ పట్టణంలో యోగా గురువు బాబా రామ్‌దేవ్ మద్దతుదారులు కొందరు ఒక విద్యార్థిపై దాడి చేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో గత ఏడాది దీక్ష కొనసాగిస్తుండగా, పోలీసులు దాడి చేసినప్పుడు ఆడవేషంలో ఎందుకు పారిపోయేందుకు ప్రయత్నించారంటూ బాబా రామ్‌దేవ్‌ను ప్రశ్నించడమే  తడవుగా ఆగ్రహంతో ఊగిపోయిన రామ్‌దేవ్ మద్దతుదారులు మూకుమ్మడిగా అతడిపైకి లంఘించి చితకబాదారు. బాధిత విద్యార్థిని అశుతోష్ పరిహార్‌గా గుర్తించారు. భిండ్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఆదివారం ఏర్పాటైన యోగా శిబిరం ముగింపు కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. అనుచరులు చుట్టిముట్టి ఉండగా ఆడవేషంలో రామ్ లీలా మైదానం నుంచి పారిపోయిన విషయంపై అశుతోష్ పరిహార్ రామ్‌దేవ్‌కు ప్రశ్న వేశాడు. ప్రశ్నలు వేయడం ఆపాలాని పరిహార్‌కు బాబా రామ్‌దేవ్ చెబుతుండగానే అనుచరులు అతన్ని పట్టుకుని కొట్టారు. శాంతిని భంగపరిచాడనే ఆరోపణపై పోలీసులు పరిహార్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరిహార్‌పై ఏ విధమైన క్రిమినల్ కేసు నమోదు చేయలేదు. వ్యక్తిగత పూచీకత్తుపై అతన్ని పోలీసులు విడుదల చేశారు. ప్రీ మెడికల్ టెస్టుకు సిద్ధమవుతున్న పరిహార్ ఆ విషయాన్ని పోలీసులకు చెప్పలేదు. పరిహార్ శాంతిని భంగపరుస్తాడేమోనని, అనుచరులు అతన్ని చితకబాదుతారేమోనని కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మ్రోగింది మంగళ వాద్య నాదం...

                              హైదరాబాద్ ఎల్. బి.స్టేడియం లో అంతర్జాతీయ మంగళ వాద్య సమ్మేళనం

చందమామ విశ్వరూపం ...

న్యూఢిల్లీ,మే 6:  చందమామ  ఆదివారం మరింత పెద్ద మామగా  భారత్‌తో సహా జగమంతా కొత్తవెలుగులు నింపాడు. ఆదివారం రాత్రి 9 గంటలు కాగానే.. ఈ ఏడాది అతిపెద్ద, అతి ప్రకాశంతోకూడిన సూపర్‌మూన్‌ను చూసి జనం  మురిసిపోయారు. సాధారణ పౌర్ణమి నాటి కంటే 14 రెట్లు పెద్దగా, 30 శాతం అధిక వెలుగులతో ఆకాశంలో వెన్నెలరేడు వికసించాడు. చంద్రుడు తన కక్ష్యలో భూమికి అతి సమీపంగా 3,57,000 కి.మీ. దూరానికి () రావడంతో ఈ అద్భుతం చోటుచేసుకుంది. ఇలా ఏడాదికోసారి మాత్రమే సూపర్‌మూన్ కనువిందు చేస్తుంది. భారత్ తో పాటు పారిస్, అమెరికా, ఇంగ్లాండ్, రష్యా, రియో డీ జెనిరియో, గ్రీస్ సహా పలు ప్రపంచదేశాల్లో కూడా శని, ఆదివారాల్లో చందమామ పెద్దగా, ప్రకాశంతో కనిపించి వీక్షకులకు కనువిందు చేశాడు. .. 
  (ఫొటో)   రియో డీ జెనిరియో లో ఆదివారం రాత్రి క్రీస్తు విగ్రహం వెనుక నుంచి దర్శన మిచ్చిన  సూపర్ మూన్... 

Sunday, May 6, 2012

మూడు రోజుల భారత పర్యటనకై ఆదివారం కోల్ కతా చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ 

రాజస్థాన్ బి.జె.పి.లో భగ్గుమన్న అంతర్గత విబేధాలు

జైపూర్ ,మే 6:  రాజస్థాన్ భారతీయ జనతా పార్టీలో అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, మరో కీలక నేత కటారియా మధ్య నాయకత్వ పోరు పతాకస్థాయికి చేరుకుంది. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో నిలిచే ప్రయత్నాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కటారియా తలపెట్టిన "లోక్‌జాగరణ్ యాత్ర'' తాజా వివాదానికి కారణమైంది. ఈ యాత్రను వెంటనే విరమించుకోవాలని, లేనిపక్షంలో తాను పార్టీకి రాజీనామా చేస్తానని వసుంధరా రాజే సింధియా హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరితో పాటు పలువురు కీలక నేతలు వసుంధర రాజేకు మద్దతు పలికారు. వసుంధర రాజే బాటలో తాము కూడా రాజీనామా చేస్తామని ప్రకటించారు. కటారియా యాత్ర అంశాన్ని పార్టీ అధిష్ఠానానికి నివేదించారు. దీనితో బీజేపీ జాతీయ అధ్యక్షుడు గట్కరీ రంగంలోకి దిగి కటారియాను ఫోన్‌లో సంప్రదించారు. ప్రస్తుతానికి యాత్రను విరమించుకోవాలని సూచించారు. దీనితో కటారియా తన యాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

కాంగ్రెస్ లోనే ఉంటాం...

చిత్తూరు,మే 6:  తాము కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతామని సినీ హీరో రాజశేఖర్  స్పష్టం చేశారు. తన సతీమణి, దర్శక నిర్మాత జీవితతో కలిసి ఆయన ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ,    తాము కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతామని, త్వరలో జరగనున్న పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గాలలో జరగనున్న ఉప ఎన్నికలలో తాము కాంగ్రెసు పార్టీ తరఫునే ప్రచారం చేస్తామని తెలిపారు. ఇతర పార్టీలలో చేరే విషయమై ఆయా నేతలతో చర్చలు జరిపింది నిజమేనని వారు చెప్పారు. తాము కాంగ్రెసు పార్టీలో చేరడం లేదని, కాంగ్రెసు పార్టీలోనే ఉన్నామని చెప్పారు. పార్టీ ఎక్కడ ప్రచారం చేయమని ఆదేశిస్తే అక్కడ ప్రచారం చేయడానికి  సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
కాగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత రాజశేఖర్ దంపతులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. అయితే ఇరువురి మధ్యన పొసగక పోవడంతో వారు జగన్‌కు దూరమయ్యారు. . అనంతరం వారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు సంప్రదింపులు జరిపారు. అయితే ఇటీవల అరెస్టైన తారా చౌదరి కేసులో రాజశేఖర్ పేరు ఉందనే వార్తలు వచ్చిన  నేపథ్యంలో వారికి తెలుగుదేశం పార్టీ తలుపులు తెరవలేదని తెలుస్తోంది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.  కానీ,  తారా కేసులో రాజశేఖర్ ఉండటంపై బిజెపిలో తర్జన భర్జన జరిగిందని, చివరకు ఆ పార్టీ కూడా తలుపులు మూసివేసిందంటున్నారు. దీనితో  వారి  కాంగ్రెసులోనే కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం. 

ఎయిరిండియాకు అమెరికా ఫైన్...

వాషింగ్టన్,మే 6: ఇప్పటికే  నష్టాలు, రుణాల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వరంగ విమానయానసంస్థ ఎయిరిండియాకు మరో కష్టం వచ్చి  పడింది. సర్వీసులు, ఫీజుల గురించిన సమాచారాన్ని వెబ్‌సైట్లో ఉంచకపోవడం, ప్రయాణికులకు సరిగ్గా తెలియజేయకపోవడం వంటి కారణాలతో ఎయిరిండియాకు  అమెరికా 80,000 డాలర్ల (సుమారు రూ. 42 లక్షలు) జరిమానా విధించింది. విమాన ప్రయాణికులకు సంబంధించి గతేడాది ఆగస్టు నుంచి అమెరికా ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పట్నుంచీ.. విధించిన తొలి జరిమానా ఇదే. నిబంధనల ప్రకారం ఫ్లైట్ జాప్యం జరిగితే ఏ విధమైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేదీ, వసూలు చేసే వివిధ రకాల ఫీజులు మొదలైన వివరాలను ఎయిర్‌లైన్స్ విధిగా తమ వెబ్‌సైట్లో పేర్కొనాల్సి ఉంటుంది. అయితే, కస్టమర్ సర్వీసు, అత్యవసర ప్రణాళికలు మొదలైన వివరాలను ఎయిరిండియా తన వెబ్‌సైట్లో ఉంచలేదని అమెరికా ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్  తెలిపింది. 

ఎన్‌సీటీసీ కి కాంగ్రెసేతర ముఖ్యమంత్రుల ససేమిరా...

న్యూఢిల్లీ,మే 6:  యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం (ఎన్‌సీటీసీ) ను  కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. దీనిపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే లక్ష్యంతో కేంద్రం శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సమావేశంలో  ఏకాభిప్రాయం కుదర లేదు.  దేశ భద్రత, రక్షణ కోసం ఎన్‌సీటీసీ అవసరమని, దీనిపై ఏకాభిప్రాయానికి రావాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం చేసిన విజ్ఞప్తులు ప్రభావం చూపలేకపోయాయి. కాంగ్రెస్ మిత్రపక్షాలతోపాటు, ఇతర పక్షాలకు చెందిన ముఖ్యమంత్రులను ఎన్‌సీటీసీ ఏర్పాటుకు ఒప్పించటంలో యూపీఏ సర్కారు విఫలమైంది. మొత్తం 24 మంది ముఖ్యమంత్రులు, ముగ్గురు రాష్ట్ర మంత్రులు హాజరైన ఈ సమావేశంలో.. దాదాపు డజను మంది కాంగ్రెసేతర సీఎంలు ఎన్‌సీటీసీ ప్రతిపాదనను వ్యతిరేకించారు.  యూపీఏ కీలక భాగస్వామి అయిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, బీజేపీ నాయకుడు, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీలయితే.. అసలు ఎన్‌సీటీసీ ప్రతిపాదననే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మిత్రపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఎన్‌సీటీసీ ప్రస్తుత రూపంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇది కూడా సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టంలాగే వివాదాస్పదమవుతుందని అభిప్రాయపడ్డారు. యూపీఏ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ కూడా.. ఎన్‌సీటీసీ నిబంధనలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని, కాబట్టి ప్రస్తుత రూపంలో దానిని అంగీకరించలేమని పేర్కొన్నారు. అయితే బీజేపీ నాయకుడు, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్.. తమ సూచనలను పొందుపర్చుతూ ఎన్‌సీటీసీకి సవరణ చేసినట్లయితే.. దానికి తాము మద్దతిస్తామన్నారు. 

' పసిడి ' దీపిక...

అంటాల్య(టర్కీ),మే 6: : ఆర్చరీ ప్రపంచ కప్ లో భారత యువ తార దీపిక కుమారి సంచలనం సృష్టించారు. శనివారం జరిగిన మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ఈ జార్ఖండ్ క్రీడాకారిణి స్వర్ణ పతకం సాధించింది. ప్రపంచ మాజీ చాంపియన్, మాజీ నంబర్‌వన్... 27 ఏళ్ల జిన్ లీ సుంగ్ (దక్షిణ కొరియా) తో జరిగిన ఫైనల్లో 17 ఏళ్ల దీపిక 6-4తో (27-30, 29-27, 27-29, 27-26, 28-27) విజయం సాధించింది. ‘బెస్ట్ ఆఫ్ ఫైవ్’ సెట్‌ల పద్ధతిలో నిర్వహించే ఫైనల్లో మూడు సెట్‌లు నెగ్గిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఒక్కో సెట్‌లో ఇద్దరికీ మూడు బాణాలు చొప్పున సంధించే అవకాశం ఇస్తారు. అత్యధిక పాయింట్లు సాధించిన వారికి సెట్ దక్కుతుంది. ఒక్కో సెట్‌కు రెండు పాయింట్లు కేటాయిస్తారు. ఈ క్రమంలో దీపిక మూడు సెట్‌లు గెల్చుకోగా... జిన్ లీ సుంగ్ రెండు సెట్‌లు సాధించింది. ఈ విజయంతో డిఫెండింగ్ జూనియర్ ప్రపంచ చాంపియన్ దీపిక తన కెరీర్‌లో తొలిసారి ప్రపంచకప్‌లో పసిడి పతకాన్ని దక్కించుకుంది. 2010 ఢిల్లీ కామన్వెల్త్   లో   వ్యక్తిగత స్వర్ణం నెగ్గిన దీపిక ఇప్పటికే లండన్ ఒలింపిక్స్ కు  వ్యక్తిగత, టీమ్ విభాగంలో అర్హత సాధించింది. 

Saturday, May 5, 2012

ప్రాణహిత-చేవెళ్ల పై మహారాష్ట్ర తో ఒప్పందం

న్యూఢిల్లీ, మే 5:   ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. దివంగత నేత డాక్టర్ వైఎస్ హయాం లో దీని నిర్మాణానికి  శంకుస్థాపన జరిగింది. 40వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలోని 7 జిల్లాలకు 160 టిఎంసిల సాగునీరు, తాగు నీరు అందుతుంది. హైదరాబాద్‌కు కూడా 30 టీఎంసీల తాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రాంతానికి లైఫ్‌లైన్ లాంటిదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. నిర్దిష్ట కాలపరిమితిలోనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.  ప్రాజెక్టు డిజైన్ మార్పులపై నిపుణుల కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు. ప్రాజెక్టు జాతీయ హోదా సాధించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని చెప్పారు. మహారాష్ట్ర ముందుకు రావడం వల్ల ముంపు సమస్య పరిష్కారం సులభతరం అయిందన్నారు. ఇతర రాష్ట్రాలతో వివాదాలను పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కృష్ణా జలాల అంశంపై టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

భానూ నేరాలు ఇన్నిన్ని కాదయా...

హైదరాబాద్, మే 5:  తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి హత్య కోసం మొద్దు శీనుకు కోటి రూపాయలు ఇచ్చినట్లు మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ చెప్పాడు. సిఐడి కోర్టుకు సమర్పించిన నేరాంగీకార పత్రంలో అతను పలు  విషయాలు వెల్లడించాడు. హంద్రీనీవా ప్రాజెక్టు సెటిల్మెంట్లలో వచ్చిన డబ్బులన్నీ పంపిణీ చేశామని అతను చెప్పాడు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత సూరి పేరు మీద 25 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు అతను చెప్పాడు.  పులివెందుల కృష్ణకు కోటీ 30 లక్షల రూపాయలు ఇచ్చినట్లు భాను కిరణ్ చెప్పాడు. జల్సాలకు 40 లక్షల రుపాయలు ఖర్చయ్యాయని  చెప్పాడు. సూరి సోదరి హేమలతా రెడ్డికి 40 లక్షల రూపాయలు ఇచ్చినట్లు  తెలిపాడు. హంద్రీనీవా 72 కోట్ల రూపాయల 7వ ప్యాకేజీ జెకె కన్‌స్ట్రక్షన్‌కు వచ్చే చూశామని, తమకు 8.6 కోట్ల రూపాయలు కమిషన్ వచ్చిందని, దాన్ని నిరంజన్ రెడ్డి అనే వ్యక్తికి ఇచ్చామని అతను చెప్పాడు. 38 కోట్ల రూపాయల ఐదో ప్యాకేజీ కాంట్రాక్టులో సహకరించినందుకు 3.5 కోట్లు రూపాయలు తీసుకున్నామని  చెప్పాడు. ఆరో ప్యాకేజీ కూడా ఓ సంస్థకు రావడానికి సహకరించామని అతను చెప్పాడు. అన్నపూర్ణ ప్యాకేజింగ్ విషయంలోనే సూరితో విభేదాలు వచ్చినట్లు అతను చెప్పాడు. సూరి హత్య తర్వాత ఉమాశంకర్ అనే వ్యక్తి 50 వేల రూపాయలు ఇచ్చాడని, అతనే సిమ్ కార్డు కూడా ఇచ్చాడని, దాంతో సూరి హత్య తర్వాత ఢిల్లీలోని శర్మ లాడ్జిలో ఉన్నానని, సింప్లెక్స్ ఉద్యోగిగా చెలామణి అయ్యాయని అతను చెప్పాడు. సూరి హత్యకు టచ్ పబ్‌లో ప్రణాళిక రచించినట్లు అతను తెలిపాడు. సినీ నిర్మాత సింగనమల రమేష్, మన్మోహన్ సింగ్‌తో కలిసి శంషాబాద్‌లో సూరి హత్యకు ఆరు రౌండ్ల టెస్ట్ ఫైరింగ్ జరిపినట్లు అతను తెలిపాడు.

Friday, May 4, 2012

తెలుగుదేశం పార్టీ మహానాడు వాయిదా

ఉప ఎన్నికల ఎఫెక్ట్హైదరాబాద్ ,మే 4:  తెలుగుదేశం పార్టీ మహానాడుపై ఉప ఎన్నికల ప్రభావం  పడింది.   మహానాడును ఉప ఎన్నికలు అయిన తర్వాతనే  నిర్వహించాలని  తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పొలిట్‌బ్యూరో నిర్ణయం తీసుకుంది. పోలిట్‌బ్యూరో సమావేశానికి పలువురు సీనియర్లు గైర్హాజరయ్యారు. పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సమావేశానికి హాజరు కాలేదు. తనకు సభ్యత్వం లేనందున తాను హాజరు కాలేదని ఆయన అన్నారు. కాగా ఉమ్మారెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫోరం నేత, సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు, ఉప్పులేటి కల్పన పోలిట్ బ్యూరో భేటీకి గైర్హాజరయ్యారు. విజయవాడలో దమ్ము ఎఫెక్ట్  కారణంగా హరికృష్ణ, పరకాల ఉప ఎన్నికలు ఉండటంతో ఎర్రబెల్లి, విదేశీ పర్యటనలో ఉండటంతో కల్పన హాజరు కాలేదని తెలుస్తోంది. 

నిత్యానందకు హైకోర్టు షాక్

మధురై  పీఠాధిపతిగా నియామకం నిలిపివేత  
చెన్నై,మే 4:  మధురై ఆధీనం పీఠాధిపతిగా స్వామి నిత్యానంద నియామకాన్ని మద్రాసు హైకోర్టు నిలిపివేసింది. నిత్యానంద నియామకాన్ని సవాల్ చేస్తూ ఓ న్యాయవాది హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దాంతో న్యాయస్థానం నియామకాన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గా నిత్యానంద స్వామిని మధురై ఆధీనం పీఠాధిపతిగా ఏప్రిల్ 30వ తేదిన నియమించారు. దీనిపై తీవ్ర దుమారం రేగింది. పలు కేసులు ఎదుర్కొంటున్న నిత్యానందను పీఠాధిపతిగా నియమించడమేమిటని పలువురు ప్రశ్నించారు. ఆయనను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయనను తొలగించే వరకు ఊరుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. పలువురు నిత్యానందను తొలగించాలని డిమాండ్ చేస్తుండగా, ఆయన మాత్రం... తాను ఎలాంటి సమస్యనైనా ధీటుగా ఎదుర్కొంటానని, మధురై ఆధీనం పీఠాధిపతి స్థానాన్ని ఎంతో బాధ్యతగా స్వీకరించానని చెప్పారు. తాను పీఠాధిపతిగా పలు ఆలయాలు సందర్శిస్తానని చెప్పారు. అయితే ఆయన నియామకంపై చెన్నై హైకోర్టు తాజాగా స్టే ఇచ్చింది.  నిత్యానందపై తమిళనాడు, కర్నాటక కోర్టులలో పలుకేసులు ఉన్న విషయం తెలిసిందే. ప్రధానంగా ప్రముఖ సినీ నటి రంజితతో  రాసలీలల వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ రాసలీలల వ్యవహారంతోనే ఆయన పేరు  బయటకు వచ్చింది.

Thursday, May 3, 2012

గవర్నర్‌గా రెండో పర్యాయం ప్రమాణ స్వీకారం చేసిన నరసింహన్‌

హైదరాబాద్ ,మే 3:  రాష్ట్ర గవర్నర్‌గా ఈఎస్ ఎల్ నరసింహన్‌  రెండో పర్యాయం ప్రమాణ స్వీకారం చేశారు.  గురువారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి. లోకూర్‌  నరసింహన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్‌గా నరసింహన్‌ను రెండో పర్యాయం కొనసాగిస్తూ  రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్‌ ద్వివేది చదివి వినిపించారు. గవర్నర్‌గా మరోసారి బాధ్యతలు స్వీకరించిన నరసింహన్‌ను ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లోకూర్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, మంత్రులు, శాసనమండలి విపక్ష నేత దాడి వీరభద్రరావు, డీజీపీ దినేష్‌ రెడ్డి, గవర్నర్‌ కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.  అనంతరం గవర్నర్  మీడియాతో మాట్లాడుతూ..ఉప ఎన్నికలు ముగియగానే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నట్లు  తెలిపారు. గవర్నర్ గా మరో అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ తో తనకు నాలుగు దశాబ్ధాల అనుబంధం ఉందన్నారు. అభివృద్ధి ఫలాలు హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాలకే పరిమితం కాకూడదన్నారు. మలేరియా మందులు గిరిజనులకు అందటం లేదని, ఈ విషయంపై శ్రద్ధ వహిస్తానని గవర్నర్ తెలిపారు.  

మావోల చెర నుండి కలెక్టర్ పాల్ విడుదల

రాయపూర్,మే 3: మావోల చెర నుంచి చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ గురువారం మధ్యాహ్నం విడుదలయ్యారు. చత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్యవర్తులుగా వ్యవహరించిన బిడి శర్మ, ప్రొఫెసర్ హరగోపాల్‌కు కలెక్టర్ మీనన్‌ను మావోయిస్టులు తాడిమెట్ల అడవులలో అప్పగించారు.  గత నెల ఏప్రిల్ 21వ తేదిన కలెక్టర్ అలెక్స్ మీనన్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఆయనను విడుదల చేయించడానికి బిడి శర్మ, హరగోపాల్ మధ్యవర్తులుగా వ్యవహరించారు. వారి కృషి ఫలించింది. వీరు నాలుగు దఫాలుగా అటు ప్రభుత్వం, ఇటు మావోయిస్టులతో చర్చలు జరిపారు.కాగా కలెక్టర్ విడుదలకు మావోయిస్టులు పెట్టిన పలు ఒప్పందాలకు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఆయనను విడుదల చేశారు. 

Wednesday, May 2, 2012

చిదంబరం నోట అదే మాట...

కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రంపై రుద్దలేం
ఏపీలో పార్టీలన్నీ చీలిపోయాయి

 న్యూఢిల్లీ, మే 2: కేంద్ర హోంమంత్రి చిదంబరం 'ఇప్పట్లో తెలంగాణపై స్పష్టత ఇవ్వలేం' అని తేల్చేశారు. లోక్‌సభలో బుధవారం టీఆర్ఎస్, టీడీపీ ఎంపీల నినాదాలు... కాంగ్రెస్ తనవైఖరి చెప్పాల్సిందేనన్న డిమాండ్ల నేపథ్యంలో  'ఇప్పట్లో తేల్చే అవకాశమే లేదు' అని చిదంబరం అంతే స్పష్టంగా చెప్పేశారు.  'కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రంపై రుద్దం. తెలంగాణ ఇచ్చేదీ లేనిదీ స్పష్టంగా చెప్పలేను. నేనేకాదు... ఏ హోంమంత్రీ చెప్పలేరు. అక్కడి పరిస్థితి మీకందరికీ తెలుసు' అన్నారు.  పార్టీలన్నీ సాధ్యమైనంత త్వరగా తమ వైఖరి వెల్లడించాలనేలా మాట్లాడిన చిదంబరం... దీనికి నిర్దిష్టమైన గడువేమీ లేదని, మరింత సమయం తీసుకున్నా అభ్యంతరమేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ మాత్రం త్వరలోనే తన వైఖరి చెబుతుందన్నారు. 'తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ నివేదికే ప్రాతిపదిక గా ఉంటుంది'' అని చిదంబరం స్పష్టం చేశారు. పరిస్థితులు అందరికీ తెలిసినవే. ఈ అంశంపై (తెలంగాణ) ప్రతి పార్టీ కూడా చీలిపోయింది'' అని చెప్పారు. 2009 డిసెంబర్ 9న పార్లమెంటులో తాను ప్రకటన చేసేప్పటికి రెండు రోజుల ముందు ఆంధ్రప్రదేశ్‌లో.. తెలంగాణపై అఖిలపక్ష సమావేశం జరిగిందని గుర్తుచేశారు. తాను ప్రకటన చేసిన రోజున ఇదే అంశంపై లోక్‌సభ బీఏసీ కూడా చర్చించిందని వెల్లడించారు. తాను ప్రకటన చేసిన 24 గంటల్లోనే పరిస్థితులు నాటకీయంగా మారిపోయాయని, అధికారంలో ఉన్న తమ కాంగ్రెస్ పార్టీతో సహా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ తమ వైఖరిని మార్చేసుకున్నాయని చెప్పారు. ఈ పరిణామాల కారణంగానే 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటనను.. అదే ఏడాది డిసెంబర్ 23న మార్చాల్సి వచ్చిందని వివరించారు. 

‘అతిరాత్రం’ పరిపూర్ణం

భద్రాచలం, మే 2:  ఇక్కడకు సమీపం లోని యెటపాక వద్ద అత్యంత ప్రాచీన వైదిక సంప్రదాయ క్రమానుగతికి అనుగుణంగా పన్నెండురోజులపాటు నిర్విరామంగా సాగిన ఉత్కృష్ట సోమయాగం ‘అతిరాత్రం’ బుధవారం ముగిసింది. లక్షలాది మంది భక్తజనుల సమక్షంలో సాగిన ఈ వైదిక క్రతువు పరమపవిత్రంగా సాగింది. అశ్వినీ స్తోత్రపఠనంతో రుత్వికులు వైదిక తంతును కొనసాగించారు. అనుయాజం వైదిక క్రతువుతో రుత్వికులు యాగ పరిసమాప్తికి వేదమంత్రాలు పఠించారు. హారీయోజనం కార్యక్రమంలో ఉన్నేత అనే రుత్వికునితో చివరిసారి సోమరసాన్ని ఆహుతి చేయించారు. సకల దోషాల పరిహారం కోసం 300 ఆజ్యాహుతులతో మహాప్రాయశ్చిత క్రతువును రుత్వికులు నిర్వహించారు. అవభృతంలో యాగ యజమాని సోమయాజి, ఆయన ధర్మపత్ని సావిత్రి పథినాడికి యాగపరిసమాప్తి స్నానం చేయించారు. అనంతరం ఉదయనీయ ఇష్టి, మైత్రావరుణి పశుఇష్టి నిర్వహించారు. వేదమంత్రాలతో దేవతలను ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేశారు. సూర్య, వరుణాది దేవతలకు పశుఇష్టి నిర్వహించారు. సక్తుహోమంలో పేలాల పిండితో హోమాన్ని నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాలు.. శ్రీరామ నామస్మరణ.. రుత్వికుల వేదమంత్రాల నడుమ పూర్ణాహుతి శాస్త్రోక్తంగా సాగింది. సాయంత్రం ఏడు గంటల ఐదు నిమిషాలకు మొదలైన అగ్నిసంస్కారం పదినిమిషాల్లో పూర్తయింది. ఈ అగ్ని కీలల వెలుగులో భద్రాచల పరిసర ప్రాంతం దేదీప్యమానంగా వెలిగింది. పూర్ణాహుతిని తిలకించిన భక్తులు పులకించిపోయారు. 

అన్నవరం లో కన్నులపండువగా కళ్యాణం

అన్నవరం, మే 2: రత్నగిరిపై కొలువైన శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి అమ్మవార్ల దివ్యకల్యాణ మహోత్సవం వైశాఖశుద్ధ ఏకాదశి బుధవారం రాత్రి కన్నులపండువగా జరిగింది. వేలాదిమంది భక్తులు తిలకిస్తుండగా శాస్త్రోక్తంగా అర్చకస్వాములు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి నూతనాలయంలో స్వామి, అమ్మవార్లు కొలువైన తర్వాత జరిగిన  ఈ ఉత్సవానికి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం గురుమూఢం కారణంగా వివాహముహూర్తాలు లేకపోయినా స్వామివారి కల్యాణం లోకకల్యాణార్థం ఏటా ఇదేరోజున జరుగుతున్న కార్యక్రమమైనందున అటువంటి పట్టింపులుండవని పండితులు తెలిపారు. రత్నగిరి రామాలయం పక్కనే గల వార్షిక కల్యాణ వేదికపై స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. క్షేత్ర పాలకులు సీతారాముల పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. 

వంశీకి షోకాజ్ పై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం ?

హైదరాబాద్,మే 2:  తనకు సన్నిహితుడైన తెలుగుదేశం  విజయవాడ నాయకుడు వల్లభనేని వంశీకి పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేయడంపై సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తన సినిమా దమ్ము విడుదల రోజున బందర్ పోర్టు సాధన కోసమంటూ తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా బంద్ నిర్వహించడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. వంశీకి షోకాజ్ నోటీసు జారీ, దమ్ము సినిమా విడుదల రోజు కృష్ణా జిల్లా బంద్ తనకు వ్యతిరేకంగా కావాలని చేసిందనే అభిప్రాయంతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. ఆ రెండు విషయాలపై జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే, ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తూనే తన ప్రణాళికను అమలు చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

మళ్లీ రూపాయి క్షీణత

ముంబై,మే 2: రిజర్వ్ బ్యాంక్ జోక్యంతో కొన్నాళ్ల క్రితం పుంజుకున్న రూపాయి..  మళ్లీ పతనమవుతూ కలవరపెడుతోంది. రెండు నెలల వ్యవధిలోనే డాలర్‌తో పోలిస్తే దాదాపు నాలుగు వందల పైసల మేర క్షీణించి 53 స్థాయికి చేరువలో ఉంది. అంతర్జాతీయ పరిణామాలకు తోడు దేశీయంగా ఆర్థిక లోటు పెరిగిపోవడం, భారత్ అంచనాలను రేటింగ్ ఏజెన్సీలు తగ్గించడం, దేశ భవిష్యత్‌పై ఇన్వెస్టర్లలో సందేహాలు రేకెత్తడం తదితర అంశాలన్నీ కూడా కరెన్సీ క్షీణతకు కారణమవుతున్నాయి. దిగుమతి చేసుకునే వాటిలో కొన్నింటి రేట్లు అంతర్జాతీయంగా తగ్గినా.. రూపాయి విలువ క్షీణత కారణంగా ఆ ప్రయోజనాలేమీ దక్కే పరిస్థితి లేదు. పెపైచ్చు రోజుకో వస్తువు ధర అంతకంతకూ పెరుగుతోంది. 

మెల్‌బోర్న్ లో భారత సంతతి కుటుంబం అనుమానాస్పద మృతి

మెల్‌బోర్న్,మే 2:  ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ లో భారత సంతతికి చెందిన ఓ కుటుంబం అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడింది. నీలేష్ శర్మ(34), అతడి భార్య ప్రీతిక(32), వారి పిల్లలు దివేష్(5), దివ్య(3)ల మృతదేహాలను గ్లెన్ వేవర్లీలోని వారి నివాసంలో కనుగొన్నారు. నీలేష్ మృతదేహం హాల్లో పడివుండగా మిగతా ముగ్గురు పడకగదిలో నిర్జీవులుగా కనిపించారు. ఫిజీ-భారత సంతతికి చెందిన నీలేష్ కుటుంబం దశాబ్దం క్రితం ఆస్ట్రేలియాకు వలస వచ్చింది. ఎకౌంటెంట్‌గా పనిచేస్తున్న నీలేష్ గత రెండేళ్లుగా గ్లెన్ వేవర్లీలో నివసిస్తున్నారు. అయితే వీరి మరణానికి గల కారణాలు వెల్లడికాలేదు. హత్య-ఆత్మహత్య కింద పోలీసులుకేసు నమోదు చేశారని ఏఏపీ వార్తా సంస్థ పేర్కొంది.

Tuesday, May 1, 2012

విడాకుల ప్రక్రియ సులభతరం

న్యూఢిల్లీ,మే 1:   హిందూ వివాహ చట్టం-2007, ప్రత్యేక వివాహ చట్టం-1954లకు సవరణలు చేస్తూ వివాహ చట్టం(సవరణ)బిల్లు-2010ని న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సవరణ చట్టం ద్వారా విడాకులు పొందడం తేలికవుతుందని తెలిపారు. దీనివల్ల విడిపోయిన భార్యాభర్తలకు చెందిన పిల్లలకు రక్షణ ఏర్పడుతుందని, భర్త ఆస్తిలో భార్యకు హక్కు ఉంటుందని వివరించారు. కాగా, బిల్లులోని కొన్ని అంశాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని బీజేపీ సభ్యుడు అరుణ్ జైట్లీ విమర్శించారు. ఈ బిల్లు వల్ల ఉపయోగాలకన్నా మహిళలకు చేటే ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. దీనిని తాము వ్యతిరేకిస్తున్నట్టు అరుణ్‌జైట్లీ తెలిపారు.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...