Monday, March 1, 2010

నాగ్ కు చైతన్యోత్సాహం


హైదరాబాద్,మార్చ్ 1: గీతాంజలి సినిమా కలిగించిన చక్కటి అనుభూతిని ‘ఏ మాయ చేసావె’ చిత్రం కూడా కలిగించిందని ప్రముఖ కథానాయకుడు నాగార్జున పేర్కొన్నారు. తన తనయుడు నాగచైతన్య నటించిన ఈ ద్వితీయ చిత్రాన్ని చూసిన ఆయన పాత్రికేయులతో ముచ్చటిస్తూ, ఈ చిత్రంలో యాక్షన్‌కు ప్రాధాన్యం ఉండదని, చక్కటి ప్రేమకథాచిత్రమిదని, ఆ ఫీల్‌ తోనే ఈ చిత్రాన్ని చూడాలని ప్రేక్షకాభిమానులను కోరారు. తన తనయుడు చిత్రమన్న ఉద్దేశంతో తాను మాట్లాడటం లేదని, అన్నివిధాలుగా చిత్రం బాగుందని, వేరొకరు ఈ చిత్రంలో నటించివున్నా తాను ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తానని ఆయన స్పష్టంచేశారు. గతంలో తాను నటించిన ‘గీతాంజలి’ చిత్రంపైన మొదట్లో విమర్శలు వచ్చాయని, హీరో క్యాన్సర్‌ రోగి కావడం, గడ్డం పెంచుకుని ఉండటం, ఫైట్లు లేకపోవడం వంటివాటిని అభిమానులు వ్యతిరేకించారని, అయితే సినిమా విడుదలైన వారం తర్వాత ఆ చిత్రం కలెక్షన్లతో పుంజుకుని ఎంతటి చక్కటి దృశ్యకావ్యంగా ప్రేక్షకాభిమానులను ఎంతగా అలరింపజేసిందో తెలిసిందేనని ఆయన అన్నారు. ‘ఏ మాయ చేసావె’లో ఆ తరహా క్యాన్సర్‌, గడ్డం వంటి అంశాలు లేవని, అయితే చిత్రం ఆద్యంతం ప్రేక్షకులకు అద్భుతమైన ఫీల్‌ను కలిగిస్తుందని ఆయన చెప్పారు. చాలా రోజుల తర్వాత ఓ రొమాంటిక్‌ చిత్రాన్ని చూసిన ఫీలింగ్‌ తనకు కలిగిందని, సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ఫీల్‌లోనే ఉండిపోతామని, అదే తనను ఈ చిత్రపరంగా ఎంతగానో ఆకర్షించిందని అన్నారు. పాయింట్‌ చిన్నదే అయినా దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ తెరపై చిత్రాన్ని మలచిన విధానం ప్రశంసనీయమని చెప్పారు. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే, ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం, ఫోటోగ్రఫీ, లొకేషన్లు, ఇందిరా ప్రొడక్షన్స్‌ నిర్మాణ విలువలు…ఇలా ఏది తీసుకున్నా హైలైట్‌గా నిలుస్తాయని అన్నారు. పాటలన్నీ బాగున్నాయని, ప్రత్యేకించి ‘కుందనపు బొమ్మ’ అనే పాట తనకెంతో నచ్చిందని చెప్పారు. హీరోహీరోయిన్ల పాత్రలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయని అన్నారు. నాగచైతన్య, సమంతల కెమెస్ట్రీ చాలా బాగా కుదిరిందని, నాగచైతన్య నటన, డైలాగ్స్‌, డ్యాన్సుల పరంగా చక్కటి ప్రతిభను కనబరిచాడని, మొదటి చిత్రం ‘జోష్‌’ చిత్రంతో పోల్చుకుంటే అతను మరింత పరిణతి సాధించాడని నాగార్జున వివరించారు. చైతన్యను కెరీర్‌ మొదట్లోనే ఇంత మంచి చిత్రం రావడం అతని అదృష్టమని అన్నారు. కృష్ణుడి పెర్పార్మెన్స్‌ కూడా బాగుందని, ఒక్కరి పెర్పార్మెన్స్‌ అని కాకుండా అందరూ చాలా బాగా నటించారని ఆయన చెప్పారు. కాగా ‘కేడి’ తర్వాత దిల్‌ రాజు నిర్మించబోయే చిత్రంలో తాను నటిస్తున్నానని, అది యాక్షన్‌ చిత్రమని అన్నారు. ఇక చైతన్య కామాక్షి కళా మూవీస్‌లో తదుపరి చిత్రంలో చేయబోతున్నాడని, అది యాక్షన్‌ చిత్రమని అన్నారు.

మంత్రి గాదె వెంకటరెడ్డికి అస్వస్థత


గుంటూరు, మార్చి 1 : రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సోమవారం తెల్లవారు జామున షుగర్ లెవెల్స్ పడిపోవడంతో ఆయనను పొన్నూరులోని ఆస్పత్రికి తరలించారు.మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి గుంటూరు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలియవచ్చింది.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...