Monday, January 26, 2015

ప్రముఖ కార్టూనిస్టు ఆర్.కె. లక్ష్మణ్ కన్నుమూత. ..

పుణే,జనవరి 26; ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్(94) కన్నుమూశారు. దీననాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. యూరినల్ ఇన్ఫెక్షన్, అవయవాలన్నీ సరిగా పనిచేయకపోవడం వంటి సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.
సమకాలీన రాజకీయాలు, దిగజారుతున్న ప్రజాస్వామిక విలువలపై ‘ది కామన్ మేన్’ కార్టూన్ కామెంట్‌తో పత్రికా ప్రపంచంలో కొత్త చరిత్రను సృష్టించిన విఖ్యాత వ్యంగ్య చిత్ర కారుడు ఆర్కే లక్ష్మణ్‌కు బాల్యం నుంచే చిత్ర లేఖనంపై అమితాసక్తి. అక్షరాలు అబ్బకముందే బొమ్మలు గీయడం మొదలుపెట్టారు. బడిలో తాను కూర్చున్న చోటు పక్కనున్న కిటీకి నుంచి బయటకు చూస్తే కనిపించే చెట్లు, వాటి ఆకులు, వాటిపై తిరుగాడే తొండ, ఉడత లాంటి చిన్న చిన్న ప్రాణులను గీయడం ద్వారా చిత్ర లేఖనంలో ఓనమాలు దిద్దుకున్నారు. బడిలోని బల్లలు, గోడలే ఆయనకు కాన్వాస్‌లయ్యాయి. వాటిని గమనించిన టీచర్లు తిట్టకుండా చిత్ర లేఖనంలో ఆయన్ని ప్రోత్సహించారు. అప్పటి నుంచి లక్ష్మణ్ బొమ్మలు గీయడమే తన ప్రపంచంగా మలుచుకున్నారు. ఇక తన చదువు... ప్రపంచాన్ని చదవడం, దాని నుంచి తాను గ్రహించింది బొమ్మల ద్వారా ప్రపంచానికి చాటటమే కర్తవ్యంగా ఎంచుకున్నారు. అందులో భాగంగానే ముంబైలోని ‘జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్’లో చేరాలని దరఖాస్తు చేసుకొన్నారు. అయితే అప్పటికి లక్ష్మణ్ గీస్తున్న బొమ్మల్లో అంత పరిపక్వత లేదంటూ ఆ కాలేజీ డీన్ అతనికి అడ్మిషన్ ఇవ్వడానికి నిరాకరించారు.అందుకు లక్ష్మణ్  నిరాశ చెందకుండా తాను ఎంచుకున్న చిత్రలేఖనంలో మరింత నైపుణ్యాన్ని సాధించేందుకు పట్టుదలగా కృషి చేశారు. మైసూరులోని కాలేజీలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా సాధించారు. ఆ తర్వాత పలు పత్రికల్లో తనదైన శైలిలో కార్టూన్లు, ఇలస్ట్రేషన్లు వేయడం ద్వారా ప్రఖ్యాతి చెందారు. సమకాలీన ప్రపంచంలో పతనమౌతున్న ప్రజాస్వామిక విలువలపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం ద్వారా గొప్ప మానవతావాదిగా కూడా పేరు గడించారు. మైసూరు మహారాజా కాలేజీలో చదువుతుండగానే స్వరాజ్య, బ్లిట్జ్ లాంటి పత్రికలకు కార్టూన్లు, బొమ్మలు వేశారు. ఆ తర్వాత  ది స్ట్రాండ్ మేగజైన్, పంచ్, బై స్టాండర్డ్, వైడ్ వరల్డ్, టిట్ బిట్స్ లాంటి వాటిలో ఇలస్ట్రేషన్లు, కార్టూన్లు వేయడం ద్వారా పూర్తి స్థాయిలో పత్రికా ప్రపంచంలోకి అడుగుపెట్టారు.1951లో ప్రారంభమైన ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికలో ‘ది కామన్ మేన్’ ఈ సెడిట్ పేరిట రోజువారీ కార్టూన్లతో అలరించి యావత్ దేశాన్ని ఆక ర్షించారు. అప్పటి నుంచి ఆ కార్టూన్ కాలంను లక్ష్మణ్ దాదాపు ఐదు దశాబ్డాలపాటు కొనసాగించారు. ఒ ‘ది టన్నెల్ ఆఫ్ టైమ్’ పేరుతో తన జీవిత చరిత్రతో పాటు కొన్ని నవలలు రచించారు. తన పెద్దన్న ఆర్కే నారాయణ్  రాసిన నవలల్లో కొన్నింటికి బొమ్మలు గీశారు. నారాయణ్ రాసిన ‘మాల్గుడీ దేస్’ టీవీ ప్రసారాలకు, కొన్ని హిందీ సినిమాలకు ఇలస్ట్రేటర్‌గా . కర్ణాటక ప్రభుత్వం  నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్న లక్ష్మణ్.. అంతర్జాతీయంగా  రామన్ మెగసెసె, జాతీయంగా పద్మ విభూషణ్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు.
ఢిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో  త్రివిధ దళాల సైనిక వందనం కార్యక్రమానికి దేశంలోనే తొలిసారిగా  నేతృత్వం వహించిన మహిళా అధికారి పూజాఠాకూర్.  వైమానిక దళంలో వింగ్ కమాండర్ గా వున్న పూజాఠాకూర్  అమెరికా అధ్యక్షుడికి గౌరవసూచకంగా నిర్వహించిన కార్యక్రమంతో ఈ బాధ్యత ను నిర్వహించడం విశేషం... .

 
        ఢిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో  ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర శకటం .... 

Sunday, January 25, 2015

కడియం కు విద్య..లక్ష్మారెడ్డికి ఆరోగ్యం..

హైదరాబాద్‌, జనవరి 25: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు చేశారు. ఆదివారం ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కడియం శ్రీహరికి విద్యా శాఖ కేటాయించారు. కాగా ఇప్పటి వరకు విద్యా శాఖ మంత్రిగా ఉన్న జగదీష్‌ రెడ్డికి విద్యుత్‌ శాఖను, మంత్రి లక్ష్మారెడ్డికి వైద్య, ఆరోగ్య శాఖను కేటాయించారు. 

గణతంత్ర అతిథికి ఘనస్వాగతం...

                             రిపబ్లిక్ డే అతిధిగా సతీసమేతంగా వచ్చిన అమెరికా అధ్యక్షుడు ఒబామాకు 
ఢిల్లీ విమానాశ్రయం వద్ద ప్రధాని నరేంద్రమోడీ

 రాష్ట్రపతి భవన్ వద్ద  ప్రణబ్ ముఖర్జీ స్వాగతం...







కడియం శ్రీహరి ప్రమాణ స్వీకారం

హైదరాబాద్,జనవరి 25: తెలంగాణ రాష్ట్ర మంత్రిగా వరంగల్ పార్లమెంట్ సభ్యుడు కడియం శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. కడియంతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఈటెల రాజేందర్, పద్మారావు, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఇతర మంత్రులు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఎంపీలు కే. కేశవరావు, కవిత, వరంగల్ జిల్లాకు చెందిన ఇతర నేతలు పాల్గొన్నారు. 

రాజయ్య పై వేటు...కడియం కు చోటు

హైదరాబాద్,జనవరి 25: వైద్య ఆరోగ్య శాఖ ను నిర్వహిస్తున్న  ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజయ్య తన రాజీనామాను గవర్నర్‌కు పంపారు. రాజయ్య రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. వైద్య ఆరోగ్య శాఖను మంత్రి లక్ష్మారెడ్డికి తాత్కాలికంగా కేటాయించారు. రాజయ్య స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రివర్గంలోకి వరంగల్ పార్లమెంట్ సభ్యుడు కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ విస్తరించడానికి కారణం వైద్యశాఖ నిర్లక్షమేనని ,  వైద్యశాఖ మంత్రి రాజయ్య చేతగాని తనం వల్లే స్వైన్‌ఫ్లూతో ఇంతమంది మరణించారని ముఖ్య్మంత్రి కేసీఆర్‌  చేసిన వ్యాఖ్యలపై  రాజయ్య మీడియాతో తన ఆవేదన పంచుకున్నారు. రాజయ్య ఆవేదనకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలపై  కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేయడం రాజయ్య రాజీనామా కు దారితీసినట్టు కనబడుతోంది.  

Friday, January 23, 2015

తిరుపతి ఉపఎన్నికకు సుగుణమ్మ నామినేషన్‌

తిరుపతి జనవరి 23:  తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా చదలవాడ సుగుణమ్మ శుక్రవారం  నామినేషన్‌ను  దాఖలు చేశారు.  వెంకటరమణ మృతితో ఏ్పడిన ఖాళీతో ఈ ఉప ఎన్నిక జరగనుంది. తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా అన్ని పార్టీలు సహకరించాలని వెంకటరమణ సతీమణి అయన సుగుణమ్మ కోరారు. 

148 మందికి పద్మ పురస్కారాలు..

అద్వానీ,  బాబా రామ్‌దేవ్,  అమితాబ్ ,పండిట్ రవిశంకర్‌లకు పద్మ విభూషణ్...
పీవీ సింధుకు  పద్మశ్రీ 
 
న్యూఢిల్లీ,జనవరి 23:  భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను  ప్రకటించింది. వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన 148 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. బీజేపీ అగ్రనేత ఎల్‌.కె. అద్వానీ, యోగా గురు బాబా రామ్‌దేవ్, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, పండిట్ రవిశంకర్‌లను కేంద్రం పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించనుంది. బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్‌తో పాటు మాజీ ఎన్నికల కమిషనర్ ఎన్‌.గోపాలస్వామిలకు పద్మభూషణ్ పురస్కారాలు లభించనున్నాయి. భారత హాకీ టీం కెప్టెన్ సర్దార్‌సింగ్, తెలుగు తేజం-స్టార్ షట్లర్ పీవీ సింధు పద్మశ్రీ అవార్డులకు ఎంపికయిన వారిలో ఉన్నారు.  తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌లను కూడా కేంద్రం పద్మ పురస్కారాలతో సత్కరించనుంది.

Monday, January 19, 2015

మే 14న తెలంగాణా ఎంసెట్ ...

హైదరాబాద్‌: తెలంగాణ ఉన్నత విద్యామండలి నేడు ఎంసెట్‌తో పాటు వివిధ సెట్ల తేదీలు ప్రకటించింది. మే 14న ఎంసెట్‌, మే 19న లాసెట్‌ ,మే 22న ఐసెట్‌ లను కేయూ నిర్వహిస్తుంది జూన్‌ 6న ఎడ్‌సెట్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది మే 25 నుంచి పీఈ సెట్‌ను ఓయూ నిర్వహిస్తుంది. ఇక్కడి విద్యాసంస్థల్లో చేరాలంటే ఏపీ విద్యార్థులు ఈ పరీక్షలు రాయాల్సి వుంటుం ది.

Tuesday, January 6, 2015

ప్రపంచ కప్‌కు భారత జట్టు ఎంపిక...


ముంబై, జనవరి 6 : వరల్డ్‌ కప్‌కు 15 మందితో కూడిన భారత జట్టును సెలెక్టర్‌ కమిటీ ఎంపిక చేసింది. ముంబైలో సమావేశమైన సెలెక్టర్లు సంచలన నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు. గత వరల్డ్‌ కప్‌ హీరో యువరాజ్‌ రంజీలో మెరిసినా సెలక్టర్లను ఆకర్షించలేకపోయారు. కెప్టెన్‌గా ధోనీ, వైస్‌ కెప్టెన్‌గా కోహ్లీ జట్టును ముందుండి నడపనున్నారు. రోహిత్‌, థావన్‌, రైనా, రహానే బ్యాటింగ్‌లో ప్రధాన పాత్ర పోషించనున్నారు.

ఎంపికైన భారత జట్టు : మహేంద్ర సింగ్‌ దోనీ, శేఖర్‌ థావన్‌, రోహిత్‌ శర్మ, రహానే, విరాట్‌ కోహ్లీ, సురేష్‌ రైనా, లంబటి రాయుడు, రవీంద్ర జడేజా, అశ్విన్‌, అక్తార్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ, ఇషాంత్‌ శర్మ, బిన్నీ, ఉమేష్‌ యాదవ్‌.
 

Monday, January 5, 2015

సినీ రచయిత గణేష్ పాత్రో మృతి ....

హైదరాబాద్‌,జనవరి 5; ప్రముఖ సినీ మాటల రచయిత గణేశ్‌పాత్రో(69) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1945 జూన్‌ 22న విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఆయన జన్మించారు. 1965లో సినీ రచయితగా తన కెరీర్‌ను ప్రారంభించారు. రుద్రవీణ, మరో చరిత్ర, ఇది కథకాదు, మయూరి, సీతరామయ్యగారి మనవరాలు, మాపల్లెలో గోపాలుడు, ప్రేమించు పెళ్లాడు, నిర్ణయం తదితర చిత్రాలకు మాటలు అందించారు. మాటల రచయితగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆయన చివరి చిత్రం. 


Thursday, January 1, 2015

ఎగ్జిబిషన్ సందడి మొదలు


హైదరాబాద్‌, జనవరి 1 : నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో 75వ నుమాయిష్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగ్జిబిషన్‌ స్థలాన్ని సొసైటీకి అందజేస్తామని  ప్రకటించారు. ఢిల్లీలో ప్రగతి మైదాన్‌ కంటే గొప్పగా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ను రూపొందించుకుందామని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌లో సిగ్నల్‌ ఫ్రీ చౌరస్తాలకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. త్వరలో జంటనగరాల ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తామని కేసీఆర్‌ వెల్లడించారు. 45 రోజుల పాటు  ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది 


బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...