హైదరాబాద్, అక్టోబర్ 13: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా అందించే నంది అవార్డులను శనివారం ప్రకటించారు. 2011 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడిగా మహేష్ బాబు(దూకుడు) ఎంపిక కాగా, ఉత్తమ నటిగా నయనతార (శ్రీరామ రాజ్యం), ఉత్తమ చిత్రంగా శ్రీరామ రాజ్యం ఎంపికయింది. ఉత్తమ దర్శకుడిగా ఎన్ శంకర్ (జైబోలో తెలంగాణ) ఎంపికయ్యారు. ఇతర అవార్డుల వివరాలు: ఉత్తమ విలన్ : మంచు లక్ష్మి (అనగనగా ఒక ధీరుడు), ఉత్తమ ద్వితీయ చిత్రం : రాజన్న, ఉత్తమ తృతీయ చిత్రం : విరోధి, ఉత్తమ గాయకుడు : గద్దర్ (జై బోలో తెలగాణ చిత్రంలోని పొడుస్తున్న పొద్దుమీద ), ఉత్తమ గాయని: మాళవిక (రాజన్న), ఉత్తమ సంగీత దర్శకుడు : ఇళయరాజా (శ్రీరామ రాజ్యం), ఉత్తమ కుటుంబ కథాచిత్రం : 100% లవ్, ఉత్తమ హాస్య నటుడు : ఎంఎస్ నారాయణ(దూకుడు), ఉత్తమ సహాయ నటుడు : ప్రకాష్ రాజ్ (దూకుడు), ఉత్తమ పిల్లల చిత్రం : శిఖరం, ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం : అవయవదానం, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ : సమ్మెట గాంధీ(రాజన్న), ఉత్తమ సహాయనటి : రత్నసాగరి(కారాలు మిర్యాలు), ఉత్తమ బాల నటుడు : నికిల్ (100% లవ్), ఉత్తమ బాల నటి : బేబి ఆని(రాజన్న), ఉత్తమ మాటల రచయిత : న...