అనంతపురం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం: 18మంది దుర్మరణం
అనంతపురం, మే 22: అనంతపురం జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 18మంది దుర్మరణం చెందారు. ఘటనాస్థలంలోనే పదిమంది సజీవ దహనం కాగా రైలు డ్రైవర్ కూడా మృతి చెందాడు. మరో 40 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం బెంగళూర్, పుట్టపర్తి, అనంతపురం ఆసుపత్రులకు తరలించారు. హుబ్లీ నుంచి బెంగళూరు వెఉతున్న హంపి ఎక్స్ ప్రెస్ పెనుగొండ రైల్వే స్టేషన్‌లో ఆగివున్న గూడ్స్రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్‌ను ఢీకొన్న వెంటనే హంపి ఎక్స్ప్రెస్‌కు చెందిన నాలుగు బోగీలు పట్టాలు తప్పగా రెండు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రయాణికులందరూ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Comments