Tuesday, July 31, 2012

నాలుగో వన్డేలో భారత్ విజయం : సిరీస్‌ కైవసం

కొలంబో, జులై 31: శ్రీలంకపై జరిగిన నాలుగో వన్డేలో విజయం సాధించి భారత్ ఐదు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ అజేయమైన సెంచరీ, సురేష్ రైనా అర్థ సెంచరీ భారత్‌కు విజయాన్ని చేకూర్చి పెట్టింది. మొదట్లో భారత్ తడబడినప్పటికీ విరాట్ కోహ్లీ, సురేష్ రైనాల బ్యాటింగుతో విజయాన్ని దక్కించుకుంది. శ్రీలంక తన ముందు ఉంచిన 252 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. ఓ మ్యాచు మిగిలి ఉండగానే సిరీస్‌ను భారత్ 3.-1 స్కోరుతో సొంతం చేసుకుంది. ఓపెనర్ గంభీర్ డకవుట్ కాగా, మరో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 34 పరుగులు చేశాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ (4), తివారీ (21) త్వరగా అవుటైనా విరాట్ కోహ్లీకి సురేష్ రైనా తోడై మరో వికెట్ పడిపోకుండా  విజయాన్ని అందించారు. తొలుత ఆచితూచి ఆడిన కోహ్లీ, రైనా తర్వాత రెచ్చిపోయారు. శ్రీలంక బౌలర్లు ఈ జోడీని విడగొట్టలేక చేతులెత్తేశారు. విరాట్ కోహ్లీ 128 పరుగులు చేయగా, రైనా 58 పరుగులు చేశాడు. మలింగ, ప్రదీప్, మెండిస్, మాథ్యూస్ తలో వికెట్ తీసుకున్నారు.  తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.  భారత బౌలర్లలో తివారి నాలుగు వికెట్లు తీసుకోగా, అశ్విన్ రెండు, సెహ్వాగ్, దిండా ఒక్కో   వికెట్   తీసుకున్నారు.

చిదంబరం కు తిరిగి ఫైనాన్స్...షిండేకు హోం...

న్యూఢిల్లీ, జులై 31:  కేంద్ర మంత్రుల  శాఖలలో  మార్పులు, చేర్పులు జరిగాయి. ఆర్థికశాఖను మళ్ళీ చిదంబరంకు అప్పగించారు.  ఆయన నిర్వహిస్తున్న  హోం శాఖను సుశీల్‌కుమార్ షిండేకు  కేటాయించారు. సిండే నిర్వహిస్తున్న విద్యుత్‌ శాఖ ను  కార్పొరేట్ శాఖ మంత్రి వీరప్పమొయిలీకి అదనంగా అప్పగించారు. కేంద్ర ఆర్ధిక మంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎంపిక కావడంతో మంత్రుల శాఖలలో   ఈ స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ...

బ్యాడ్మింటన్ ఫ్రీ క్వార్టర్స్ లో కశ్యప్

లండన్, జులై 31:  హైదరాబాదీ పారుపల్లి కశ్యప్ లండన్ ఒలింపిక్స్ లో   బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ఫ్రీ క్వార్టర్స్ లోకి ప్రవేశించాడు. గ్రూప్ డిలో జరిగిన రెండో మ్యాచ్‌లో పదో సీడ్ వియత్నాం ప్లేయర్ గుయెన్‌పై  విజయాన్ని సాధించాడు. స్మాష్ షాట్లు, డ్రాప్ షాట్లతో గుయెన్‌ పై 21-9, 21--14 తేడాతో గెలిచాడు. ఈ విజయంతో గ్రూడ్ డిలో తొలి స్దానం సాధించిన ఒలింపిక్ పతకం దిశగా మరో అడుగు ముందుకేశాడు. 25 సంవత్సరాలు వయసు కలిగిన పారుపల్లి కశ్యప్‌కు ఇది రెండవ విజయం. బెల్జియంకు చెందిన టన్ యుహన్‌తో జరిగిన బ్యాడ్మింటన్ సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో కశ్యప్ తన మొదటి గెలుపుని నమోదు చేశాడు.
ఫ్రీ క్వార్టర్స్ లో  సైనా నెహ్వాల్
మహిళల సింగిల్స్ విభాగంలోహైదరాబాద్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్స్ లోకి ప్రవేశించింది.  సైనా 21-4, 21-14 తో లియాన్ తాన్ (బెల్జియం) పై విజయం సాధించింది.
జ్వాలా, దిజు  అవుట్... 
బ్యాడ్మింటన్‌ మిక్స్ డ్  డబుల్స్ జోడీ గుత్తా జ్వాలా, దిజు గ్రూప్‌ సి లో మూడో మ్యాచ్‌లోనూ ఓడారు. కొరియా జోడీ డే లీ, హున్‌ హాతో జరిగిన మూడో మ్యాచ్‌లో 15-21, 15-21 తేడాతో  ఈ జోడీ  పరాజయం పాలైంది.. 

మంత్రి పార్థసారథికి ఊరట

హైదరాబాద్, జులై 31: ఫెరా నిబంధనలు ఉల్లఘించిన కేసులో జైలుశిక్ష పడిన మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథికి ఊరట లభించింది. జైలుశిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో మంత్రి పార్థసారధికి రెండు నెలల జైలు శిక్షను ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టు విధించింది. కేపీఆర్ టెలీప్రొడక్ట్స్ ఎండీ హోదాలో ఫారిన్ ఎక్ఛేంజ్ రెగ్యులేషన్ యాక్టు  (ఫెరా) నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు విధించిన రెండు నెలల సాధారణ జైలు శిక్షను సవాల్ చేస్తూ మంత్రి పార్థసారథి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టును సోమవారం ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Monday, July 30, 2012

బ్యాడ్మింటన్‌లో జ్వాల-అశ్వని జోడీ విజయం

లండన్, జులై 30: ఒలింపిక్స్  మహిళల బ్యాడ్మింటన్‌లో గుత్తా జ్వాల-అశ్వని పొన్నప్పల జోడీ  విజయం సాధించారు. జ్వాల జోడి 23-25, 20-12, 21-18 తేడాతో చెంగ్-చియాస్‌  పై విజయం సాధించారు. ఇప్పటికే మహిళల డబుల్స్ లో ఒక మ్యాచ్‌లో ఓడిన గుత్తా-అశ్వని జోడీ  ఈ విజయానికి తీవ్రంగా శ్రమించారు.
దూసుకుపోతున్న సైనా నెహ్వాల్
బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో  ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి సైనా మరో అడుగు ముందుకేసింది. బెల్జియం క్రీడాకారిణి టాన్‌లీ పై సైనా నెహ్వాల్ 21-4, 21-14 తేడాతో విజయం సాధించి  రెండో గెలుపును తన ఖాతాలో వేసుకుంది.
హాకీ లో భారత్ ఓటమి
ఒలింపిక్స్  లో  భాగంగా సోమవారం జరిగిన తొలి హాకీ మ్యాచ్‌లో భారత్ ఓటమి చవిచూసింది.   2-3 తేడాతో నెదర్లాండ్ చేతిలో ఓడొపోయింది. 

భారత బాక్సర్ సమిత్ సంగ్వాన్ ఓటమి వివాదాస్పదం

లండన్, జులై 30:  ఒల్యంపిక్స్ లో భారత బాక్సర్ సమిత్ సంగ్వాన్  వివాదస్పద పరిస్థితుల్లో ఓటమిపాలయ్యాడు. 81 కిలోల కేటగిరి విభాగంలో పోటీ పడిన సుమిత్ అంపైర్ల తప్పుడు నిర్ణయాల కారణంగా బ్రిజిల్ యామగుచి ఫాల్కావో ఫ్లోరెంటినో చేతిలో 14-15 స్కోరుతో  పరాజయం పాలయ్యాడు. చివరి వరకు పోరాడిన 19 ఏళ్ల సుమిత్.. అంపైర్ల నిర్ణయాల కారణంగా కీలక పాయింట్లు కోల్పోయాడు. అంపైర్ల నిర్ణయాలపై  ఈఎస్ పీఎన్ కామెంటేటర్లు మండిపడ్డారు. సుమిత్ కు జరిగిన అన్యాయాన్ని 'పట్టపగలే జరిగిన దోపిడి'గా అభివర్ణించారు. కాగా, సుమిత్ సంగ్వాన్ వివాదస్పద ఓటమి తీరుపై భారత్ కూడా తీవ్రంగా  స్పందించింది. దీనిపై  ఒలంపిక్ నిర్వాహకులకు భారత క్రీడా మంత్రి అజయ్ మాకెన్ ఫిర్యాదు చేశారు. 

నిమ్మగడ్డకు బెయిల్ నిరాకరణ

 హైదరాబాద్ ,జులై 30: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో నిందితుడు ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అలియాస్ మ్యాట్రిక్స్ ప్రసాద్‌ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు  తిరస్కరించింది. వాన్‌పిక్ వ్యవహారంలో దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వరాదని సిబిఐ కోర్టులో వాదించింది. అయితే, సిబిఐ ఇప్పటికే సాక్ష్యాలను సేకరించిందని చెబుతూ తాను దర్యాప్తునకు సహకరించినందున బెయిల్ ఇవ్వాలని నిమ్మగడ్డ ప్రసాద్ కోరారు. ఇరువైపులా సాగిన సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద రావు నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ప్రభుత్వాధికారి బ్రహ్మానంద రెడ్డిని కూడా సిబిఐ అరెస్టు చేసింది. వైయస్ జగన్ సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ 842 కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలున్నాయి. అందుకు ప్రతిఫలంగా ఆయన వాన్‌పిక్ పేరిట ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వేల ఎకరాలు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో పొందినట్లు సిబిఐ ఆరోపించింది.  నిమ్మగడ్డ ప్రసాద్‌కు అనుకూలంగా అధికారి బ్రహ్మానంద రెడ్డి వ్యవహరించారని, వీరిద్దరు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సిబిఐ పేర్కొంది.

తమిళనాడు ఎక్స్ ప్రెస్ లో రెండు బోగీలు దగ్ధం...30 మంది మృతి

మృతులలో హైదరాబాద్ యువతి
నెల్లూరు,జులై 30: న్యూఢిల్లీ-చెన్నై తమిళనాడు ఎక్స్ ప్రెస్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు కనీసం 30 మంది ప్రయాణికులు మృతి చెందారు.  శనివారం రాత్రి న్యూఢిల్లీ బయల్దేరిన ఈ రైలు  తెల్లవారుజామున 4.30 గంటలకు నెల్లూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఎస్ -10, ఎస్ -11 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. ప్రయాణికులంతా  దాదాపు తమిళనాడుకు చెందిన వారిగానే భావిస్తున్నారు. ఒక మృత దేఅన్ని హైదరాబాద్‌లోని కాప్రాకు చెందిన శాలిని అనే యువతిగా గుర్తించారు.  చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆమె తన స్నేహితురాలి ఎంగేజ్‌మెంట్‌ కోసం కరీంనగర్‌ వచ్చింది. శాలిని  వరంగల్ లో తమిళనాడు ఎక్స్ప్రెస్‌ ఎక్కింది. అగ్ని ప్రమాదానికి గురైన బోగి... ఆనవాళ్లు లేకుండా మారిపోయింది. బెర్తులన్నీ బూడిద కుప్పలుగా మారాయి. శవాల్ని అతికష్టమ్మీద బయటకు తీశారు.

2005 లో శవం తో ధర్నా కేసు : కొడాలి నానికి ఏడాది జైలు శిక్ష

విజయవాడ,జులై 30:   కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానికి కైకలూరు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. వేయి రూపాయల జరిమానా విధించింది. మృతదేహం తో  ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అధికారుల విధులకు ఆటంకం కలిగించినందుకు నానిని దోషిగా కోర్టు నిర్ధారించి, శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో నానికి 353 సెక్షన్ కింద ఏడాది జైలు శిక్ష, 426 సెక్షన్ కింద వేయి రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అప్పీల్‌ కోసం నానికి కోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది.  నాని 2005లో ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. గుడివాడ శాసనసభా నియోజకవర్గంలో మోషి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ పథకాలు తనకు అందడం లేదని ఆరోపిస్తూ అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గుడివాడ ఆర్డీవో కార్యాలయం ముందు అతని శవంతో నాని వందలాది మందితో ధర్నా చేశాడు. ధర్నా రోజంతా సాగింది. నాని ధర్నాపై అప్పటి నుంచి కోర్టులో కేసు నడుస్తోంది. సాక్షులను విచారించిన తర్వాత కోర్టు సోమవారం ఈ కేసులో తీర్పును వెలువరించింది. తెలుగుదేశం పార్టీ  నంచి  గుడివాడ శాసనసభ్యుడిగా గెలిచిన కొడాలి నాని ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను, అధ్యక్షుడు వైయస్ జగన్‌ను కలిశారు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి ఆయన సిద్ధపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు తరఫున గుడివాడ నుంచి పోటీ చేస్తానని కూడా ప్రకటించారు.

ఒలింపిక్స్ లో భారత్ బోణి...కాంస్యం గెలిచిన మన నారంగ్

లండన్,జులై 30:  లండన్ ఒలింపిక్స్ లో భారత్ బోణి కొట్టింది.   పురుషుల 10 మీటర్ల  రైఫిల్ షూటింగ్‌లో హైదరాబాద్‌కు చెందిన గగన్ నారంగ్ కాంస్య పతకాన్ని సాధించాడు. మొదటి స్దానాన్ని రొమేనియాకి చెందిన అలెన్ జార్జి సొంతం చేసుకోగా.. రెండవ స్దానాన్ని ఇటలీకి చెందిన నికోల్ సాధించాడు. గగన్ నారంగ్ తన పైనల్ రౌండ్‌లో 10.7, 9.7, 10.6, 10.7, 10.4, 10.6, 9.9, 9.5, 10.3, 10.7 స్కోరు చేశాడు.

మాజీమంత్రి కలిదిండి రామచంద్రరాజు మృతి

హైదరాబద్,జులై 30:  పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నేత, మాజీ మంత్రి కలిదండి రామచంద్రరాజు సోమవారం సాయంత్రం  బీమవరం లో మృతి చెందారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో రామచంద్రరాజు భాదపడుతున్నారు. భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. 1983 నుంచి 2004 సంవత్సర కాలంలో ఆయన ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా సేవలందించారు.  

Sunday, July 29, 2012

జ్వాల- దిజు జోడీ ఓటమి

లండన్,, జులై 28:  ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మిక్సెడ్  డబుల్స్ లో జ్వాల- దిజు జోడీ ఓటమి పాలయ్యారు. ఆదివారం జరిగిన పోటీలో 12-21, 16-21 తేడాతో డెన్మార్క్ జోడీ రిటర్ - లేబౌర్న్ చేతిలో  వారు పరాజయాన్ని చవి చూశారు.
సానియా జోడి అవుట్
టెన్నిస్ డబుల్స్ లో సానియా మీర్జా, రష్మి చక్రవర్తి జోడి నిష్క్రమించింది. చైనీస్‌ తైపీ జంట జంగ్‌ చుయాంగ్‌, సూ చేతిలో 6-1, 3-6, 6-1 తేడాతో సానియా జోడి ఓటమి పాలైంది. వింబుల్డెన్‌ గ్రాస్‌ కోర్టులో జరిగిన ఈ మ్యాచ్‌ 91 నిముషాలు సాగింది. రెండో సెట్‌ పోరాడినా... మూడో సెట్‌లో సానియా జోడి చేతులెత్తేసింది.
 ఆర్చరీ జట్టుకు నిరాశ
భారత మహిళల ఆర్చరీ జట్టుకు ఒలింపిక్స్ లో నిరాశే ఎదురయింది. లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగిన టీమ్ ఈవెంట్ ప్రిక్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ చేతిలో భారత టీమ్ ఒక్క పాయింట్ తేడాతో ఓడిపోయింది. దీపికా కుమారి, బొంబేలా దేవి, సువురో చక్రవోలులతో కూడిన భారత్ టీమ్ 210 పాయింట్లు సాధించగా డెన్మార్క్ ఆర్చర్లు 211 పాయింట్లు గెల్చుకున్నారు.

అభినవ సిద్దేంద్ర యోగి అస్తమయం...

చెన్నై,  జులై 28:  కూచిపూడి నాట్యానికి సమున్నత స్థానం  కల్పించిన ప్రఖ్యాత కూచిపూడి నాట్య గురువు వెంపటి చినసత్యం  (87)  కన్నుమూశారు. కూచిపూడి నాట్యంలో సరికొత్త ప్రయోగాలు చేయడానికి  తమ జీవితమంతా అంకితం చేసిన విదుషీ మణి వెంపటి చినసత్యం 100కి పైగా చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించారు. రేఖ, హేమమాలిని, వైజయంతిమాల, ప్రభ తదితర నటీమణులకు ఆయన నాట్యగురువు. 1963లో చెన్నైలోకూచిపూడి ఆర్ట్ పౌండేషన్‌ స్థాపించి కూచిపూడి నాట్యానికి విశేష సేవలందించారు. ఆయన శిష్య పరంపరలో చేరిన వాళ్లలో చాలా మంది విదేశాలలో కూడా, కూచిపూడి నాట్య శిక్షణా సంస్థలని నెలకొల్పి,  నిరంతరాయంగా కూచిపూడి నాట్య కళా ప్రాచుర్యానికి దోహదం చేస్తున్నారు. దేశ, విదేశాలలో అసంఖ్యాకమైన సత్కార, సన్మానాలు, గౌరవ డాక్టరేట్లు సంతరించుకున్న వెంపటి చినసత్యం ను  కూచిపూడి నాట్య కళా ప్రపంచం అభినవ సిద్దేంద్ర యోగిగా భావిస్తుంది.     శ్రీ కృష్ణ పారిజాతం,     మేనకా విశ్వామిత్ర,     రుక్మిణీ కల్యాణం,     కిరాతార్జునీయం,     క్షీరసాగరమధనం,     పద్మావతీ శ్రీనివాసం,     చండాలిక,     హరవిలాసం నృత్య రూపకాలకు ఆయన జీవం పోశారు.

Saturday, July 28, 2012

మూడో వన్డేలో భారత్ విజయం

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రైనా 
కొలంబో, జులై 28:  ఓపెనర్ గౌతమ్ గంభీర్ (101 బంతుల్లో 102; ఫోర్లు 10) సూపర్ సెంచరీతో  మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. శనివారం ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. చివర్లో సురేశ్ రైనా (45 బంతుల్లో 65 నాటౌట్; ఫోర్లు 6; ఓ సిక్స్), ఇర్ఫాన్ పఠాన్ (31 బంతుల్లో 34 నాటౌట్; ఫోర్లు 3) ఒత్తిడిని తట్టుకుంటూ సమన్వయంతో ఆడటంతో ఐదు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై నెగ్గింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యం సాధించింది.  టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న లంక నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 286 పరుగులు సాధించింది. 20 పరుగులకే తొలి మూడు వికెట్లు కోల్పోగా జట్టును సంగక్కర (95 బంతుల్లో 73; ఫోర్లు 5), జయవర్ధనే (79 బంతుల్లో 65; ఫోర్లు 5), మాథ్యూస్ (57 బంతుల్లో 71; ఫోర్లు 5; ఓ సిక్స్) ఆదుకున్నారు. జహీర్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన భారత్ 49.4 ఓవర్లలో 288/5 పరుగులు చేసి గెలిచింది. రెండో ఓవర్‌లోనే సెహ్వాగ్ (3) వికెట్ కోల్పోయింది. గంభీర్, కోహ్లి (65 బంతుల్లో 38; ఫోర్లు 2) సమయోచితంగా ఆడి లంక బౌలర్లను ఎదుర్కొన్నారు. వీరిద్దరి మధ్య రెండో వికెట్‌కు 105 పరుగులు జత చేరాయి. 39వ ఓవర్‌లో గంభీర్ రనౌట్ అయ్యాడు. చివర్లో రన్‌రేట్ పెరిగినా రైనా, ఇర్ఫాన్ పద్దతిగా  ఆడి మ్యాచ్‌ను ముగించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రైనా కు దక్కింది.

: ఈ ఏడాది అదనంగా 31,190 ఇంజనీరింగ్‌ సీట్లు...

హైదరాబాద్, జులై 28: ఈ ఏడాది ఇంజనీరింగ్‌లో అదనంగా 31,190 సీట్లకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. దీంతో ఈ సంవత్సరం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఉన్న సీట్ల సంఖ్య 3,38,115 కు పెరిగింది. గత ఏడాది 3,06,925 సీట్లు మాత్రమే ఉన్నాయి. ప్రధానంగా ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌లో 10,375 సీట్లు పెరిగాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో 8,220, మెకానికల్ ఇంజనీరింగ్‌లో 9,270 సీట్లు అదనంగా వచ్చాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 2,880 సీట్లు తగ్గాయి. కౌన్సెలింగ్ ప్రారంభంనాటికి మరిన్ని సీట్లకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. కాగా, ఇంజనీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ వచ్చే నెల రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యయ నివేదికలు సమర్పించని కాలేజీలు ప్రస్తుతం అమలులో ఉన్న ఏ, బీ కేటగిరీలకు వేర్వేరు ఫీజుల విధానానికి అంగీకరిస్తే.. కన్వీనర్ కోటా ఫీజు రూ.4 వేలు పెంచుతామని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు యాజమాన్య సంఘాల ప్రతినిధులు ప్రాథమికంగా అంగీకరించారు. అయితే, ఈ కళాశాలలన్నీ ఏకాభిప్రాయానికి రావడానికి ఒకటి, రెండు రోజులు పట్టే అవకాశముంది. అవి కామన్ ఫీజు అక్కర్లేదని ప్రభుత్వానికి చెబితే, సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా వచ్చే నెల 1వ తేదీన కౌన్సెలింగ్ షెడ్యూలు వెలువడి, 9 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన, 12 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది. సెప్టెంబర్ 1న తరగతులు ప్రారంభమయ్యే అవకాశముంది. ఒకవేళ ప్రభుత్వ ప్రతిపాదనకు యాజమాన్యాలన్నీ అంగీకరించకపోతే.. ఏ,బీ కేటగిరీల అంశంపై వచ్చేనెల 1వ తేదీన సుప్రీంకోర్టులో జరిగే విచారణ వరకు వేచి చూడాల్సి వస్తుంది.

ఒలింపిక్స్ లో మెరిసిన తెలుగుతేజం

లండన్, జులై 28:  ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పారుపల్లి కశ్యప్ పురుషుల సింగిల్స్ లో శుభారంభం చేశాడు.  మొదటి రౌండ్ లో బెల్జియం ఆటగాడు యుహాన్ తాన్ ను 21-14 21-12 తో ఓడించి రెండో రౌండ్ లోకి అడుగుపెట్టాడు. ఈనెల 31న జరిగే రెండో మ్యాచ్ లో వియత్నాం ఆటగాడు టియన్ మిన్హ్ గుయన్ తో కశ్యప్ తలపడతాడు.
ఆర్చరీలో నిరాశ
కాగా, ఆర్చరీలో భారత జట్టు నిష్క్రమించింది. తీవ్ర ఉత్కంఠ మధ్య లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగిన పోటీల్లో జపాన్ జట్టు చేతిలో భారత జట్టు ఓడిపోయింది. జయంత్ తాలూక్ దార్, రాహుల్ బెనర్జీ, తరుణ్ దీప్ రాయ్ శుక్రవారం జరిగిన రౌండ్ లో 12వ ర్యాంక్ సాధించారు. అయితే, జపాన్ తో జరిగిన పోటీలో శనివారం ఓడిపోయారు. జపాన్ కు చెందిన యూ ఇషిజూ, హిడెకీ కికుచి, తకహరు ఫురుకువా జట్టు భారత్ పై గెలిచింది.
జ్వాలా గుత్తా, దిజు జోడీ ఓటమి
బ్యాడ్మింటన్ మిక్స్ డ్ డబుల్స్ లో కూడా భారత జోడీకి నిరాశే ఎదురైంది. జ్వాలా గుత్తా, దిజు లతో కూడిన భారత జోడీ తొలి రౌండ్ లో ఓటమి పాలైంది. ఇండోనేషియా జోడీ తోంతోవి అహ్మద్, నట్సీర్ చేతిలో జ్వాలా జోడీ వరుస గేమ్స్ లో ఓటమి పాలైంది.

Friday, July 27, 2012

టి.డి.పి. నేత బివి మోహన్ రెడ్డి కన్నుమూత

హైదరాబాద్, జులై 27: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఇటీవల ఆసుపత్రిలో చేరారు.  ఆయన వయస్సు 67. ఆయన 1983 నుండి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. 1983-1999 వరకు ఆయన వరుసగా ఐదుసార్లు గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు, టిడిపి ప్రస్తుత అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన మంత్రిగా విధులు నిర్వర్తించారు. తాజా ఉప ఎన్నికలలో బివి మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు నుండి పోటీ చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్య్రర్థి చేతిలో ఓటమి చవి చూశారు. ఉప ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఆయన ఆరోగ్యం విషమించింది. ఎమ్మిగనూరు నియోజకవర్గం అభివృద్ధికి బివి మోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ కుటుంబంతో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది. ప్రస్తుత కేంద్రమంత్రి పురంధేశ్వరి, హీరో నందమూరి బాలకృష్ణలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు బివి మోహన్ రెడ్డి తన చేతులతో ఆడించారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పురంధేశ్వరి పార్టీ పెద్దలు కోరినప్పటికీ ఎమ్మిగనూరుకు మాత్రం వెళ్లలేదు. రాజకీయ జ్యోతిష్యాల్లో దిట్టగా ఆయనకు పేరుంది.

మా నాన్నే...మా బాబే...

న్యూఢల్లీ,జులై 27: :  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్  మాజీ  గవర్నర్ ఎన్ డీ తివారీ- రోహిత్ శేఖర్ తండ్రేనని  ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఎన్ డీ తివారీ డీఎన్ఏ పరీక్షల నివేదికను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేవా ఖేత్రపాల్ శుక్రవారం విడుదల చేశారు. తీవారీ డీఎన్ఏ పరీక్షలను హైదరాబాద్ లోని ఓ లాబరేటరీలో నిర్వహించారు. ఇద్దరి డీఎన్‌ఏలూ ఒక్కటే అని కోర్టు నిర్దారించింది. ఉజ్వల శర్మ, ఎన్ డీ తివారీలకు కలిగిన సంతానమే రోహిత్ శేఖర్ అని కోర్టు తీర్పులో పేర్కొంది. తివారీ గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా  ఉన్న కాలంలో ఆయనపై సెక్స్ కుంభకోణ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆతర్వాతనే ఆరోగ్య కారణాలను చూపి  ఆయన గవర్నర్ పదవి నుంచి తప్పుకున్నారు. డీఎన్ఏ పరీక్షల నివేదిక  బయటపడకుండా తివారీ తీవ్ర ప్రయత్నాలు చేశారు .తన బయోలాజికల్ ఫాదర్‌గా తివారీని ప్రకటించాలని కోరుతూ రోహిత్ శేఖర్ గత ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నారు. చివరకు విజయం సాధించారు. పితృత్వం కేసులో తనపై జరిపిన డిఎన్ఎ పరీక్షల నివేదికను గోప్యంగా ఉంచాలని కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.

Thursday, July 26, 2012

లండన్ ఒలింపిక్స్ లో మన పోటీల షెడ్యూల్....

లండన్,జులై, 26: లండన్ ఒలింపిక్స్ లో మన పోటీల షెడ్యూల్.... 
బ్యాడ్మింటన్
సైనా నెహ్వాల్ (మహిళల సింగిల్స్), కశ్యప్ (పురుషుల సింగిల్స్), జ్వాల-అశ్విని (మహిళల డబుల్స్), జ్వాల-దిజు (మిక్స్‌డ్ డబుల్స్).వేదిక: వెంబ్లీ ఎరీనా....తేదీలు: జూలై 28 నుంచి ఆగస్టు 5 వరకు......తొలి నాలుగు రోజులపాటు లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం ఆగస్టు 1 నుంచి నాకౌట్ దశ మ్యాచ్‌లు మొదలవుతాయి. 3వ తేదీన మిక్స్‌డ్ డబుల్స్; 4వ తేదీన మహిళల సింగిల్స్, డబుల్స్; 5వ తేదీన పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ఫైనల్స్ (పతకాల కోసం) జరుగుతాయి.
టేబుల్ టెన్నిస్
సౌమ్యజిత్ ఘోష్ (పురుషుల సింగిల్స్), అంకిత దాస్ (మహిళల సింగిల్స్)....వేదిక: ఎక్సెల్ ఎరీనా.....తేదీలు: జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు...
తొలి రోజున ఈ ఇద్దరు భారత క్రీడాకారులు ప్రిలిమినరీ రౌండ్‌లో పోటీపడతారు. ముందంజ వేస్తే తదుపరి రోజుల్లో పోటీపడతారు. ఆగస్టు 1న మహిళల సింగిల్స్లో , ఆగస్టు 2న పురుషుల సింగిల్స్ లో పతకాల కోసం మ్యాచ్‌లుంటాయి.
హాకీ
భరత్ చెత్రి నాయకత్వంలోని 16 మంది సభ్యులతో భారత్ బరిలోకి దిగనుంది. డ్రాగ్ ఫ్లికర్ సందీప్ సింగ్, సర్దార్ సింగ్, శివేంద్ర సింగ్ కీలక ఆటగాళ్లు......వేదిక: రివర్‌బ్యాంక్ ఎరీనా......తేదీలు: జూలై 29 నుంచి ఆగస్టు 11 వరకు.......గ్రూప్ ‘బి’లో ఉన్న భారత్  జూలై 30న నెదర్లాండ్స్తో; ఆగస్టు 1న న్యూజిలాండ్‌తో; ఆగస్టు 3న జర్మనీతో; ఆగస్టు 5న దక్షిణ కొరియాతో; ఆగస్టు 7న బెల్జియంతో లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్ ‘బి’లో గనుక తొలి రెండు స్థానాల్లో నిలిస్తే సెమీఫైనల్‌కు అర్హత సాధించి పతకం రేసులో ఉంటుంది. ఆగస్టు 11న స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం మ్యాచ్‌లుంటాయి. 
జూడో
గరీమా చౌదరీ....వేదిక: ఎక్సెల్ ఎరీనా: తేదీలు: జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు.....భారత్ నుంచి బరిలోకి దిగుతున్న ఏకైక జూడో క్రీడాకారిణి గరీమా చౌదరీ 63 కేజీల విభాగంలో జూలై 31న బరిలోకి దిగుతుంది. అదే రోజున క్వాలిఫయింగ్ రౌండ్లతోపాటు ఫైనల్స్ ఉంటాయి.
బాక్సింగ్
పురుషుల విభాగం: దేవేంద్రో సింగ్ (49 కేజీలు), శివ థాపా (56 కేజీలు), జై భగవాన్ (60 కేజీలు), మనోజ్ కుమార్ (64 కేజీలు), వికాస్ కృషన్ (69 కేజీలు), విజేందర్ (75 కేజీలు), సుమిత్ సాంగ్వాన్ (81 కేజీలు); మహిళల విభాగం: మేరీకామ్ (51 కేజీలు).....వేదిక: ఎక్సెల్ ఎరీనా
తేదీలు: జూలై 28 నుంచి ఆగస్టు 12 వరకు......తొలి రోజు నుంచి నాకౌట్ మ్యాచ్‌లు మొదలవుతాయి. ఆగస్టు 5న మహిళల విభాగం బౌట్‌లు ప్రారంభమవుతాయి. 9న మహిళల ఫైనల్స్ జరుగుతాయి. పురుషుల విభాగం ఫైనల్స్ 11, 12 తేదీల్లో జరుగుతాయి.
స్విమ్మింగ్
గగన్ ఉలాల్మత్....వేదిక: అక్వాటిక్ సెంటర్: తేదీలు: జూలై 28 నుంచి ఆగస్టు 10 వరకు....భారత్ నుంచి బరిలోకి దిగుతున్న ఏకైక స్విమ్మర్ గగన్ ఉలాల్మత్ ఆగస్టు 3న జరిగే 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ హీట్స్‌లో పోటీపడతాడు. ఈ దశ దాటితే ఆగస్టు 4న జరిగే ఫైనల్లో బరిలోకి దిగుతాడు.
ఆర్చరీ
దీపిక కుమారి, బొంబేలా దేవి, చక్రవోలు స్వారో (మహిళల టీమ్, వ్యక్తిగత రికర్వ్), జయంత తాలుక్‌దార్, రాహుల్ బెనర్జీ, తరుణ్‌దీప్ రాయ్ (పురుషుల టీమ్, వ్యక్తిగత రికర్వ్)......వేదిక: లార్డ్స్ మైదానం; తేదీలు: జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు....తొలి రోజు ర్యాంకింగ్ రౌండ్స్ జరిగాక 28, 29వ తేదీల్లో టీమ్ విభాగాల్లో పతకాల కోసం మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం మూడు రోజులపాటు వ్యక్తిగత విభాగాల్లో నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆగస్టు 2, 3వ తేదీల్లో పతకాల కోసం మ్యాచ్‌లు ఉంటాయి.
టెన్నిస్
సోమ్‌దేవ్ (పురుషుల సింగిల్స్), మహేశ్ భూపతి-రోహన్ బోపన్న (పురుషుల డబుల్స్), పేస్-విష్ణువర్ధన్ (పురుషుల డబుల్స్), సానియా-రష్మీ చక్రవర్తి (మహిళల డబుల్స్), పేస్-సానియా (మిక్స్‌డ్ డబుల్స్).......వేదిక: వింబుల్డన్; తేదీలు: జూలై 28 నుంచి ఆగస్టు 5 వరకు
వారం రోజులపాటు నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆగస్టు 4న పురుషుల డబుల్స్, మహిళల సింగిల్స్ విభాగాల్లో స్వర్ణ, రజత, కాంస్యాల కోసం... మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతకం కోసం మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ఆగస్టు 5న పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ విభాగాల్లో స్వర్ణ, రజత, కాంస్యాల కోసం... మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ, రజత పతకాల కోసం మ్యాచ్‌లుంటాయి.
అథ్లెటిక్స్
ఓంప్రకాశ్ (షాట్‌పుట్), వికాస్ గౌడ (డిస్కస్ త్రో), రంజిత్ మహేశ్వరీ (ట్రిపుల్ జంప్), గుర్మీత్ సింగ్, బల్జిందర్ సింగ్, ఇర్ఫాన్ (20 కిలోమీటర్ల నడక), బహదూర్ రాణా (50 కిలోమీటర్ల నడక), రామ్‌సింగ్ యాదవ్ (మారథాన్), మయూఖా జానీ (ట్రిపుల్ జంప్), టింటూ లూకా (800 మీటర్లు), కృష్ణ పూనియా, సీమా అంటిల్ (డిస్కస్ త్రో), సుధా సింగ్ (3000 మీటర్ల స్టీపుల్‌చేజ్), సహనా కుమారి (హైజంప్)........వేదిక: ఒలింపిక్ స్టేడియం; తేదీలు: ఆగస్టు 3 నుంచి 12 వరకు.....పోటీలు జరిగే అన్ని రోజులూ ఫైనల్స్ (పతకాల కోసం) ఉన్నాయి. భారత ఫేవరెట్... కృష్ణ పూనియా ఆగస్టు 3న డిస్కస్ త్రో అర్హత రౌండ్లలో పోటీపడుతుంది. ఫైనల్‌కు చేరుకుంటే ఆగస్టు 4వ తేదీన పత కం రేసులో ఉంటుంది.
షూటింగ్
గగన్ నారంగ్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 50 మీటర్ల రైఫిల్ ప్రోన్, 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్), అభినవ్ బింద్రా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్), రంజన్ సోధి (డబుల్ ట్రాప్), మానవ్‌జిత్ సంధూ (ట్రాప్), విజయ్ కుమార్ (25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్), సంజీవ్ రాజ్‌పుత్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్), జాయ్‌దీప్ కర్మాకర్ (50 మీటర్ల రైఫిల్ ప్రోన్), హీనా సిద్ధూ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్), రాహీ సర్నోబాత్ (25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్), అన్నూరాజ్ సింగ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్), షగున్ చౌదరీ (ట్రాప్)......
వేదిక: ది రాయల్ ఆర్టిలరీ బ్యారెక్స్; తేదీలు: జూలై 28 నుంచి ఆగస్టు 6 వరకు....పోటీలు జరిగే 10 రోజులూ ఫైనల్స్ (పతకాల కోసం) ఉన్నాయి. భారత ఫేవరెట్స్... గగన్ నారంగ్ ఈవెంట్స్ వరుసగా జూలై 30న, ఆగస్టు 3న, ఆగస్టు 6న ఉన్నాయి. అభినవ్ బింద్రా తన స్వర్ణాన్ని నిలబెట్టుకునేందుకు జూలై 30న బరిలోకి దిగుతాడు. రంజన్ సోధి ‘డబుల్ ట్రాప్’ ఈవెంట్ ఆగస్టు 2న ఉంది.
రోయింగ్
స్వరణ్ సింగ్, మంజిత్ సింగ్, సందీప్ కుమార్.....వేదిక: ఎటాన్ డోర్నీ; తేదీలు: జూలై 28 నుంచి ఆగస్టు 4 వరకు.....స్వరణ్ సింగ్ జూలై 28న ‘సింగిల్ స్కల్’ ఈవెంట్ హీట్స్‌లో బరిలోకి దిగుతాడు. ఈ దశ తర్వాత మరో మూడు దశలుంటాయి. ఆగస్టు 3న ఫైనల్ ఉంటుంది. మంజిత్, సందీప్ జూలై 28న ‘డబుల్ స్కల్స్’ హీట్స్‌లో పోటీపడతారు. ఆగస్టు 2న ఫైనల్ జరుగుతుంది.
వెయిట్‌లిఫ్టింగ్
సోనియా చాను, కత్తుల రవికుమార్....వేదిక: ఎక్సెల్ ఎరీనా; తేదీలు: జూలై 28 నుంచి ఆగస్టు 7 వరకు.......అన్ని విభాగాలలో అదే రోజున ఫైనల్స్ జరుగుతాయి. సోనియా చాను మహిళల 48 కేజీల విభాగంలో జూలై 28న... రవికుమార్ పురుషుల 69 కేజీల విభాగంలో జూలై 31న పోటీపడతారు.
రెజ్లింగ్
అమిత్ కుమార్ (55 కేజీలు), యోగేశ్వర్ దత్ (60 కేజీలు), సుశీల్ కుమార్ (66 కేజీలు), నర్సింగ్ యాదవ్ (74 కేజీలు), గీతా ఫోగట్ (మహిళల 55 కేజీలు)....వేదిక: ఎక్సెల్ ఎరీనా......తేదీలు: ఆగస్టు 5 నుంచి 12 వరకు......
తొలి మూడు రోజులు గ్రీకో రోమన్ విభాగంలో పోటీలు జరుగుతాయి. అదే రోజున పతకాల కోసం బౌట్స్ ఉంటాయి. ఆ తర్వాత రెండు రోజులు మహిళల విభాగంలో బౌట్‌లుంటాయి. ఆగస్టు 9న గీత బరిలోకి దిగుతుంది. భారత రెజ్లర్లు పోటీపడే ఫ్రీస్టయిల్ ఈవెంట్ ఆగస్టు 10 నుంచి 12 వరకు జరుగుతాయి. 10న అమిత్ కుమార్, నర్సింగ్ యాదవ్; 11న యోగేశ్వర్ దత్; 12న సుశీల్ కుమార్ పతకాల కోసం బరిలోకి దిగుతారు.

భద్రాచలం - చెన్నై బస్సులో ముగ్గురి హత్య...

హైదరాబాద్,   జులై 26: భద్రాచలం నుండి చెన్నై వెడుతున్న ఆర్టీసి బస్సులో గురువారం వేకువజామున  నెల్లూరు వద్ద నలుగురు వ్యక్తులపై గుర్తు తెలియని వ్యక్తి  కత్తితో దాడి చేసి వారి గొంతులు కోయడంతో ముగ్గురు మృతి చెందారు. మరణించినవారి శవాలు 12 గంటలకు పైగా బస్సులోనే ఉన్నాయి.  గురువారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా,  సాయంత్రం ఐదు గంటల వరకు కూడా శవాలను బస్సులోంచి తీయలేదు. ఉన్నతాధికారులు వస్తే గానీ ముందుకు కదలబోమని కింది స్థాయి అధికారులు, సిబ్బంది చెప్పారు. ఎస్పీ హైదరాబాదులో ఉండడంతో చాలా ఆలస్యంగా వచ్చారు. బస్సును ఆస్పత్రి వద్దనే ఉంచారు. సైకో సాంబ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని తొలుత వార్తలు వచ్చాయి.  అయితే ఈ వార్తలను  నెల్లూరు జిల్లా ఎస్పీ ఖండించారు. హంతకుడి కోసం  వరదాయపాలెం, సత్యవేడు పోలీసులు గాలింపు జరుపుతున్నారు.  తమిళనాడు రాష్ట్రంలోని ఊతకోటలో కూడా పోలీసులు అన్వేషణ సాగిస్తున్నారు.

పెన్సిల్వేనియాలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి అరెస్ట్

పెన్సిల్వేనియా, జులై 26:  ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కు చెందిన సంయుక్త కార్యదర్సి స్థాయి అధికారి సురేంద్ర మహాపాత్ర అమెరికాలో పెన్సిల్వేనియాలోని మాటోమోరస్‌లో అరెస్టయ్యాడు. పెన్సిల్వేనియాలోని ఓ హోటల్ ఉద్యోగినిపై  అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   న్యూయార్క్ లో ఒక విశ్వవిద్యాలయంలో వర్క్ షాప్ లో పాల్గొనడానికి వెళ్లిన 34 మంది అధికారుల్లో సురేంద్ర మహాపాత్ర  ఒకరు. పోలీసులు సురేంద్ర మహాపాత్ర పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతను జైలులో ఉన్న  మహాపాత్రకు న్యాయవాదిని ఏర్పాటు చేసి బెయిల్ పొందడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

Wednesday, July 25, 2012

13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ప్రమాణ స్వీకారం

 న్యూఢిల్లీ, జులై 25: భారత 13 వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ బుధవారం మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు.  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కపాడియా ప్రణబ్‌ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోకసభ స్పీకర్ మీరా కుమార్, ఉప రాష్ట్రపతి అన్సారీ, ప్రతిభా పాటిల్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ... రాష్ట్రపతిగా దేశానికి తన సేవలు అందిస్తానని, దేశాభివృద్ధి కోసం, దేశ ఆర్థిక రంగాన్ని మెరుగు పర్చేందుకు నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. భారత్ తన భవిష్యత్తు లక్ష్యాలను విద్యాభివృద్ధితోనే సాధించగల్గుతుందని చెప్పారు. అభివృద్ధికి అవినీతే ప్రధాన అడ్డంకి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నియంత్రుత్వానికి నూకలు చెల్లుతున్నాయని, ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతోందన్నారు. భారతీయులు పరిస్థితులను చక్కగా అర్థం చేసుకోగలరన్నారు. ప్రపంచ ఆధునీకరణకు మన దేశం ఓ నమూనా అన్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా నూతన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైనిక గౌరవ వందనం స్వీకరించారు. ప్రణబ్ పార్లమెంటు సెంట్రల్ హాలులో ప్రమాణ స్వీకారం చేశారు.

మంత్రుల అవినీతి ఆరోపణలలపై అన్నా బృందం దీక్ష...

న్యూఢిల్లీ, జులై 25: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మంది కేంద్ర మంత్రులపై విచారణకు ఆదేశించాలంటూ అన్నా హజారే బృందం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో దీక్ష చేపట్టింది.  మరోవైపు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీపై అన్నా బృందం చేస్తోన్న ఆరోపణలపై మండిపడ్డ ఎన్ఎస్ యుఐ కార్యకర్తలు జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేపట్టారు. అన్నా బృందానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా,  పటిష్ట లోక్‌పాల్‌ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలనే డిమాండ్‌తో హజారే ఈ నెల 29న నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ప్రభుత్వం హామీలు మాత్రమే ఇస్తోందని, బిల్లు ఆమోదానికి సంబంధించి ఏ చర్యలు ఆచరణలో కనిపించడంలేదని అన్నా బృందం ఆరోపించింది.

ఫెరా ఉల్లంఘన: పార్థసారథికి 2 నెలలు జైలు, జరిమానా

 హైదరాబాద్ , జులై 25:  ఫెరా నిబంధనలు ఉల్లంఘించిన కేసులో మంత్రి పార్థసారధికి నాంపల్లిలోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు రెండు నెలల జైలు శిక్ష విధించింది. ఆయన మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న కె.పి.ఆర్‌ టెలిప్రొడక్ట్స్ కు 5 లక్షల 15 వేల రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు తీర్పు చెప్పింది. శిక్ష నిలుపుదల చేయాలంటూ మంత్రి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంత్రికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దిగుమతుల సుంకం చెల్లింపు విషయంలో కె.పి.ఆర్‌ టెలిప్రొడక్ట్ కంపెనీ ఫెరా నిబంధనలు ఉల్లంఘించినట్లు నేరం రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పు చెప్పింది. కె.పి.ఆర్‌ టెలిప్రొడక్ట్ కంపెనీ 2002లో ఫెరా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్‌ కంపెనీ ఎండి హోదాలో ఉన్న పార్థసారధిపై కోర్టులో కేసు నమోదు చేసి చార్జిషీట్‌ దాఖలు చేసింది.ఈ కేసులో ఈడీ ఆరోపణలు రుజువుకావడంతో పార్థసారధికి మూడు లక్షల రూపాయలు జరిమానా విధిస్తూ 2003లో న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పటి నుంచి పార్థసారధి ఈ జరిమానా చెల్లించకపోవడంతో పాటు కోర్టు విచారణకు కూడా హాజరుకాలేదు. దీంతో ఈడి విభాగం దాఖలు చేసిన తాజా పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం పార్థసారధి ఉద్దేశ్యపూర్వకంగానే ఈడి ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారని, విచారణకు హాజరు కాకపోవడం కూడా తప్పే అని నిర్థారించి ఆయనపై రెండు రోజుల క్రితం నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్ వారెంట్‌ జారీ చేసింది.     

కాంగ్రెస్ , ఎన్ సిపి రాజీ

న్యూఢిల్లీ, జులై 25:  కాంగ్రెస్ పార్టీ , ఎన్ సిపి (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) మధ్య రాజీ కుదిరింది. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తో ఎన్ సిపి నేతలు శరద్‌పవార్, ప్రఫుల్ పటేల్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. రెండు పార్టీల మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలపై చర్చించారు. శరద్‌పవార్, ప్రఫుల్ పటేల్ మంత్రి మండలిలో కొనసాగటానికి అంగీకరించారు. సమన్వయ కమిటీ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. దీంతో  వివాదం ముగిసిపోయినట్టు చెబుతున్నారు. 

Tuesday, July 24, 2012

పార్లమెంటుకు ప్రణబ్ కుమారుడు...!

 కోల్‌కతా,, జులై 24:   ప్రణబ్ ముఖర్జీ  రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతోఆయన  కుమారుడు, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభిజిత్ ముఖర్జీ. తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన జాంగీపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. ముర్షీదాబాద్ జిల్లాలోని జాంగీపూర్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని ఆకాంక్షను అభిజిత్ వ్యక్తంచేశారని ముర్షీదాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ ఆధిర్ చౌధురి మంగళవారం చెప్పారు. అభిజిత్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. అయితే జాంగీపూర్ పోటీ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం తనకు లేదన్నారు. జాంగీపూర్ ఉప ఎన్నికకు ఇంకా తేదీ ఖరారు కాలేదని, ఆ నియోజకవర్గం అభివృద్ధికి ప్రణబ్ ముఖర్జీ ఎంతో కృషి చేసినందున, అక్కడి నుంచి అభిజిత్ పోటీ చేస్తే విజయం సాధిస్తామని ఆయన అన్నారు. అభిజిత్ ప్రస్తుతం బీర్భుమ్ జిల్లాలోని నల్హతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

పెరగనున్న డీజిల్, వంట గ్యాస్ ధరలు... ?

న్యూఢిల్లీ, జులై 24:  పెట్రోల్ ధరను లీటర్‌కు 70 పైసలు పెంచిన కేంద్ర ప్రభుత్వం,... డీజిల్ ధరను, గృహ వినియోగం కోసం వాడే వంటగ్యాస్ ధరను పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. డీజిల్, వంటగ్యాస్‌ల ధరలనే కాక, కిరోసిన్ ధరను కూడా పెంచాలన్న అంశంపై పూర్తి ఏకాభిప్రాయం వ్యక్తమైందని, హెచ్చింపు ఎప్పుడు? ఎలా? అన్నదే ఇంకా నిర్ణయం కాలేదని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. రిటైల్ వాణిజ్యంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐలను) అనుమతించకపోవడం, డీజిల్, వంటగ్యాస్ (ఎల్పీజీ), కిరోసిన్‌లపై సబ్సిడీలకు కోత విధించడం ప్రభుత్వం ఇకపై తీసుకోబోయే ముఖ్యమైన సంస్కరణలని చమురు మంత్రిత్వశాఖ అధికారి  చెప్పారు. డీజిల్, ఎల్పీజీ, కిరోసిన్ ధరలను గత ఏడాది జూన్ 25వ తేదీ తర్వాత ఇప్పటివరకూ పెంచలేదు. ముడిపదార్థమైన చమురు ధరలు పెరిగినా, అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి మారకం విలువ తగ్గి, దిగుమతుల వ్యయం పెరిగినా, డీజిల్, ఎల్పీజీ, కిరోసిన్ ధరలను మాత్రం ప్రభుత్వం ఇప్పటివరకూ పెంచలేదు. తాజా పరిస్థితులలో లీటర్ డీజిల్‌ను రూ. 11.26 నష్టంతో, గృహ వినియోగానికి సంబంధించిన గ్యాస్ సిలిండర్(14.2 కేజీలు)ను రూ. 319 రూపాయల నష్టంతో విక్రయిస్తున్నామని ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థలు చెబుతున్నాయి. కిరోసిన్‌పై తాము లీటర్‌కు రూ. 28.56 దాకా నష్టపోతున్నట్టు ఆ కంపెనీలు పేర్కొంటున్నాయి. ఇప్పుడైనా  దరలు పెంచని పక్షంలో ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంధనం అమ్మకాలపై లక్షా 60 వేల కోట్ల రూపాయలు నష్టపోవలసి వస్తుందని చెబుతున్నారు. ఈ అంశంపై సంబంధిత మంత్రుల సాధికార బృందం ఇంకా ఏర్పాటుకాని ప్రస్తుత పరిస్థితుల్లో, ధరల పెంపు ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘానికి నివేదించాలని, నిర్ణయాన్ని ప్రధానమంత్రికి వదిలి వేయాలని చమురు మంత్రిత్వశాఖ యోచిస్తున్నట్టు ఆ శాఖ అధికారి చెప్పారు. 

శ్రీలక్ష్మిని ' గాలి ' కొదిలేసిన ప్రభుత్వం...

హైదరాబాద్ , జులై 24:  కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయి చంచల్‌గుడా జైలులో ఉన్న ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపింది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో 26 వివాదాస్పద జీవోల జారీ విషయంలో సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న ఎనిమిది ఐఎఎస్ అధికారుల్లో ఏడుగురికి న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఏడుగురు ఐఎఎస్ అధికారులకు ప్రభుత్వం న్యాయవాదుల ఫీజులు చెల్లిస్తుంది. ఇదే వ్యవహారంలో సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న ఆరుగురు మంత్రుల్లో ఐదుగురికి న్యాయసహాయం అందిస్తూ ప్రభుత్వం ఇది వరకే నిర్ణయం తీసుకుంది. మంత్రుల్లో మోపిదేవి వెంకటరమణను ప్రభుత్వం సహాయం నుంచి మినహాయించింది. న్యాయ సహాయం అందుకునే ఐఎఎస్ అధికారుల్లో శామ్యూల్, రత్నప్రభ, మన్మహన్ సింగ్, ఆదిత్యనాథ్, సివిఎస్‌కె శర్మ, ఎస్వీ ప్రసాద్ ఉన్నారు. మంత్రుల్లో కన్నా లక్ష్మినారాయణ, ధర్మాన ప్రసాద రావు, పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి, జె. గీతా రెడ్డి ఉన్నారు. 

ఎన్సీపి అల్టిమేటం...

న్యూఢిల్లీ, జులై 24:  తమ డిమాండ్లను బుదవారం లోగా పరిష్కరించకపోతే ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపి కాంగ్రెసు పార్టీని హెచ్చరించింది. యుపిఎ సంకీర్ణం సమన్వయ కమిటీ ఏర్పాటు, భాగస్వామ్య పక్షాలను గౌరవించడం వంటి డిమాండ్లను ఎన్సీపి కాంగ్రెసు ముందు ఉంచింది. ఢిల్లీలో ప్రభుత్వం నుంచి తాము తప్పుకుంటే దాని ప్రభావం మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంపై కూడా పడుతుందని శరద్ పవార్ సూచనప్రాయంగా చెప్పారు. మహారాష్ట్రలో గత 13 ఏళ్లుగా కాంగ్రెసు, ఎన్సీపి సంకీర్ణం మనుగడలో ఉంది. యుపిఎలోని కాంగ్రెసేతర భాగస్వామ్య పక్షాలు తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉన్నారని, ఆ పార్టీలతో తాము ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఎన్సీపి నాయకులు చెబుతున్నారు. శరద్ పవార్ స్థాయి నాయకుడు రెండు మంత్రి వర్గ సమావేశాలకు గైర్హాజరు కావడమనేది బాధ్యత గల తమ పార్టీకి మంచిది కాదని, దాంతో ఉత్కంఠకు తెర దించాలని శరద్ పవార్ భావిస్తున్నారని, అందువల్లనే  వరకు తాము గడువు విధించామని ఎన్సీపి నేతలు అంటున్నారు.  శరద్ పవార్ తో పాటు ఆ పార్టీకి చెందిన మరో కేంద్ర మంత్రి , ప్రఫుల్ పటేల్ గత వారం మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు.  

రెండవ వన్ డే లో శ్రీలంక విజయం

హాంబన్ టోట, జులై 24: రెండవ వన్ డే లో  భారత్ పై 9 వికెట్ల తేడాతో శ్రీలంక  ఘనవిజయం సాధించింది.  139 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 19.5 ఓవర్లకే ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి విజయం సాధించింది. దిల్షన్ 50 పరుగులు చేసి అవుటయ్యాడు. తారంగ్ 59 పరుగులు, చాండిమాల్ 6పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నాడు. 5 వన్డేల సిరీస్ లో  రెండు జట్లు చెరో మ్యాచ్ గెలుచుకొని సమాన స్కోర్ తో ఉన్నారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 33.3 ఓవర్లకు 138 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.  గంభీర్ 65 పరుగులు, అశ్విన్ 21, సెహ్వాగ్ 15, ధోనీ 11, పఠాన్ 6, ఓఝా 5 పరుగులు చేశారు. ఖాన్ 2 పరుగులు చేయగా, కోహ్లీ, రైనా ఒక్కో పరుగు మాత్రమే చేశారు. ఆర్ జి శర్మ పరుగులు ఏమీ చేయకుండానే అవుటయ్యాడు. పెరీరా, మాథ్యూస్ చెరో మూడ వికెట్లు, మలింగ రెండు, హెరాత్ ఒక వికెట్ తీసుకున్నారు.

Monday, July 23, 2012

కెప్టెన్ లక్ష్మీసెహగల్ కన్నుమూత

కాన్పూర్,జులై 23: భారత స్వాతంత్య్ర పోరాట యోధురాలు కెప్టెన్ లక్ష్మీసెహగల్ కన్నుమూశారు. ఆమె వయసు 98 సంవత్సరాలు.  కెప్టెన్ లక్ష్మీసెహగల్ స్వాతంత్య్ర పోరాటంలో క్రియాశీలకమైన పాత్ర పోషించారు. బ్రిటిష్ పాలకులపై సాయుధ పోరాటం నడిపిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీలో మహిళా విభాగమైన రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్‌కు ఆమె నాయకత్వం వహించారు. 1947లో కల్నల్ ప్రేమ్‌కుమార్ సెహగల్‌ను వివాహమాడారు. అప్పటి నుంచి కాన్పూర్‌లో నివసిస్తున్నారు. వృత్తి రీత్యా వైద్యురాలైన సెహగల్  కాన్పూర్‌ లో క్లినిక్ ఏర్పాటు చేసి లక్షలాది మంది పేద మహిళలకు ఉచితంగా వైద్య చికిత్స అందించటం ప్రారంభించారు. వైద్య వృత్తిని కొనసాగించటంతో పాటు సామాజిక కార్యకర్తగా కూడా పనిచేసేవారు. ఆమెకు 1998లో భారత ప్రభుత్వం పద్మవిభూషన్ అవార్డును బహూకరించింది.  ఆమె 1971 లో సీపీఎం పార్టీలో చేరారు. పార్టీ టికెట్‌పై రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2002లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థిగా ఎ.పి.జె.అబ్దుల్‌కలాంపై పోటీ చేసి ఓడిపోయారు.

విజయవంతంగా విజయమ్మ సిరిసిల్ల దీక్ష...

హైదరాబాద్,జులై 22: కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చేనేత కార్మికులకు  మద్దతుగా  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఆదివారం నాడు  ఒక రోజు ధర్నానిర్వైంచారు.  విజయమ్మ మాట్లాడుతూ, సిరిసిల్లలోని నేతన్నలను ఓదార్చమని జగన్మోహన రెడ్డి చెబితే తాను ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. త్వరలోనే జగన్ ముఖ్యమంత్రి అయి సువర్ణ యుగం తీసుకువస్తారన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఆప్పుడు చేనేత కార్మికుల కోసం జగన్ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని చెప్పారు. . చేనేత వస్త్రాలంటే రాజశేఖర రెడ్డికి ఇష్టం అని చెప్పుకొచ్చారు.  చేనేతలకు రాజశేఖర రెడ్డి పెన్షన్ ఇచ్చారని తెలిపారు. ఆప్కో ఆదాయం పెరిగింది రాజశేఖర రెడ్డి హయాంలోనేనని తెలిపారు. సిరిసిల్లలో 5వేల మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చారన్నారు. టెక్స్ టైల్ పార్కు కోసం ఆయన భూములు కేటాయిస్తే, వాటిని కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చారని తెలిపారు. నేతన్నలను ఆదుకున్న నేత వైఎస్ఆర్ అని చెప్పారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ఈ ప్రభుత్వం అమలు చేయలేకపోతోందన్నారు.  ఇలా ఉండగా,  విజయమ్మ దీక్షను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ప్రాంగణం వద్ద వారు కొద్దిసేపు ఉద్రిక్తత సృష్టించారు.  దీక్షను భగ్నం చేసేందుకు టీఆర్ఎస్ సిరిసిల్ల బంద్ కు కూడా పిలుపునిచ్చింది.  టీఆర్ఎస్ ఎమ్మెల్యే కెటిఆర్ ను ముందస్తు అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. మరో ఎమ్మెల్యే హరీష్ రావును  సిద్ధిపేటలో అరెస్టు చేశారు. తూముకుంట వద్ద విజయమ్మ కాన్వాయ్‌ను అడ్డుకున్న 20 మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Sunday, July 22, 2012

దేశ 13 వ రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ ఘనవిజయం

న్యూఢిల్లీ,జులై 21:  భారత రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో ప్రణబ్‌ముఖర్జీ ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా నాలుగున్నర దశాబ్దాల పాటు క్రియాశీల రాజకీయాల్లో కొనసాగిన ప్రణబ్.. దేశ 13 వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని అధికార యూపీఏ కూటమి మద్దతుతో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన ప్రణబ్‌కు ఊహించినట్లే భారీ మెజారిటీ లభించింది. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 10,29,750 విలువగల చెల్లుబాటు ఓట్లలో.. 7,13,763 విలువ గల  ( 69.3 శాతం )ఓట్లను ప్రణబ్ గెలుచుకున్నారు. ఆయన ప్రత్యర్థి, బీజేపీ, ఏఐఏడీఎంకే, బీజేడీ తదితర  ప్రతిపక్ష పార్టీల మద్దతుతో పోటీ చేసిన పి.ఎ.సంగ్మాకు కేవలం 3,15,987 విలువగల ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ప్రణబ్ 3,97,776 ఓట్ల విలువ తేడాతో సంగ్మాపై గెలుపొందారు.  ప్రతిపక్ష బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ప్రణబ్‌కు అనుకూలంగా పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరగటం విశేషం. మొత్తం శాసనసభ్యులు 224 మంది కాగా.. బీజేపీ బలపరిచిన సంగ్మాకు 103 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయగా.. ప్రణబ్‌కు 117 మంది శాసనసభ్యుల ఓట్లు పోలయ్యాయి. మరో మూడు ఓట్లు చెల్లలేదు. ఒక ఎమ్మెల్యే ఓటు వేయలేదు. బీజేపీ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో మినహా మిగతా రాష్ట్రాల్లో ప్రణబ్‌కు స్పష్టమైన మెజారిటీ లభించింది. బీజేపీ అధికారంలో ఉన్న మిగతా రాష్ట్రాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, గోవాల్లో సంగ్మాకు భారీగా ఓట్లు లభించాయి. బీజేపీ - జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వమున్న జార్ఖండ్‌లో 81 మంది ఎమ్మెల్యేలుండగా.. సంగ్మాకు కేవలం 20 ఓట్లు మాత్రమే దక్కటం విశేషం. జేఎంఎం ప్రణబ్‌కు అనుకూలంగా ఓటు వేయటంతో ఆయనకు 60 ఓట్లు లభించాయి. 294 మంది ఎమ్మెల్యేలున్న ఆంధ్రప్రదేశ్‌లో.. 190 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేయగా.. ప్రణబ్‌కు 182 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. వీరిలో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన శాసనసభ్యులు ఉన్నారు. సంగ్మాకు ముగ్గురు ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి. ఐదు ఓట్లు చెల్లలేదు. టీడీపీ, టీఆర్‌ఎస్‌లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. కేరళలో ప్రణబ్ క్లీన్ స్వీప్ చేశారు. పోలైన 124 ఓట్లూ ప్రణబ్‌కే దక్కాయి. ఒక్క ఓటు మాత్రం చెల్లలేదు. సంగ్మాకు ఒక్క ఓటు కూడా పడలేదు. 140 మంది సభ్యులన్న కేరళ అసెంబ్లీలో సీపీఐ, ఆర్‌ఎస్‌పీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. చివరి నిమిషంలో మద్దతు ప్రకటించిన తృణమూల్ కాంగ్రెస్‌తో సహా యూపీఏ భాగస్వామ్య పక్షాలు, యూపీఏకు వెలుపలి నుంచి మద్దతిస్తున్న సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలతో పాటు.. జేడీ(యూ), శివసేన వంటి పార్టీల మద్దతుతో ప్రణబ్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 

Friday, July 20, 2012

కేంద్రమంత్రులు పవార్, ప్రపుల్ రాజీనామా

ÊÖuœµËMx, జులై 20:   ꢓŸ¿-«Õ¢-“ÅŒÕ©Õ ¬Áª½-Ÿþ-X¾-„êý, “X¾X¶¾Û-©ü-X¾-˜ä-© ÅŒ«Õ «Õ¢“A X¾Ÿ¿-«Û-©Â¹× ªÃ°-¯Ã«Ö Íä¬Çª½Õ. ÅŒ«Õ ªÃ°-¯Ã«Ö ©äÈ-©ÊÕ „ê½Õ “X¾ŸµÄE «Õ¯ît-£¾Ç-¯þ-®Ï¢-’ûÂ¹× X¾¢¤Äª½Õ. ‡Fq-XÔÂË Íç¢CÊ ¨ ƒŸ¿lª½Õ «Õ¢“Ōթ֠  OÕœË-§ŒÖÅî «ÖšÇx-œ¿ÕÅŒÖ ®¾¢Â̪½g “X¾¦µ¼Õ-ÅÃyEo ‡©Ç Êœ¿-¤Ä©ð Ââ“é’-®ýÂ¹× ÅçL-§ŒÕ-Ÿ¿E „Ãu‘Çu-E¢-Íê½Õ. ÅŒ«Õ ¬ÇÈÂ¹× Íç¢CÊ “¤Äèã-¹×dÊÕ Â¹ØœÄ “X¾¦µ¼Õ-ÅŒy„äÕ ¯äª½Õ’à ÂËx§ŒÕªý Íä²òh¢-Ÿ¿E „ê½Õ ‚ªî-XÏ¢-Íê½Õ. ƪáÅä ‚Jn-¹-«Õ¢-“A’à “X¾º¦ü «áÈKb ªÃ°-¯Ã«Ö Íä®ÏÊ ÆÊ¢-ÅŒª½¢ ¯ç¢¦-ªý{Ö ²ÄnÊ¢ ÅŒÊÂ¹× ƒ«y-¹-¤ò-«-{„äÕ ¬Áª½-Ÿþ-X¾-„êý Æ©-Â¹Â¹× Æ®¾©Õ Âê½-º-«ÕE Åç©Õ-²òh¢C. ‡Fq-XÔÂË ¤Äª½x-„çÕ¢-šü©ð 9«Õ¢C ‡¢XÔ-©Õ-¯Ãoª½Õ.యూపీఏలో మాత్రం ఎన్సీపీ కొనసాగుతుందంటూ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి పవార్ వర్తమానం అందించారు.

నెత్తురోడిన సినిమా దియేటర్... ఉన్మాది కాల్పుల్లో 12మంది మృతి

 ఉన్మాది కాల్పుల్లో 12మంది మృతి 
వాషింగ్టన్,జులై 20:  అమెరికాలో కొలరాడో రాష్ట్రం డెన్వర్ శివారు ప్రాంతమైన అరోరాలోని ఒక సినిమా థియేటర్‌లో ముసుగు ధరించిన దుండగుడు ప్రేక్షకులపై విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 12 మంది మృతిచెందగా, 50 మంది గాయపడ్డారు. మృతుల్లో, క్షతగాత్రుల్లో భారతీయ అమెరికన్లెవరూ లేరు.  సెంచరీ 16 మూవీ థియేటర్‌లో బ్యాట్‌మేన్-3: ‘ద డార్క్ నైట్ రైజస్’ తొలి ప్రదర్శనలో ఈ ఘోరం చోటుచేసుకుంది. అమెరికాలో 2007 తర్వాత ఇలాంటి కాల్పులు జరగడం ఇదే తొలిసారి. థియేటర్ కాల్పుల్లో 10 మంది అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరు క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.  క్షతగాత్రుల్లో కొంతమంది పిల్లలు, నాలుగు నెలల శిశువు ఉన్నారని   అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన యువకుని 24 ఏళ్ల జేమ్స్  హేమ్స్ గా
గుర్తించారు. 

Thursday, July 19, 2012

ప్రశాంతంగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్

®ÔXÔ‰, ‚ªý-‡-®ýXÔ, Åç©Õ-’¹Õ-Ÿä¬Á¢, Åç©¢-’Ã-º-ªÃ-†¾Z-®¾-NÕ-A  ‹šË¢-’ûÂ¹× Ÿ¿Öª½¢

 ÊÖuœµËMx, జులై 19:  ªÃ†¾Z-X¾A ‡Eo-Â¹Â¹× ¤Äª½x-„çÕ¢{Õ, œµËMx, X¾ÛŸ¿Õ-ÍäaJ , ‚§ŒÖ ªÃ†¾Z© ¬Ç®¾-Ê-®¾-¦µ¼© ¦µ¼«-¯Ã©ðx Eª½y-£ÏÇ¢-*Ê ¤òL¢’û «áT-®Ï¢C. ‡Eo¹ X¶¾LÅéÊÕ ©ãÂˈ¢X¾Û ÆÊ¢-ÅŒª½¢ ‚C-„ê½¢ “X¾Â¹-šË-²Ähª½Õ. Ÿä¬Á-ªÃ-•-ŸµÄ-E©ð §ŒâXÔ\ ͵çjªý-X¾-ª½q¯þ ²òE-§ŒÖ-’âDµ, “X¾º-¦ü-«á-ÈKb, ªÃ£¾Ý-©ü-’â-Dµ©Õ , «Ö§ŒÖ-«A, «á©Ç-§ŒÕ¢-®Ï¢-’û-§ŒÖ-Ÿ¿„þ, ¬Áª½-Ÿþ-X¾-„êý... ÅŒC-ÅŒ-ª½Õ©Õ ‹{Õ-„ä-¬Çª½Õ. «á©Ç-§ŒÕ¢-®Ï¢’û ¤ñª½-¦Ç-{ÕÊ ®¾¢’ÃtÂ¹× ‹{Õ-„ä-¬Çª½Õ. ƪáÅä ¤ñª½-¦Ç{Õ •J-T-Ê{Õd ‚§ŒÕÊ J{-Jo¢’û ÆCµ-ÂÃJ Ÿ¿%†ÏdÂË B®¾Õ-¹×-„ç-@Á-œ¿¢Åî ‚§ŒÕ-ÊÂ¹× «ÕSx ‹{Õ-„äæ® ²ù¹ª½u¢ ¹Lp¢-Íê½Õ. ®ÔXÔ‰, ‚ªý-‡-®ýXÔ, Åç©Õ-’¹Õ-Ÿä¬Á¢, Åç©¢-’Ã-º-ªÃ-†¾Z- ®¾-NÕ-A ‹šË¢-’ûÂ¹× Ÿ¿Öª½¢’à «Û¯Ãoªá.

 హైదరాబాద్ లో  రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 193 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనర్హత కారణంగా సుమన్‌ రాథోడ్‌ ఓటు వేయలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓటింగ్ సరళిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పర్యవేక్షించారు. బ్యాలెట్ బ్యాక్సులను శుక్రవారం ఉదయం 6:30 గంటలకు విమానంలో  ఢిల్లీకి తరలిస్తామని రిటర్నింగ్ అధికారి సదారామ్ తెలిపారు. రెండు బ్యాలెట్ పత్రాలకు గీతలు పడటంతో వాటిని రద్దు చేసినట్టు చెప్పారు. ఎమ్మెల్యేలు ఎవరూ రెండో బ్యాలెట్ పత్రం అడగలేదన్నారు. కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు చిన్నం రామకోటయ్య, బాలనాగిరెడ్డి, వేణుగోపాలాచారి, హరీశ్వర్‌రెడ్డి, కొడాలి నాని పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ఓటేశారు. 

Wednesday, July 18, 2012

రాజేష్ ఖన్నా ఇక లేరు...

ముంబై,జులై 18: బాలీవుడ్‌ తొలి సూపర్‌స్టార్‌  రాజేష్‌ఖన్నా(69) కన్నుమూశారు. బాంద్రాలోని తన స్వగృహం "ఆశీర్వాద్‌"లోనే తుదిశ్వాస విడిచారు. ఆయన ఏప్రిల్‌ నుంచి శ్వాససంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. గత నెల 23వ తేదీ నుంచి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు. మంగళవారమే వైద్యులు రాజేష్‌ఖన్నాను డిశ్చార్జ్‌ చేశారు. ఆయన మరణవార్త తెలియగానే బాంద్రాలోని ఖన్నా నివాసానికి అభిమానులు భారీగా చేరుకున్నారు. 1942 డిసెంబర్‌ 29లో అమృత్‌సర్‌లో జన్మించిన రాజేష్‌ఖన్నా  అసలు పేరు జతిన్ ఖన్నా. బాలీవుడ్‌లో 163 సినిమాల్లో నటించారు. ఆయన మూడు ఫిలిం ఫేర్‌ అవార్డులను  సొంతం చేసుకున్నారు. 1966లో "ఆఖ్రీ రాత్‌"సినిమాతో కెరీర్‌ను ప్రారంభించిన రాజేష్‌ఖన్నా రాజ్‌, బహారోంకీ సప్నే, ఇత్తెఫాఖ్‌, ఆరాధన వంటి సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు.  హాథీ మేరే సాథీ', ‘ఆనంద్', ‘అమర్ ప్రేమ్' వంటి చిత్రాలు ఖన్నా నట జీవితంలో గొప్ప మైలురాళ్లుగా మిగిలిపోతాయి. 1969 నుంచి 1972 మధ్యకాలంలో ఒకదాని తర్వాత మరొకటిగా 15 సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ‘ఆరాధన', హాథీ మేరే సాథీ', ‘ఆనంద్', ‘అమర్ ప్రేమ్' వంటి చిత్రాలు ఖన్నా నట జీవితంలో గొప్ప మైలురాళ్లు.  1991 నుంచి 1996 వరకు ఎంపీగా పని చేశారు. నటుడుగానే కాకుండా నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు. రాజేష్ ఖన్నాను ముద్దుగా  కాకా అంటారు. 1973 లో డింపుల్ కపాడియాను వివాహం చేసుకున్న ఖన్నా 1984లో ఆమె నుంచి విడిపోయాడు. ప్రస్తుతం వీరు విడివిడిగా జీవిస్తున్నప్పటికీ, విడాకులు తీసుకోలేదు. పెద్ద కూతురు ట్వింకిల్ ఖన్నా కొంత కాలం సినిమాల్లో నటించిన అనంతరం బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‍‌ను పెళ్లాడింది. రెండో కూతురు రింకీ ఖన్నా కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించింది. తర్వాత ఆమె లండన్‌లోని ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకొని అక్కడే స్థిరపడింది. ఖన్నాతో విడిపోయినప్పటికీ డింపుల్ కపాడియా కొంత కాలంగా ఆయన వెంటేవుండి సపర్యలు చేస్తున్నారు.

Monday, July 16, 2012

డిసెంబర్‌లో భారత్ - పాక్ సిరిస్...?

బెంగుళూరు,,జులై 16:  ఎన్నాళ్ల నుండో భారత్ - పాకిస్తాన్ సిరిస్ కోసం ఎదురు చూస్తున్న క్రీడాభిమానుల ఆశలు నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి.  ఈ ఏడాది డిసెంబర్‌లో మూడు వన్డే మ్యాచ్‌ల సిరిస్‌ ఆడేందుకు  పాకిస్తాన్ జట్టు  ఇండియాకు వచ్చే అవకాశాలున్నాయి. ఐతే ఈ వన్డే సిరిస్‌కు ఇంకా భారత ప్రభుత్వం నుండి అనుమతి లభించాల్సి ఉంది. 2008 లో ముంబై తాజ్ హోటల్‌ పై టెర్రరిస్టుల దాడి అనంతం భారత్ - పాక్ క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. మళ్లీ ఐదు సంవత్సరాల తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన బోర్డు చర్చలు ఫలించి ఈ సిరిస్‌ను ఆడాలనే ఉద్దేశంతో ఉన్నాయి. ప్రభుత్వం నుండి అనుమతి లభిస్తే దాదాపు ఐదు సంవత్సరాలు తర్వాత రెండు జట్లు మధ్య మొదటి ద్వైపాక్షిక సిరీస్ ఇదే అవుతుంది. 2007లో భారత్ - పాకిస్తాన్ మధ్య  సిరీస్ జరిగింది. భారత్ - పాకిస్తాన్‌ మధ్య 2011 లో ప్రపంచ కప్‌లో భాగంగా మొహాలిలో మ్యాచ్ జరిగింది. భారత్‌లో జరిగే నాలుగు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు ట్వంటీ 20 మ్యాచ్‌ల కోసం ఇంగ్లాండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. క్రిస్టమస్ సెలవులలో భాగంగా ఇంగ్లాండ్ జట్టు డిసెంబర్ 22న  తమ దేశానికి బయలుదేరి జనవరి 3వ తారీఖున తిరిగి ఇండియాకు వస్తుంది.  ఈ మద్య  సమయంలో  భారత్ - పాక్ సిరీస్‌కు బిసిసిఐ  సన్నాహాలు చేస్తోంది.

ఒబామా వ్యాఖ్యకు భారత్ స్పందన

న్యూఢిల్లీ,జులై 16:  భారత్ కఠిన సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యకు భారత్ తీవ్రంగా స్పందించింది.  తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు అమెరికా అధ్యక్షుడు ఒబామాకు ఉందని, అయితే విధాన నిర్ణయమనేది తమ సార్వభౌమాధికారానికి సంబంధించిందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో తమ ప్రభుత్వ విధానం పెట్టుబడులకు అనుకూలంగానే ఉందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద శర్మ అన్నారు. అమెరికా రక్షణ విధానం నుంచి, వాణిజ్య హద్దుల నుంచి బయటపడాలని ఆయన అన్నారు. 

Sunday, July 15, 2012

భారత్ లో పెట్టుబడుల వాతావరణం సానుకూలంగా లేదు- ఒబామా

వాషిగ్టన్ : ,జులై 15:  రిటైల్ సహా అన్ని రంగాల్లో భారత్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పై నిషేధం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా స్పష్టం చేశారు. భారత్ లో పెట్టుబడుల వాతావరణం సానుకూలంగా లేదన్నారు. ఆర్థిక సంస్కరణలు ముందుకు తీసుకెళ్లడం తప్పని సరని సలహా ఇచ్చారు. అనేక సవాళ్ల మధ్య భారత్ వృద్ధి సాధిస్తుండటం హర్షణీయమని అన్నారు. కాశ్మీర్ సహా అనేక అంశాలను భారత్-పాకిస్తాన్ లు మాత్రమే పరిష్కరించుకోవాలని, అమెరికా సహా మరే దేశమూ పరిష్కారం చూపలేవని అన్నారు. 

నేపాల్ లో రోడ్డు ప్రమాదం: 36 మంది మృతి

ఖాట్మండ్,జులై 15:  నేపాల్ లో జరిగిన  రోడ్డు ప్రమాదంలో 36 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో పది మంది గాయపడ్డారు. మృతులలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. 70 నుంచి 80 మంది  ప్రయాణికులతో వెళుతున్న ఒక బస్సు దక్షిణ నేపాల్ లోని ఒక కాలువలో బోల్తాపడింది.   వారిలో ఎక్కువ మంది ఉత్తర ప్రదేశ్ కు చెందినవారు . వీరందరూ త్రివేణీ ఘాట్ లో జరిగే బోల్ బామ్ లో జరిగే ఉత్సవాలకు  వెళుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి 25 మంది పురుషు ల, పది మంది మహిళల, ఒక బాలుడి మృత దేహాన్ని వెలికి తీశారు.

Saturday, July 14, 2012

ఉప రాష్ట్రపతిగా తిరిగి హమీద్ అన్సారీ?

న్యూఢిల్లీ,జులై 14;: తమ కూటమి తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా హమిద్ అన్సారీ పేరును పాలక యూపీఏ ఖరారు చేసింది. ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన యూపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ చైర్మన్ గా అన్సారీ సమర్థవంతంగా పనిచేశారని యూపీఏ భాగస్వామ్య పక్షాలు ప్రశంసించాయి.స్వతంత్ర భారతంలో ఉప రాష్ట్రపతిగా వరుసగా రెండో సారి అవకాశం దక్కించుకున్న రెండో వ్యక్తి అన్సారీ. 75 ఏళ్ల అన్సారీ అలిగడ్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా పనిచేశారు. ఇంత వరకు తత్వవేత్త, పరిపాలనాదక్షుడు సర్వేపల్లి రాధాకృష్ణ మాత్రమే రెండు సార్లు ఉప రాష్ట్రపతిగా పనిచేశారు. 2007లో యుపిఎ - 1 ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇచ్చిన వామపక్షాలు ఉప రాష్ట్రపతి పదవికి అన్సారీ పేరును సూచించాయి. దానికి కాంగ్రెసు నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం అంగీకరించింది. బిజెపి అభ్యర్థి నజ్మా హెప్తుల్లాను ఆయన 455 ఓట్ల తేడాతో ఓడించారు. ఉప రాష్ట్రపతి పదవికి నామినేషన్లు దాఖలు చేయడానకి ఈనెల 20 ఆఖరు తేదీ..  

Thursday, July 12, 2012

ఇద్దరు డిప్యుటీలతో శెట్టర్‌ ప్రమాణం

బెంగళూరు,జులై 12; కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా జగదీష్‌ శెట్టర్‌ బాధ్యతలు చేపట్టారు. బెంగళూరు రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ భరద్వాజ్‌ గురువారం మధ్యాహ్నం శెట్టర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రాజకీయ సర్దుబాట్లు, కులసమీకరణాల్లో భాగంగా ఇద్దరు సీనియర్లను ఆయన ఉప ముఖ్యమంత్రులుగా తీసుకున్నారు.బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు ఈశ్వరప్ప, సీనియర్‌ మంత్రి అశోక్‌ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిద్దరూ కాకుండా మరో 29 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అధికార మార్పిడి జరిగినా యడ్యూరప్ప వర్గీయులు చాలా మంది ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదు.  \

నటుడు, మల్లయోధుడు దారాసింగ్ మృతి

ముంబయి,జులై 12;  : బాలీవుడ్ నటుడు, మల్లయోధుడు దారాసింగ్ (84) కన్నుమూశారు. ఈనెల 7న గుండెపోటుతో ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారు. మెదడు బాగా దెబ్బతిందని, కోలుకోవడం కష్టమని డాక్టర్లు తేల్చారు. కోమాలోకి వెళ్లే ప్రమాదముండడంతో కుటుంబసభ్యుల కోరిక మేరకు దారాను ఇంటికి పంపగా అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు.  పంజాబ్‌లో సిక్కుల కుటుంబంలో నవంబర్‌ 19, 1928లో దారాసింగ్ పుట్టారు. దేశ, విదేశాల్లో మల్లయోధుడిగా గుర్తింపుపొందారు. కామన్ వెల్థ్ త్‌ దేశాల్లో పర్యటించిన దారా ఒరియంటల్ చాంపియన్ కింగ్‌ఖాన్‌, జార్జ్‌ గోర్డియెంకో, జాన్ డిసెల్వాతోపాటు పేరుగాంచిన ఎందరినో ఓడించారు. 1954లో ఇండియన్ ఛాంపియన్‌గా 1968లో వరల్డ్ ఛాంపియన్‌గా ఎదిగారు. 1960-70లలో ఎన్నో సినిమాల్లో ఆయన యాక్షన్‌ కింగ్‌గా నటించారు.  బుల్లితెర రామాయణ్ లో హనుమాన్ గా రాణించారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా కూడా ఆయన మంచిపేరు తెచ్చుకున్నారు. ఇటు సీరియల్స్, యాడ్స్ లో కూడా నటించిన  దారా 2007లో వచ్చిన జబ్‌ వి మెట్‌లో చివరిసారిగా తెరపై  కనిపించారు.   

Wednesday, July 11, 2012

రైళ్ళలో ‘ఇన్ఫోటైన్‌మెంట్’' సౌకర్యం

బెంగళూరు,జులై 11;  రైళ్ళలో  ‘ఇన్ఫోటైన్‌మెంట్’ (ప్రసార మాధ్యమ సౌకర్యం) గా సరికొత్త సీటింగ్, ప్రతి బోగీలో రెండు టీవీలు, డిజిటల్ ఆడియో, జీపీఎస్ విధానం కల్పించబోతున్నారు. ఈ సదుపాయాన్ని ప్రధమంగా నైరుతి రైల్వే అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరు-చెన్నై-బెంగళూరు మధ్య నడిచే శతాబ్దిలో ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటుచేశారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మునియప్ప, బెంగళూరు నగర రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఈ సదుపాయాన్ని ప్రారంభించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో భాగంగానే దీనికి శ్రీకారం చుట్టారు. ప్రయాణికుల గమ్యస్థానాల వివరాలతో కూడిన డిజిటల్ ఆడియో, వినోదాన్ని పంచేందుకు టీవీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. చెన్నై-బెంగళూరు మధ్య నడిచే లాల్‌బాగ్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హుబ్లి మధ్య నడిచే జన శతాబ్దిల్లోనూ ఈ సౌకర్యాలను అందించడానికి నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు.

Tuesday, July 10, 2012


                                      అమర్ నాథ్ యాత్ర...

రాష్ట్రపతి ఎన్నికలో హైదరాబాదులోనే జగన్ ఓటు ?

హైదరాబాద్,జులై 10;  రాష్ట్రపతి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప లోకసభ సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులో ఓటు వేసే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో హైదరాబాదులో ఓటు వేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని వైయస్ జగన్ ఎన్నిక కమిషన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఎన్నికల కమిషన్‌ కార్యదర్శికి లేఖ రాశారు. ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించాలని ఆయన సుప్రీంకోర్టును కూడా కోరారు. సుప్రీంకోర్టులో సోమవారం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లో ఆయన ఆ విజ్ఞప్తి చేశారు. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్ ప్రస్తుతం హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఉన్న విషయం తెలిసిందే. కేసులో నిందితుడిగా జైలులో ఉన్నప్పటికీ  శానససభ్యుడు లేదా  పార్లమెంటు సభ్యులకు   ఓటును వినియోగించుకునే హక్కు ఉంటుంది. అయితే  జైలులో ఉన్న ప్రజాప్రతినిధి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషన్‌ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనే విషయంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ వైయస్ జగన్‌కు కట్టబెడుతూ తీర్మానం చేసింది. వైయస్సార్ కాంగ్రెసుకు 17 మంది శానససభ్యులు, ఇద్దరు పార్లమెంటు సభ్యులు ఉన్నారు. వీరంతా జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేస్తారు

Monday, July 9, 2012

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై తెలుగుదేశం సస్పెన్షన్ వేటు..

ఇక జగన్ పార్టీలో చేరడమే తరవాయి...  
హైదరాబాద్ ,జులై 9:  కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని తెలుగుదేశం పార్టీ  సస్పెండ్‌ చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడింది. నాని సోమవారం  ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మతో భేటీ అయ్యారు. ఈ విషయం తెలిసిన టీడీపీ వెంటనే నానిని సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ అనుచరుడిగా నానికి పేరు. గుడివాడ నుంచి ఆయన రెండుసార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. నిర్మాతగా జూనియర్‌ ఎన్టీఆర్‌తో కొన్ని సినిమాలు కూడా తీశారు. గత కొంతకాలంగా నాని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. తనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, కృష్ణా జిల్లాలో పార్టీపరంగా చేపట్టే కార్యక్రమాల్లోనూ తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన కినుక వహించారు. ఎన్టీఆర్‌ కుటుంబాన్ని అవమానిస్తున్నారని  నాని ఏడాది క్రితమే చంద్రబాబును నిలదీశారు. అప్పుడు ఆయనకు షోకాజ్‌ నోటీసు కూడా జారీ చేశారు. కాగా, కొడాలి నాని విలేకర్లతో మాట్లాడుతూ తనపై టీడీపీ చేసిన విమర్శలకు త్వరలోనే సమాధానం చెబుతానన్నారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని ఆయన తెలిపారు.ఆయన సోమవారం  చంచల్ గూడ జైల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసారు. 
నాని వెనుక నేను లేను: ఎన్టీఆర్
యే కొడాలి నాని పార్టీ మారడం వెనుక తన ప్రోద్భలం లేదని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. తన కుటుంబానికి  తెలుగుదేశం పార్టీతో ఎలాంటి విభేదాలు లేవని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. తన ప్రాణమున్నంత వరకు... పార్టీ ఉన్నంత వరకు..., తెలుగు జాతి ఉన్నంత వరకు.. తాను తెలుగుదేశంతోనే ఉంటానని ఆయన అన్నారు. తన వృత్తి సినిమా అని.. వృత్తి కారణంగానే టీడీపీకి దూరంగా ఉన్నానని ఆయన అన్నారు. తాను ఎన్టీఆర్‌ను ఎప్పుడూ మర్చిపోలేనని జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. ఇవాళ్టి జనరేషన్‌కు ఎన్ టీ ఆర్ గురించి తెలపడం తన మీదున్న ప్రధాన బాధ్యత అని అన్నారు. టీడీపీ నుంచి వీడిపోయాననడం కరెక్టు కాదన్నారు. 
గుడివాడపై బాలయ్య కన్ను?
 జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడై కొడాలి నాని ప్రాతినిధ్యం వహిఉన్న   గుడివాడ శాసనసభా స్థానంపై హీరో బాలకృష్న కన్నేసినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి ఆయన శాసనసభకు పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పుట్టిన గడ్డ కావడంతో ఆయన ఆ స్థానానికి ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడానికి తొలి మెట్టుగా దాన్ని ఆయన భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 

పాక్ లో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన ఎయిర్‌ ఇండియా విమానం

122 మంది ప్రయాణికులు క్షేమం
ఇస్లామాబాద్,జులై 9:  ఎయిర్‌ ఇండియా విమానం పాకిస్తాన్ లో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. అబుదాబి నుంచి న్యూఢిల్లీ వస్తున్న 'ఎయిర్‌ బస్‌ ఎ 319' అనే విమానం సింధ్‌ ప్రావిన్స్‌లోని నవాబ్‌ షా విమానాశ్రయంలో ఎమర్జెన్సీగా దిగింది. విమానంలో ఉన్న 122 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. విమానం పాకిస్తాన్ మీదుగా వస్తున్నప్పుడు మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థలు ఒకేసారి విఫలం అయ్యాయి. దీంతో పైలెట్‌ సునీల్‌ వశిష్ట్‌ పాక్ లో ల్యాండ్‌ అయ్యేందుకు అక్కడి విమానాశ్రయ అధికారులను అనుమతి కోరారు. అనుమతి వచ్చిన వెంటనే తెల్లవారుజామున 3 గంటల 37 నిమిషాలకు విమానాన్ని ల్యాండ్‌ చేశారు. ఒక విమానంలో మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థలు ఒకేసారి విఫలం అరుదుగా చోటు చేసుకునే సాంకేతిక లోపమని నిపుణులు చెబుతున్నారు. పాక్ లో ఉన్న ప్రయాణికులను తీసుకువచ్చేందుకు ఢిల్లీ నుంచి ఎయిర్‌ ఇండియా ఒక విమానాన్ని పంపింది.

Sunday, July 8, 2012

పంతం నెగ్గించుకున్న యడ్యూరప్ప : కర్ణాటక కొత్త సి.ఎం. జగదీశ్ శెట్టర్‌

జగదీశ్ శెట్టర్‌ను అభినందిస్తున్న సదానంద గౌడ
బెంగళూరు, జులై 8: కర్ణాటక రాజకీయ సంక్షోభానికి ఎట్టకేలకు తెర  పడింది.  రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం సదానంద గౌడను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి, ఆ స్థానంలో మాజీ సీఎం యడ్యూరప్ప సన్నిహితుడు, రాష్ట్ర మంత్రి జగదీశ్ శెట్టర్‌ను నియమించింది. దీంతో తన వర్గానికి చెందిన తొమ్మిది మంది మంత్రులతో రాజీనామాలు చేయించి, రాజకీయ అలజడి సృష్టించిన యడ్డీ పంతం నెగ్గినట్టయ్యింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా పది నెలలే గడువుండటంతో రాష్ట్రంలో మంచి ఫలితాలు సాధించాలంటే యడ్యూరప్ప నాయకత్వంలో పనిచేయక తప్పదని పార్టీ కేంద్ర నాయకత్వం గుర్తించినట్టు బీజేపీ వర్గాలు చెప్పాయి. దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో 2008 నుంచి దినదినగండంగా పాలన సాగిస్తున్న బీజేపీ సర్కారుకు 56 ఏళ్ల శెట్టర్ ముచ్చటగా మూడో సీఎం కావడం విశేషం. కర్ణాటకకు ఆయన 27వ ముఖ్యమంత్రి కానున్నారు. గత 11 నెలల వ్యవధిలో ఆ రాష్ట్రంలో సీఎం మారడం ఇది రెండోసారి.

ఏడోసారి వింబుల్డన్ ట్రోఫీని సాధించిన ఫెడరర్

లండన్,జులై 8;   స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్  ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రికార్డుస్థాయిలో ఏడోసారి గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో మూడో సీడ్ ఫెడరర్ 4-6, 7-5, 6-3, 6-4తో నాలుగో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)ను ఓడించాడు. ఈ విజయంతో ఫెడరర్ ఖాతాలో 17వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ చేరింది. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 11 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 9 కోట్ల 86 లక్షలు)... రన్నరప్ ముర్రేకు 5 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 4 కోట్ల 93 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన ఈ స్విస్ స్టార్ తాజా విజయంతో సోమవారం విడుదల చేసే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మరోసారి నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకోనున్నాడు. చివరిసారి ఫెడరర్ 2010 జూన్ 6వ తేదీన నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. 

Saturday, July 7, 2012

వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత సెరెనా విలియమ్స్

. లండన్,జులై 7: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నమెంట్‌లో ఆరో సీడ్ సెరెనా తన కెరీర్‌లో ఐదోసారి వింబుల్డన్ సింగిల్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో  సెరెనా 6-1, 5-7, 6-2తో మూడో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్)పై విజయం సాధించింది. సెరెనాకిది 14వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్. విజేతగా నిలిచిన సెరెనాకు 11 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 9 కోట్ల 86 లక్షలు); రన్నరప్ రద్వాన్‌స్కాకు 5 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 4 కోట్ల 93 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 30 ఏళ్లు పైబడినా... గాయాలతో ఎక్కువ కాలం ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చినా... యువ క్రీడాకారిణులకు దీటుగా, తనలో ఇంకా పోరాటపటిమ మిగిలి ఉందని... .మరో ‘గ్రాండ్’ విజయంతో సెరెనా చాటిచెప్పింది.   కాగా, మిక్సెడ్  డబుల్స్ లో      పేస్ (భారత్)-వెస్నినా (రష్యా) జోడి ఫైనల్‌కు చేరుకుంది.  సెమీఫైనల్లో పేస్-వెస్నినా జోడీ  7-5, 3-6, 6-3తో టాప్ సీడ్ బాబ్ బ్రయాన్-లీజెల్ హ్యుబెర్ (అమెరికా) జంటను ఓడించింది.

Friday, July 6, 2012

వింబుల్డన్ ఫైనల్లో ఫెదరర్

లండన్,జులై 6:రోజర్ ఫెదరర్‌ వింబుల్డన్‌ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లోకి  ప్రవేశించాడు. సెమీ ఫైనల్ మ్యాచ్ లో జొకోవిచ్‌పై విజయం సాధించాడు. ఈ విజయంతో ఎనిమిదోసారి వింబుల్డన్ ఫైనల్‌ చేరిన ఘనతను ఫెదరర్‌ సొంతం చేసుకున్నాడు. ఫెదరర్ 6-3, 3-6, 6-4, 6-3తో జొకోవిచ్ పై గెలిచాడు. 

Thursday, July 5, 2012

సెక్సీ కత్రినా...!

 ముంబై,జులై 5: ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ వరుసగా నాలుగోసారి ప్రపంచ శృంగార తార (సెక్సీయస్ట్ ఉమెన్) గా ఎంపికయింది.  ఎఫ్‌హెచ్‌ఎం మేగజైన్ పూర్తిగా ఆన్‌లైన్, ఎస్సెమ్మెస్ ద్వారా నిర్వహించిన పోల్‌ లో మెగాన్ ఫాక్స్, ఏంజెలినా జోలీ, బ్లేక్ లైవ్లీ వంటి హాలీవుడ్ తారలతోపాటు బాలీవుడ్ తారలను కూడా వెనక్కి నెట్టి 27 ఏళ్ల కత్రినా.. మరోసారి ఆ ఘనత సాధించింది. దీనిపై కత్రినా స్పందిస్తూ, ‘‘ఈ విషయం తెలియగానే చెప్పలేనంత ఆనందం కలిగింది. ప్రజలు కేవలం నా భౌతికరూపం చూసి మాత్రమే ఓటు వేయట్లేదు. నాకు సంబంధించిన అన్ని విషయాలనూ చూసిన తర్వాతే ఈ గౌరవం కట్టబెడుతున్నారు’’ అని పేర్కొంది.  సెక్సీగా ఉండటం అనేది కేవలం వస్త్రధారణకు సంబంధించిన విషయం కాదంటోంది ఈ అందాల భామ.  

ఈ నెల 9న ఇంటర్‌నెట్ బంద్ !

వాషింగ్టన్,జులై 5:  ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులకు ఈ నెల 9న ఇంటర్‌నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. ఏడాది క్రితం అంతర్జాతీయ హ్యాకర్లు వ్యాప్తిచేసిన మాల్‌వేర్ కారణంగా ప్రపంచ మంతా లక్షలాది కంప్యూటర్లు  ఇన్‌ఫెక్ట్ అయ్యాయి.  సోమవారంలోగా ఆ కంప్యూటర్లలోని మాల్‌వేర్‌ని తొలగించకపోతే ఇంటర్‌నెట్ నిలిచిపోయే వీలుంది. .ఒక వేళ  మాల్‌వేర్‌ని తొలగించకుండా సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా నెట్‌ను తిరిగి పొందినా భవిష్యత్తులో మళ్లీ సమస్య రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇన్‌ఫెక్ట్ అయిన 5,70,000 కంప్యూటర్లను నియంత్రణలోకి తీసుకునేందుకుగాను హ్యాకర్లు ఆన్‌లైన్ ప్రకటనల కుంభకోణాన్ని నడపడంతో సమస్య మొదలైంది. అయితే హ్యాకర్లను అణచేయడానికి ఎఫ్‌బీఐ ప్రయత్నించినా, ఇన్‌ఫెక్ట్ అయిన కంప్యూటర్లను నియంత్రించేందుకు ఉపయోగించిన దోషపూరిత సర్వర్లను నిలిపేస్తే బాధితులందరూ ఇంటర్‌నెట్ సేవలను కోల్పోతారు. దీంతో ఎఫ్‌బీఐ ప్రత్యేకంగా ఒక సేఫ్టీనెట్‌ను ఏర్పాటుచేశారు. తాత్కాలికంగా రెండు కొత్త ఇంటర్‌నెట్ సర్వర్లనూ ప్రారంభించారు. అయితే ఈ తాత్కాలిక సర్వర్ల కాల పరిమితి ఈ నెల 9న  ముగియనుండటంతో మళ్లీ సమస్య ఏర్పడింది.

Wednesday, July 4, 2012

ఓ...హో..హో...పావురమా...

                             చెన్నై మెరీనా బీచ్ లో పావురాల సందడి...

జట్టులోకి తిరిగి జహీర్‌ఖాన్, సెహ్వాగ్

ఈ నెల 21 నుంచి లంకతో వన్ డే సిరీస్...  
ముంబై,జులై 4: శ్రీలంకతో సిరీస్ కోసం 15 మంది సభ్యుల భారత జట్టు ఖరారైంది.  జహీర్‌ఖాన్, సెహ్వాగ్, ఉమేశ్ యాదవ్ తిరిగిజట్టులోకి వచ్చారు. భారత్ ఆడిన చివరి టోర్నీ ఆసియాకప్‌కు గాయాల కారణంగా దూరమైన ఈ ముగ్గురూ మళ్లీ జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శన కనబరచిన అజింక్య రహానేతో పాటు హైదరాబాదీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాకు జట్టులో స్థానం లభించింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ విశ్రాంతి కోరడంతో ఎంపిక చేయలేదు.  ఐపీఎల్‌లో పేలవంగా ఆడిన . ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, రవీంద్ర జడేజాలపై వేటు పడింది.  ధోనికి డిప్యూటీగా విరాట్ కోహ్లి కొనసాగుతాడు.  శ్రీలంకతో భారత జట్టు జులై 21 నుంచి ఆగస్టు 4 వరకు ఐదు వన్డేలు ఆడుతుంది. 7న ఒక టి 20 మ్యాచ్ ఆడుతుంది. జట్టు: ధోని (కెప్టెన్), కోహ్లి (వైస్‌కెప్టెన్), సెహ్వాగ్, గంభీర్, రైనా, రోహిత్ శర్మ, రహానే, మనోజ్ తివారీ, జహీర్, ఉమేశ్, వినయ్, అశోక్ దిండా, అశ్విన్, ఓజా, రాహుల్‌శర్మ.

ఉప రాష్ట్రపతి రేసులో కిశోర్ చంద్రదేవ్ !

 న్యూఢిల్లీ,జులై 4:  ఉప రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఆంధ్రకు చెందిన కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి కిశోర్ చంద్రదేవ్ పేరు వినవస్తోంది. ఆయనతో పాటు కాంగ్రెస్ ఎన్నికల రేసులో  ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, నాగాలాండ్ మాజీ సీఎం ఎస్‌సీ జమీర్ తదితరుల పేర్లు కూదా వినబదుతున్నాయి.  ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా గిరిజనుడిని నిలబెడితే.. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ గిరిజనుడికి మద్దతివ్వలేదని విపక్షాల తరఫు రాష్ట్రపతి అభ్యర్థి పీఏ సంగ్మా చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టొచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, కాంగ్రెస్ తరపు అభ్యర్థులుగా దళితుడైన సుశీల్ కుమార్ షిండే, పంజాబ్ గవర్నర్ శివరాజ్ పాటిల్‌ల పేర్లూ వినిపిస్తున్నాయి. కాగా, ఈ ఎన్నికల్లో సంఖ్యాబలం లేకపోవడంతో తమ అభ్యర్థిని నిలబెట్టడంపై బీజేపీ అసక్తి కనబరచడం లేదు. ఎన్డీఏ మిత్రపక్షాలు కానీ, కాంగ్రెసేతర పార్టీలు కానీ అభ్యర్థిని నిలబెడితే మద్దతిస్తామని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ తమ అధ్యక్షురాలు సోనియాకు అప్పగించింది. 

జగన్ రిమాండ్ 18 వరకు పొడిగింపు

హైదరాబాద్,జులై 4: అక్రమాస్తుల   వ్యవహారంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, బీపీ ఆచార్యల రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 18 వరకు పొడిగించింది. వీరిద్దరి రిమాండ్ ముగియడంతో బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి యు.దుర్గాప్రసాదరావు ఎదుట హాజరుపర్చారు. జగతి పబ్లికేషన్స్ తరపున కంపెనీ సెక్రటరీ కార్తీక్ కోర్టు విచారణకు హాజరుకావడంపై సీబీఐ డిప్యూటీ లీగల్ అడ్వైజర్ బళ్లా రవీంద్రనాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో కార్తీక్ సాక్షిగా ఉన్నారని, ఆయన నిందితునిగా హాజరుకావడమే తమ అభ్యంతరమని చెప్పారు. సీబీఐ అభ్యంతరాన్ని పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. వీరి హాజరును నమోదు చేసుకున్న కోర్టు, తదుపరి విచారణను 18వ తేదీకి వాయిదావేసి, ఆరోజున కోర్టుకు హాజరుకావాలని నిందితులను ఆదేశించింది.  మరోవైపు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బెయిలు కోసం పెట్టుకున్న దరఖాస్తును హైకోర్టు తిరస్కరించింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆయనకు బెయిలు మంజూరు చేయటం సరికాదంటూ.. జస్టిస్ సముద్రాల గోవిందరాజులు బుధవారం ఈ బెయిలు పిటిషన్‌ను తిరస్కరించారు.

Tuesday, July 3, 2012

షిర్డీ సంస్థాన్‌కు ఎన్నారై భారీ విరాళం

 షిర్డీ,జులై 3:  : గురుపౌర్ణమి పర్వదినం సందర్భంగా సాయినాథుడు కొలువైన షిర్డీ  సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్  కు  ఓ ప్రవాస భారతీయుడు 33 వేల అమెరికన్ డాలర్ల మొత్తాన్ని (భారత కరెన్సీలో సుమారు 17 లక్షల రూపాయలకు పైనే..) విరాళంగా అందించారు. మరో భక్తుడు 90 గ్రాముల విలువైన హారాన్ని బాబాకు బహుకరించినట్టు  ఆలయ వర్గాలు తెలిపాయి.

సంగ్మా అభ్యంతరాలకు నో...ప్రణబ్ నామినేషన్ ఓకే...

న్యూఢిల్లీ,జులై 3:  రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఎ అభ్యర్థి, తన ప్రత్యర్థి ప్రణబ్ ముఖర్జీని నిలువరించాలనే పిఎ సంగ్మా ప్రయత్నం విఫలమైంది. సంగ్మా అభ్యంతరాలను రిటర్నింగ్ అధికారి తోసిపుచ్చారు. ప్రణబ్ ముఖర్జీ నామినేషన్‌పై రిటర్నింగ్ అధికారి  ఆమోద ముద్ర వేశారు. ప్రణబ్ ముఖర్జీ నామినేషన్‌తో పాటు సంగ్మా నామినేషన్‌ను కూడా రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. దీంతో ఈ నెల 19వ తేదీన జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఇరువురి మధ్య ముఖాముఖి పోరు ఖాయమైంది. రాజ్యసభ సెక్రటరీ జనరల్ వికె అగ్నిహోత్రి రాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఐఎస్ఐ చైర్మన్‌గా లాభదాయక పదవిలో కొనసాగుతున్నందున ప్రణబ్ ముఖర్జీ నామినేషన్‌ను తిరస్కరించాలని సంగ్మా రిటర్నింగ్ అధికారి ముందు పిటిషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయానికి ప్రణబ్ ఆ పదవిలో కొనసాగుతున్నారని సంగ్మా ఫిర్యాదు చేశారు. అయితే, రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి ఎనిమిది రోజుల ముందే జూన్ 20వ తేదీన ప్రణబ్ ముఖర్జీ ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ (ఐఎస్ఐ) చైర్మన్ పదవికి రాజీనామా చేశారని ప్రణబ్ ముఖర్జీ తరఫున చేసిన వాదనను అగ్నిహోత్రి అంగీకరించారు.

ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎయిర్ ఇండియా పైలట్ల సమ్మె విరమణ

న్యూఢిల్లీ,జులై 3: ఎయిర్ ఇండియా పైలట్లు తమ సమ్మెను  విరమించనున్నారు. గత 57 రోజులుగా చేస్తున్న సమ్మెను  ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో తాము వచ్చే 48 గంటల్లో  విరమిస్తామని పైలట్లు చెప్పారు. సమ్మె విరమించాలని ఢిల్లీ హైకోర్టు ఎయిర్ ఇండియా పైలట్లను ఆదేశించింది. తిరిగి పనిలో చేరుతామని పైలట్లు అండర్‌టేకింగ్ ఇచ్చారు. సమ్మె సందర్భంగా తొలగించిన పైలట్లను తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకునే విషయంపై యాజమాన్యం సానుభూతితో వ్యవహరించాలని హైకోర్టు సూచించింది. సమ్మె కాలంలో వివిధ కారణాలతో విధులకు గైర్హాజరైన పైలట్లను యాజమాన్యం ఉద్యోగాల నుంచి తలొగించింది. ఎయిర్ ఇండియాకు చెందిన 434 మంది పైలట్లు కూడా తిరిగి ఉద్యోగం చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు. పైలట్ల డిమాండ్లను పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉద్వాసనకు గురైన వంద మంది పైలట్లను, ఇండియన్ పైలట్స్ గిల్డ్డ్‌ నాయకులు పది మందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని పైలట్లు డిమాండ్ చేస్తున్నారు. పైలట్ల 57 రోజుల సమ్మె వల్ల ఎయిర్ ఇండియాకు భారీ నష్టం వాటిల్లింది.

Sunday, July 1, 2012

రాష్ట్రంలో ప్రణబ్ ప్రచారం

    హైదరాబాద్, జులై 1: దేశానికి మరింత గౌరవ ప్రతిష్టలు తెస్తానని, అన్ని పార్టీల సభ్యులు తనకు మద్దతివ్వాలని యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ కోరారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రణబ్ ఆదివారం చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు. జూబ్లీహాలులో జరిగిన కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశంలో ప్రసంగించారు. ‘‘నేను కాంగ్రెస్ నేతగా ఇక్కడికి రాలేదు. రాష్ట్రపతి అభ్యర్థిగా వచ్చాను. ఇప్పుడు నేను ఎన్నికల ప్రచారానికి రాలేదు. ఎలక్టోరల్ సభ్యులను కలవడానికి వచ్చాను. సుదీర్ఘకాలం వివిధ హోదాల్లో దేశానికి సేవలందించిన వ్యక్తిగా దేశ ప్రజలందరికీ నా గురించి తెలుసు. కాంగ్రెస్ నేతగా సుదీర్ఘకాలం నాకు గౌరవం లభించింది. రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ ఒక్కటే కాకుండా యూపీఏలోని దాదాపు అన్ని పార్టీలు నాకు మద్దతిస్తున్నాయి. యూపీఏ బయట ఉన్న సీపీఎం, ఫార్వర్డ్ బ్లాక్, ఎస్పీ, బీఎస్పీలే కాకుండా యూపీఏను వ్యతిరేకించే ఎన్డీయేలోని జేడీ (యూ), శివసేన వంటి పార్టీలూ మద్దతు ప్రకటించాయి. కాంగ్రె స్ నేతనని కాకుండా రాష్ట్రపతి అభ్యర్థిగా నాకు సహకారం అందిస్తున్నాయి. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాదిని కాదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా నాకు వీడ్కోలు చెప్పింది’’ అని ప్రణబ్ చెప్పారు. ‘‘ప్రజాస్వామ్యంలో రాష్ట్రపతి స్థానానికి ఎవరైనా పోటీ చేయవచ్చని రాజ్యాంగంలో ఉంది. ఆ పదవి గౌరవప్రదమైనది కనుక అందరికీ ఆమోదయోగ్యమైన వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడమన్నది సంప్రదాయం. సాధారణంగా అధికార పార్టీ ప్రతిపాదించే వారే ఎన్నికవుతుంటారు. ఇతర పార్టీలూ దాదాపు ఆ అభ్యర్థికే మద్దతు ప్రకటిస్తుంటాయి. అప్పుడే ఆ పదవి ఔన్నత్యాన్ని గౌరవించినట్లు అవుతుంది. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా అన్ని పార్టీలు నాకు మద్దతిస్తాయని ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. దక్షిణాది నుంచి అనేకమంది నేతలు రాష్ట్రపతి పదవిని అలంకరించి సేవలందించారని అంటూ.. నీలం సంజీవరెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్, వీవీ గిరి, వెంకట్రామన్, అబ్దుల్‌కలాంలను ఆయన గుర్తుచేశారు. వారంతా ఆ పదవికి వన్నె తెచ్చారని, తానూ ఆ పదవి గౌరవాన్ని నిలబెడతానని వివరించారు.  అనంతరం ప్రణబ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 15 వరకు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి, అక్కడి ఎలక్టోరల్ కాలేజి సభ్యులను కలుసుకుంటానని చెప్పారు. రాష్ట్రపతి పదవి అనేది పార్టీలకు అతీతమైనదని, ఇప్పుడు తాను పార్టీ, ప్రభుత్వ విధానాలపై మాట్లాడలేనని అన్నారు. ఎంఐఎం సభ్యుల మద్దతు గురించి విలేకరులు ప్రస్తావించగా.. వారు యూపీఏ భాగస్వాములే కనుక తప్పకుండా వారి మద్దతు లభిస్తుందని ప్రణబ్ వ్యాఖ్యానించారు.

 

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...