Wednesday, April 23, 2014

బాబు రాసిచ్చేశాడు...తెలంగాణా సి.ఎం. బి.సి. కృష్ణయ్య..

అదిలాబాద్, ఏప్రిల్ 23 : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 40 సంవత్సరాలుగా బీసీల కోసం వారికి న్యాయం జరిగే విధంగా ఉద్యమిస్తున్న ఆర్.కృష్ణయ్యను ముఖ్యమంత్రిని చేస్తామని టీడీపీ అధ్యక్షుడు, మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి లో జరిగిన ప్రజాగర్జన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబునాయుడు బుధవారం  ప్రసంగించారు. తెలంగాణ తన వల్ల వచ్చిందని టీఆర్ఎస్, తామే ఇచ్చామని కాంగ్రెస్ చెబుతున్నారని వాస్తవానికి 2008లోనే తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా టీడీపీ లేఖ ఇచ్చిందన్నారు.  దొరల గడీల పాలన అంతం చేయడమే టీడీపీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిధులు తీసుకురావడం జరిగిందని , ప్రాజెక్టులైనా, రోడ్లు అయినా, మంచినీటికి సంబంధించిన అభివృద్ధి అయినా తన హయాంలోనే జరిగిందన్నారు. సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటాను తాను ఇచ్చానన్నారు. కేంద్రంతో పోరాడి సింగరేణి బంద్ అవుతున్న సందర్భంలో రూ. 600 కోట్ల అప్పు మీద మారటోరియం ఇప్పించి సింగరేణి ని కాపాడామన్నారు. 


Saturday, April 12, 2014

తెలంగాణలో 8 నుంచి 10 జిల్లాల ఏర్పాటు-తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో

హైదరాబాద్, ఏప్రిల్ 12 : తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో శనివారం విడుదలైంది. కేంద్ర మంత్రి జైరాం రమేష్, టి.పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మేనిఫెస్టోను విడుదల చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో ముఖ్యాంశాలు
* ప్రతి జిల్లాకు లక్ష ఉద్యోగాలు
* అమరవీరుల కోసం జయశంకర్ ట్రస్ట్ ఏర్పాటు
* వ్యవసాయానికి పగటిపూట 7 గంటల విద్యుత్
* ఆరోగ్య శ్రీ తరహాలో మరింత పారదర్శకంగా ఆరోగ్య విధానం
* సాంకేతిక విద్యార్థులకు ఉపాధి లభించేవిధంగా శిక్షణ
* నల్గొండ, ఖమ్మం సరిహద్దుల్లో వెయ్యి ఎకరాల్లో పారిశ్రామిక జోన్ ఏర్పాటు
* ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా
* బెల్టు షాపులు రద్దు చేస్తాం
* లంబాడా తండాలకు పంచయతీ హోదా కల్పిస్తాం
* బీసీ యాక్షన్‌ప్లాన్ అమలు
* తెలంగాణలో 8 నుంచి 10 జిల్లాల ఏర్పాటు
* విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు నామమాత్రపు వడ్డీ రుణాలు
* స్టేట్ అడ్వయిజరీ కౌన్సిల్ ఏర్పాటు
* జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు
* వృద్ధులు, వింతతు పెన్షన్‌లు వెయ్యికి పెంపు
* ప్రతి జిల్లాలో ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు
* వచ్చే రెండేళ్లలో ప్రభుత్వ కాలేజీలో లెచ్చరర్ పోస్టుల భర్తీ
* ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ పట్టభద్రులు ప్రభుత్వ ఉద్యోగం పొందే వరకు రూ.10 వేల భృతి
* ముస్లిలకు బీసీ ఈ కేTaగిరి
* గ్రామాల్లో ఇళ్లులేని వారికి పది సెంట్ల భూమి
* గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు
* మైనార్టీకి సబ్‌ప్లాన్ అమలు
* సింగరేణిలో వీఆర్ఎస్ పునరుద్దరణ
* సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు .
* బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ ప్రయోట్ చేసేందుకు చర్యలు
* ఒలంపిక్ గేమ్ నిర్వహణే లక్ష్యంగా మౌలిక వసతులు
* పోలిస్‌శాఖలో సంస్కరణలు
* రాష్ట్ర పండుగలుగా బతుకమ్మ, మేడారం జాతర
* గల్ఫ్ వెళ్లే వారికి భీమా సదుపాయం
* గల్ఫ్‌లో మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా
* ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంపు
* ఉద్యోగులకు ప్రత్యేక తెలంగాణ ఇంక్రిమెంట్
* సకలజనుల సమ్మెలో జీతాలు కోల్పోయిన వారికి చెల్లింపులు

Tuesday, April 8, 2014

లోక్ సభకు మెదక్ నుంచి కె.సి.ఆర్- నిజామాబాద్ నుంచి కవిత

హైదరాబాద్, ఏప్రిల్ 8 : టీఆర్ఎస్ అభ్యర్థుల మూడో జాబితా మంగళవారం ఉదయం విడుదలైంది. 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించారు.
 లోక్‌సభ అభ్యర్థుల జాబితా
* మెదక్ - కేసీఆర్
* కవిత - నిజామాబాద్
* హైదరాబాద్ - రషీద్ షరీఫ్
* జహీరాబాద్ - బీవీ పాటిల్
* పెద్దపల్లి - బాల్కాసుమన్
* ఖమ్మం - బుడాన్ బేగ్ షేక్
* మహబూబాబాద్ - సీతారం నాయక్
* ఆదిలాబాద్ - జి.నగేష్
టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా
* ఉప్పల్ - సుభాష్‌రెడ్డి
* చార్మినార్ - ఇనాయత్ అలీ
* మలక్‌పేట్ - సతీష్‌యాదవ్
* చాంద్రాయణగుట్ట - ఎం.సీతారామిరెడ్డి
* ఖైరతాబాద్ - మన్నె గోవర్దన్‌రెడ్డి
* అంబర్‌పేట - ఎడ్ల సుధాకర్‌రెడ్డి
* కార్వాన్ - ఠాకూర్‌జీవన్‌సింగ్
* ఖమ్మం - జి.కృష్ణ
* పినపాక - డా.శంకర్‌నాయక్
* మధిర - బమ్మెర రామ్మూర్తి
* వైరా - చంద్రావతి
* కత్బుల్లాపూర్ - కొలను హన్మంతరెడ్డి
* సనత్‌నగర్ - దండె విఠల్
* మంచిర్యాల - ఎం.దివాకర్‌రావు
* నిజామాబాద్ అర్బన్ - గణేష్‌గుప్తా
* నారాయణఖేడ్ - భూపాల్‌రెడ్డి
* కూకట్‌పల్లి - గొట్టిముక్కల పద్మారావు
* యాకుత్‌పురా - ఎండీ షబ్బీర్ అలీ
* ఎల్బీనగర్ - రామ్మోహన్‌గౌడ్
* కొడంగల్ - గుర్నాథరెడ్డి
* గోషామహల్ - ప్రేమ్‌కుమార్ ధూత్
* అశ్వరావుపేట - జె.ఆదినారాయణ
* మహేశ్వరం - కొత్త మనోహర్‌రెడ్డి
* పరకాల - సహోదరరెడ్డి
* భువనగిరి - పైలా శేఖర్‌రెడ్డి
* నాగార్జునసాగర్ - నోముల న ర్సింహయ్య
* చొప్పదండి - బొడిగె శోభ
* జహీరాబాద్ - మాణిక్‌పూర్
* నర్సాపూర్ - సీహెచ్ మదన్‌రెడ్డి
* మహబూబాబాద్ - శంకర్‌నాయక్


కన్నుల పండువగా కళ్యాణోత్సవం...

ఖమ్మం, ఏప్రిల్ 8 :భద్రాచలం లో  శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం మంగళవారం ఉదయం కన్నుల పండువగా జరిగింది. నవవధూవరులుగా భక్తులకు దర్శనమిస్తూ కల్యాణమండపానికి చేరుకున్న సీతారాములకు గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు స్వామి వారి కల్యాణం జరిగింది. అంతకుముందు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్రువమూర్తుల కల్యాణం, ఉదయం 9:30 నుంచి 10:30 వరకు కల్యాణమూర్తుల ఊరేగింపు నిర్వహించారు. దేవాలయం నుంచి కల్యాణ మండపం వరకు అంగరంగ వైభవంగా స్వామివారి ఊరేగింపు జరిగింది. భద్రాది సీతారాముల కల్యాణమోహత్సవం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరపున చైర్మన్ కనుమూరి బాపిరాజు సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు.

Monday, April 7, 2014

'వార్తాప్రపంచం' వీక్షకులకు 'శ్రీరామనవమి' శుభాకాంక్షలు...


ముగ్గురు లోక్‌సభ, 27 మంది అసెంబ్లీ అభ్యర్థులతో టీడీపీ తొలి జాబితా

హైదరాబాద్, ఏప్రిల్ 7 : తెలంగాణలో ఈనెల 30వ తేదీన జరగనున్న ఎన్నికలకు టీడీపీ తొలి జాబితా విడుదల చేసింది. ముగ్గురు లోక్‌సభ, 27 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది.
లోక్‌సభ అభ్యర్థులు
ఆదిలాబాద్ రమేశ్ రాథోడ్
జహీరాబాద్ కె.మదన్‌మోహనరావు
మహబూబాబాద్ బాణోత్ మోహన్‌లాల్
అసెంబ్లీ అభ్యర్థులు
బాన్స్‌వాడ నేనావత్ బద్యానాయక్
బాల్కొండ ఏలేటి మల్లికార్జున రెడ్డి
బోధన్ ప్రకాశ్ రెడ్డి
జగిత్యాల ఎల్. రమణ
మంథని కర్రు నాగయ్య
పెద్దపల్లి సి. విజయరమణారావు
మానకొండూరు కె. సత్యనారాయణ
నారాయణఖేడ్ ఎం. విజయపాల్‌రెడ్డి
జహీరాబాద్ వై.నరోత్తం
గజ్వేల్ ఒంటేరు ప్రతాపరెడ్డి
కూకట్‌పల్లి మాధవరం కృష్ణారావు
ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
మహేశ్వరం తీగల కృష్ణారెడ్డి
రాజేంద్రనగర్ టి.ప్రకాశ్ గౌడ్
తాండూర్ మాల్కుద్ నరేశ్
సనత్‌నగర్ టి. శ్రీనివాస యాదవ్
చాంద్రాయణగుట్ట ప్రకాశ్ ముదిరాజ్
అచ్చంపేట పి.రాములు
దేవరకొండ బిల్యా నాయక్
మిర్యాలగూడెం బంటు వెంకటేశ్వర్లు
హుజూర్‌నగర్ వంగాల స్వామిగౌడ్
సూర్యాపేట పటేల్ రమేశ్ రెడ్డి
భువనగిరి ఎ. ఉమా మాధవరెడ్డి
మహబూబాబాద్ బాలూ చౌహాన్
నర్సంపేట రేవూరి ప్రకాశ్‌రెడ్డి
పరకాల చల్లా ధర్మారెడ్డి
ములుగు అనసూయ (సీతక్క)

టి.కాంగ్రెస్ అభ్యర్ధులు రెడీ-8మంది సిట్టింగ్ లు అవుట్-సి.పి.ఐ. కి 8 సీట్లు

న్యూఢిల్లీ,ఏప్రిల్ 7: తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలైంది.  'ఒక కుటుంబం నుంచి ఒక్కరికే చాన్స్' అనే నిబంధనను కాంగ్రెస్ నిక్కచ్చిగా పాటించింది. మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల లోక్‌సభ స్థానం కేటాయించిన నేపథ్యంలో సబితకు అసెంబ్లీ సీటు ఇవ్వలేదు. మొత్తంగా 111 సీట్లలో 8 మంది మహిళలకు మాత్రమే అవకాశం కల్పించారు. మల్కాజ్‌గిరి స్థానాన్ని కేటాయించలేదని అలిగి, ఆగమేఘాలమీద  కాంగ్రెస్‌లో చేరిన తెలుగుదేశం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, టీఆర్ఎస్ నుంచి మల్కాజ్‌గిరి సీటును ఆశించి భంగపడి, తిరిగి వెనక్కి తిరిగి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌లకు కూడా అధిష్ఠానం మొండిచెయ్యి చూపింది.  ఈ మధ్యనే ఎమ్మెల్సీగా ఎంపికైన నంది ఎల్లయ్యకు నాగర్ కర్నూల్ లోక్‌సభ సీటును కేటాయించగా, రెండేళ్లకు పైగా పదవీ కాలం ఉన్న ఎమ్మెల్సీ షబ్బీర్ అలీకి అసెంబ్లీ సీటు ఇచ్చింది. రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్‌లకు కూడా అసెంబ్లీ స్థానాలు ఇచ్చినప్పటికీ వారి పదవీ కాలం రెండేళ్లలోపే ఉంది.
టి. కాంగ్రెస్ అభ్యర్ధులు వీరే
సిర్పూర్‌- ప్రేమ్‌సాగర్‌రావు, చెన్నూరు- జి.వినోద్‌
మంచిర్యాల- అరవింద్‌రెడ్డి, అసిఫాబాద్‌- సక్కు
ఖానాపూర్‌- హరినాయక్‌, ఆదిలాబాద్‌- భార్గవ్‌దేశ్‌పాండే
బోథ్‌- జే.అనిల్‌, నిర్మల్‌- ఎ.మహేశ్వర్‌రెడ్డి, ముథోల్‌- విఠల్‌రెడ్డి,

ఆర్మూర్‌- సురేష్‌రెడ్డి, బోధన్‌- పి.సుదర్శన్‌రెడ్డి
జుక్కల్‌- గంగారాం, బాన్సువాడ- కాసుల బాలరాజు
ఎల్లారెడ్డి- వేదుల సురేంద్ర, కామారెడ్డి- షబ్బీర్‌అలీ
నిజామాబాద్‌ అర్బన్‌- మహేష్‌గౌడ్‌
నిజామాబాద్‌ రూరల్‌- డి.శ్రీనివాస్‌, బాల్కొండ- అనిల్‌

కోరుట్ల- కొమిరెడ్డి రాములు, జగిత్యాల- జీవన్‌రెడ్డి
ధర్మపురి- ఎ.లక్ష్మణ్‌కుమార్‌, రామగుండం- సలీం పాషా
మంథని- శ్రీధర్‌బాబు, పెద్దపల్లి- భానుప్రసాదరావు
కరీంనగర్‌- లక్ష్మీనర్సింహరావు, చొప్పదండి- సుద్దాల దేవయ్య
వేములవాడ- బొమ్మ వెంకటేశ్వర్లు, సిరిసిల్ల- రవీందర్‌రావు
మానకొండూరు- ఆరేపల్లి మోహన్‌
హుజురాబాద్‌- సుదర్శన్‌రెడ్డి, హుస్నాబాద్‌- ప్రవీణ్‌రెడ్డి

సిద్దిపేట- శ్రీనివాస్‌గౌడ్‌, మెదక్‌- విజయశాంతి
నారాయణ్‌ఖేడ్‌- కిష్టారెడ్డి, ఆందోల్‌- దామోదర రాజనర్సింహ
నర్సాపూర్‌- సునీతలక్ష్మారెడ్డి, జహీరాబాద్‌- గీతారెడ్డి
సంగారెడ్డి- జగ్గారెడ్డి, పటాన్‌చెరు- నందీశ్వర్‌గౌడ్‌
దుబ్బాక- ముత్యంరెడ్డి, గజ్వేల్‌- నర్సారెడ్డి

మేడ్చల్‌- కేఎల్‌ఆర్‌, మల్కాజ్‌గిరి- నందికంటి శ్రీధర్‌
కుత్బుల్లాపూర్‌- కూన శ్రీశైలంగౌడ్‌, కూకట్‌పల్లి- నర్సింహయాదవ్‌
ఉప్పల్‌- లక్ష్మారెడ్డి, ఇబ్రహీంపట్నం- కైమ మల్లేష్‌
ఎల్బీ నగర్‌- సుధీర్‌రెడ్డి, రాజేంద్రనగర్‌- జ్ఞానేశ్వర్‌
శేరిలింగంపల్లి- భిక్షపతియాదవ్‌, చేవెళ్ల- కె.యాదయ్య
పరిగి- రాంమోహన్‌రెడ్డి, వికారాబాద్‌- గడ్డం ప్రసాద్‌
తాండూరు- నారాయణరావు

ముషిరాబాద్‌- డా.వినయ్‌కుమార్‌, మలక్‌పేట్‌- విఎన్‌.రెడ్డి
అంబర్‌పేట్‌- వీహెచ్‌, ఖైరతాబాద్‌- దానం నాగేందర్‌
జూబ్లీహిల్స్‌- విష్ణువర్దన్‌రెడ్డి, సనత్‌నగర్‌- మర్రి శశిధర్‌రెడ్డి
నాంపల్లి- వినోద్‌కుమార్‌, కార్వాన్‌- రూప్‌సింగ్‌
గోషామహల్‌- ముఖేష్‌గౌడ్‌, చార్మినార్‌- కె.వెంకటేష్‌
చాంద్రయణగుట్ట- మైనంపాటి అశ్విన్‌రెడ్డి, యాకుత్‌పురా- సదానంద్‌
బహుదూర్‌పురా- అబ్దుల్‌ సమీ, సికింద్రాబాద్‌- జయసుధ
కంటోన్మెంట్‌- క్రిషాంక్‌

కొడంగల్‌- విఠల్‌రావు, నారాయణ్‌పేట్‌- వామనగిరి కృష్ణ
మహబూబ్‌నగర్‌- ఒబేదుల్లా కొత్వాల్‌, దేవరకద్ర- పవన్‌కుమార్‌
మక్తల్‌- చిట్టెం రాంమోహన్‌రెడ్డి, వనపర్తి- చిన్నారెడ్డి
గద్వాల- డీకే అరుణ, అలంపూర్‌- సంపత్‌కుమార్‌
నాగర్‌కర్నూల్‌- దామోదర్‌రెడ్డి, అచ్చంపేట- వంశీకృష్ణ
కల్వకుర్తి- వంశీచంద్‌రెడ్డి, షాద్‌నగర్‌- ప్రతాప్‌రెడ్డి
కొల్లాపూర్‌- హర్షవర్దన్‌రెడ్డి

నాగార్జునసాగర్‌- జానారెడ్డి, మిర్యాలగూడ- భాస్కర్‌రావు
హుజూర్‌నగర్‌- ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సూర్యాపేట- దామోదర్‌రెడ్డి
నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి- పోతంశెట్టి వెంకటేశ్వర్లు
నకిరేకల్‌- చిరుమర్తి లింగయ్య, తుంగతుర్తి- గుడిపాటి నర్సయ్య
ఆలేరు- భిక్షమయ్యగౌడ్‌

జనగాం- పొన్నాల లక్ష్మయ్య, స్టేషన్‌ఘన్‌పూర్‌- విజయరామారావు
పాలకుర్తి- దుగ్యాల శ్రీనివాసరావు, డోర్నకల్‌- రెడ్యానాయక్‌
మహబూబాబాద్‌- కవిత, నర్సంపేట- దొంతి మాధవరెడ్డి
పరకాల- ఈ.వెంకట్రామ్‌రెడ్డి, వరంగల్‌ వెస్ట్‌- ఎర్రబెల్లి స్వర్ణ
వరంగల్‌ ఈస్ట్‌- బస్వరాజు సారయ్య, వర్దన్నపేట్‌- కొండేటి శ్రీధర్‌
భూపాలపల్లి- గండ్ర వెంకటరమణారెడ్డి, ములుగు- వీరయ్య

ఇల్లెందు- కొర్రం కనకయ్య, ఖమ్మం- పువ్వాడ అజయ్‌
పాలేరు- ఆర్‌.వెంకట్‌రెడ్డి, మధిర- భట్టి విక్రమార్క
సత్తుపల్లి- సంబాని చంద్రశేఖర్‌, అశ్వరావుపేట- మిత్రసేన
భద్రాచలం- కుంజా సత్యవతి

సీపీఐకి కేటాయించిన స్థానాలు ఇవే...
బెల్లంపల్లి, మహేశ్వరం, దేవరకొండ, కోదాడ, మునుగోడు..
పినపాక, వైరా, కొత్తగూడెం సీట్లను సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్‌

Sunday, April 6, 2014

టీ20 ప్రపంచకప్ ను తన్నుకు పోయిన శ్రీలంక

మిర్పూర్,ఏప్రిల్ 6: : టీ20 ప్రపంచకప్-2014ను శ్రీలంక చేజిక్కించుకుంది. ఆదివారమిక్కడ  జరిగిన ఫైనల్స్ లో  భారత్ ను 6 వికెట్ల తేడాతో ఓడించి లంక టీ20 చాంపియన్ గా అవతరించింది. భారత్ నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక మరో 13 బంతులు మిగిలివుండగానే ఛేదించింది. 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. కుమార సంగక్కర అజేయ అర్థసెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. 35 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ తో 52 పరుగులు చేశాడు. మహేల జయవర్థనే 24, పెరీరా 21, దిల్షాన్ 18 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రైనా, మొహిత్ శర్మ, అశ్విన్, అమిత్ మిశ్రా తలో వికెట్ తీశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది.

లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు రంగం సిద్ధం...

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6 : సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది.  ఏప్రిల్ 7 సోమవారం నాడు  అసోం  (5), త్రిపుర (1) ల్లోని మొత్తం 6 లోక్‌సభ స్థానాలకు తొలి దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ స్థానాల్లో శనివారంతో ప్రచార గడువు ముగిసింది. అసోంలోని తేజ్‌పూర్, కొలియాబోర్, జొర్హాట్, డిబ్రుగర్, లక్ష్మీపూర్ లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. మూడు దశాబ్దాల తర్వాత ఉల్ఫా నుంచి ఎలాంటి ఎన్నికల బహిష్కరణ పిలుపు లేకుండా రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు స్థానాలకు 51 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేంద్ర మంత్రులు రానీ నర్హా, పవన్ సింగ్ ఘటోవర్, అసోం సీఎం తరుణ్ గొగోయ్ తనయుడు గౌరవ్ గొగోయ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. త్రిపురలోని పశ్చిమ త్రిపుర లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్, తృణమూల్, సీపీఎం నడుమ త్రిముఖ పోరు నడుస్తోంది. ఈ స్థానం సీపీఎంకి కంచుకోట. ఇక్కడ 15 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు సీపీఎం విజయం సాధించింది.

టీడీపీ, బీజేపీ మధ్య ఎట్టకేలకు పొత్తు ఖరారు...

బీజేపీకి తెలంగాణలో 8 ఎంపీ, 47 అసెంబ్లీ స్థానాలు
సీమాంధ్రలో 5 పార్లమెంట్ , 15 అసెంబ్లీ స్థానాలు... 
హైదరాబాద్, ఏప్రిల్ 6 : టీడీపీ, బీజేపీ మధ్య ఎట్టకేలకు పొత్తు ఖరారైంది. బీజేపీకి సీమాంధ్రలో 5 పార్లమెంట్ స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాలు..., తెలంగాణలో 8 ఎంపీ, 47 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి అంగీకారం కుదిరినట్లు  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు  అధికారికంగా ప్రకటన చేశారు.  ఒకటి రెండు రోజుల్లో నియోజక వర్గాలు కూడా ప్రకటిస్తామని ఆయన తెలిపారు. టీడీపీ దేశ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.
 

టీఆర్ఎస్ మలిజాబితా-కడియం శ్రీహరికి వరంగల్ లోక్ సభ టికెట్...

హైదరాబాద్, ఏప్రిల్ 5 : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ శనివారం రెండు విడతల్లో 12 మంది పార్టీ అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. వారిలో ఎనిమిదిమంది లోక్‌సభ, నలుగురు అసెంబ్లీ అభ్యర్థులున్నారు. 69 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థుల పేర్లతో మొదటి జాబితాను శుక్రవారం వెల్లడించిన టీఆర్ఎస్.. శనివారం రెండు విడతల్లో మీడియా ప్రతినిధులకు ఎస్ఎంఎస్ ల ద్వారా 8 లోక్‌సభ, 4 అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.  రెండో జాబితాలో అభ్యర్థులు వీరే..
లోక్‌సభ స్థానాలు
భువనగిరి- డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ (బీసీ-గౌడ్)
నల్లగొండ -డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి (ఓసీ-రెడ్డి)
నాగర్ కర్నూల్ -డాక్టర్ మంద జగన్నాథం (ఎస్సీ-మాదిగ)
మహబూబ్‌నగర్ -ఏపీ జితేందర్‌రెడ్డి (ఓసీ-రెడ్డి)
వరంగల్ -కడియం శ్రీహరి (ఎస్సీ-మాదిగ)
కరీంనగర్ -బి.వినోద్‌కుమార్ (ఓసీ-వెలమ)
చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (ఓసీ-రెడ్డి)
సికింద్రాబాద్ - తూం భీంసేన్ (బీసీ-మున్నూరు కాపు)
అసెంబ్లీ స్థానాలు
నిజామాబాద్ రూరల్ - బాజిరెడ్డి గోవర్ధన్ (బీసీ-మున్నూరు కాపు)
మల్కాజిగిరి- చింతల కనకారెడ్డి (ఓసీ-రెడ్డి)
కోదాడ - కె.శశిధర్‌రెడ్డి (ఓసీ-రెడ్డి)
షాద్‌నగర్ -వై.అంజయ్యయాదవ్ (బీసీ-యాదవ్)


Friday, April 4, 2014

పీఎస్ఎల్‌వీ-సీ ప్రయోగం విజయవంతం... జూన్ తర్వాత మరో రెండు నేవిగేషన్ ఉపగ్రహాలు

శ్రీహరికోట , ఏప్రిల్ 4 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన పీఎస్ఎల్‌వీ-సీ 24 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం సాయంత్రం 5.14 గంటలకు షార్ నుంచి పీఎస్ఎల్‌వీ-సీ24  రాకెట్ నిప్పులు చిముమతూ నింగిలోకి దూసుకువెళ్ళింది. స్వదేశీ నేవిగేషన్‌కు సంబంధించిన రెండో ఉపగ్రహం ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీని ఈ రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. బెంగుళూరులోని శాటిలైట్ సెంటర్‌లో రూపొందించిన ఈ ఉపగ్రహం ద్వారా స్వదేశీ గి.ఎస్.టి. అభివృద్ధికి వీలవుతుంది.  ఐఆర్ఎన్ఎస్ఎస్ ఏడు ఉపగ్రహాల వ్యవస్థ అని,  ఈ ఏడాదిలో జూన్ తర్వాత మరో రెండు నేవిగేషన్ ఉపగ్రహాలను ప్రయోగిస్తామని ఇస్రో చైర్మన్  రాధాకృష్ణన్ చెప్పారు.

టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో-ముస్లీం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు:24 కొత్త జిల్లాలు

హైదరాబాద్, ఏప్రిల్ 4 :  టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల   మేనిఫెస్టోను పార్టీ అధినేత కేసీఆర్  విడుదల చేశారు. ముస్లీం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు దాన్ని రాజ్యాంగబద్దం చేస్తామని హామీ ఇచ్చారు. ముస్లీం మైనార్టీల అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఉద్యోగుల పాత్ర కీలకమైనదని వారికి  తెలంగాణ ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు ఇవ్వనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. పెన్సన్‌దారులకు కేంద్రంతో సమానంగా పెన్సన్లు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. 24 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని, యువతకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపాలను నిర్మిస్తామని, అలాగే వారి కుటుంబాల నుంచి ఒకరు లేక ఇద్దరికి ఉద్యోగం కల్పించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పండుగగా బతుకమ్మను నిర్వహించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. గిరిజన తండాలను గ్రామపంచాయితీలుగా మారుస్తామన్నారు. దళిత అభివృద్ధికి ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. వాల్మికి బోయలను ఎస్టీలో చేరుస్తామన్నారు. వికలాంగులకు రూ.1500, వితంతు, వృద్ధులకు వెయ్యి రూపాయల పెన్సన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. బలహీనవర్గాలకు పక్కా గృహాలు నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కమతాల ఏకీకరణ లు ప్రాధాన్యత ఇస్తామన్నారు. భూములను కంప్యూటరైజ్డ్ చేస్తామన్నారు. లక్ష వరకు రైతులు రుణాలు మాఫీ చేస్తామని పేర్కొన్నారు. ఆటో కార్మికులపై వేధింపులు ఉండవన్నారు. ప్రతి నియోజగర్వంలో లక్ష ఎకరాలకు సాగునీరు, ఉచిత నిర్బంధ విద్యను అములు చేస్తామని తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి, నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆస్పత్రి, ప్రతి జిల్లా కేంద్రంలో నిమ్స్ తరహా ఆస్పత్రులు నిర్మిస్తామని కేసీఆర్ హమీ ఇచ్చారు.

69 అసెంబ్లీ సీట్లకు టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు-గజ్వేల్ నుంచి కె.సి.ఆర్. - పొత్తులు లేనట్టే...

హైదరాబాద్, ఏప్రిల్ 4 : శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధినేత కేసీఆర్ విడుదల చేశారు. 69 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన  కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నారు. తొలి జాబితలో 55 శాతం సీట్లు బలహీన వర్గాలకు కేటాయించామని కేసీఆర్ తెలిపారు. అలాగే ఏ పార్టీలతో పొత్తులు లేవని ఆయన స్పష్టం చేశారు.
 69 అసెంబ్లీ సీట్లకు ఖరారైన టీఆర్ఎస్ అభ్యర్థులు :
* నాగర్ కర్నూలు - మర్రి జనార్దన్ రెడ్డి
* మక్తల్ - ఎల్లారెడ్డి
,అచ్చంపేట - గువ్వల బాలరాజు
* కల్వకుర్తి - జైపాల్‌యాదవ్
* అలంపూర్ - శ్రీనాథ్
* మహబూబ్‌నగర్ - వి.శ్రీనివాస్‌గౌడ్
* జడ్చర్ల - లక్ష్మారెడ్డి
* దేవరకద్ర - ఆలే వెంకటేశ్వరరెడ్డి
* గద్వాల - కృష్ణమోహన్
* వనపర్తి - ఎస్.నిరంజన్‌రెడ్డి
* సూర్యాపేట - జగదీశ్‌రెడ్డి
* నకిరేకల్ - వీరేశం
* ఆలేరు - గొంగిడి సునీత
* మిర్యాలగూడ - అమరేందర్‌రెడ్డి
* హుజూర్‌నగర్ - శంకరమ్మ
* వరంగల్ తూర్పు - కొండా సురేఖ
* వరంగల్ పశ్చిమ - వినయ్ భాస్కర్
* డోర్నకల్ - సత్యవతిరాథోడ్
* స్టేషన్‌ఘన్‌పూర్ - టి.రాజయ్య
* వర్ధన్నపేట - ఆరూరి రమేశ్
* పాలకుర్తి - సుధాకర్‌రావు
* నర్సంపేట - పెద్దిసుదర్శన్‌రెడ్డి
* భూపాలపల్లి - మధుసూదనాచారి
* జనగాం - ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
* కొత్తగూడెం - జలగం వెంకట్రావు
* సత్తుపల్లి - పిడమర్తి రవి
* చెన్నూరు - నల్లాల ఓదేలు
* సిర్పూర్‌కాగజ్‌నగర్ - కావేటి సమ్మయ్య
* మంచిర్యాల - దివాకర్‌రావు
* ఆసిఫాబాద్ - లక్ష్మి
* ఆదిలాబాద్ - జోగురామన్న
* నిర్మల్ - శ్రీహరిరావు
* బోధన్ - షకీల్
* బాన్సువాడ - పోచారం శ్రీనివాస్‌రెడ్డి
* బాల్కొండ - ప్రశాంత్‌రెడ్డి
* జుక్కల్ - హన్మంతు షిండే
* ఎల్లారెడ్డి - ఏనుగు రవీందర్‌రెడ్డి
* కామారెడ్డి - గంపగోవర్దన్
* ఆర్మూరు - జీవన్‌రెడ్డి
* కరీంనగర్ - గంగుల కమలాకర్
* జగిత్యాల - డా.సంజయ్
* కోరుట్ల - కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
* ధర్మపురి - కొప్పుల ఈశ్వర్
* వేములవాడ - చెన్నమనేని రమేశ్
* సిరిసిల్ల - కేటీఆర్‌
* రామగుండం సోమారపు సత్యనారాయణ
* హుస్నాబాద్ - లక్ష్మీకాంత్‌రావు కుమారుడు సతీష్
* మంథని - పుట్టమధు
* పెద్దపల్లి - మనోహర్‌రెడ్డి
* మానకొండూరు - రసమయి బాలకిషన్
* హుజురాబాద్ - ఈటెల
* మెదక్ - పద్మాదేవేందర్‌రెడ్డి
* గజ్వేల్ - కేసీఆర్
* ఆందోల్ - బాబూమోహన్
* జహీరాబాద్ - మాణిక్‌రావు
* సంగారెడ్డి - చింతా ప్రభాకర్
* సిద్దిపేట  - టి.హరీశ్‌రావు
* నారాయణ్‌ఖేడ్ - భూపాల్‌రెడ్డి
* మేడ్చల్ - సుధీర్‌రెడ్డి
* ఇబ్రహీంపట్నం - సామలవెంకట్‌రెడ్డి
* పరిగి - హరీశ్వర్‌రెడ్డి
* చేవెళ్ల - కె.ఎస్.రత్నం
* తాండూరు - మహేందర్‌రెడ్డి
* వికారాబాద్ - ఆనంద్
* సికింద్రాబాద్ - పద్మారావు
* పటాన్‌చెరు - మహిపాల్‌రెడ్డి
* బోథ్ - నగేష్

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...