
న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటి, పార్లమెంటు సభ్యురాలు జయప్రద బిజెపి గూటికి
చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకుగాను ఆమె పదిహేను రోజుల క్రితం
బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీతో రహస్యంగా సమావేశమై చర్చలు జరిపినట్లు
తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఆమె తన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనకు
గురవుతున్నారు. ఇప్పుడు బిజెపి నుంచి సానుకూల సంకేతాలు వచ్చినట్లు సమాచారం. ఉత్తర
ప్రదేశ్‌లోని రాంపూర్ నియోజక వర్గం నుంచి రెండు సార్లు లోక్‌సభ
సభ్యురాలిగా ఎన్నికైన జయప్రద సమాజ్‌వాదీ పార్టీలో ఒక వెలుగు వెలిగారు.
అమర్ సింగ్‌కు సమాజ్‌వాదీ పార్టీతో సంబంధాలు తెగిపోవడంతో
జయప్రద
పరిస్థితి కూడా సందేహంలో పడింది. ఈ స్థితిలో బిజెపి ఆమెకు ఆలంబనగా
నిలిచింది. ఆమె రాంపూర్ లోకసభ స్థానాన్ని అడుగుతున్నట్లు సమాచారం. అయితే,
బిజెపి రాంపూర్ సీటు ఇస్తుందా, రాజ్యసభకు ఎంపిక చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
Comments