జీడిగుంట రామచంద్రమూర్తి కథల సంపుటి ' నిన్నటి కొడుకు ' ఆవిష్కరణ
హైదరాబాద్,మే 25: ప్రముఖ రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి కథల సంపుటి ' నిన్నటి కొడుకు ' ఆవిష్కరణ సభ శుక్రవారం సాయంత్రం సిటీ సెంట్రల్ లైబ్రరీలో అభిమానులు, ఆత్మీయులు, బంధుమిత్రుల సమక్షంలో ఆహ్లాదకర వాతావరణం లో జరిగింది. కిన్నెర సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో తెలుగు విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య ఎన్. శివారెడ్డి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయనతో పాటు దూరదర్శన్ కార్యక్రమ నిర్వహణాధికారి ఓలేటి పార్వతీశం, నటుడు సుబ్బరాయ శర్మ, ఆచార్య నిర్మల, తెలుగు విశ్వ విద్యాలయం పౌర సంభందాల అధికారి జె.చెన్నయ్య, కిన్నెర అధినేత ఎం. రఘురాం తదితరులు రామచంద్ర మూర్తి కధా రచనా శైలిని కొనియాడారు. రామ చంద్ర మూర్తి ధన్య వాదాలు తెలియ చేస్తూ, తిరిగే కాలు, తిట్టే నోరూ మాదిరి, రాసే కలం తన చేత మరిన్ని మంచి కథలు రాయించ గలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తన తాజా కథల సంపుటి ' నిన్నటి కొడుకు ' ను ఆయన కిన్నెర రఘురాం కు అంకిత మిచ్చారు.
Comments