Sunday, November 30, 2014

చిత్ర పరిశ్రమ విరాళం 11. 50 కోట్లు

 హైదరాబాద్ , నవంబర్ 30; హూద్ హూద్ తుఫాను బాధితుల సహాయం కోసం ‘మేము సైతం’ అంటూ ముందుకు వచ్చిన తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆదివారం ఉదయం 10 నుండి రాత్రి 10వరకు హైదరాబాద్ లో నిర్వహించిన వివిధ వినోద, క్రీడా కార్యక్రమాలు ఆద్యంతం  రసవత్తరంగా సాగాయి. తెలుగు సినీ పరిశ్రమ యావత్తు ఇందులో పాల్గొనేందుకు కదిలిరావడంతో ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. సినీ పరిశ్రమ 12గంటల పాటు ఏకధాటిగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా వసూలయిన రూ.11,51,56,116 లను, చివరిగా ఈ కార్యక్రమానికి హాజరయిన ముఖ్యమంత్రి (సహాయ నిధి)కి చెక్కు రూపంలో అందజేశారు. 

జెమినీ టీవి. రూ.3.50 కోట్లు, మేము సైతం వెబ్ సైటుకి ప్రజలు మరియు అభిమానులు పంపిన విరాళాలు రూ.20లక్షలు, బాలకృష్ణ అభిమాన సంఘం రూ.1,11,111, హిందూపురం నియోజక వర్గం ప్రజలు రూ.43 లక్షలు, బిగ్ సి సంస్థ వారు రూ.15లక్షలు, ఆశ్రా ఫౌండేషన్ రూ.10 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారు. 

Thursday, November 27, 2014

ఆస్త్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ మృతి

అడిలాయిడ్ ,నవంబర్ 27; మృత్యువుతో పోరాడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ (25) గురువారం మృతిచెందాడు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దేశవాళీ క్రికెట్ ఆడుతుండగా హ్యూస్ తలకు బలమైన గాయం తగిలింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ అబార్ట్ బౌలింగ్‌లో బంతి హ్యూస్ తలకు బలంగా తగిలింది. ఈ ఘటనలో తీవ్ర గాయంగా గాయపడిన హ్యూస్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గత రెండు రోజులుగా కోమాలోనే ఉన్న హ్యూస్ పరిస్థితి విషమించడంతో నేడు మృతిచెందాడు. 

Wednesday, November 26, 2014

ఎ.పి. లో రిజి స్త్రేషన్ ఫీజులు పెంపు ..

  హైదరాబాద్‌,నవంబర్ 26;   ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్త్రేషన్  ఫీజులు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టాంపు డ్యూటీ 4 నుంచి 5 శాతం పెంచారు. రిజిస్త్రేషన్   ఫీజు 0.5 శాతంనుంచి 1 శాతానికి పెంచారు. కుటుంబ సభ్యుల మధ్య జరిగే ఒప్పందాలపై ఒక శాతం ఫీజు, ఇతర ఒప్పందాలపై 6 నుంచి 3 శాతానికి ఫీజు సవరించారు. 2013 నాటి ఉత్తర్వులను కొట్టివేస్తూ తాజాగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. 


    

Tuesday, November 25, 2014

టి. పారిశ్రామిక విధానం సిద్ధం ... ఇక అనుమతులు వేగవంతం

హైదరాబాద్,నవంబర్ 25; దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యుత్తమ పారిశ్రామిక విధానం తెలంగాణలో అమలు కానుంది . శాసన సభా వ్యవహారాల   శాఖ మంత్రి హరీష్‌రావు అసెంబ్లి  లో నూతన పారిశ్రామిక విధానం ప్రవేశపెట్టారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికెట్ సిస్టమ్ పేరుతో సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.  ఇందులో భాగంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయనున్నారు. పరిశ్రమల అనుమతుల కోసం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కమిటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీ పనిచేయనుంది. కమిటీ నెలరోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇవ్వనుంది. మెగా ప్రాజెక్టుల అనుమతుల కోసం సీఎస్ అధ్యక్షతన పెట్టుబడుల సదుపాయాల బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు బిల్లులో పేర్కొన్నారు. మెగా ప్రాజెక్టు కోసం బోర్డు ద్వారా 15 రోజులోల తాత్కాలిక అనుమతులు లభించనున్నాయి. దరఖాస్తుదారునికి ఇబ్బంది కలుగకుండా అధికార యత్రాంగం పనిచేయనుంది. అనుమతుల వేగవంతానికి సమిష్టి దరఖాస్తు పద్దతిని అవలంభించనున్నారు. రాష్ట్రస్థాయి పరిశ్రమల శాఖ అదనపు డైరెక్టర్ హోదా స్థాయి నోడల్ ఏజెన్సీ, జిల్లా నోడల్ ఏజెన్సీగా జిల్లా పారిశ్రామిక కేంద్రం పనిచేయనుంది. 


మోదీ దంపతులు మళ్ళి కలుస్తారా...!

అహ్మదాబాద్ నవంబర్‌ 25 : 43 ఏళ్ల కిత్రం విడిపోయిన ప్రధాని నరేంద్రమోదీ దంపతులు మళ్లీ కలిసే సూచనలు కనిపిస్తున్నాయి. మోదీ పిలిస్తే తప్పకుండా ఆయన వెంట వెళతానని మోదీ భార్య జశోదా బెన్‌ వెల్లడించారు. మోదీకి తన మీద  ప్రేమ ఉందని అందుకే ఎన్నికల అఫిడవిట్‌లో తన పేరు రాశారని ఆమె అభిప్రాయపడ్డారు. 

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలిసి ఉండాలని తనకు ఉందని...ఆయనతో కొత్త జీవితం ప్రారంభించాలని ఉందని ఆయన భార్య జశోదా బెన్‌ తెలిపారు. ఆయనకు సేవ చేయాలని ఉందని, ఒక్కసారి రమ్మని పిలిస్తే సంతోషంగా ఆయన వెంట వెళతానని ఆమె చెప్పారు. నేను ఉంటున్న ఇంటి వద్దకు వచ్చి ఒక్కసారి రమ్మని పిలవగానే మరుక్షణం ఆయన వెంట వెళ్లి జీవితాంతం తోడు ఉంటానని జశోదాబెన్‌ చెప్పారు. కానీ ముందు ఆయన తనను పిలవాలి కదా అని ఆమె అన్నారు. 
43 ఏళ్లపాటు విడిగా ఉంటున్నా... భర్తపై మమకారం తగ్గలేదని... తన పూజలన్నీ ఆయన కోసమేనని జశోదా బెన్‌ చెప్పారు. ఇప్పటికీ వారంలో 4 రోజులు ఆమె ఉపవాసం ఉంటారు. 1968లో మోదీకి 17 ఏళ్ల వయసులో జశోదా బెన్‌తో వివాహం అయింది. మూడేళ్లు తర్వాత వారిద్దరూ విడిపోయారు. తండ్రి సహకారంతో ఆమె చదువుకుని ఓ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా ఆమె కొత్త జీవితం ప్రారంభించారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల వరకు తన వివాహం గురించి కానీ, భార్య గురించి గానీ మోదీ ఎక్కడా బహిరంగంగా ప్రకటించలేదు. వడోదర స్థానం నుంచి లోక్‌సభకు మోదీ పోటీ చేస్తున్న సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో తన భార్య పేరు జశోదా బెన్‌ అని తొలిసారి ఆయన వెల్లడించారు. ఆఫిడవిట్‌లో భార్యగా తన పేరును మోదీ రాశారని తెలిసినప్పుడు తన భావాలను ఓ పత్రికలో ఆమె పంచుకున్నారు. చాలా సంతోషం కలిగిందని కళ్లలో నీళ్లు వచ్చాయని జశోదాబెన్‌ అన్నారు. ఆయనకు నేను అంటే ఇష్టమేనని తెలుసన్నారు. ఆందుకే ఆయన తన పేరు రాశారని ఆమె చెప్పారు. 





 

Sunday, November 23, 2014

డిసెంబర్‌ నుంచి ఆన్‌లైన్‌ భవిష్యనిధి ఉపసంహరణ

న్యూఢిల్లీ, నవంబర్‌ 23: దేశంలోని 5 కోట్లమందికిపైగా భవిష్యనిధి (పీఎఫ్‌) చందాదారులకు శుభవార్త. వారంతా ఎంతోకాలం నుంచీ ఎదురుచూస్తున్న ఆన్‌లైన్‌ భవిష్యనిధి ఉపసంహరణ విధానాన్ని డిసెంబర్‌ నుంచి అమలు చేయనున్నట్లు ‘ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ’ (ఈపీఎఫ్‌వో) ప్రకటించింది.   ఇప్పటివరకు    ఉద్యోగం మారడం లేదా విరమణ తర్వాత దరఖాస్తులను నేరుగా సమర్పించుకోవాల్సి వ స్తోంది. ఆ తర్వాత నెలలోగా క్లెయిమ్‌ పరిష్కా రం కావాల్సి ఉన్నా వివిధ కారణాలవల్ల రెండుమూడు నెలలు పడుతున్న సందర్భాలున్నాయి. ఆన్‌లైన్‌ పద్ధతి అమలులోకి వస్తే పీఎఫ్‌, బ్యాంకు ఖాతాలతో ఆధార్‌ అనుసంధానం చేసుకున్న చందాదారులకు దరఖాస్తు చేసిన మూడు రోజుల్లోనే ఖాతా బదిలీ లేదా నగదు జమ పూర్తయిపోతుంది. బయో మెట్రిక్  ప్రాతిపదికగల ఆధార్‌ అనుసంధానం వల్ల ఎలాంటి మోసాలకు, అవినీతికి తావుండదని ఒక అధికారి పేర్కొన్నారు. ఈ దిశగా ఇప్పటికే ఆధార్‌, బ్యాంకు ఖాతాల అనుసంధానంతో విశిష్ట ఖాతా సంఖ్య (యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌-యూఏఎన్‌) జారీచేసిన నేపథ్యంలో ఆన్‌లైన్‌ విధానం అమలు సులభతరం కానుంది. యూఏఎన్‌ ఉండటం వల్ల ఉద్యోగి ఎన్ని సంస్థలు మారినా, రిటైరయ్యేదాకా ఒకే ఖాతా సంఖ్య కొనసాగే వెసులుబాటు కూడా కలిగింది. ఇక ఆన్‌లైన్‌ పద్ధతిని అమలులోకి తెచ్చాక ఈ ఆర్థిక సంవత్సరం (2015 మార్చి 31)లోగా 20-30 శాతం పీఎఫ్‌ క్లెయిములను పరిష్కరించాలని ఈపీఎఫ్‌వో యోచిస్తోంది. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో ఖాతా బదిలీసహా 1.21 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించారు.

Saturday, November 22, 2014

ఇక అసీస్ లో క్రికెట్ సంరంభం .... అడిలైడ్ చేరిన భారత జట్టు

ముంబై, నవంబర్ 22; భారత క్రికెట్ జట్టు శనివారం ఆస్త్రేలియా చేరుకుంది. ముంబై నుంచి బయల్దేరిన టీమిండియా సభ్యులు సింగపూర్ మీదుగా అడిలైడ్ చేరుకున్నారు. ఈ  పర్యటనలో భారత్ నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 14న బ్రిస్బేన్ లో తొలి టెస్టు ఆరంభంకానుంది. టెస్టు సిరీస్ ముగిశాక ఆసీస్, ఇంగ్లండ్ లతో కలసి ముక్కోణపు వన్డే సిరీస్ ఆడనుంది. ఆ వెంటనే వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ఆస్ట్రేలియాలో ప్రపంచ కప్ ఆరంభంకానుంది.  ఈ సారి భారత జట్టు సుదీర్ఘకాలం పాటు ఆస్త్రేలియా లో పర్యటించనుంది.

హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళనకు 100 కోట్లు

హైదరాబాద్‌, నవంబర్‌ 22: హైదరాబాద్‌లో హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళనకు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు రూ. 100 కోట్లు కేటాయించారు. హుస్సేన్‌సాగర్‌ను యుద్ధప్రాతిపదికపై ప్రక్షాళనం చేసే లక్ష్యంతో కేసీఆర్‌ శనివారంనాడు ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హుస్సేన్‌ సాగర్‌లోకి మురుగు నీరు రాకుండా మళ్లింపు కాల్వల నిర్మాణాలకు టెండర్లు పిలవాలని కేసీఆర్‌ ఆదేశించారు. హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళనకు తగిన ఏర్పాట్లు చేయడానికి వీలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వాన ఒక ఉపసంఘాన్ని నియమించారు.హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ 100 ఎకరాలలో ఆకాశ హర్మ్యాలు నిర్మించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కూడా కేసీఆర్‌ అధికారులను సూచించారు అయితే పర్యావరణానికి ఆటంకం కలుగకుండా, అలాగే సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్మాణాలు జరగాలని ఆయన అన్నారు. 
75వ బర్త్ డే సందర్భంగా 75 అడుగుల కేక్ ను కట్ చేస్తున్న సమాజ్వాది అధినేత ములాయమ్... 


Friday, November 21, 2014

వచ్చే జులై 14 నుంచి 25 వరకు గోదావరి పుష్కరాలు

హైదరాబాద్‌,నవంబర్ 21; వచ్చే ఏడాది   జులై 14 నుంచి 25 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. జులై 14న ఉదయం 6.28 నిమిషాలకు పుష్కరాలకు ప్రారంభ ముహూర్తమని, ఈ ముహూర్తానికి తితిదే పంచాంగాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. పుష్కరాలకు గాను గోదావరి తీర ప్రాంతాల్లో  మొత్తం రూ. 900 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. డిసెంబరు నుంచి పనులు ప్రారంభిస్తామన్నారు. 256 ఘాట్లను అభివృద్ధి చేస్తామని, 12 రోజుల పాటు గోదావరి హారతుల కార్యక్రమం ఉంటుందని మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. రాజమండ్రి, కొవ్వూరులో గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 

ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్‌ పేరును వ్యతిరేకించిన టి. అసెంబ్లీ

హైదరాబాద్, నవంబర్ 21;  శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డొమెస్టిక్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం తెలంగాణ ప్రజలను కించపరచడమేనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్టీఆర్ పేరు పెట్టడం మీద తమకు అభ్యంతరం లేదని, పక్క రాష్ట్రం వ్యక్తి పేరు పెట్టడమే అభ్యంతరమని  అన్నారు. తెలంగాణలో అనేకమంది వీరులు, యోధులు, రాజకీయ దురంధరులు వున్నారని, వారి పేరు పెట్టొచ్చుకదా అని ఆయన అన్నారు. ఏపీలో నాలుగు ఎయిర్‌పోర్టులున్నాయని, వాటికి ఎన్టీఆర్‌ పేరుపెట్టుకోవాలని సూచించారు. కేంద్రం ఎయిర్‌పోర్టు పేరు మార్చితే తమ రాష్ట్రాన్ని సంప్రదించాలని కేసీఆర్‌ అన్నారు.ఈ అంశం మీద శుక్రవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే బీజేపీ, తెలుగుదేశం పార్టీలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాయి. కాగా  తీర్మానాన్ని ఎంఐఎం, వైసీపీ, సీపీఐ, సీపీఎం పార్టీల సభ్యులు స్వాగతించారు.  దీంతో తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
అశోక గజపతి వివరణ 
న్యూఢిల్లీ; విమానాశ్రయానికి ఎన్టీఆర్‌ పేరు పెట్టింది తాను కాదని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు తెలిపారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి ఎన్టీఆర్‌ పేరు పెట్టాలన్నది 1999 నాటి నిర్ణయమని, అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేసి తీసుకున్న నిర్ణయమని ఆయన తెలిపారు. అప్పటి కేబినెట్‌ నిర్ణయాన్నే తమ ప్రభుత్వం అమలుచేస్తోందని ఆయన స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీర్మానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 


Thursday, November 20, 2014

కృష్ణా డెల్టాకు లిఫ్ట్ ద్వారా గోదావరి జలాలు ... ఎ.పి. సర్కార్ యోచన

విజయవాడ,  నవంబర్‌ 20 : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందే గోదావరి జలాలను లిఫ్ట్‌ ద్వారా కృష్ణా డెల్టాకు ఇవ్వబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ‘పోలవరం బ్యారేజి నిర్మాణానికి ముందే ఒక ఎత్తిపోతల పథకం నిర్మించి దాని ద్వారా కృష్ణా బ్యారేజికి గోదావరి జలాలను మళ్ళించాలని నిర్ణయించాం. కాల్వల నిర్మాణం ఇప్పటికే పూర్తయినందువల్ల గోదావరి జలాలను తరలించడానికి ఎక్కువ సమయం పట్టదు. ఈ నీటిని పెన్నా డెల్టా వరకూ తరలించవచ్చు. దీని ద్వారా కృష్ణా జలాల్లో కొంత ఆదా అవుతాయి. ఈ నీటిని శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి రాయలసీమకు తరలిస్తాం. ఈ రకంగా ఇటు కృష్ణా డెల్టా అవసరాలు, అటు రాయలసీమ అవసరాలు తీరతాయి’ అని ఆయన వివరించారు. గురువారం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విస్తృత సమావేశం లో చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ కు గల సుదీర్ఘ  తీర ప్రాంతం దవల్ల పోర్టులు ఈ రాష్ట్ర దశ...దిశ మార్చబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. 
రాష్ట్రంలోని   ప్రతి జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలో గతంలోనే ఒక ప్రణాళిక ప్రకటించాం. దాని అమలుకు కట్టుబడి ఉన్నాం’ అని ఆయన తెలిపారు. వచ్చే మే నెల నాటికి తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా చేస్తామని ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రెండు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ నిలదొక్కుకోవడంతోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తుందని ఆయన చెప్పారు. 



శంషాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు

 హైదరాబాద్,నవంబర్ 20; హైదరాబాద్  లోని శంషాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్ కు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరును పెట్టారు. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. బేగంపేట విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్  కు ఎన్టీఆర్ పేరు వుండేది. అయితే శంషాబాద్ విమానాశ్రయం కట్టిన తర్వాత విమానాశ్రయం మొత్తానికీ రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. అయితే విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్  కు ఎన్టీఆర్ పేరును పెట్టక పోవడం పై నిరసనలు వ్యక్తమతున్నా గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ  వచ్చింది . 
 ఇప్పుడు బి. జె . పి. ప్రభుత్వ హయంలో పౌర విమాన యాన శాఖను దక్కించుకున్న టిడి.పి. మంత్రి అశోక గజపతి రాజు తన పలుకుబడి తో ఈ కార్యాన్ని సాధించారు 

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్

విజయవాడ, నవంబర్ 20;  వచ్చే ఏడాది మే 9,10,11 తేదీల్లో డీఎస్సీ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించనుంది.ఉపాధ్యాయ పోస్టుల భర్తీకోసం డీఎస్సీ-2014 నోటిఫికేషన్  ను ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు విడుదల చేశారు. స్కూల్ అసిస్టెంట్ 1,848, లాంగ్వేజ్ పండిట్స్ 812, పీఈటీ 156, ఎస్జీటీ 6,244 పోస్టులకు మంత్రి నోటిఫికేషన్ విడుదల చేశారు. డీఎస్సీ పరీక్షలు, ఎస్జీటీలకు మే 9న, లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీలకు మే 10, స్కూల్ అసిస్టెంట్లకు మే 11న పరీక్షలు జరగనున్నాయి. డిసెంబర్ 2 నుంచి జనవరి 16 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఫీజు చెల్లింపులు కూడా  ఆన్ లైన్ లోనే చేసే అవకాశం వుంది. ఏప్రిల్ 25 నుంచి హాల్ టిక్కెట్లు జారీ చేసి, మే 18న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. మే 27న ఫైనల్ కీ, మే 28న ఫలితాలు వెల్లడించనున్నారు. 

చలి, మంచుతో అధ్వాన్నమైన అమెరికా జీవనం ...


Upstate New York Gets Another Blast of Snow న్యూయార్క్ , నవంబర్‌ 20 : ఆలాస్కా నుంచి హవాయి వరకు... అమెరికాలోని 50 రాష్ట్రాలు చలితో గజ గజ లాడుతున్నాయి. పలు ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా మొత్తం అన్ని రాష్ట్రాలు గజగజలాడిపోతున్నాయి. . హవాయి సహా అన్ని రాష్ట్రాల్లోనూ మైనస్ డిగ్రీల్లోనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అమెరికాలో 1976 తర్వాత నవంబర్ నెలలో ఈ స్థాయి అత్యల్ప టెంపరేచర్ నమోదవ్వడం ఇదే ప్రథమం .న్యూయార్క్ పశ్చిమ ప్రాంతంలోని ఎరీ కౌంటీలో 60 అంగుళాలమేర మంచు పేరుకుపోయింది. ఈ కౌంటీలో... అత్యవసర పరిస్థితి ప్రకటించారు. గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తుండటంతో జనం ఆందోళన చెందుతున్నారు.మంచు తీవ్రత పెరగడంతో పలు హైవేలను మూసివేశారు. అమెరికా ఉత్తర, తూర్పు రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 48 రాష్ట్రాల్లో మంచు తీవ్రంగా కురుస్తోంది. దీని ప్రభావం... 23 కోట్లమందిపై పడింది. బఫెలో ప్రాంతం పూర్తిగా మంచులో కూరుకుపోయింది. కాగా చలి, మంచు వల్ల ఇంతవరకు 8 మరణాలు నమోదయ్యాయి. 



డాలర్ @ 61. 94


న్యూ ఢిల్లీ,నవంబర్ 20; రూపాయి విలువ మళ్లీ పడిపోయింది. గురువారంనాడు డాలర్‌తో రూపాయి విలువ ముందు 62.25 పైసలకు పడిపోయింది. గత తొమ్మిది నెలల్లో ఇదే కనిష్ఠ విలువ. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రూపాయి విలువ అత్యల్పంగా 62.45 పైసలకు పడిపోయింది. అయితే గురువారంనాడు ఒక దశలో 62.25 పైసలకు పడిపోయినా సాయంత్రానికి మళ్లీ కాస్త కోలుకుని 61.94 పైసల వద్ద ముగిసింది. 



Wednesday, November 19, 2014

అమెరికా సాహిత్య పురస్కార పోటీదారులలో భారత సంతతి రచయిత...


న్యూయార్క్, నవంబర్ 19; : అమెరికాలో ప్రతిష్ఠాత్మకమైన సాహిత్య పురస్కారాన్ని దక్కించుకునేందుకు పోటీపడుతున్నవారి తుది జాబితాలో భారత సంతతి రచయిత ఆనంద్‌గోపాల్‌ పేరు చోటు చేసుకొంది. యుద్ధ ప్రభావిత అఫ్ఘానిస్థాన్‌పై ఆయన రచించిన నవల 'నో గుడ్‌మెన్‌ ఎమాంగ్‌ ది లివింగ్‌'ను కాల్పనిక సాహిత్యేతర విభాగంలో ఎంపిక చేశారు. 'ది వాల్‌ స్త్రీట్ జర్నల్‌'కు అఫ్ఘానిస్థాన్‌ విలేకరిగా పనిచేసిన ఆయన- ముగ్గురు అఫ్ఘాన్‌ ప్రజల జీవితాన్ని నవలగా మలిచారు. 


ఎట్టకేలకు గురు రామ్ పాల్ అరెస్ట్ ...

న్యూఢిల్లీ, నవంబర్ 19; హర్యానాలోని హిస్సార్లో వివాదాస్పద స్వామీజీ  రామ్ పాల్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. మంగళవారం నుంచి పోలీసులు రామ్ పాల్ ఆశ్రమంలో ప్రవేశించడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆయన శిష్యులుగా చెప్పుకుంటున్నవారు అడ్డుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో ఆరుగురు శిష్యులు మరణించారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు పోలీసులు ఆశ్రమంలోకి ప్రవేశించి రామ్ పాల్ ను అదుపులోకి తీసుకున్నారు. హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్ పాల్ కు న్యాయస్థానం పలుమార్లు సమన్లు పంపినా స్పందన లేకపోవడంతో ఆయన్ని అరెస్టు చేయాల్సిందిగా పోలీసులను కోర్టు ఆదేశించింది. 2006లో రామ్ పాల్ మీద కేసు నమోదైంది. ఈ కేసులో కోర్టు ఇప్పటి వరకు 63 వారంట్లు జారీ చేసింది. ఈ వారెంట్లు దేనికీ రామ్ పాల్ స్పందించకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసుల మీద ఆయన శిష్యులుగా చెప్పుకుంటున్నవారు పలుమార్లు దాడులు చేశారు. మంగళవారం నాడు మరోసారి అదే పరిస్థితి ఎదురైంది. రామ్ పాల్ మీద పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసి కేంద్ర బలగాల సాయంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.  

మూడు అంచెలుగా రాజధాని భూ సమీకరణ

హైదరాబాద్‌, నవంబర్‌ 19 : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని భూ సమీకరణ కోసం ఏర్పాటు చేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీ  బుధవారం సమావేశం అయింది. త్వరలోనే రాజధాని భౌగోళిక స్వరూపాన్ని విడుదల చేస్తామని  స్పష్టం చేశారు. సర్వేయర్లు ,అధికారుల నియామకానికి ఆర్థికశాఖ ఆమోదం తెలిపిందని వారు చెప్పారు. భూ సమీకరణకు చట్టబద్ధత కోసం విధి విధానాలను రూపొందిస్తున్నామమని , మూడు అంచెలుగా రాజధాని కోసం భూ సేకరణ జరుగుతుందని చెప్పారు. దీనిపై క్షేత్రస్థాయిలో రైతులు, గ్రామస్థులతో మాట్లాడుతున్నామని చెప్పారు. ఈ సమావేశంలో రైతులకు మేలు కలిగే నిర్ణయాలు తీసుకున్నామని మంత్రులు తెలిపారు. 

రణభూమిగా మారిన సత్ లోక్ ఆశ్రమం ... ఆచూకి లేని గురు రామ్ పాల్

Rampal Lives in 12-Acre Ashram, Owns BMWs, Mercsన్యూఢిల్లీ, నవంబర్‌ 18: హర్యానాలోని బర్వాలాలోగల వివాదాస్పద ‘గురు రామ్‌పాల్‌’ దుర్భేద్య దుర్గంలాంటి ‘సత్‌లోక్‌’ ఆశ్రమంలో మంగళవారం హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిపై గురువుతోపాటు ఆయన అనుచరులపై పోలీసులు 3కేసులు నమోదుచేశారు. కోర్టు ధిక్కారం కేసులో ఆయన అరెస్టుకు హైకోర్టు నాన్‌-బెయిలబుల్‌ వారంట్‌ జారీచేసింది. ఆయనను అరెస్టు చేసేందుకు ఆశ్రమం వద్దకు వెళ్ళిన  పారామిలిటరీ బలగాలపై బాబా కమాండో దళం   గా ప్రకటించుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో దాడికి దిగారు. యాసిడ్‌ సీసాలు, పెట్రోలు బాంబులు, రాళ్లు విసిరారు. అటుపైన పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. మరోవైపు దట్టమైన పొగల నడుమ నుంచి కాల్పుల శబ్దాలు కూడా వినిపించాయి. ఈ సంఘటనలలో 100 మంది పోలీసులు, పలువురు మీడియా ప్రతినిధులుసహా 200మందికిపైగా గాయపడ్డారు. 
బాబాను కచ్చితం గా అరెస్ట్‌చేసి, హైకోర్టులో హాజరుపరుస్తామని డీజీపీ చెప్పారు. ఆశ్రమంలోకి వెళ్లేందుకు ప్రహరీని కూల్చగా తమను అడ్డుకునేందుకు ఏర్పాటుచేసిన ఎల్పీజీ డంప్‌ కనిపించిందని, వేలసంఖ్యలో మహిళలు, పిల్లలను మానవ కవచాలుగా వాడుకుంటున్నారని ఆయన తెలిపారు . ఆశ్రమంలో  ఇంకా 5వేల మందికిపైగానే భక్తులు చిక్కుకున్నట్లు డీజీపీ వెల్లడించారు. ఆశ్రమం లోపల కొన్ని మృత దేహాలు ఉన్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు. అయితే పోలీసుల కాల్పుల్లో ఎవరూ మరణించలేదని ఆయన స్పష్టం చేసారు? బాబా రామ్‌పాల్‌ ఆశ్రమంలోనే ఉన్నారని ఆయన వెల్లడించారు. 
కాగా స్వామీజీ రామ్‌పాల్‌ను అరెస్టు చేస్తామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తెలిపారు. రామ్‌పాల్‌ అరెస్టయ్యే వరకు ఆశ్రమం వద్ద ఆపరేషన్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం రామ్‌పాల్‌పై చర్యలు ఉంటాయని వెల్లడించారు. రామ్‌పాల్‌పై దేశద్రోహం కేసు కింద చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Tuesday, November 18, 2014

మూడు గ్రామాలను దత్తత తీసుకున్నఎమ్.పి. కవిత

హైదరాబాద్ ,నవంబర్ 18; నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మూడు గ్రామాలను ఎంపీ కల్వకుంట్ల కవిత దత్తత తీసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు సంసద్ గ్రామ్ యోజన పథకం కింద తాను తన నియోజకవర్గంలోని కందకుర్తి, మాణిక్ బండార్, జగిత్యాల గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్టు ఆమె ప్రకటించారు. రానున్న రైల్వే బడ్జెట్‌లో నిజామాబాద్-పెద్దపల్లి రైల్వే లైన్ కోసం అధిక నిధులు మంజూరు చేయించుకుంటామని చెప్పారు. 


భూములిచ్చేవారికి బాబు భరోసా ....

 హైదరాబాద్,నవంబర్ 18; ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటవుతున్న గుంటూరు జిల్లా తుళ్ళూరు పరిసర గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని హైదరాబాద్లో కలిశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడిన చంద్రబాబు , ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూములు ఇచ్చే రైతులను పారిశ్రామికవేత్తలుగా తయారుచేస్తామని హామీ ఇచ్చారు. భూ సమీకరణకు ముందుకు వచ్చే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నైపుణ్య అభివృద్ధికి శిక్షణ ఇప్పించి రైతులకు ఉజ్వల భవిష్యత్తు అందిస్తామని చంద్రబాబు చెప్పారు. రాజధానికోసం భూములిచ్చిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి వచ్చే పరిశ్రమలన్నీ తొలుత రాజధాని ప్రాంతంలోనే ఉంటాయని చెప్పారు. భూములిచ్చే రైతుల కుటుంబాలలో నిరుద్యోగులుంటే వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చంద్రబాబు నాయుడు రైతులకు హామీ ఇచ్చారు. 

వచ్చే ఏడాది జరిగే ప్రపంచ క్రికెట్ టోర్నీ కప్ ను మెల్ బోర్న్ లో ఆవిష్కరిస్తున్న భారత ప్రధాని మోడీ .... 

కేపిటల్‌ రీజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆధారిటీకి ఎ.పి. క్యాబినెట్ ఆమోదం... ఇక ఎన్.టి.ఆర్. వైద్యసేవగా ఆరోగ్యశ్రీ...

హైదరాబాద్‌, నవంబర్‌ 18 : ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేపిటల్‌ రీజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆధారిటీకి (సీఆర్‌డీఏ) మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. సీఆర్‌డీఏకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. వైస్‌ ఛైర్మన్‌గా మున్సిపల్‌ శాఖ మంత్రి ఉంటారు. కేపిటల్‌ సిటీ, కేపిటల్‌ రీజయన్‌ అనే రెండు విభాగాలతో సీఆర్‌డీఏ పనిచేస్తుంది. 29 గ్రామాల పరిధిలో నూతన రాజధానిని నిర్మించనున్నారు.

సీఆర్‌డీఏ కోసం ఆర్డినెన్స్‌ జారీ చేయాలా? లేక చట్టం చేయాలా? అన్న దానిపై రైతులతో సమావేశం అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు. ఆరోగ్యశ్రీ పేరును ఎన్టీఆర్‌ వైద్యసేవగా మార్చాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్‌ సేవకింద రూ. 2.50 లక్షల నగదు రహిత వైద్యం అందిస్తారు. మంగపేట, బెరైటీస్‌ గనుల లీజును మంత్రివర్గం రద్దు చేసింది. బెరైటీస్‌ గనుల లీజులో భారీ అక్రమాలు జరిగాయని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. దీనిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించనుంది. గత ప్రభుత్వం జారీ చేసిన మైనింగ్‌ లీజులను రద్దు చేసి గ్లోబల్‌ టెండర్లను పిలవాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇసుక పాలసీలపై కూడా చర్చ జరిగింది. ఇసుక అమ్మకాల్లో మార్పులకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 

Monday, November 17, 2014

తెలంగాణా రాష్ట్ర అధికార చిహ్నాలు ఖరారు

మహబూబ్‌నగర్‌, నవంబర్‌ 17 : తెలంగాణ రాష్ట్రం అధికారిక చిహ్నాలను సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, జంతువుగా జింక, రాష్ట్ర వృక్షం జమ్మిచెట్టు, రాష్ట్ర పుష్పం తంగేడుగా నిర్ణయించారు. కొత్త రాష్ట్రంలో తెలంగాణ కోణం నుంచి చిహ్నాలను ఎంపిక చేశామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. 
 
రామాయణంలో జింకకు ప్రాధాన్యం ఉందని, రాముడు పాలపిట్టను దర్శించుకున్న తర్వాతే విజయం సిద్ధించిందని కేసీఆర్‌ అన్నారు. జమ్మిచెట్టు తెలంగాణ ప్రజల జీవితాలలో అంతర్భాగమని ఆయన తెలిపారు. తంగేడు పూలు సౌభాగ్యాన్ని కాపాడే విశిష్ట పుష్పంగా మహిళలు భావిస్తారని కేసీఆర్‌ చెప్పారు. 


Sunday, November 16, 2014

ఐదో వన్డేలోను భారత్‌ గెలుపు....సిరీస్ క్లీన్ స్వీప్

 రాంచీ, నవంబర్ 16;  భారత్‌, శ్రీలంక మధ్య ఝార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన ఐదో వన్డేలో భారత్‌ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది.తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 286 పరుగులు చేసింది. శ్రీలంక కెప్టెన్‌ మాథ్యూస్‌ (139 నాటౌట్‌) శతకంతో శ్రీలంక భారీ పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్‌ ఈ లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి 48.4 ఓవర్లలోనే ఛేదించింది. భారత్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లి (139 నాటౌట్‌: 126 బంతుల్లో 12ఫోర్లు, 3 సిక్స్‌లు) మరోసారి ఛేదనలో సత్తా చాటుతూ అజేయ శతకంతో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.ప్రస్తుతం ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి తనలోని ఈ శైలిని మరింత మెరుగుపరుచుకున్నాడు. సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించడంలో ధోనీని మురిపించాడు. 14 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను నాయకుడిగా ముందుండి నడిపించాడు. రాయుడి(59)తో కలిసి మూడో వికెట్‌కు 136 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో భారత్‌ వరుసగా మూడు వికెట్లు కోల్పోయి ఒత్తిడి పెరిగిన సమయంలో కోహ్లి జోరు పెంచి సాధించాల్సిన పరుగుల రన్‌రేట్‌ పెరగకుండా జాగ్రత్త తీసుకున్నాడు. అక్షర్‌ పటేల్‌(17నాటౌట్‌)తో సమన్వయం చేసుకుంటూ జట్టును అజేయ శతకంతో గెలిపించాడు.1982 తర్వాత శ్రీలంకను భారత్‌ క్లీన్‌ స్వీప్‌ చేయడం ఇదే తొలిసారి. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 139 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, శ్రీలంక కెప్టెన్‌ మాథ్యూస్‌ సైతం 139 పరుగులతో నాటౌట్‌గా నిలవడం విశేషం.
ఐదు వన్డేల సిరీస్‌లో అద్భుతంగా రాణించిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో మొత్తం 329 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకం, రెండు అర్థ సెంచరీలు ఉన్నాయి. కాగా, ఐదో వన్డేలో అద్భుత ఆల్‌రౌండర్‌ ప్రదర్శన చేసిన శ్రీలంక కెప్టెన్‌ మాథ్యూస్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కింది. తొలుత బ్యాటింగ్‌లో శతకం(139 నాటౌట్‌)గా నిలవడమే గాకుండా బౌలింగ్‌లోనూ రాణించి 2 వికెట్లు తీశాడు. 
నెల్లూరు జిల్లా పుట్టంరాజు కండ్రిగ గ్రామాన్ని దత్తత చేసుకున్న సచిన్ 
అక్కడి ప్రజలతో ముచ్చటిస్తున్న చిత్రం 

తెరాసలో చేరిన చేవెళ్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

హైదరాబాద్‌ ,నవంబర్ 15: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కాలె యాదయ్య తెరాసలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో యాదయ్య తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... చేవెళ్ల , శంకర్‌పల్లిలో ప్రభుత్వ ఆస్పత్రులు కడుతామని హామీ ఇచ్చారు. కొత్తగా వచ్చిన తెలంగాణలో ప్రజలు కోటి ఆశలతో ఉన్నారని వారి ఆశలను నెరవేర్చుతామని అన్నారు. తెలంగాణకు లక్షల కోట్ల విలువ చేసే భూములున్నాయని వాటిని చెర విడిపిస్తే బంగారు తెలంగాణ సాధించుకోవచ్చని వివరించారు. 3 సంవత్సరాల తర్వాత తెలంగాణలో కన్నురెప్పపాటు కూడా కరెంట్ పోనీయమని వెల్లడించారు. 4 సంవత్సరాల్లోగా ప్రతీ ఇంటికి మంచినీటి నల్లా కనెక్షన్ ఇస్తామని తెలిపారు. ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇవ్వకపోతే మళ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయాలని అడగమని పునరుద్ఘాటించారు. 

చైనా ఓపెన్ టైటిల్ గెలిచిన సైనా...

పుజై (చైనా), నవంబర్‌ 16 : భారత స్టార్‌ షట్లర్‌ ప్రతిష్టాత్మక చైనా ఓపెన్‌లో చరిత్ర సృష్టించారు. టోర్నీలో మొదటి నుంచి అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న సైనా చైనా ఓపెన్‌ టైటిల్‌ సాధించారు. జపాన్‌ షట్లర్‌ యమగుచిపై 21-12, 22-10 స్కోర్‌తో సైనా గెలుపొందారు. తొలిసారి చైనా ఓపెన్‌ గెలిచినా సైనా నెహ్వాల్‌కు ఈ ఏడాది ఇది మూడో టైటిల్‌. 

మూడు చోట్ల మెట్రో రూట్ మార్పు..

 హైదరాబాద్, నవంబర్  15; హైదరాబాద్ మెట్ రో రైలు మార్గం అలైన్మెంట్ మార్పుకు ఎల్ అండ్ టి సంస్థ అంగీకరించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం నాడు ఎల్ అండ్ టి సంస్థ  ప్రతినిధులతో  సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అలైన్మెంట్ మార్చడానికి అంగీకారం కుదిరింది. ఈ మేరకు పాతబస్తీలో ప్రార్థనా మందిరాలు ఉన్న చోట అలైన్మెంట్ను మార్చి మూసీ నది పక్కనుంచి మార్గాన్ని మార్చుతారు. అలాగే సుల్తాన్ బజార్ దగ్గర మార్గాన్ని మార్చి కోఠీ ఉమన్స్ కాలేజీ వెనుక నుంచి మళ్ళిస్తారు. అదేవిధంగా ప్రస్తుతం అసెంబ్లీ ముందు నుంచి వున్న మార్గాన్ని అసెంబ్లీ వెనుక నుంచి తీసుకెళ్తారు. మెట్ రో అలైన్మెంట్ మార్పుకు అయ్యే వ్యయాన్ని భరించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు. మెట్రోకి అప్పగించిన స్థలాలను కూడా తిరిగి తీసుకోబోమని కూడా కేసీఆర్ హామీ ఇచ్చారు అలాగే, మొత్తం మెట్రోరైలు మార్గాన్ని కూడా 72 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్లకు పెంచడానికి కూడా అంగీకారం కుదిరింది.    

Saturday, November 15, 2014

కేంద్రమంత్రి దత్తాత్రేయను సన్మానిస్తున్న టీ. సి.ఎమ్. చంద్రశేఖర రావు 

Friday, November 14, 2014

కవిత పై రేవంత్ వ్యాఖ్యలు...అట్టుడికిన టి. అసెంబ్లీ...వారం పాటు దేశం సభ్యుల సస్పెన్షన్

 హైదరాబాద్,  నవంబర్ 14;  నిజామాబాద్‌ ఎంపీ కవితపై తెదేపా నేత రేవంత్‌రెడ్డి చేసిన  వ్యాఖ్యలు శుక్రవారం కూడా తెలంగాణ శాసనసభను కుదిపేశాయి. రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందేనని తెరాస సభ్యులు పట్టుబట్టడం...ప్రతిగా తమ నేతను బడ్జెట్‌పై ప్రసంగించనివ్వాలని సభ మధ్య బైఠాయించిన నేపథ్యంలో శాసనసభ నుంచి తెలుగు దేశం సభ్యులు   వారంరోజుల పాటు సస్పెండ్‌ అయ్యారు. అయినా సభలోనే కూర్చుండిపోయిన వారిని మార్షల్స్‌ వచ్చి బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. సస్పెండైన వారిలో తెదేపాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు, ఉపనేత రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, రాజేందర్‌రెడ్డి, ఎ.గాంధీ, సాయన్న, సండ్ర వెంకటవీరయ్య, వివేకానంద, గోపీనాథ్‌ ఉన్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్‌పై మాట్లాడేందుకు రేవంత్‌రెడ్డికి అవకాశమివ్వగా తెరాస సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

గందరగోళం మధ్య సమావేశాన్ని సభాపతి ఎస్‌.మధుసూదనాచారి వాయిదా వేశారు. మధ్యాహ్నం 12.52 గంటల సమయంలో సభ ప్రారంభం కాగా మళ్లీ అదే పరిస్థితి. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రులు సమాధానం చెప్పకుండా పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించగా మంత్రి హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం చెబుతూ ఆ వ్యాఖ్యలని ఖండించారు. ఎన్ని రోజులైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, సభను తప్పుదోవపట్టించిన రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నారు. మళ్లీ గందరగోళం నెలకొనడంతో సభను మరోసారి వాయిదా వేశారు. మధ్యాహ్నం 2.50 గంటల సమయంలో సభ ప్రారంభం కాగానే తెరాస సభ్యులు రేవంత్‌రెడ్డి క్షమాపణకు పట్టుబట్టారు.

మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ పదే పదే విజ్ఞప్తి చేసినా సభను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇష్టం లేకపోయినా తెదేపా సభ్యులు 8 మందిని ఈ వారం సస్పెండ్‌ చేయడానికి ప్రతిపాదించినట్లు చెప్పారు. ఇంతలో తెదేపా పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉప నేత రేవంత్‌రెడ్డి కూడా తమ పార్టీ సభ్యులతో కలసి స్పీకర్‌ పోడియం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డిని కూడా సస్పెండ్‌ చేయాలని మంత్రి ప్రతిపాదించారు. తెదేపా సభ్యుల సస్పెన్షన్‌ తీర్మానాన్ని సభ ఆమోదించింది. 

రేవంత్ వివరణ...

ఇటీవల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జరిపిన సమగ్ర సర్వేలోని కొన్ని లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం  మాత్రమే చేశానని టి.టిడిపి నేత రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎక్కడా ఎవరిమీదా నిరాధార ఆరోపణలు చేయలేదని అన్నారు. వార్తా, ప్రకటనల రూపంలో వచ్చిన వాటినే చూపించి... ప్రభుత్వాన్ని ప్రశ్నించానని అన్నారు. నిజామాబాద్‌ ఎంపీ కవిత రెండో చోట్ల నయోదు చేయించుకున్నారని, దీనిపై అధికారులపై ఏ చర్యలు తీసుకుంటున్నారో సమాధానం చెప్పాలని మాత్రమే ప్రశ్నించానని ఆయన అన్నారు. అయితే ప్రభుత్వం 30 గంటల తర్వాత క్షమాపణలు చెప్పాలని, ఆ తర్వాతే సభలో మాట్లాడాలని... సభను స్తంభింపజేసిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై స్పీకర్‌ కు, శాసనసభలో ఉన్న మిగతా పక్షాల నాయకులకు లేఖలు రాశానని, జరిగిన సంఘటనలు,  తన వద్ద ఆధారాలను వారికి ఇచ్చినట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా టీడీపీ ఎమ్మెల్యేలను వారం రోజుల పాటు సస్పెండ్‌ చేసి సభను కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తన వద్ద ఉన్న వీడియో క్లిప్పుంగ్‌లను మీడియా ఎదుట రేవంత్‌రెడ్డి బహిరంగపరిచారు. 
సమగ్ర సర్వేలో ఎంపీ కవిత పేరు రెండు చోట్ల నమోదు అయిన మాట వాస్తవమని, కలెక్టర్‌కు పిర్యాదు అందడంతో హైదరాబాద్‌లో  పేరు తొలగించారని అన్నారు. 
 
ఇలా వుండగా, ఎంపీ కవితపై రేవంత్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం తెలంగాణ జనజాగృతి కార్యకర్తలు రేవంత్‌ రెడ్డి నివాసంపై దాడికి యత్నించారు. దీనిపై స్పందించిన రేవంత్‌ దాడులతో ఆత్మస్థైర్యాన్ని కోల్పోనని వెల్లడించారు. కేసీఆర్‌ను నీడలా వెంటాడుతునే ఉంటానని ఆయన అన్నారు. కేసీఆర్‌ను గద్దె దించేవరకు పోరాటం చేస్తారని, తెలంగాణలో టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. పొలిటికల్‌ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, హరగోపాల్‌ లాంటి నేతలు కదలాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. నా ఫోన్‌ను ట్యాప్‌ చేస్తున్నారని... నేనేమైనా ఉగ్రవాదినా? అంటూ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 

టి.ఆర్.ఎస్. పై మజ్లిస్ కు భ్రమలు తొలగుతున్నాయా!

హైదరాబాద్ న వంబెర్ 14;  టి.ఆర్.ఎస్. సర్కారు మీద మిత్రపక్షం మజ్లిస్ కు భ్రమలు తొలగి పోయినట్టున్నాయి. మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్  తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి ప్రభుత్వం పై నిప్పులు కురిపిస్తూనే వున్నారు. శుక్రవారం నాడు కూడా అక్బరుద్దీన్ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బడ్జెట్ మీద చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే తెలంగాణ కోసం ఉద్యమం ఎందుకు చేశారా అనిపిస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం కోరానని చెప్పారు. అయితే, ఇంత వరకు సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్టానికి విద్యుత్ సమస్యలాగే ఆర్థిక సమస్య కూడా ఉందన్నారు. మరి ఆ సమస్యని ఎందుకు బహిర్గతం చేయడం లేదన్నారు. ప్రభుత్వం కొన్ని అంశాలను ఉద్దేశపూర్వకంగానే దాస్తోందని చెప్పారు. శ్వేతపత్రాలు ఇచ్చేందుకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో చెప్పాలన్నారు. 

Thursday, November 13, 2014

నాల్గవ వన్డే లోను మనదే గెలుపు...

కలకత్తా, నవంబర్‌ 13: కలకత్తా లో జరిగిన నాల్గవ వన్‌ డే లో శ్రీలంక పై భారత్‌ 153 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (264) ద్విశతకంతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 404 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 43.1 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌటైంది. రోహిత్‌ డబుల్‌ సెంచరీ చేయడామే గాక వన్‌ డే లో అత్యధిక స్కోర్‌ చేసిన బ్యాట్స్‌మేన్‌గా రికార్డు నెలకొల్పాడు. అలాగే గతంలో వన్‌ డే లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ చేసిన సేహ్వాగ్‌ స్కోర్‌ను కూడా అధిగమించి 264 పరుగులతో రోహిత్‌ మరో రికార్డు సృష్టించారు. 

ఈడెన్ లో రోహిత్ వీరవిహారం ...డబుల్ సెంచరీతో కొత్త వరల్డ్ రికార్డు...

Rohit-Sharma-celeb-pix
కోల్ కతా, నవంబర్ 13; శ్రీలంకతో ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న నాల్గో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీతో చెలరేగిపొయాడు . తుది రెండు వన్డేలకు జట్టులోకి వచ్చిన రోహిత్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. కేవలం 148 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 33 ఫోర్లు, 9 సిక్సర్ల తో  రెండో శతకాన్ని పూర్తిచేశాడు. తొలుత అర్ధ సెంచరీ చేయడానికి  కొంత సమయం తీసుకున్న రోహిత్ శర్మ.. ఆ తరువాత పదునైన షాట్లతో అలరించాడు. సెంచరీ చేయడానికి 100 బంతులను ఎదుర్కొన్న రోహిత్.. మరో సెంచరీకి 50 బంతులు మాత్రమె తీసుకున్నాడు. 

ఈ తాజా డబుల్ సెంచరీతో రోహిత్ శర్మ వన్డేల్లో రెండో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. గతంలో అసీస్ పై  209 పరుగులు చేసిన ఈ హైదరాబాదీ ఆటగాడు మరోసారి జూలు విదిల్చాడు. ఈ క్రమంలోనే వీరేంద్ర సెహ్వాగ్ వన్డే రికార్డును కూడా రోహిత్ అధిగమించాడు. గతంలో సెహ్వాగ్ పేరిట ఉన్న 219 ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టి ప్రపంచ వన్డే చరిత్రలో అరుదైన రికార్డును స్వంతం చేసుకున్నాడు.



Tuesday, November 11, 2014

భర్తను కోల్పోయిన జమునకు నటులు, నేతల పరామర్శ
(జమున భర్త రమణారావు (86) మంగళవారం కన్ను మూశారు )

కు.ని. ఆపరేషన్లు వికటించి 10 మంది మహిళల మృతి...

బిలాసపూర్‌, నవంబర్‌ 11 : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బిలాస్ పూర్  లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి 10 మంది మహిళలు మృతి చెందారు. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. పరిస్థితి విషమంగా ఉన్నవారికి రూ.50వేల సాయం అందజేస్తారు .   తాక్తాపూర్‌లో నిర్వహించిన శిబిరంలో 80 మంది మహిళలు శస్త్రచికిత్సలు చేయించుకోగా వారిలో ఉదయం 8మంది మహిళలు మరణించగా తరువాత ఇంకో  ఇద్దరు మరణించారు . 

Sunday, November 9, 2014

విస్తరణ తరవాత కేంద్ర మంత్రులు... శాఖలు



కేబినెట్‌ మంత్రులు
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి (పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సులు, పింఛన్లు, అంతరిక్షం, అణుశక్తి శాఖ మరియు 
ఎవరికీ కేటాయించని శాఖలు.)
రాజ్‌నాథ్‌ సింగ్‌ హోం
మనోహర్‌ పర్రీకర్‌ రక్షణ
అరుణ్‌ జైట్లీ ఆర్థిక శాఖ, కంపెనీ వ్యవహారాలు, 
సమాచార, ప్రసారశాఖ
సుష్మా స్వరాజ్‌ విదేశీ వ్యవహారాలు, ప్రవాసభారతీయ వ్యవహరాలు
నితిన్‌ గడ్కరీ షిప్పింగ్‌, రోడ్డు రవాణా, 
జాతీయ రహదారులు
వెంకయ్యనాయుడు పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, 
పట్టణ దారిద్య్ర నిర్మూలన
సురేష్‌ ప్రభు రైల్వే శాఖ
డి.వి.సదానంద గౌడ న్యాయశాఖ
రాంవిలాస్‌ పాశ్వాన్‌ ఆహారం, ప్రజాపంపిణీ, కన్య్జూమర్‌ అఫైర్లు
జె.పి.నడ్డా ఆరోగ్య, కుటుంబ సంక్షేమం
చౌదరి బీరేందర్‌ సింగ్‌ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌, 
తాగు నీరు, పారిశుధ్యం
కల్‌రాజ్‌ మిశ్రా మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌
మేనకా గాంధీ మహిళా శిశు సంక్షేమం
అనంతకుమార్‌ రసాయనాలు, ఎరువులు
రవిశంకర్‌ ప్రసాద్‌ కమ్యూనికేషన్‌, ఐటీ
అశోక్‌ గజపతి రాజు పౌర విమానయానం
అనంత్‌ గీతే భారీ పరిశ్రమలు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌
హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండసీ్ట్ర
నరేంద్ర సింగ్‌ తోమర్‌ గనులు, ఉక్కు  
జ్యుయల్‌ ఓరమ్‌ గిరిజన వ్యవహారాలు
తవర్‌చంద్‌ గెహ్లాట్‌ సామాజిక న్యాయం, సాధికారత
స్మృతి ఇరానీ మానవ వనరులు
ఉమాభారతి జల వనరులు, నదుల అభివృద్ధి, గంగా ప్రక్షాళన
నజ్మా హెప్తుల్లా మైనారిటీ వ్యవహారాలు
రాధా మోహన్‌ వ్యవసాయం
హర్షవర్ధన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎర్త్‌ సైన్సెస్‌
సహాయ మంత్రులు (స్వతంత్ర ప్రతిపత్తి)
వి.కె.సింగ్‌ గణాంకాలు, పథకాల అమలు, 
విదేశాంగ, ప్రవాస భారతీయ వ్యవహారాలు
సంతోష్‌ గంగ్వార్‌ జౌళిశాఖ 
శ్రీపాద నాయక్‌ ఆయుష్‌, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
ధర్మేంద్ర ప్రధాన్‌ పెట్రోలియం, సహజ వాయువులు
శర్వానంద్‌ సోన్వాల్‌ యువజన వ్యవహారాలు, క్రీడలు.
ప్రకాశ్‌ జవదేకర్‌ పర్యావరణం, అడవులు 
పీయూష్‌ గోయల్‌ విద్యుత్తు, బొగ్గు, కొత్త, సంప్రదాయేతర ఇంధన వనరులు
జితేంద్ర సింగ్‌ పీఎంవో, సిబ్బంది శిక్షణ వ్యవహారాలు, శాస్త్ర 
సాంకేతికత, ఎర్త్‌ సైన్స్‌. అంతరిక్షం, 
అణు శక్తి శాఖల సహాయ మంత్రి.
నిర్మలా సీతారామన్‌ వాణిజ్యం, పరిశ్రమలు. 
రావ్‌ఇందర్‌జిత్‌ సింగ్‌ ప్రణాళిక, రక్షణ శాఖ
రాజీవ్‌ ప్రతాప్‌ రూడి నైపుణ్య అభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, 
పార్లమెంటరీ వ్యవహారాలు
బండారు దత్తాత్రేయ కార్మిక, ఉపాధి 
మహేశ్‌ శర్మ సాంస్కృతిక, పర్యాటక శాఖలు, పౌర విమానయానం
సహాయ మంత్రులు 
జి.ఎం.సిద్ధేశ్వర భారీ పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు
మనోజ్‌ సిన్హా రైల్వేలు
ఉపేంద్ర కుష్వాహా మానవ వనరుల అభివృద్ధి
పొన్‌ రాధాకృష్ణన్‌ షిప్పింగ్‌, రోడ్డు రవాణా, 
జాతీయ రహదారులు
కిరన్‌ రిజిజు హోం
క్రిషన్‌ పాల్‌ గుజ్జర్‌ సామాజిక న్యాయం, సాఽధికారత
సంజీవ్‌ బల్యాన్‌ వ్యవసాయం  
మన్‌సుఖ్‌భాయ్‌ వసావా గిరిజన వ్యవహారాలు
రావ్‌సాహెబ్‌ దాదారావు ధాన్వే ఆహారం, ప్రజా పంపిణీ, కన్య్జూమర్‌ అఫైర్లు
విష్ణుదేవ్‌ సాయి గనులు, ఉక్కు  
సుదర్శన్‌ భగత్‌ గ్రామీణాభివృద్ధి
నిహాల్‌చంద్‌ పంచాయతీరాజ్‌
ముక్తార్‌ అబ్బాస్‌ న క్వీ మైనారిటీ, పార్లమెంటరీ వ్యవహారాలు
రాంకృపాల్‌ యాదవ్‌ తాగునీరు, పారిశుధ్యం
హరిభాయ్‌ పార్థీభాయ్‌ చౌదరి హోం శాఖ
సంవర్‌లాల్‌ జాట్‌ జల వనరులు, నదుల అభివృద్ధి, గంగానది శుద్ధి
మోహన్‌లాల్‌ కుందారియా వ్యవసాయం
గిరిరాజ్‌ సింగ్‌ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
హన్సరాజ్‌ అహిర్‌ రసాయనాలు, ఎరువులు
రాంశంకర్‌ కఠీరియా మానవ వనరుల అభివృద్ధి
సుజనా చౌదరి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎర్త్‌ సైన్సెస్‌
రాజ్యవర్ధన్‌ రాఠోర్‌ సమాచార, ప్రసారాల శాఖ
బాబూలాల్‌ సుప్రియో పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, 
పట్టణ దారిద్య్ర నిర్మూలన,
జయంత్‌ సిన్హా ఆర్థిక శాఖ
సాధ్వి నిరంజన్‌ జ్యోతి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండసీ్ట్రస్‌
విజయ్‌ సాంప్లా సామాజిక న్యాయం, సాఽధికారిత

మోడీ టీమ్ లో మహిళా ప్రాతినిథ్యం తక్కువే..

 న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో మహిళల సంఖ్య ఎనిమిదికి చేరింది. కొత్తగా జరిగిన విస్తరణలో ఒక్క మహిళకే చోటు దక్కింది.   యూపీకి చెందిన  ఎంపీ సాధ్వి నిరంజన్ జ్యోతి   సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం మంత్రి మండలిలో  సుష్మా స్వరాజ్, ఉమా భారతి, నజ్మా హెప్తుల్లా, మేనకా గాంధీ, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, స్మతీ ఇరానీ  కేబినెట్ హోదా మంత్రులుగా ఉన్నారు.  

నిర్మలా సీతారామన్ స్వతంత్ర హోదా ఉన్న సహాయ మంత్రిగా ఉన్నారు.  కేబినెట్‌లోని అత్యంత పెద్ద, పిన్న వయస్కులు మహిళలే కావడం విశేషం. ఎక్కువ వయసు ఉన్న మంత్రి నజ్మా  హెప్తుల్లా కాగా, తక్కువ వయసు ఉన్న మంత్రి స్మతి ఇరానీ కావడం గమనార్హం. నరేంద్ర మోదీ మంత్రి వర్గంలో మొత్తం 66 మంది సభ్యులు ఉండగా, 8 మంది మహిళలకు మాత్రమే స్థానం లభించింది.

హ్యాట్రిక్ గెలుపుతో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా...

హైదరాబాద్,నవంబర్ 9;  శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ ను టీమిండియా కైవశం చేసుకుంది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా  ఇక్కడ జరిగిన మూడో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ ను చేజిక్కించుకుంది.  243 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా సునాయాసంగా  గెలుపొందింది. కేవలం నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా 44.1 ఓవర్లో  లక్ష్యాన్ని సాధించింది.  శ్రీలంక బౌలర్లలో కులశేఖర, పెరీరా, దిల్షాన్ లకు తలో వికెట్టు దక్కింది.
  ఆరు వేల పరుగుల క్లబ్‌లో విరాట్‌ కోహ్లీ
ఈ మ్యాచ్ లో విరాట్‌ కోహ్లీ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడంతోపాటు తన కెరీర్‌లో 6 వేల పరుగుల మైలు రాయిని దాటాడు. 51 పైచిలుకు సరాసరితో విరాట్‌ కోహ్లీ అత్యంత వేగంగా ఈ క్లబ్‌లో చేరిన ఆటగాడు. కోహ్లీకిది 32వ అర్ధ సెంచరీ కావడం విశేషం. ప్రముఖ వెస్టిండీస్‌ ఆటగాడు రిచర్డ్స్‌ కంటే ముందుగా ఆరు వేల పరుగుల క్లబ్‌లో చేరుకున్న వ్యక్తి విరాట్‌ కోహ్లీ. ప్రపంచలో ఈ ఘనత సాధించిన వ్యక్తి కూడా విరాట్‌ కోహ్లీ. విరాట్‌ తర్వాత వేగంగా ఆరు వేల పరుగులు సాధించిన వారిలో వివ్‌ రిచర్డ్స్‌, సౌరబ్‌ గంగూలీ, దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీడెవిలియర్స్‌, ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూహెడెన్‌ ఉన్నారు. 

మోడీ క్యాబినెట్ లో షూటర్, సింగర్ ,సాధువు ...

 modi-cabinet-sensationన్యూఢిల్లీ,నవంబర్  9; ప్రధాని మోడీ తన మంత్రివర్గ విస్తరణలో విభిన్న రంగాలకు చెందిన ముగ్గురికి స్థానం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.క్రీడారంగానికి చెందిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్… సినీ గాయకుడు బాబుల్ సుప్రియో… సామాజిక కార్యకర్త, సాధువు అయిన సాధ్వీ నిరంజన్ జ్యోతి మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు.
వీరిలో రాజ్యవర్ధన్ పేరు ముందునుంచే వినిపించినా మిగతా ఇద్దరి పేర్లూ మాత్రం ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. షూటర్ గా పేరున్న రాజ్యవర్దన్ రాజస్థాన్ లోని జయపూర్ రూరల్ స్థానం నుంచి బీజేపీ తరఫున గెలిచారు. మరోవైపు బెంగాలీ, హిందీ సినీ గాయకుడు బాబుల్ సుప్రియో పశ్చిమబెంగాల్ లోని అసన్ సోల్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఇక సాధువైన సాధ్వి నిరంజన్ జ్యోతి ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ నుంచి గెలిచారు.


మోడీ కొలువులో కొత్తగా 21 మంది...దత్తన్నకు స్వతంత్ర హోదా ...సహాయమంత్రిగా సుజనా


న్యూఢిల్లీ, నవంబర్ 9; కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 21 మంది మంత్రులు రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారం చేసారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మనోహర్ పారికర్ , సురేష్ ప్రభాకర్ ప్రభు, జేపీ నడ్డా, బీరేంద్రసింగ్, బండారు దత్తాత్రేయ, రాజీవ్ ప్రతాప్ రూడీ, డాక్టర్ మహేష్ శర్మ, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, రాంకృపాల్ యాదవ్, హరిబాయ్ చౌదరి, సన్వర్లాల్ జాట్, మోహన్ కుందారియా, మోహన్ జీ బాయ్, గిరిరాజ్ సింగ్, హన్స్రాజ్ అహిర్, రాంశంకర్, సుజనా చౌదరి, జయంత్ సిన్హా, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, బాబుల్ సుప్రియో, సాధ్వి నిరంజన్ జ్యోతి, విజయ్ సంప్లా... ప్రమాణ స్వీకారం చేసిన వారిలో వున్నారు. వీరిలో నలుగురు కేబినెట్ మంత్రులుగా, ముగ్గురు స్వతంత్ర హోదా కలిగిన మంత్రులుగా , 15 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కేంద్ర సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. టీడీపీ నాయకుడు సుజానా చౌదరి తొలిసారిగా కేంద్ర కేబినెట్ లో దక్కించుకున్నారు. పారిశ్రామికవేత్తగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన తర్వాత రాజకీయాలవైపు అడుగులు వేశారు. చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటూ టీడీపీలో వడివడిగా ఎదిగారు. రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్ లో అడుగుపట్టిన ఆయన కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇప్పటివరకు పత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ ఆయనకు మంత్రి పదవి దక్కడం విశేషం.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ కేంద్ర సహాయమంత్రి (స్వతంత్ర హోదా)గా ప్రమాణ స్వీకారం చేశారు.హైదరాబాద్ నగర రాజకీయాల్లో తనదైన మార్కుతో కార్యకర్తలతో సత్సంబంధాలున్న బండారు దత్తాత్రేయ గతంలో ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయ్ ప్రభుత్వంలో 1999 నుంచి 2004 సంవత్సరాల మధ్య పట్ణణాభివృద్ధి, రైల్వేశాఖా మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్నారు. దత్తాత్రేయ పాతబస్తీలోని గౌలిగూడలో ఓ నిరుపేద కుటుంబంలో 1947 జూన్ 12 తేదిన జన్మించారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌లో ప్రవేశించిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ రాజకీయనేతగా స్థాయికి ఎదిగారు. 




Saturday, November 8, 2014

ఉత్తరాంధ్రలో రీ షెడ్యూల్‌ రుణాలపై ఏడాదిపాటు మారటోరియం

హైదరాబాద్‌, నవంబర్‌8; తుఫాన్‌ బాధిత ఉత్తరాంధ్రకు చేయూతకోసం బ్యాంకులు ముందుకొచ్చాయి.. ఇందుకు సంబంధించిన  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జారీచేసిన మార్గదర్శకాలపై హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో చర్చించారు. వీటిని బ్యాంకులన్నీ అమలు చేయాలని ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ దొరైస్వామి, ప్రెసిడెంట్‌ సీపీఆర్‌ రాజేంద్రన్‌, బ్యాంకు కంట్రోలింగ్‌ అధికారులకు చెప్పారు. ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు రుణాల రీషెడ్యూల్‌ సర్వసాధారణం కాగా, ప్రస్తుతం పరిశ్రమలకూ ఆర్థిక సహకారం అందించాలని  రిజర్వు  బ్యాంక్ నిర్దేశించడం విశేషం. దీని ప్రకారం.. అర్హతనుబట్టి కొత్త రుణాలు కూడా ఇస్తారు. ఇక ఏడాది మారటోరియం తర్వాత.. 3, 5, 7 సంవత్సరాల వరకు రైతులు బకాయిలు చెల్లించేలా కొన్ని విధానాలను బట్టి వెసులుబాటు కల్పిస్తారు. రైతులకు వర్తింపజేసే విఽధానాన్నే డ్వాక్రా బృందాలకూ అన్వయిస్తారు. ఆర్బీఐ ఆదేశాలను బ్యాంకర్లు వచ్చే ఏడాది జనవరి 12లోగా అమలు చేయాలని దొరైస్వామి తెలిపారు. జాబితా ఇచ్చే సమయంలో నష్టం 50 శాతం కంటే ఎక్కువని వారు ధ్రువీకరించాల్సి ఉంటుంద ని రాజేంద్రన్‌ అన్నారు. వ్యవసాయ రుణాలపై ఏపీ ప్రభుత్వం ఆధార్‌నూ అనుసంధానించాలని బ్యాంకులకు చెప్పారు. 

ఎ.పి. రాజధాని సరిహద్దులు ఖరారు...


హైదరాబాద్‌, నవంబర్‌ 8 : రైతులు తనపై నమ్మకముంచి రాజధాని నిర్మాణానికి సహకరించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం రాజధాని భూసమీకరణపై మంత్రివర్గ ఉప సంఘంతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణంలో మొదటి లబ్దిదారులు రైతులు, బడుగు బలహీన వర్గాల వారే అవుతారని స్పష్టం చేశారు. అందరికీ న్యాయం చేసే బాధ్యత తనది అని బాబు హామీ ఇచ్చారు. 
 రాజధాని నిర్మాణంలో ప్రతి పౌరుడి పాత్ర ఉండాలని, అందరికీ ఒకటే పాలసీ ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. భూమి ఎంత కావాలన్నది భవిష్యత్‌ నిర్ణయిస్తుందన్నారు. రైతులు, రైతు కూలీలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. రూ.వంద ఆదాయం వచ్చే వారికి రూ.1000 వచ్చేలా చేస్తామని, రాజధాని పరిధిలో ఇళ్లు లేని వారికి పక్కా ఇళ్లు నిర్మాస్తామని భరోసా ఇచ్చారు. 
 
 రాజధానికి భూములిచ్చే రైతులకు రూ.లక్షన్నర వరకు ఒకేసారి రుణమాఫీ చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. భూములమ్ముకునే రైతులకు ఆదాయపన్ను మినహాయింపుపై కేంద్రంతో చర్చిస్తామని తెలిపారు. ఏడాదిలో రైతులకు హక్కు పత్రం అందజేస్తామని బాబు చెప్పారు. తమకు వచ్చిన వాటాను అమ్ముకునే సౌకర్యాన్ని సైతం కల్పిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అలాగే ఏపీ రాజధాని సరిహద్దులను చంద్రబాబు వెల్లడించారు.
- తూర్పు : ఆటోనగర్‌ - ప్రకాశం బ్యారేజీ(10 కిలోమీటర్లు)
- పడమర : బోరుపాలెం రింగ్‌రోడ్డు(6 కిలోమీటర్లు)
- ఉత్తరం : బోరుపాలెం- ప్రకాశం బ్యారుజీ(18 కిలోమీటర్లు)
- దక్షిణం : ఆటోనగర్‌ 16 కిలోమీటర్లు రింగ్‌రోడ్డు వరకు ఉంటుందని చంద్రబాబు తెలిపారు.

కేంద్రమంత్రులుగా దత్తన్న, సుజనా...

.


న్యూఢిల్లీ ,నవంబర్ 8;  ఆదివారం జరుగనున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి, తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయకు మంత్రి పదవులు దక్కనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేసి ఈ విషయాన్ని ఇద్దరు ఎంపీలకు తెలియజేశారు. ఆదివారం న్యూఢిల్లీలో ఉండాలని ప్రధానమంత్రి కోరినట్టు సమాచారం. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎంపీ సీటును బీజేపీ కేవసం చేసుకుంది. సుజనా చౌదరి తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడిగా వుంటూ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక భూమికను నిర్వర్తిస్తున్నారు. అలాగే సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ ఎంపీగా గెలిచారు. బండారు దత్తాత్రేయకు కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ బీజేపీ వర్గాలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నాయి. అలాగే టీడీపీ - బీజేపీ స్నేహంలో భాగంగా తెలుగుదేశం పార్టీకి మరో మంత్రి పదవి దక్కుతోంది. బండారు దత్తాత్రేయ గతంలో రైల్వేశాఖ సహాయమంత్రిగా కూడా పని చేశారు 

Friday, November 7, 2014

టి. అసెంబ్లీ నుంచి దేశం సభ్యుల సస్పెన్షన్...



హైదరాబాద్‌, నవంబర్‌ 7 : తెలంగాణ అసెంబ్లీ నుంచి పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురయ్యారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రతిపాదించారు. దీంతో స్పీకర్‌ మధుసూదనాచారి పది మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి, సండ్ర, సాయన్న, ప్రకాష్‌గౌడ్‌, రాజేందర్‌రెడ్డి, మంచిరెడ్డి, అరికపూడి గాంధీ, కృష్ణారావు, మాగంటి గోపీనాథ్‌ సస్పెండ్‌ అయిన వారిలో ఉన్నారు. సభలో అనేక సార్లు గందరగోళ పరిస్థితులు నెలకొన్నపడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాట్లాడుతూ అన్ని సమస్యలపైనా మాట్లాడదామని అన్నారు. 

అంతకుముందు తెలుగుదేశం సభ్యుడు ఎర్రబెల్లి రైతుల ఆత్మహత్యలను ప్రస్తావిస్తూ మంత్రి పోచారం రైతు ఆత్మహత్యలపై హేళనగా మాట్లాడారని, అందుకు ఆయనను సభకు పిలిపించి క్షమాపణ చెప్పించాలని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత బడ్జెట్‌పైన చర్చిద్దామని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణాలో 370 మంది రైతులు మరణించారని, గజ్వేల్‌లో అత్యధిక సంఖ్యలో మృతి చెందారని ఆయన గుర్తు చేశారు. రైతు సమస్యల పైనా, కరెంటు సంక్షోభంపైనా చర్చించాల్సిందేనని ఆయన అన్నారు. తెలుగుదేశం సభ్యులు ఆయనకు మద్దతుగా నిలిచారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపడు బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపిన విషయాన్ని మర్చిపోయారా అని మంత్రి హరాష్‌రావు వ్యాఖ్యానించారు. దాంతో సభలో మరింత గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం సభ నిర్వహించాలనుకుంది, ప్రతిపక్షం మాత్రం సభను అడ్డుకోవడానికి వచ్చిందని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారని ఆయన అన్నారు.  


ప్రముఖ రచయిత్రి విశాలాక్షి కన్నుమూత

విశాఖపట్నం, నవంబర్ 7;  ప్రముఖ రచయిత్రి ద్వివేదుల  విశాలాక్షి విశాఖపట్నంలో కన్నుమూశారు. 1929 ఆగస్టు 19న విజయనగరంలో జన్మించిన ఆమె స్త్రీవాద రచయిత్రిగా తెలుగు సాహితీ లోకంలో పేరు గాంచారు . వైకుంఠపాళి, మారిన విలువలు, గ్రహణం విడిచింది వంటి నవలలు... ఆమె కోరిక, భావబంధం, ద్వివేదుల విశాలాక్షి కథలు... మలేషియా నాడు-నేడు వ్యాస సంపుటి తదితరాలు ఆమె రచనల్లో ప్రముఖమైనవి. సుమారు 200 పుస్తక సమీక్షలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ జ్యేష్ఠ సాహితీ అవార్డు, అడవిబాపిరాజు సాహితీ అవార్డు, రాజాలక్ష్మీ ఫౌండేషన్‌ సాహితీ అవార్డు, దిల్లీ తెలుగు అకాడమీ సాహిత్య పురస్కారం తదితరాలను పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డి. లిట్‌ పట్టాను పొందారు. 

Wednesday, November 5, 2014

లక్షా 637 కోట్లతో తెలంగాణ తొలి బడ్జెట్ ...

హైదరాబాద్ ,నవంబర్ 5; తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ ను అసెంబ్లీలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ లక్షా 637 కోట్లతోప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా బడ్జెట్ ను రూపొందించామని, ఇది కేవలం 10 నెలల బడ్జెట్ మాత్రమేనని వివరించారు. అమరుల సంక్షేమానికి రూ. 100 కోట్లు కేటాయించారు.  459 మంది అమరవీరులకు ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల పరిహారం అందించనున్నామని తెలిపారు. 
48648 కోట్ల ప్రణాళిక వ్యయాన్ని, 51989 కోట్ల రూపాయల ప్రణాళికేతర వ్యయాన్ని, 301 కోట్ల రెవెన్యూ మిగులు అంచనా, 17398 కోట్ల రూపాయల ఆర్దిక లోటును బడ్జెట్ లో ప్రతిపాదించారు . ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కోటిన్నర చొప్పున మొత్తం 234  కోట్లు కేటాయించారు . రాష్ట్ర సంక్షేమం కోసం రూ. 500 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు. సీఎం హామీలు, ప్రజా ప్రతినిధుల వినతుల కోసం ప్రత్యేక నిధి ని వెచ్చిస్తారు .వృద్ధులు, వితంతువులకు రూ. 1000, వికలాంగులకు రూ. 1500 ఫించన్లు ఇస్తున్నామని  ఆర్దిక మంత్రి ప్రకటించారు. చేనేత, బీడీ, గీత కార్మికుల పెన్షన్లు కూడా పెంచడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువుల ఫించన్ల కోసం రూ. 1315.77 కోట్లను, వికలాంగుల పెన్షన్ల కోసం రూ. 367.75 కోట్లను ఈ బడ్జెట్‌లో కేటాయించామని స్పష్టం చేశారు. ఫించన్లను నవంబర్ 8 నుంచి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. 
రహదారుల అభివృద్ధికి రూ.10వేల కోట్లు, మండల కేంద్రాల నుంచి జిల్లాలకు డబుల్ రోడ్లకు రూ.400 కోట్లు; విద్యుత్ రంగానికి మొత్తం రూ.3241 కోట్లు; 6, 000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కోసం జెన్ కోలో రూ.1000 కోట్ల పెట్టుబడి; 9, 000 చెరువుల అభివృద్ధికి రూ.2వేల కోట్ల కేటాయించారు. తెలంగాణలో దెబ్బతిన్న 45, 000 చెరువులను పునరుద్ధరణ; రైతులకు సోలార్ పంపు సెట్ల కోసం రూ.200 కోట్లు ప్రత్యేకించారు . 
  గృహ నిర్మాణానికి  రూ.1000 కోట్లు కేటాయించారు.

బీసీల సంక్షేమానికి రూ.2022 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి రూ.1030 కోట్లు; ఎస్సీల సబ్ ప్లాన్ కు రూ.7579 కోట్లు, ఎస్టీల సబ్ ప్లాన్ కు రూ.4559 కోట్లు; మహిళా శిశు సంక్షేమానికి రూ.221 కోట్లు, ఐసిడీఎస్ పథకానికి రూ.1103 కోట్లు; 2014-19 వరకు ఎస్సీల అభివృద్ధి కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వ లక్ష్యం; కళ్యాణ లక్ష్మీ (ఎస్సీ) పథకానికి రూ.150 కోట్లు, కళ్యాణ లక్ష్మీ (ఎస్టీ) పథకానికి రూ.80కోట్లు కేటాయించారు 

Monday, November 3, 2014

ఛత్తీస్‌గఢ్‌తో తెలంగాణ విద్యుత్ ఒప్పందం

ఛత్తీస్‌గడ్‌, నవంబర్‌ 3 : చత్తీస్‌గడ్‌ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సోమవారం ఆ రాష్ల్ర సీఎం రమణ్‌సింగ్‌తో సమావేశం అయ్యారు. వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. విద్యుత్‌ సరఫరాపై ఇరు రాషా్ట్రల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇరు రాషా్ట్రల ముఖ్యమంత్రులు రమణ్‌సింగ్‌, కేసీఆర్‌ల సమక్షంలో ఉన్నతాధికారులు ఎంవోయూపై సంతకాలు చేశారు. మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఇవ్వడానికి ఛత్తీస్‌గడ్‌ సీఎం రమణ్‌సింగ్‌ అంగీకారం తెలిపినట్లుగా తెలియవచ్చింది.

Sunday, November 2, 2014

కటక్ లో భారత్ శుభారంభం...


కటక్‌, నవంబర్ 2; rశ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 169 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 364 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక భారత బౌలర్ల విజృంభనతో 39.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది.టాస్‌ గెలిచిన శ్రీలంక భారత్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది.  ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌(113), రహానే(111) శతకాలతో రాణించారు  భారత్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 363 పరుగుల భారీ స్కోరు సాధించింది. శ్రీలంక బౌలర్లలో రణదేవ్‌ మూడు వికెట్లు తీసుకున్నాడు. .భారత బౌలర్లు ఆది నుంచి శ్రీలంక వికెట్ల వేట కొనసాగించారు. 31 పరుగుల వద్ద దిల్షాన్‌ను ఔట్‌ చేసి లంకేయులకు షాక్‌ ఇచ్చిన భారత బౌలర్లు 109 పరుగులకే నాలుగు కీలక వికెట్లు పడగొట్టిఆ జట్టును కోలుకోలేని దెబ్బ తీశారు. అయితే మధ్యలో జయవర్దనే(43) ఒంటరి పోరాటం చేసినా జట్టుకు భారీ స్కోరు ఇవ్వలేకపోయాడు. భారత బౌలర్లలో ఇషాంత్‌ శర్మ 4, ఉమేశ్‌ యాదవ్‌ 2, అక్షర్‌ పటేల్‌ 2, అశ్విన్‌, రైనా చెరో వికెట్‌ తీశారు.  

యూనివర్సల్‌ హెల్త్‌ ప్లాన్‌ పై కేంద్రం కసరత్తు ...

 న్యూఢిల్లీ, నవంబర్‌ 1: అమెరికాలో  మాదిరి యూనివర్సల్‌ హెల్త్‌ ప్లాన్‌ విధానాన్ని భారత్‌లో కూడా తీసుకురావాలని భావిస నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీని విధివిధానాలపై ఓ ప్రత్యేక కమిటీ పని చేస్తోంది. ఈ విధానం వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి శ్రీకారం చుట్టుకోనుంది. మార్చి 2019 నాటికి దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తరించనున్నారు. దేశవ్యాప్తం గా అమలుకు 1.6 లక్షల కోట్ల రూపాయల ఖర్చయ్యే ఈ పథకం కింద మం దులు ఉచితంగా ఇస్తారు. చికిత్సలు ఉచితంగా చేస్తారు. తీవ్రమైన వ్యాధుల విషయంలో బీమా కవరేజి కూడా ఉంటుంది. రాబోయే రోజుల్లో దేశంలోని అతి పెద్ద ఆరోగ్య పథ కం ఇదే కానుంది. నేషనల్‌ హెల్త్‌ అస్యూరెన్స్‌ మిషన్‌ కింద ఆరో గ్య బీమా పథకాన్ని దశలవారీగా 2015 ఏప్రిల్‌ నుంచి 2019 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ప్రజలందరికీ అమలు చేస్తారు. 


బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...