Sunday, November 14, 2010

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం లోని స్వగ్రామం మందలపర్రులో తుదిశ్వాస వదిలారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. శిమరామరాజుకు వారసులు లేకపోవడంతో తన ఆస్తులను దాన ధర్మాలకు ధారాదత్తం చేశారు.శివరామరాజు తన పేరిట ఉన్న 11 ఎకరాల భూమిలో 9 ఎకరాలను వివిధ దేవస్థానాలు, మిత్రులు, తెలుగుదేశం పార్టీకి రాసి ఇచ్చారు. బువ్వనపల్లి గ్రామంలో ఉన్న ఉమా మార్కెండేయస్వామి ఆలయానికి రెండెకరాల భూమి, పెనుమంట్ర మండలం పోలమూరు గ్రామంలోని ఉమామార్కండేయస్వామి ఆలయానికి ఒక ఎకరం భూమి, అత్తిలిలోని వల్లీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి ఒక ఎకరం  వితరణగా ఇచ్చారు.

No comments: