Thursday, January 28, 2016

హైదరాబాద్ తోనే వుంటా. ... చంద్రబాబు

హైదరాబాద్ ,జనవరి 28; టీడీపీతో తెలంగాణను ఎవరూ విడదీయలేరని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం పటాన్‌చెరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్‌లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చానని, దీనివల్ల 14 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. హైదరాబాద్‌ వల్ల తెలంగాణకు ఎక్కువ లాభం వచ్చిందని, ఔటర్‌ రింగురోడ్డు, మెట్రోరైలు ఘనత టీడీపీదేనని, 12 ఏళ్లయినా మెట్రో పనులు పూర్తి కాలేదని, అదే తాము మేము గెలిచి ఉంటే మూడేళ్లలో పూర్తిచేసే వాళ్లమన్నారు. అలాగే తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం ఎన్టీఆర్‌ తెచ్చారని, ఇప్పుడున్న నాయకులు ఎక్కడి నుంచి వచ్చారని, నన్ను విమర్శించే హక్కు వీరికి ఎక్కడిదని చంద్రబాబు ప్రశ్నించారు. అలాగే హైదరాబాద్‌లో అడుగడుగునా తాను చేసిన అభివృద్ధి ఉందని, నేను ఎక్కడికీ వెళ్లలేదు.. ఇక్కడే ఉంటా.. మీతోనే ఉంటా అని అన్నారు. తెలంగాణ సమస్యలపై కేంద్రంతో మాట్లాడుతూనే ఉన్నానని, తెలంగాణ రైతుల కోసం బాబ్లీపై పోరాడానని, నేను రాజీ పడ్డానని కాంగ్రెస్‌ వాళ్లు అంటున్నారని, ఇందిరా, రాజీవ్‌గాంధీ, సోనియాకే భయపడలేదని, నేను ఎవరికీ భయపడనని చంద్రబాబు ఉద్ఘాటించారు. అలాగే రాజకీయం వేరు.. ప్రభుత్వాలు వేరని, టీడీపీ ప్రజల పక్షానే ఉంటుందే తప్ప వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని, 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించడం సరికాదన్నారు. కేంద్రం సహకారం కావాలంటే టీడీపీ-బీజేపీని గెలిపించాలని చంద్రబాబు కోరారు.. తొలుత పటాన్‌చెరులో ప్రచారం నిర్వహించిన  చంద్ర బాబు అనంతరం బీరంగూడ, రామచంద్రాపురం, లింగంపల్లి మీదుగా చందానగర్ వరకు జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు.. 

బాబు ప్రచారం దండగ...మాదే పండగ...కె.సి.ఆర్.

హైదరాబాద్,జనవరి 28; గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేయ్యడానికి కోతల్లేని కరెంట్ చాలు అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోతే చిమ్మచీకట్లు కమ్ముకుంటాయని విష ప్రచారం చేశారు. 30 ఏళ్ల పాటు నెలకొన్న దుస్థితికి, విష ప్రచారాలకు తెరదించాం. ఇప్పుడు నగరంలో నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. గతంలో విద్యుత్ లేక పారిశ్రామికవేత్తలు ఇందిరాపార్క్ వద్ద ధర్నాలు చేసేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 
బాబు ప్రచారం దండగ ..... చంద్రబాబు హైదరాబాద్‌లో ప్రచారం చేయడం అసంబద్ధమని కేసీఆర్ అన్నారు. .. ఇప్పుడు చంద్రబాబుకు తెలంగాణతో ఏం పని? ఆయనకు విజయవాడలో బోలెడంత పని ఉంది. చంద్రబాబు పాలన గురించి చెప్పాలంటే హిందూపురం నుంచి ఇచ్చాపురం దాకా ఉంది. చంద్రబాబు ప్రచారం చేయడం వృథా ప్రయాస. అధికారంలో ఉన్నప్పుడు చేయలేని అభివృద్ధి ఏం చేస్తారు? బాబు, ఆయన మామ ఏం చేశారు హైదరాబాద్‌కు? అధికారంలో లేని వారు హైదరాబాద్‌కు ఏమి చేయరు. ఇంత చిన్న విషయం కూడా గుర్తించకుండా ప్రచారానికి రావడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి జరగకపోవడానికి టీడీపీ, కాంగ్రెస్సే కారణమని తెలిపారు. 
కొత్త  సచివాలయం ... జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కొత్త సచివాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రి టవర్స్‌కు రూపకల్పన జరుగుతుంది. హైదరాబాద్‌కు ఇరువైపులా మరో రెండు రైల్వే స్టేషన్లను నిర్మిస్తాం. ఎంజీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్లు సరిపోవడం లేదు. నగరానికి నాలుగు వైపులా కొత్త బస్టాండ్లను నిర్మిస్తాం. ఇక గుడిసెలో ఉండే వారికే కాకుండా.. కిరాయి ఇండ్లలో ఉండే వారికి డబుల్ బెడ్‌రూమ్స్ కట్టించి ఇస్తాం. గతంలో ఇందిరమ్మ ఇండ్లలో కుంభకోణం జరిగింది. తాము కట్టించే డబుల్ బెడ్‌రూమ్స్‌లో రాజకీయ జోక్యం ఉండదు అని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీలో రూ. 30 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. అత్యాధునిక టెక్నాలజీని సమకూర్చి పోలీసు శాఖను ఆధునీకరించామని చెప్పారు. ఆకతాయిల ఆగడాలను షీ టీమ్స్ ద్వారా ఆరికట్టగలిగామని తెలిపారు. 
480 వేల కోట్లతో సంక్షేమ పథకాలు ... రాష్ట్ర వ్యాప్తంగా రూ. 480 వేల కోట్లతో సంక్షేమ పథకాలు చేపడుతున్నామని సీఎం తెలిపారు. .నిరుపేదలందరికీ డబుల్ బెడ్‌రూమ్స్ కట్టించి ఇస్తాం. అర్హులందరికీ ఆసర పింఛన్లు, దళిత ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మీ, ముస్లిం యువతులకు షాదీముబారక్ ద్వారా వారి వివాహాలకు రూ. 51 వేలు ఇస్తున్నాం. హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నాం. 10 లక్షల మంది డ్రైవర్లకు బీమా కల్పించాలి. జీవో 58 కింద లక్ష మందికి పట్టాలిచ్చాం. జంటనగరాల అభివృద్ధికి రూ. 38 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని , ఆటోలకు రవాణా పన్ను మాఫీ చేశామని తెలిపారు.
విజ్ఞత తో వోటు ... గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గ్రేటర్ ప్రజలంతా పాల్గొనాలని సీఎం కేసీఆర్ కోరారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. జంట నగరాల ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనరు అనే అపవాదు ఉంది. ఈ అపవాదును జంటనగరాలు పారద్రోలాలి. ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యస్ఫూర్తిని, విజ్ఞతను ప్రదర్శించాలి. గ్రేటర్ ప్రజలంతా ఓటింగ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీల్లో తెలంగాణలో ఒక్కటీ లేదని ముఖ్యమంత్రి అన్నారు. దీనికి వెంకయ్య ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పక్షపాత వైఖరికి కూడా హద్దు ఉండాలన్నారు. గ్రేటర్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయమైందని కేసీఆర్ స్పష్టం చేశారు. గ్రేటర్‌లో అతి పెద్ద పార్టీగా టీఆర్‌ఎస్ ఆవిర్భవిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్ తమ మిత్ర పక్షమేనని అన్నారు. 


తొలి జాబితాలో తెలంగాణకు దక్కని స్మార్ట్ సిటీ ... ఆంధ్ర నుంచి విశాఖ, కాకినాడ

న్యూఢిల్లీ,జనవరి 28; కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు గురువారం స్మార్ట్‌ సిటీల జాబితాను ప్రకటించారు. తొలి దశలో 20 స్మార్ట్‌ సిటీలను ఆయన ప్రకటించారు. ఇందులో తెలంగాణకు స్థానం దక్కలేదు.  ఆంధ్రప్రదేశ్‌ నుంచి విశాఖ, కాకినాడ ఎంపిక అయ్యాయి. స్మార్ట్‌ సిటీలకు రూ. 3 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు వెంకయ్య  వెల్లడించారు. స్మార్ట్‌సిటీల ఎంపికలో పారదర్శకత పాటించామని ఆయన పేర్కొన్నారు. స్మార్ట్‌ సిటీలతో నగరాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.  ఇవే స్మార్ట్‌ సిటీలు : న్యూఢిల్లీ, చెన్నై, కోయంబత్తూర్, కొచ్చి, పుణె, జైపూర్‌, ‌జబల్‌పూర్, దావణగేరి, సూరత్, అహ్మదాబాద్‌, షోలాపూర్‌, లూధియానా, భోపాల్‌, భువనేశ్వర్, గువహటి, బెల్గాం, ఇండోర్, ఉధంపూర్‌, విశాఖ, కాకినాడ.  


Monday, January 25, 2016

భోగాపురం ఎయిర్ పోర్ట్ కు బ్రేక్ ...

హైదరాబాద్,జనవరి 25; భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణపై హైకోర్టు స్టే విధించింది. భూ సేకరణకు వ్యతిరేకంగా 12 గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు స్టే విధించింది. దీంతో జిల్లా కలెక్టర్ ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ నిలిచిపోయింది
 భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం రెండేళ్ల క్రితం  5,315 ఎకరాల భూమి కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి వ్యతిరేకంగా.. అప్పటి నుంచి  అక్కడి పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన  సాగిస్తున్నారు ప్రభుత్వం భూ సేకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీసిందంటూ ఆరోపించారు. భోగాపురానికి కేవలం45 కిలో మీటర్ల దూరంలో విశాఖ ఎయిర్ పోర్టు ఉండగా.. భోగాపురం ఎయిర్ పోర్టు దేనికని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్టు లండన్ హిత్రూ కేవలం 3వేల ఎకరాలు కాగా.. భోగాపురం ఎయిర్ పోర్టుకు 5వేలకు పైగా ఎకరాల స్థలం ఎందుకని నిలదీశారు . 



రామోజీ, రజనీలకు పద్మవిభూషణ్.... రాజమౌళికి పద్మ శ్రీ

న్యూఢిల్లీ, జనవరి 25: 2016 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను  ప్రకటించింది . పలువురు ప్రముఖులకు ఈ అవార్డులు దక్కాయి. తెలుగు వారిలో పత్రికా రంగ ప్రముఖుడు  రామోజీరావుకి పద్మవిభూషణ్ అవార్డు వరించింది. పత్రికా రంగంలో ఎనలేని కృషి చేసినందుకు గాను ఆయనకు ఈ అవార్డు అందించారు. ఇంకా తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కు కూడా పద్మవిభూషణ్ అవార్డు దక్కింది. వీరితోపాటు నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి, ధీరూబాయ్ అంబానీ(మరణానంతరం), సంగీత విద్వాంసురాలు గిరిజాదేవి, శ్రీశ్రీ రవిశంకర్, జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్, విశ్వనాథన్ శాంత, డా. వాసుదేవ్ కులకుంటె ఆత్రే, అవినాశ్ దీక్షిత్(భారత సంతతి)లకు పద్మ విభూషణ్  అవార్డు వరించింది. . 

పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు 

సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా, టెన్నిస్ క్రీడాకారిణి యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఉదిత్ నారాయణన్ వినోద్ రాయ్(మాజీ కాగ్) హేస్నమ్ కన్హయిలాల్ ఎన్ఎస్ రామనుజ తాతాచార్య బరిందర్ సింగ్ హమ్దర్ద్ డి. నాగేశ్వర్ రెడ్డి స్వామి తేజోమయానంద రాబర్ట్ డి బ్లాక్విల్(భారత యూఎస్ మాజీ అంబాసిడర్) ఇందూ జైన్ రవిచంద్ర భార్గవ రాం వి సుతార్ హఫీజ్ కాంట్రాక్టర్ వెంకట్ రామారావు ఆళ్ల బ్రిజేందర్ సింద్ 

రాజమౌళికి పద్మ శ్రీ అవార్డ్ 

ఉజ్వల్ నికమ్(సీనియర్ లాయర్) అజయ్ దేవగన్, బాలీవుడ్ నటుడు ప్రియాంక చోప్రా, బాలీవుడ్ నటి ఎస్ఎస్ రాజమౌళి(బాహుబలి దర్శకుడు) మాళిని అవాస్థి, భోజ్పురి గాయని ప్రెడ్రగ్ కె నికిక్(యోగా-సైబీరియా) హూయి లాన్ ఝాంగ్(యోగా-చైనా)

అమెరికాలో సాధారణ స్థితికి చేరని జనజీవనం

వాషింగ్టన్‌ ,జనవరి  25; అమెరికా తూర్పు తీరాన్ని మంచు తుఫాన్‌ తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ సీజన్‌లో మంచు తుఫాన్‌లు రావడం సాధారణమయినప్పటికి  ఈ ఏడాది తుఫాన్‌ తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం సమస్యలు సృష్టిస్తోంది. రోడ్డు రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. తుఫాన్‌ ప్రభావం తగ్గినప్పటికీ జనజీవనం సాధారణ స్థితికి చేరుకోడానికి రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. వాషింగ్టన్‌, న్యూయార్క్‌, ఫిలడెల్పియా వంటి నగరాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పరిస్థితులు అనుకూలిస్తే మంగళవారం పాఠశాలలు తెరుస్తారు. 


Monday, January 18, 2016

మార్చినాటికి 1000 పోస్టల్‌ ఏటీఎంలు

హైదరాబాద్ ,జనవరి  18;: పోస్టల్‌ శాఖ భారీ విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కోర్‌ బ్యాంకింగ్‌ సిస్టమ్‌లో భాగంగా మార్చినాటికి 25,000 డిపార్ట్‌మెంట్‌ పోస్ట్‌ఆఫీసులు, 1000 ఏటీఎంలను ప్రారంభిస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే 12,441 పోస్టాఫీసులు, 300 ఏటీఎంలను సీబీఎస్‌లో నమోదు చేసుకుంది. సీబీఎస్‌ నెట్‌వర్క్‌లో భాగంగా కస్టమర్లు  తమ ఖాతాలను దేశంలో ఎక్కడి నుంచైనా నిర్వహించుకోవచ్చు. 

పీఎస్‌ఎల్‌వీ-31 రాకెట్‌ కౌంట్‌డౌన్‌...

హైదరాబాద్‌,జనవరి  18;  నావిగేషన్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. ఈనెల 20 ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు శ్రీహరికోటలోని షార్‌ కేంద్రంలో సోమవారం ఉదయం 9.31 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం  అయింది 48 గంటల కౌంట్‌డౌన్‌ తర్వాత పీఎస్‌ఎల్‌వీ-31 వాహననౌక ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లి కక్ష్యలో ప్రవేశపెడుతుంది. 

Friday, January 15, 2016

45 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్టు ..

హైదరాబాద్‌,జనవరి 15; జీహెచ్‌ఎంసీ ఎన్నికల కు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 45 మంది అభ్యర్థులతో తొలి జాబితాను మీడియాకు వెల్లడించారు. కాంగ్రెస్‌ అభ్యర్థులు ... కాప్రా- గూడ ఇంద్రయ్య హబ్సిగూడ- పసుల మంజుల హయత్‌నగర్‌-ఎం.చంద్రశేఖర్‌రావు నాగోలు- పోలేపల్లి వనజ సైదాబాద్‌- కె.అరుణారెడ్డి దూద్‌బౌళి-మీరాజ్‌ మహ్మద్‌ మంగళ్‌హాట్‌-సుబేదార్‌ అంజురాణి దత్తాత్రేయనగర్‌- ఎం. రమేశ్‌కుమార్‌ షేక్‌పేట్‌- ఆత్మకూరి సుధాకర్‌ ఎర్రగడ్డ-నౌసిన్‌బేగం సూరారం- అబ్దుల్‌ ఆసిఫ్‌ చైతన్యపురి-గూడూరి నరేంద్రరెడ్డి బోరబండ-ఉడతలపల్లి పోచయ్యగౌడ్‌ కొండాపూర్‌- ఉట్ల కృష్ణ రెహమత్‌నగర్‌-బండ్రచంద్రమ్మ వెంగళ్రావునగర్‌-దేవిరెడ్డి నాగార్జునరెడ్డి కూకట్‌పల్లి- కూన అమరేశ్‌గౌడ్‌ బౌద్ధానగర్‌-ఆజాం ఉమాదేవి తార్నాక-బండ కార్తీకరెడ్డి మల్కాజ్‌గిరి-జి.డి.శ్రీనివాస్‌గౌడ్‌ మౌలాలి-పూలపల్లి పద్మావతి యాదవ్‌ నేరేడ్‌మెట్‌- మరియమ్మ ఐపే మచ్చ బొల్లారం-ఎంవీ సూర్యకిరణ్‌ జీడిమెట్ల-డి.పల్లవి దూద్‌బౌళి- మీరాజ్‌ మహ్మద్‌ సైదాబాద్‌-కె.అరుణారెడ్డి కుత్బుల్లాపూర్‌-ఇందుకూరి సూర్యప్రభ సుభాష్‌నగర్‌-ఆర్‌.లక్ష్మీదేవి చందానగర్‌- గంపల అనిత చింతల్‌- బండి సుగుణ సూరారం- అబ్దుల్‌ అరీఫ్‌ మంగళ్‌హాట్‌- సుబేదార్‌ అంజురాణి భోలక్‌పూర్‌-వాదిజ్‌ హుస్సేన్‌ షేక్‌పేట్‌- ఆత్మకూరి సుధాకర్‌ యూసఫ్‌గూడ- అప్పాల సురేంద్రయాదవ్‌ రంగారెడ్డినగర్‌- వల్లెపు కృష్ణ జగద్గిరిగుట్ట- అత్తారి మారయ్య వినాయక్‌నగర్‌- ఎం.కృష్ణవేణి 

ప్రాణాలు తీసిన పతంగులు

హైదరాబాద్ ,జనవరి 15;  సంక్రాంతి పండుగ సందర్భంగా  పతంగులు ఎగురవేస్తూ నగరం లోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు. గుడిమల్కాపూర్‌లో కైట్ ఎగురవేస్తున్న ఓ బాలుడు భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ముషీరాబాద్‌లో పతంగు ఎగురవేస్తుండా విద్యుత్ షాక్ కొట్టి యువకుడు మృతి చెందాడు. వీరి కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

కాంగ్రెస్ లో మహ్మద్ రఫీ కొడుకు ...

ముంబై, జనవరి 15; ప్రముఖ బాలీవుడ్ గాయకుడు  మహ్మద్  రఫీ కొడుకు   కాంగ్రెస్ తీర్థంపుచ్చుకున్నారు.  రఫీ కుమారుడు షాహిద్  మొహమ్మద్ రఫీ(52) .  కాంగ్రెస్  పార్టీ ఉపాధ్యక్షుడు  రాహుల్ గాంధీ    సమక్షంలో  కాంగ్రెస్ లో చేరారు.   రాహుల్  ఆయనకు  కాంగ్రెస్ కండువా కప్పి  పార్టీలోకి ఆహ్వానించారు.షాహిద్ రఫీ ఇంతకుముందు ముంబై లో   ముస్లింలు అధిక సంఖ్య లో ఉన్న ముంబాదేవి నియోజకవర్గంనుంచి ఎఐఎంఐఎం  తరపున ఎమ్మేల్యేగా    పోటీ చేసి ఓడిపోయారు. 

బ్రిస్బేన్ లోను అదే వరస..చెత్త ఫీల్డింగ్ తో గెలుపును చేజార్చుకున్న భారత్

బ్రిస్బేన్ ,జనవరి 15; ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌కు రెండో వన్డేలో కూడా ఓటమి తప్పలేదు. బ్రిస్బేన్‌ వేదికగా శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ జట్టులో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (124: 127 బంతుల్లో 11×4, 3×6) అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ శతకం బాదడంతో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనను ధాటిగా ఆరంభించిన ఆస్ట్రేలియా ఓపెనర్లు అరోన్‌ ఫించ్‌ (71: 81 బంతుల్లో 7×4, 1×6), మిచెల్‌ మార్ష్‌ (71: 81 బంతుల్లో 5×4) భారత్‌ ఫీల్డర్ల తప్పిదాలను సొమ్ము చేసుకుని తొలి వికెట్‌కు 24.5 ఓవర్లలో ఏకంగా 145 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి బాటలు వేశారు. వీరి ఔట్‌ అనంతరం స్టీవ్‌ స్మిత్‌ (49), జార్జ్‌ బెయిలీ (76 నాటౌట్‌), మాక్స్‌వెల్‌(26 నాటౌట్‌) కూడా బ్యాట్‌ ఝళిపించడంతో ఆసీస్‌ మరో 6 బంతులు మిగిలి ఉండగానే 3 మూడు వికెట్లు కోల్పోయి 309 పరుగులతో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఐదు వన్డేల సిరీస్‌లో ఆసీస్‌ 2-0తో ఆధిక్యం సాధించింది. మూడో వన్డే మెల్‌బోర్న్‌ వేదికగా జనవరి 17న జరుగు తుంది 

60 మందితో టి.ఆర్.ఎస్. తొలి జాబితా

హైదరాబాద్ ,జనవరి 15;  గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్ తొలి జాబితా విడుదలైంది. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ నేత కె. కేశవరావు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తొలి జాబితాలో 60 మందికి అవకాశం కల్పించారు. ఇందులో.. 24 మంది బీసీలు, 5 మంది ఎస్సీలు, 16 మంది మైనార్టీలు, 15 మంది జనరల్ అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని తెలిపారు. డివిజన్ల వారీగా అభిప్రాయాలను సేకరించి అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. బలాబలాల మీద రెండుసార్లు సర్వే జరిపించామని పేర్కొన్నారు.
తెరాస అభ్యర్థులు వీరే... మీర్‌పేట్‌: గొల్లూరి అంజయ్య హబ్సిగూడ: బేతి స్వప్న సుభాష్‌రెడ్డి సైదాబాద్‌: సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి సోమాజిగూడ: అట్లూరి విజయలక్ష్మి గచ్చిబౌలి: సాయిబాబా గాంధీనగర్‌: జి.పద్మనగేష్‌ కూర్మగూడ: కూసూరు పూజ అఖిల్‌ యాదవ్‌ ఘన్సిబజార్‌: మహాదేవి ముషీరాబాద్‌: ఎడ్ల భాగ్యలక్ష్మియాదవ్‌ శేరిలింగంపల్లి: రాగం నాగేందర్‌ యాదవ్‌ కొండాపూర్‌: హమీద్‌పటేల్‌ చైతన్యపురి: జి.విఠల్‌రెడ్డి అమీర్‌పేట: ఎం.కేశకుమారి సనత్‌నగర్‌: కొలను లక్ష్మీపాల్‌రెడ్డి బాలానగర్‌: నరేంద్రాచారి కేపీహెచ్‌బీ కాలనీ: అడుసుమిల్లి వెంకటేశ్వరరావు అడ్డగుట్ట: విజయకుమారి ఎర్రగడ్డ: అన్నపూర్ణ కాప్రా: స్వర్ణరాజు శివమణి ఎ.ఎస్‌.రావునగర్‌: పావనిరెడ్డి యూసఫ్‌గూడ: బి.సంజయ్‌గౌడ్‌ జీడిమెట్ల: కె.ఎం. పద్మ ప్రతాప్‌గౌడ్‌ అల్వాల్‌: చింతల విజయశాంతిరెడ్డి గోల్నాక: కాలేరు జయశ్రీ చైతన్యపురి: జి.విఠల్‌రెడ్డి తార్నాక: ఆలకుంట సరస్వతి హరి బౌద్ధనగర్‌: బైరగోని ధనుంజయ దయానంద్‌గౌడ్‌ అజంపురా: సిద్దా లక్ష్మి ఓల్డ్‌ మలక్‌పేట: ఎస్‌.భువనేశ్వరి చావ్‌నీ: మహమ్మద్‌ ఖలీమ్‌ బోరబండ: బాబా షంషుద్దీన్‌ రహమత్‌నగర్‌ : మహ్మద్‌ అబ్దుల్‌ షఫీ గుడిమల్కాపూర్‌: బంగారు ప్రకాశ్‌ అల్లాపూర్‌: సరియాబేగం ముసారాంబాగ్‌: తీగల సునరితారెడ్డి ఉప్పుగూడ: ఆకుల శీనయ్య డబీర్‌పురా: అబ్దుల్‌ ఇషాన్‌ మోండామార్కెట్‌: ఆకుల రూపా హరికృష్ణ పురాణపూల్‌: మల్లికార్జున యాదవ్‌ చంద్రాయణగుట్ట: రాజేంద్రకుమార్‌ఉప్పల్‌: హన్మంత్‌రెడ్డి సైదాబాద్‌: సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి మన్సూరాబాద్‌: కొప్పుల విఠల్‌రెడ్డి భోలక్‌పూర్‌- రెబ్బ రామారావు బన్సీలాల్‌పేట: కుర్మ హేమలత జియాగూడ: ఐనందల కృష్ణ ఎర్రగడ్డ: కంజర్ల అన్నపూర్ణ సదాశివయాదవ్‌ రామ్‌గోపాల్‌పేట: అత్తెల్లి అరుణగౌడ్‌ అజంపురా: సిద్దా లక్ష్మి సంతోష్‌నగర్‌: మహమ్మద్‌ అక్రముద్దీన్‌ రెయిన్‌బజార్‌: మహమ్మద్‌ ఐజాజ్‌ శాలిబండ: మహ్మద్‌ అన్వర్‌ మొఘల్‌పురా: పి.వీరమణి నవాబ్‌ సాహెబ్‌కుంట: ఫర్హాత్‌ సుల్తానా జహానుమా: గులాం నబీ గౌలిపురా: కె.మీనా ఐఎస్‌ సదన్‌: సామా స్వప్న సుందర్‌రెడ్డి కిషన్‌బాగ్‌: షకీల్‌ అహ్మద్‌ రామ్నాస్‌పురా: మహ్మద్‌ అజాం పాషా గాంధీనగర్‌: ముత్తా పద్మా నరేష్‌ తలాబ్‌ చంచలమ్‌: నుజాహత్‌ ఫాతిమా చావ్‌నీ- మహ్మద్‌ ఖలీమ్‌ గాంధీ నగర్‌: ముత్తా పద్మా నరేష్‌ రియాసత్‌నగర్‌: మహ్మద్‌ యూసఫ్‌ అడ్డగుట్ట: ఎస్‌.విజయకుమారి కాచిగూడ: చైతన్య కన్న యాదవ్‌ 


బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...