తెలుగుదేశం పార్టీ మహానాడు వాయిదా
ఉప ఎన్నికల ఎఫెక్ట్హైదరాబాద్ ,మే 4: తెలుగుదేశం పార్టీ మహానాడుపై ఉప ఎన్నికల ప్రభావం పడింది. మహానాడును ఉప ఎన్నికలు అయిన తర్వాతనే నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పొలిట్‌బ్యూరో నిర్ణయం తీసుకుంది. పోలిట్‌బ్యూరో సమావేశానికి పలువురు సీనియర్లు గైర్హాజరయ్యారు. పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సమావేశానికి హాజరు కాలేదు. తనకు సభ్యత్వం లేనందున తాను హాజరు కాలేదని ఆయన అన్నారు. కాగా ఉమ్మారెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫోరం నేత, సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు, ఉప్పులేటి కల్పన పోలిట్ బ్యూరో భేటీకి గైర్హాజరయ్యారు. విజయవాడలో దమ్ము ఎఫెక్ట్ కారణంగా హరికృష్ణ, పరకాల ఉప ఎన్నికలు ఉండటంతో ఎర్రబెల్లి, విదేశీ పర్యటనలో ఉండటంతో కల్పన హాజరు కాలేదని తెలుస్తోంది.
Comments