Saturday, June 30, 2012

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలోని నాగార్జున అగ్రికెమ్ పరిశ్రమలో శనివారం రెండు రియాక్టర్లు పేలిన దృశ్యం... ఈ ప్రమాదంలో 18మంది తీవ్రంగా గాయపడ్డారు.

Friday, June 29, 2012

ఎడ్డీ వర్గం మంత్రుల రాజీనామా...

సంక్షేభంలో కర్ణాటకం... 
బెంగళూరు,జూన్ 29: మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప మద్దతుదారులు ఎనిమిది మంది మంత్రుల రాజీనామాతో కర్నాటక ప్రభుత్వం తాజాగా సంక్షోభంలో కూరుకుపోయింది. ముఖ్యమంత్రి డీవీ సదానంద గౌడను పదవి నుంచి వెంటనే తొలగించాలని రాజీనామా సమర్పించిన మంత్రులు బీజేపీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. హై కమాండ్ నిర్ణయం కోసం ఇన్నాళ్లు ఎదురు చూశామని.. ఇక ఎక్కువ కాలం వేచి చూసే అవకాశం లేదని.. అందుకే రాజీనామా సమర్పించామని వారు మీడియాతో అన్నారు. ఎనిమిది మంది మంత్రులు ముఖ్యమంత్రికి రాజీనామా లేఖను సమర్పించామని మంత్రి సీఎం ఉదాసీ తెలిపారు.

అవును...సమయమొచ్చింది...

 తెలంగాణా నిర్ణయంపై చిదంబరం 
న్యూఢిల్లీ ,జూన్ 29:   తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం శుక్రవారం చెప్పారు.  తెలంగాణపై  వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోందని చెప్పారు.  కానీ ఖచ్చితమైన టైమ్ లిమిట్ మాత్రం ఏదీ లేదని చెప్పారు.. తనను కలిసిన తెలంగాణ ప్రజా ప్రతినిధులకు కూడా తాను ఇదే విషయాన్ని చెప్పానని తెలిపారు. తనను కలిసిన ఆంధ్ర ప్రదేశ్ నాయకులు తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారని చెప్పారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.  కాంగ్రెసు పార్టీతో పాటు నిర్ణయం చెప్పని మిగతా పార్టీలు కూడా తమ నిర్ణయాన్ని చెప్పాల్సి ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5.99 శాతం డీఏ

హైదరాబాద్ ,జూన్ 29:   రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 5.99 శాతం పెంచుతూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. శుక్రవారం  జరిగిన మంత్రి మండలి సమావేశంలో నూతన ఎక్సైజ్ పాలసీకి ఆమోదం తెలిపారు. కొత్త భూ కేటాయింపు విధానాన్ని కూడా ఆమోదించారు. కాగా, ఈ సమావేశంలో ఎతువంటి రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాలేదు.

ఎంసెట్ ఫలితాల విడుదల; జులైలో కౌన్సెలింగ్

హైదరాబాద్ ,జూన్ 29:  ఎంసెట్ - 2012 ఫలితాలను ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు.  ఎంసెట్ ఇంజనీరింగ్, మెడిసిన్ విభాగాల్లో తొలి పది టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలను కూడా వెల్లడించారు. ఇంజనీర్ విభాగంలో 73.18 శాతం అభ్యర్థులు అర్హత సాధించగా, మెడిసిన్ విభాగంలో 88.57 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. ఎంసెట్‌కు సంబందించి మార్కులతో పాటు ర్యాంకుల వివరాలను కూడా అందించారు. ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి జులైలో కౌన్సెలింగ్ జరుగుతుందని, ఆగస్టులో తరగతులు ప్రారంభమవుతాయని దామోదర రాజనర్సింహ చెప్పారు. మెడిసిన్ విభాగం టాప్ పది ర్యాంకర్లలో బాలురు పది మంది ఉన్నారు. ఇంజనీరింగ్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన నితీష్ చంద్ర  149 మార్కులతో  ఫస్ట్ ర్యాంకు సాధించాడు. మెడిసిన్ విభాగంలో హైదరాబాదుకు చెందిన రెడ్డి విజయకేతన్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు.
ఇంజనీరింగ్ విభాగంలో టాప్ ర్యాంకర్లు
1. చింతా నితీష్ చంద్ర - 149 (రంగారెడ్డి జిల్లా)
2. ఎవిబి మనోజ్ కుమార్ - 148 (విశాఖపట్నం)
3. నల్లమిల్లి రూపేష్ - 147 (విజయవాడ)
4. ధీరజ్ రెడ్డి - 146 (హైదరాబాద్)
5. సాయికుమార్ రెడ్డి - 146 (విజయవాడ)
6. మంద మకరందు - 146 (విజయవాడ)
7. ప్రభాకర్ వరణ్ - 146 (విజయవాడ)
8. ఆకుల శ్రీనితీష్ - 144 (విజయవాడ)
9. అనీలా యాదవ్ - 144 (నిజామాబాద్)
10. సుష్మ - 143 (విశాఖపట్నం
మెడిసిన్ విభాగంలో టాప్ ర్యాంకర్లు
1. రెడ్డి విజయకేతన్ - 155 మార్కులు (హైదరాబాద్)
2. సుంకర లోకేంద్ర పవన్ కుమార్ - 154 (విజయవాడ)
3. డివిఆర్ సాయి - 153 (ప్రకాశం జిల్లా)
4. కె. నరేష్ బాబు - 152 (వరంగల్)
5. దాసరి ఉత్తేజ్ - 152 (విజయవాడ)
6. బొబ్బిలి సవ్యసాచి - 152 (విజయవాడ)
7. భరద్వాజ - 152 (నెల్లూరు)
9. కె అక్షయ్ - 152 (హైదరాబాద్)
10. గడ్డం వినూత్న - 152 (రంగారెడ్డి జిల్లా)

కుప్పగా పసికుసుమాలు...

పాలమూరులో కలకలం 
మహబూబ్‌నగర్,జూన్ 29: : మహబూబ్‌నగర్ జిల్లా పెద్దచెరువుగట్టు ప్రాంతంలో శుక్రవారం ఉదయం తొమ్మిది మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఆరుగురు చిన్నారులతోపాటు మరో ముగ్గురున్నారు. కాగా మృతులు ఎవరనే  విషయం ఇంకా తెలియరాలేదు. వీరిని హత్యచేశారా..లేక ప్రయోగాల నిమిత్తం ఈ మృతదేహాల్ని వాడి పడేశారా అన్నది తేలాల్సి ఉంది. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Thursday, June 28, 2012

జగన్ బెయిల్ పై హైకోర్టు. తీర్పు జులై 4కి వాయిదా

హైదరాబాద్:జూన్ 28: అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బెయిల్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది. జగన్ తరఫున ప్రముఖ న్యాయవాది రాం జెత్మలానీ వాదించగా, సిబిఐ తరఫున అశోక్ భాను వాదించారు.

రాష్ట్రపతి పదవికి గురువారం నామినేషన్లు వేసిన యు.పి.ఎ. అభ్యర్ధి ప్రణబ్, ఎన్.డి.ఎ. అభ్యర్థి సంగ్మా...

Wednesday, June 27, 2012

అమెరికాలో బెంగళూర్‌ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

బెంగళూర్,జూన్ 27:  బెంగళూర్‌కు చెందిన 26 ఏళ్ల  పవన్ కుమార్ అంజయ్య అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అమెరికాలో మరణించాడు. కంపెనీ అసైన్‌మెంట్‌పై అమెరికా వెళ్లిన ఈ సాఫ్త్ట్‌ వేర్ ఇంజనీర్ న్యూజెర్సీలోని హోటల్ గదిలో గత వారం ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఓ అమెరికా మహిళ హత్య కేసులో అతను నిందితుడు కూడా. కాగ్నిజెంట్‌లో పనిచేస్తున్న  అంజయ్య  మత్తుపదార్థాలను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల మరణించినట్లు అనుమానిస్తున్నారు. కాగా, డానిల్లే మెహమాన్ అనే 26 ఏళ్ల టీచర్, నాలుగేళ్ల బాలుడి తల్లి హత్య కేసులో పోలీసులు పవన్ కోసం ఇప్పటి వరకు గాలిస్తున్నారు.  డెలవర్ లోని దేవెయ్ బీచ్ హోటల్ గదిలో ఆమె శవం జూన్ 18వ తేదీన కనిపించింది. ఆమె శరీరంపై పలు గాయాలున్నాయి. ఆమెతో పవన్ గడిపినట్టు  పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్  వచ్చే వారం బెంగళూర్ తిరిగి రావాల్సి ఉంది.

Tuesday, June 26, 2012

సరబ్ జిత్ సింగ్ ఉరిశిక్ష రద్దు

ఇస్లామాబాద్ ,,జూన్ 26:  20 సంవత్సరాల క్రితం బాంబు దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఇక్కడ జైలులో ఉంటున్నసరబ్ జిత్ సింగ్ ఉరిశిక్షను పాకిస్తాన్ అధ్యక్షుడు జర్దారీ  జీవిత ఖైదుగా మార్చారు.  ఉరి శిక్షని జీవిత కాలశిక్షగా మార్చడంతో ఇప్పటికే 14 ఏళ్లు దాటి జైలులో ఉంటున్న అతనిని త్వరలో విడుదల చేస్తారు.ఈ వార్త తో  పంజాబ్ లోని సరబ్ జిత్ సింగ్ కుటుంబ సభ్యులలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి.

మన్మోహన్ చేతిలోనే ఫైనాన్స్...

న్యూఢిల్లీ,,జూన్ 26:  రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ కూటమి అభ్యర్థిగా ఎంపికైన ప్రణబ్ ముఖర్జీ రాజీనామా సమర్పించడంతో అయన నిర్వహిస్తున్న ఆర్ధిక శాఖను తన వద్దే ఉంచుకోవాలని దేప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయించారు.  కాగ,  ఆర్ధిక శాఖ సహాయమంత్రులుగా  ఎస్‌ఎస్ పలనిమనిక్కమ్, నామో నారాయణ మీనా కొనసాగుతారు. 1991 సంవత్సరంలో పీవీ నర్సింహరావు ప్రధానిగా ఉన్న కాలంలో ఆర్ధిక శాస్త్రవేత్త అయిన మన్మోహన్ కేంద్ర ఆర్ధికమంత్రిగా పలు ఆర్ధిక సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ధిక వృద్ధి రేటు 6.5 శాతానికి పతనమై.. తొమ్మిదేళ్ల కనిష్టస్థాయికి చేరుకోవడం.. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 57.97 స్థాయిని నమోదు చేసి చారిత్రక కనిష్టానికి చేరుకోవడంతో  ఒక సవాల్ గా మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిత్వ శాఖను తన వద్దే ఉంచుకోవాలని నిర్ణయం తీసుకోవడం విశేషం.

కేంద్రమంత్రి పదవికి వీరభద్ర సింగ్ రాజీనామా

న్యూఢిల్లీ,,జూన్ 26:  కేంద్రమంత్రి పదవికి వీరభద్ర సింగ్ మంగళవారం రాజీనామా చేశారు. వీరభద్ర సింగ్ పైన అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామా కోసం విపక్షాల నుండి తీవ్ర ఒత్తిడి వచ్చింది. తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు పంపించారు. . తాను యాభై ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నానని చెప్పారు. కేంద్రానికి చెడ్డ పేరు రాకూడదనే  తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన నిజాయితీని నిరూపించుకునేందుకే రాజీనామా చేసినట్లు చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయపరంగా పోరాటం చేస్తానన్నారు. తనపై ఆరోపణల కోసం చూపిన ఆధారాలు అన్ని కల్పితమైనవని చెప్పారు. సిడి ప్రామాణికాబద్దమైనది కాదన్నారు. సిడిలోని వాయిస్‌ తనది కాదన్నారు. ప్రస్తుతం లఘు, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్న వీరభద్ర సింగ్ 1989లో హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విషయంలో కొందరు పారిశ్రామికవేత్తలతోపాటు ఐఎఎస్ అధికారి మహిందర్ లాల్‌తో లంచం, ఇతర అవినీతి పరమైన లావాదేవీలపై  జరిపిన సంభాషణలు రికార్డైయ్యాయి.  వీరభద్ర సింగ్, ఆయన భార్యపై కుట్ర, అవినీతి సంబంధించిన కేసులు నమోదు చేయాలని సిమ్లాలోని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల క్రిందట జరిగిన ఈ వ్యవహారంలో మంత్రి, ఆయన భార్య ప్రతిభాసింగ్‌ల నేరాలకు కచ్ఛితమైన సాక్ష్యాధారాలు లభించిన నేపథ్యంలో ఐపిసి సెక్షన్ 120 బి(కుట్ర), అవినీతి నిరోధక చట్టంలోని 7,11,13 సెక్షన్‌ల ప్రకారం ప్రత్యేక న్యాయమూర్తి బిఎల్ సోని కేసు నమోదుకు ఆదేశించారు.

ఒలంపిక్స్‌లో సానియాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ!

హైదరాబాద్,జూన్ 26: భారత మహిళా టెన్నిస్ తార సానియా మీర్జా, రష్మీ చక్రవర్తిలకు లండన్ ఒలంపిక్స్ డబుల్స్ టెన్నిస్ విభాగంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో సోమ్‌దేవ్ దేవర్మన్‌కు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. 

Monday, June 25, 2012

భావోద్వేగంతో ప్రణబ్ కు కాంగ్రెస్ వీడ్కోలు...

న్యూఢిల్లీ,జూన్ 25:  . నాలుగు సుదీర్ఘ దశాబ్దాల పాటు అవసరాల్లోనూ, ఆపద సమయాల్లోనూ నేనున్నానంటూ ఎప్పటికప్పుడు ఆదుకుంటూ వచ్చిన  ప్రణబ్ ముఖర్జీ  (76) కి  కాంగ్రెస్ పార్టీ  ఘనంగా వీడ్కోలు పలికింది. రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి ప్రణబ్ మంగళవారం రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సోమవారం ఉదయం ప్రత్యేకంగా సమావేశమై పార్టీకి ప్రణబ్ చేసిన  సేవలను గుర్తు చేసుకుంది.అధినేత్రి సోనియా గాంధీ ఆయనకు స్వయంగా వీడ్కోలు పలికారు. భారీ మెజారిటీతో ప్రథమ పౌరునిగా ఎన్నికవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీలో అత్యంత సీనియర్ సభ్యుడు ఆయనేనంటూ  గుర్తు చేసుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా యూపీఏ ఆయనను ఎంచుకోవడం అత్యంత హర్షణీయమన్నారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ అనేకానేక బాధ్యతలను అత్యంత సమర్థంగా నిర్వర్తిస్తూ వచ్చిన ప్రణబ్ సేవలను ఇకపై కోల్పోతామని ప్రధాని మన్మోహన్‌సింగ్ నిట్టూర్చారు. ఆయన లోటు పూరేది కాదన్నారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీతో పాటు మోతీలాల్ వోరా, ఎస్‌జీ జమీర్, ఆర్‌కే ధావన్, మొహిసినా కిద్వాయ్ వంటి పార్టీ సీనియర్లు ఈ సందర్భంగా మాట్లాడారు. కొండంత అండగా నిలుస్తూ, అందరికీ తలలో నాలుకలా మెలుగుతూ వచ్చిన ఆయన ఇప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని వీడుతున్నందుకు బాధగానే ఉన్నా.. అత్యున్నత పదవిని చేపడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. పార్టీతో దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంటున్న నేపథ్యంలో ప్రణబ్ కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. తాను పార్టీకి ఇచ్చిన దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువే పొందానన్నారు. సీడబ్ల్యూసీతో తన సుదీర్ఘ అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు.




డాలర్ శేషాద్రి పదవీ కాలం రెండేళ్లు పొడిగింపు

హైదరాబాద్ ,జూన్ 25;  తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో డాలర్ శేషాద్రి పదవీ కాలంని మరో రెండేళ్లు పొడిగిస్తూ టిటిడి పాలకమండలి  నిర్ణయంలు తీసుకుంది. వరాహస్వామి ఆలయ గోపురానికి బంగారు తాపడం వేయాలని నిర్ణయించారు. కల్యాణకట్టలో 620 క్షురకుల పోస్టుల భర్తీకి సమావేశం ఆమోదం తెలిపింది. తిరుమల-తిరుపతి ప్రాంతాన్ని మద్యరహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని కూడా నిర్ణయించారు. 

హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పినాకీ చంద్రఘోష్ ప్రమాణం

హైదరాబాద్ ,జూన్ 25;  రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ పినాకీ చంద్రఘోష్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ సోమవారం ఉదయం ఆయన చేత ప్రమాణం చేయించారు. చంద్రఘోష్‌ అంతకుముందు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. జస్టిస్‌ మదన్‌ లోకూర్‌ సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పినాకీ చంద్రఘోష్‌ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప‌లువురు న్యాయ‌వాదులు, ప్రముఖులు హాజ‌ర‌య్యారు.

Sunday, June 24, 2012

పూరి జగన్నాథ రధయాత్ర సందర్భంగా ఇసుకతో జగన్నాథ,బలభద్ర, సుభద్ర రథాలను మలచిన కళాకారుడు...  

బోరు బావిలో చిన్నారి మృతి

రోదిస్తున్న మహి తల్లి...
గుర్గాన్,జూన్ 24: బోరు బావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి మహిని రెస్క్యూ టీం ఆదివారం బయటకు తీసింది. అయితే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పుట్టిన రోజు సందర్భంగా అడుకుంటానని వెళ్లిన ఆమె కొంతదూరంలో ఉన్న బోరుబావిలో పడిపోయింది. ఆమెను రక్షించేందుకు ఆర్మీయే రంగంలోకి దిగింది. 86 గంటల తర్వాత రెస్క్యూ టీం చిన్నారిని బయటకు తీసింది.  బోరు బావి నుండి బయటకు తీసిన తర్వాత ఆమెకు ఆరోగ్య పరీక్షలు జరిపేందుకు అధికారులు వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఆమెను  పరీక్షించిన వైద్యులు మహి మృతి చెందినట్లు చెప్పారు. చిన్నారిని ప్రాణాలతో ఉంచేందుకు బావిలోకి ఆక్సిజన్ పంపించారు. మహిని కాపాడేందుకు ఆర్మీ ఇంజనీర్లు, జాతీయ భద్రతా దళం కమెండోలు, పోలీసులు, గుర్గావ్ మెట్రో రైలు ఇంజనీర్లు  మొత్తం వందమందికి పైగా రంగంలోకి దిగారు. ఆ బోరు బావికి ఎనిమిది అడుగుల దూరంలో మరో బోరు బావిని తవ్వారు. కానీ దురదృష్టవశాత్తూ ఆ రెండింటి మధ్య సొరంగం తవ్వుతుండగా పెద్ద రాయి అడ్డు వచ్చింది.దాంతో శనివారం మరో సొరంగం తవ్వారు. మళ్లీ రాయి వచ్చినా.. దానిని డ్రిల్లింగ్ మెషీన్లతో పగలగొట్టేందుకు ప్రయత్నించి చేతులెత్తేశారు. దీంతో ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్‌కు చెందిన ప్రత్యేక నిపుణులతో మరో బోరు బావి తవ్వారు.చివరికి  ఎంతో ప్రయాస మీద మహిని బయటకు తెచ్చినా ఫలితం లేకపోయింది. 

Saturday, June 23, 2012

మళ్లీ అంతరిక్షానికి సునీతావిలియమ్స్

వాషింగ్టన్ ,జూన్ 23:  2006 లో ఏకంగా ఆరు నెలల పాటు అంతరిక్షంలో గడిపి 2006 లో ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్న భారత-అమెరికన్ సునీతావిలియమ్స్.  మరోసారి అంతరిక్షానికి పయనమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే జూలై 14న మొదలవనున్న ఈ యాత్రకు తుది ఏర్పాట్లు జరుగుతున్నాయని నాసా తెలిపింది. ఈ యాత్రలో భాగంగా సునీత ఫ్లైట్ ఇంజినీర్ గా బాధ్యతలు నిర్వహించనున్నారని నాసా పేర్కొంది. మరికొంత మంది తోటి ఫ్లైట్ ఇంజినీర్లతో ఆమె రెండు సార్లు స్పేస్ వాక్ చేయనున్నారని తెలిపింది. కల్పనాచావ్లా తరువాత అంతరిక్షయానానికి నాసా ఎంపిక చేసిన భారత సంతతికి చెందిన రెండో మహిళ సునీతా విలియమ్స్. అంతరిక్షయానం చేసిన మహిళలకు సంబంధించి ఆమె మూడు రికార్డులను కలిగి ఉన్నారు. అత్యధికంగా 195 రోజులపాటు యాత్రలో పాల్గొనడం, నాలుగు సార్లు స్పేస్ వాక్ చేయడం, 29 గంటల 17 నిముషాల పాటు స్పేస్ వాక్ లో పాల్గొనడం ఆమె సాధించిన ఘనత. అమెరికా నావల్ అకాడమీ నుంచి 1987లో పట్టభద్రురాలైన సునీత.. 1998లో ఆస్ట్రొనాట్ గా నాసా తరఫున ఎంపికయ్యారు. ఈ మధ్య కాలంలో అమెరికా నావీ అధికారిగా వివిధ విభాగాల్లో సేవలు అందించారు. ఆమె ఫ్లోరిడా ఇన్ స్టిట్యూట్ నుంచి 1995లో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు.

రుతుపవనాల మందగమనం

విశాఖపట్నం,జూన్ 23:  రాష్ట్రంలో వర్షపాతం పెరిగేందుకు సహకరించే అల్పపీడన ద్రోణి  మధ్య భారతం వైపు తరలి పోతుండడంతో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదలక ఉత్తర కోస్తాతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ అనుకున్నంత స్థాయిలో వర్షం కురవలేదు. అక్కడక్కడా చిరుజల్లులు పడుతున్నా అవి రుతుపవనాల ప్రభావం వల్ల కాదని, ద్రోణి కారణంగానే పడుతున్నాయని భావించారు. దీనికి తోడు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వచ్చే అవకాశం ఉందన్నారు. అది కూడా గోవా వైపు మళ్లింది.  ప్రస్తుతం నైరుతి రుతుపవనాల్లో కదలిక లేదు.  అయితే ఇవన్నీ సాధారణమేనని, కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగినా ఆందోళన చెందనక్కర్లేదని వాతావరణ నిపుణులు అంటున్నారు. రుతుపవనాల్లో కదలిక వస్తేనే వర్షాలొస్తాయని చెప్తున్నారు.

Friday, June 22, 2012

' చిరు ' బుర్రు...

హైదరాబాద్,జూన్ 22: రాష్ట్ర కాంగ్రెసు రాజకీయాలు  రసకందాయంలో పడినట్లు కనిపిస్తోంది. ఉప ఎన్నికలలో రెండు నియోజకకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న చిరంజీవి  పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లపై  ఆధిపత్యం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కనిపిస్తోంది.ఆయన శుక్రవారం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెసు పార్టీలో తీవ్ర చర్చను లేవనెత్తుతున్నాయి. రామచంద్రాపురం, నర్సాపురం సీట్లలో ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చినవారే కాంగ్రెసు తరఫున పోటీ చేసి విజయం సాధించడం చిరంజీవికి కలిసి వచ్చింది. రామచంద్రాపురం పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధికారం లభించడం కలేనని  సంచలన వ్యాఖ్యలు చేశారు.  పీఆర్పీ కార్యకర్తలను కాంగ్రెస్ పట్టించుకోకపోవడం వల్లే ఉపఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ నేతలకు సరైన గుర్తింపు లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పీఆర్పీ మాజీ నేతలంతా కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేశారని చెప్పారు. పార్టీలో సీనియర్లు కొందరు సహకరించడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు అభద్రతా భావంలో ఉన్నారన్నారు. నామినేటెడ్ పదవులను పీఆర్పీ నేతలకు ఇవ్వాలని కోరారు.  2014 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాదని కాంగ్రెసు పెద్దలు డిసైడ్ అయిపోయారని, అందుకే కష్టపడి పనిచేయడం లేదని ఆయన అన్నారు.  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో పార్టీ పెద్దలను కలుస్తూ బిజీ బిజీగా ఉన్న సమయంలో చిరంజీవి రామచంద్రాపురం కార్యకర్తలను ఉద్దేశించి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

Thursday, June 21, 2012

ఆస్ట్రేలియా పై భారతీయుల మక్కువ

మెల్ బోర్న్,జూన్ 21: ఐదేళ్లకోసారి నిర్వహించే ఆస్ట్రేలియా జనాభా లెక్కల ప్రకారం అక్కడ భారత సంతతికి చెందిన ప్రజల సంఖ్య లక్షా యాభై వేలకు చేరింది. 2006తో పోలిస్తే ఇది  14 శాతం ఎక్కువ. జాత్యాహంకార దాడులు జరుగుతున్నా.. వివక్షకు గురవుతున్నా.. ఆస్ట్రేలియాపై భారతీయుల మక్కువ ఏ మాత్రం తగ్గడం లేదనడానికి  ఇది  నిదర్శనం.  ముఖ్యంగా పంజాబీ మాట్లాడేవారైతే మునుపటి లెక్కలతో పోలిస్తే ఏకంగా 200 శాతం పెరిగారని లెక్కలు చెబుతున్నాయి.

రాష్ట్రపతి ఎన్నికల ముఖచిత్రం పై స్పష్టత .....ప్రణబ్ కే పిఠం

న్యూఢిల్లీ,జూన్ 21: రాష్ట్రపతి ఎన్నికల ముఖచిత్రం పై  స్పష్టత వచ్చింది. యూపీఏ కూటమి తరఫున బరిలోకి దిగుతున్న ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ దేశ అత్యున్నత పీఠంపై కూర్చునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.  ఇప్పటిదాకా తమ అభ్యర్థిపై కొనసాగిస్తున్న సస్పెన్స్కు బీజేపీ గురువారం తెరదించింది. లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మాకు మద్దతు ప్రకటించింది. ఈ నిర్ణయంతో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో ప్రధాన భాగస్వామ్య పార్టీ అయిన జేడీ(యూ) విభేదించింది. తాము సంగ్మాకు మద్దతు ఇవ్వబోమని, ప్రణబ్ వైపునే నిలుస్తామని స్పష్టం చేసింది. ఎన్డీయేలోని శివసేన ఇప్పటికే ప్రణబ్ కు మద్దతునివ్వగా తాజాగా.. జేడీ(యూ) కూడా అదే బాటలో నడుస్తానని చెప్పి బీజేపీకి షాక్ ఇచ్చింది. దీంతో రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో యూపీఏతోపాటు ఎన్డీయేలోనూ చీలిక వచ్చినట్లయింది. ప్రధాన కూటములే కాదు.. అటు లెఫ్ట్ పార్టీల్లోనూ విభజనరేఖలు ప్రస్పుటమయ్యాయి. సీపీఎం, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు ప్రణబ్‌కు బాసటగా నిలవగా.. సీపీఐ, రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్‌ఎస్‌పీ)లు తాము ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించాయి. ప్రణబ్ అభ్యర్థిత్వంతో విభేదించిన యూపీఏలోని ప్రధాన భాగస్వామ్య పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ తన మద్దతుపై ఇంకా సస్పెన్స్ కొసాగిస్తూనే ఉంది.  కాగా,  రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో తాము భిన్నమైన నిర్ణయాలు తీసుకున్నా.. కూటమి అస్థిత్వంపై ఎలాంటి ప్రభావం చూపబోదని బీజేపీ, జేడీయూ స్పష్టం చేయడం గమనార్హం.
రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం ఓట్ల విలువ 10.98 లక్షలు. ఇందులో రాష్ట్రపతి పీఠం కైవసం చేసుకోవడానికి కావాల్సిన ఓట్ల విలువ 5,49,442. అయితే యూపీఏ (తృణమూల్ మినహా), సమాజ్‌వాది, బహుజన్ సమాజ్‌వాది పార్టీ, సీపీఎం, ఫార్వర్డ్ బ్లాక్, జేడీ(యూ), శివసేన, జేడీఎస్‌ల మద్దతుతో ప్రణబ్‌కు 6.29 లక్షల విలువైన ఓట్లు వస్తాయి. పీఏ సంగ్మా ఈ అంకెల రేసులో చాలా వెనకబడ్డారు. ప్రణబ్‌కు వచ్చే ఓట్ల విలువలో సగమైనా దక్కే అవకాశాలు కన్పించడం లేదు. ఎన్డీయే (జేడీయూ, శివసేన మినహా), అన్నా డీఎంకే, బీజేడీలు ఆయనకు అనుకూలంగా ఓటేసినా 3.10 లక్షల ఓట్లకు మించవు. ఒకవేళ 45,925 ఓట్లున్న తృణమూల్ కాంగ్రెస్ కూడా సంగ్మాకు మద్దతు పలికినా విజయం దరిదాపుల్లోకి చేరే అవకాశాల్లేవు. క్రాస్ ఓటింగ్‌పై నమ్మకం పెట్టుకున్నా.. అంత పెద్ద ఎత్తున ఓట్లు క్రాస్ అయ్యే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎన్డీయే కూటమికి వాస్తవానికి 3.04 లక్షల విలువైన ఓట్ల బలం ఉంది. అయితే జేడీ(యూ) ప్రణబ్ వైపున నిలవడంతో అది 2.43 లక్షలకు పడిపోయింది. వచ్చేనెల 19న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 776 ఎంపీలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు చెందిన 4,120 ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

రూపాయి కనిష్ట పతనం...

ముంబై,జూన్ 21: : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో వరుసగా నాలుగో రోజు రూపాయి పతనమైంది. యూస్ డాలర్ తో పోల్చితే రుపాయి 56.57 స్థాయికి పతనమై.. రికార్డు కనిష్టస్థాయిని నమోదు చేసుకుంది. మే 31 తేదిన రూపాయి 56.52 స్థాయికి పతనమైన సంగతి తెలిసిందే. గత మూడు సెషన్లలో రూపాయి 75 పైసలు నష్టపోయింది.

టెన్నిస్ వివాదం....విష్ణువర్హన్ వద్దన్న పేస్...

న్యూఢిల్లీ,జూన్ 21: హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారుడు విష్ణువర్దన్ ఆశలపై భారత నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ నీళ్లు చల్లారు. లండన్ ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్లు టీవీ చానెల్ వార్తలు తెలియజేస్తున్నాయి. చాలా తక్కువ ర్యాంక్ ఉన్న విష్ణువర్ధన్‌తో జోడీ కట్టాలని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ) నిర్ణయించడాన్ని నిరసిస్తూ లియాండర్ పేస్ ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. లండన్‌కు రెండు జట్లను పంపుతున్నట్లు ఎఐటిఎ  ప్రకటించింది. మహేష్ భూపతి, రోహన్ బోపన్న ఒక జోడీగా, లియాండర్ పేస్, విష్ణువర్ధన్ మరో జోడీగా లండన్ వెళ్తారని సంఘం ప్రకటించింది. అయితే జూనియర్ ఆటగాడిని తనకు జతగాడిగా నిర్ణయిస్తే ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటానని పేస్ హెచ్చరించారు. లియాండర్ తండ్రి, ఒపింపియన్ వేసే పేస్ కూడా ఎఐటిఎ నిర్ణయంపై ధ్వజమెత్తారు. ప్రపంచ నెంబర్ 328 క్రీడాకారుడు విష్ణు వర్ధన్‌ను తన కుమారుడికి జోడీగా నిర్ణయించడం సరి కాదని ఆయన అన్నారు. దేశ అత్యున్నత స్థాయి ర్యాంక్ ఆటగాడి పట్ల అది అన్యాయమేనని ఆయన అన్నారు. విష్ణువర్ధన్ పేస్‌తో ఆడడానికి చాలా ఉత్సాహం ప్రదర్శించాడు. ఈ అవకాశం వచ్చినందుకు అతను ఆనందించాడు. అయితే, పేస్ నిర్ణయం మరో విధంగా ఉండడం విష్ణువర్ధన్‌కు నిరాశ మిగిల్చింది.

Wednesday, June 20, 2012

రాజేశ్ ఖన్నాకు సీరియస్...

 ముంబై ,జూన్ 20:   నిన్నటితరం  బాలీవుడ్  సూపర్‌స్టార్ రాజేశ్ ఖన్నా(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొన్ని రోజులుగా ఆహారం తీసుకోవడం లేదు. మాజీ భార్య డింపుల్ కపాడియా ప్రస్తుతం రాజేశ్ ఖన్నా బాగోగులు చూసుకుంటున్నారు. ‘రాజేశ్‌జీ ఆరోగ్యం బాగోలేదు. గత నాలుగైదు రోజులుగా ఆయన ఆహారం తీసుకోవడం లేదు. అసలు ఆహారం ఆయన నోట్లోకే వెళ్లడం లేదు’ అని రాజేశ్ మేనేజర్ అశ్విన్  మీడియాకు తెలిపారు. డింపుల్, ఆమె కూతురు రింకేలు దగ్గరుండి రాజేశ్‌కు సపర్యలు చేస్తున్నారని చెప్పారు. గత ఏప్రిల్‌లోనూ రాజేశ్ ఖన్నా ఇలాగే అనారోగ్యానికి గురయ్యారు. చివరిసారిగా ఇటీవల ఆయన ఓ టీవీ యాడ్‌లో కనిపించారు. ‘కాకా’గా సుపరిచితుడైన రాజేశ్ ఖన్నా హిందీ చిత్రసీమలో తొలి సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందారు. 1966లో ‘ఆఖ్‌రీ ఖత్’ చిత్రంతో రాజేశ్ సినీ జీవితం ప్రారంభమైంది. 1960, 70ల్లో ‘ఆరాధన’, ఆనంద్’, ‘బావర్చి’, ‘రాజ్’ వంటి సూపర్ హిట్లతో ఆయన బాలీవుడ్‌ను ఒక ఊపు ఊపారు.  150కి పైగా చిత్రాల్లో నటించారు.

డల్లాస్ లో ‘కల్యాణ శ్రీనివాసం’

డల్లాస్,జూన్ 20:  తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో అమెరికాలోని డల్లాస్ నగరంలో ఈనెల 17న ‘కల్యాణ శ్రీనివాసం’ పేరుతో కూచి పూడి నృత్యప్రదర్శన ఏర్పాటుచేశారు. నృత్యప్రదర్శన బృందానికి నేతృత్వం వహించిన శోభానాయుడును ‘విశ్వ నాట్యాచార్య శిరోమణి’ బిరుదుతను, నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ స్కూల్ డెరైక్టర్ శ్రీలత సూరిని ‘నాట్య కళా చూడామణి’ బిరుదుతోను  సత్కరించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన న్యూజెర్సీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ చివుకుల ఉపేంద్రను సత్కరించారు.

ఎన్సీపి కి సంగ్మా రాజీనామా

 రాష్ట్రపతి పదవికి పోటీకే నిర్ణయం.,.

న్యూఢిల్లీ,జూన్ 20:  రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ఎన్సీపి నేత పిఎ సంగ్మా ఆ పార్టీకి బుధవారం రాజీనామా చేశారు.  తాను అనివార్య పరిస్థితులలోనే రాజీనామా చేసినట్లు పిఏ సంగ్మా చెప్పారు. ఆత్మగౌరవం కోసం రాజీనామా చేశానని చెప్పారు. పోటీ నుండి తగ్గేది లేదన్నారు. కాగా,  సంగ్మా రాజీనామాను   ఎన్సీపి అధినేత శరద్ పవార్ ఆమోదించారు.సంగ్మా మేఘాలయలో శాసనసభ్యుడిగా ఉన్నారు. సంగ్మా గతంలో లోకసభ స్పీకర్‌గా పని చేశారు. రాష్ట్రపతి బరిలో ఉన్న సంగ్మాకు ఇప్పటికే బిజెడి, ఎఐడిఎంకే మద్దతు ప్రకటిస్తున్నాయి. అయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించి సంగ్మాను బరిలో నుండి తప్పిద్దామన్న పార్టీకి ఆయన కౌంటర్ ఇస్తూ రాజీనామా చేయడం గమనార్హం. పవార్ కూడా దానిని వెంటనే ఆమోదించడం విశేషం. పిఎ సంగ్మా కూతురు అ.గాథా సంగ్మా కేంద్రమంత్రిగా ఉన్నారు. సంగ్మా మొండిగా పార్టీకి రాజీనామా చేసి మరీ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధపడిన నేపథ్యంలో  అగాథాపై ఎన్సీపి ఏం నిర్ణయం తీసుకోనుందో  వేచి చూడాలి.


చిరంజీవికి నాన్ బెయిలబుల్ వారెంట్

 చెన్నై,జూన్ 20: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు చిరంజీవికి తమిళనాడు హోసూర్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు బుధవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2011 తమిళనాడు ఎన్నికల్లో పరిమితికి మించి వాహనాలు వాడారని ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసు నిమిత్తం గత నెల 7వ తేదీన చిరంజీవి కోర్టు హాజరు కావల్సి ఉంది. అయితే ఆయన కోర్టుకు హాజరు కాకపోవటంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అక్టోబర్ 2వ తేదీలోపు చిరంజీవి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

Tuesday, June 19, 2012

ముదురుతున్న పాలమూరు పంచాయితీ

హైదరాబాద్,జూన్ 19: మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెసు నేతల మధ్య వివాదం ముదురుతోంది. డిసిసి అధ్యక్షుడిగా నియమితులైన ఒబేదుల్లా కొత్వాల్ ప్రమాణ స్వీకారానంతరం ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశంలో జిల్లా మంత్రి డికె అరుణ, నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మందా జగన్నాథంకు మద్దతుగా చేరిన కార్యకర్తలను ఎమ్మెల్సీ విష్ణువర్థన్ అడ్డుకోవడంతో తలెత్తిన ఘర్షణ చినికి చినికి గాలివానలా మారింది. అనంతరం జగన్నాథం ఎస్పీని కలిసి మంత్రి డికె అరుణపై ఫిర్యాదు చేశారు. అరుణను దళిత వ్యతిరేకిగా అభివర్ణిస్తూ ఆమె తనపై హత్యాప్రయత్నం చేయించినట్లు ఆరోపించారు.  విష్ణువర్థన్‌పై చర్య తీసుకుంటే ఫిర్యాదు ఉప సంహరణ గురించి ఆలోచిస్తానని జగన్నాథం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తన నియోజకవర్గానికి రావొద్దని అరుణ భర్త తనను బెదిరించారని జగన్నాథం ఆరోపించారు. అరుణ కారణంగానే గత ఉప ఎన్నికలలో కాంగ్రెసు ఘోర పరాజయం చవి చూసిందన్నారు. తాను తెలంగాణ రాష్ట్ర సమితితో కుమ్మక్కు కాలేదన్నారు. తనపై దాడికి అరుణ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.మరోవైపు ఈ ఘటనపై బొత్స సత్యనారాయణ నిజ నిర్థారణ కమిటీ ఏర్పాటు చేశారు. సంఘటనపై నివేదిక ఇవ్వాలని ఆయన డిసిసి అధ్యక్షుడిని ఆదేశించారు. కాగా మరోవైపు మంత్రులు గల్లా అరుణ కుమారి, ఏరాసు ప్రతాప్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో ఓ ప్రయివేటు వ్యక్తికి సున్నపురాయి నిక్షేపాల కేటాయింపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు ఇద్దరు మంత్రులకు నోటీసులు జారీ చేసింది. తాజాగా మంద వర్గీయులు అరుణపై, అరుణ వర్గీయులు మంద పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

దక్షిణ కొరియాలోని బుసాన్ లో జరిగిన అందాల పోటిలో మిస్ ఆసియా పసిఫిక్ 2012 కిరీటం గెలుచుకున్న ఇండోర్ సుందరి హిమాంగిని సింగ్

డీజీపీగా దినేష్‌ రెడ్డి నియామకం చెల్లదని క్యాట్‌ తీర్పు

హైదరాబాద్ ,  జూన్ 19:  రాష్ట్ర డీజీపీగా దినేష్‌ రెడ్డి నియామకం చెల్లదని కేంద్ర పరిపాలన ట్రిబ్యూనల్‌ (క్యాట్‌) ఆదేశించింది. ఆయన నియామకం చెల్లదని  ప్రకటించింది. కొత్త డీజీపీ ఎంపిక కోసం మళ్లీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర సర్కారుకు సూచించింది. డీజీపీగా దినేష్‌ రెడ్డి నియామకాన్ని సీనియర్‌ ఐపీఎస్ అధికారి గౌతం కుమార్‌ క్యాట్‌లో సవాల్‌ చేశారు. దినేష్‌ రెడ్డి 1977 బ్యాచ్‌కు చెందిన అధికారి. సీనియర్‌ అయిన తనను కాదని దినేష్‌ రెడ్డిని డీజీపీగా నియమించడాన్ని గౌతమ్‌ కుమార్‌ వ్యతిరేకించారు. డీజీపీ నియామకం కోసం రూపొందించిన సీనియార్టీ లిస్టులో మొదటి పేరు గౌతం కుమార్‌ది, ఆ తర్వాత స్థానాల్లో హైదరాబాద్‌ మాజీ పోలీసు కమిషనర్‌ బల్వీందర్‌ సింగ్‌, కెఆర్ నందన్‌ ఉన్నారు. అయితే పదవీ కాలం ఎక్కువ లేకపోవడంతో డీజీపీగా బాధ్యతలు చేపట్టేందుకు నందన్‌ విముఖత చూపారు. కాగా 2010 ఆగస్టు 31న రాష్ట్ర డీజీపీగా దినేష్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. సెప్టెంబర్‌ 2013 వరకూ ఆయన పదవీ కాలం ఉంది.
ఐపీఎస్‌ఉమేష్‌పై సస్పెన్షన్‌ వేటు
ఐపీఎస్‌ అధికారి ఉమేష్‌కుమార్‌ ను  సస్పెండ్  చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత మూడు రోజులుగా ఉమేష్‌ అందుబాటులో లేని కారణంగా క్రమశిక్షణ చర్య కింద ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఎంపీ సంతకం ఫోర్జరీ కేసులో ఉమేష్‌ నిందితుడుగా ఉన్నారు. ఇటీవల ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే.

పాక్ ప్రధాని గిలానీపై సుప్రీం అనర్హత వేటు...

ఇస్లామాబాద్,  జూన్ 19:పాకిస్థాన్ లో తీవ్ర రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది. పాక్ ప్రధాని గిలానీని ఆ పదవికి  అనర్హుడిగా పాక్ సుప్రీంకోర్టు తేల్చడంతో రాజ్యంగ సంక్షోభంలో కూరుకుపోయింది. ఏప్రిల్ 26 నుంచి ప్రధాని పదవి ఖాళీగా ఉందని పాక్ సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది. కోర్టును అవమానించిన కేసులో గిలానీ దోషి అని పాక్ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం పాక్ ప్రధాని పదవి పోస్టు ఖాళీగా ఉన్నట్టేనని సుప్రీంకోర్టు తెలిపింది. పాక్ అధ్యక్షుడు అసఫ్ అలీ జర్దారీ అవినీతి ఆరోపణలకు సంబంధించి గిలానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గత ఏప్రిల్ నెలలో సుప్రీం కోర్టు గిలానీపై కోర్టు ధిక్కారణ కేసును నమోదు చేసింది. ఈ కేసును విచారించిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం గిలానీని వెంటనే తొలగించాలని అధ్యక్షుడు జర్దారీని ఆదేశించింది. గిలానీ స్థానంలో నూతన నియామకం చేపట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. పాకిస్తాన్ సుప్రీం కోర్టు తీర్పును పాకిస్తాన్ పీపుల్సా పార్టీ స్వాగతించింది.  కొత్త నేతను ఎన్నుకుంటామని ప్రకటించింది.   

కృష్ణా పరివాహక జిల్లాల్లో భూ ప్రకంపనలు

విజయవాడ, జూన్ 19:  రాష్ట్రంలోని  కృష్ణా, గుంటూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాలలో మంగళవారం సాయంత్రం  కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది.  ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలోని ప్రజలు ఆందోళనకు గురై ఒక్కసారిగా బయటకు వచ్చారు. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి, మాచవరం, పిడుగురాళ్ల, అచ్చంపేట, అమరావతి, క్రోసూరు పెదకూరపాడు తదితర ప్రాంతాలలో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. కృష్ణా జిల్లాలోని నందిగామ, చందర్లపాడు, జగ్గయ్యపేట, కంచికర్ల, పెనుగంచిప్రోలు, ఖమ్మం జిల్లాలోని మధిర, ఎర్రపాలెం, వైరా బోనకల్, నల్గొండ జిల్లాలోని కోదాడ, మేళ్లచెరువు, హుజుర్ నగర్‌లలో భూమి కంపించింది. అరగంట సమయంలో వివిధ ప్రాంతాలలో కొన్ని సెకన్ల పాటు  ఈ ప్రకంపనలు సంభవించాయి.  కాగా,  ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం,  ఆస్తి నష్టం జరగలేదు

Monday, June 18, 2012

కాలిఫోర్నియాలో బాలు జన్మదిన వేడుకలు...

కాలిఫోర్నియా,జూన్ 18:  : ప్రముఖ నేపథ్య గాయకుడు యస్పీ బాలసుబ్రహ్మణ్యం 66వ జన్మదినాన్ని పురస్కరించుకొని చిమటమ్యూజిక్.కామ్ అమెరికాలో మొట్టమొదటిసారిగా ఆరు నగరాలలో (బే ఏరియా, అట్లాంటా, డల్లాస్, డెట్రాయిట్, మినియాపొలిస్, ఆష్టిన్) బాలు పాటల విభావురులను జూన్ నెల మొత్తం తలపెట్టారు. మొదటి విభావరిని 'ఏ దివిలో విరిసిన పారిజాతమో!' పేరిట జూన్ 16న చిమటమ్యూజిక్, స్థానిక బే ఏరియా తెలుగు అసోసియేషన్(బాటా) సంయుక్తంగా వందలాది మంది బాలు అభిమానుల సమక్షంలో స్థానిక జైన్ టెంపుల్ లో ఘనంగా నిర్వహించారు. భారత్ నుంచి విచ్చేసిన గాయకుడు రాము, హ్యూస్టన్ నగరం నుంచి వచ్చిన గాయనీ శారద ఆకునూరి స్థానిక గాయనీ గాయకులతో కలిసి 66 మధురమైన గీతాలను ఆలపించి గాన గంధర్వుడికి స్వరార్చన చేశారు.  కార్యక్రమంలో  కేక్ కట్ చేసి బాలుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

10 వేల జనాభా వరకు మద్యం షాపు లైసెన్స్ ఫీజు రూ.32.5 లక్షలు

హైదరాబాద్ ,జూన్ 18:  నూతన మద్యం విధానాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. మద్యం విధానంలో 6 స్లాబ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 10 వేల జనాభా వరకు షాపు లైసెన్స్ ఫీజు రూ.32.5లక్షలుగా, 10 వేల నుంచి 50 వేల జనాభా ఉంటే లైసెన్స్ ఫీజు రూ.34లక్షలుగా, 50 వేల నుంచి 3 లక్షల జనాభా ఉంటే లైసెన్స్ ఫీజు రూ.42లక్షలుగా నిర్ణయించింది. ఇంకా 3 నుంచి 5లక్షల జనాభా ఉంటే లైసెన్స్ ఫీజు రూ.46లక్షలుగా, 5 నుంచి 20లక్షలు జనాభా ఉంటే లైసెన్స్ ఫీజు 64 లక్షలు, జనాభా 20లక్షల కంటే ఎక్కువగా ఉంటే ఫీజు రూ.1.04 కోట్లుగా నూతన మద్య విధానంలో వెల్లడించింది.

మరోసారి....! సారీ...కలాం

న్యూఢిల్లీ,జూన్ 18: రాష్ట్రపతిగా మరోసారి పోటీ చేసేందుకు తన అంతరాత్మ  అంగీకరించడం లేదని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తేల్చి చెప్పారు. తాను పోటీ చేసే ప్రసక్తి లేదని అబ్దుల్ కలాం భారతీయ జనతా పార్టీ అగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీకి ఫోన్ ద్వారా తెలిపారు. తనకు మద్దతు ఇస్తున్న అద్వానీ, తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు రెండోసారి రాష్ట్రపతి కావాలన్న ఆశ లేదని ఆయన  అధికారిక ప్రకటన చేశారు. రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు అబ్దుల్ కలాంపై తృణమూల్, బిజెపిలు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో ఆయన ఈ  ప్రకటన చేశారు. కాగా, రాష్ట్రపతి పదవికి పోటీ చేయకూడదని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ తీసుకున్న నిర్ణయం సరైందేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి మనీష్‌ తివారి అన్నారు.  ఆంధ్రఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నామన్నారు.

Sunday, June 17, 2012

చల్లబడిన రాష్ట్రం..

విశాఖపట్టణం, జూన్ 17:  నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి. అనంతపురం మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఇవి రాయలసీమలో పూర్తిగానూ, తెలంగాణలోని మహబూబ్‌నగర్, దక్షిణ కోస్తాలో బాపట్లను తాకినట్లు  తుపాను హెచ్చరిక కేంద్రం అధికారులు ధ్రువీకరించారు. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్ర మంతటా రుతుపవనాలు వ్యాపించి పూర్తిస్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
రుతుపవనాల రాకతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే తగ్గుముఖం పట్టాయి. ఆకాశం మేఘావృతం కావటం, అక్కడక్కడా జల్లులు పడుతుండటంతో వాతావరణం చల్లబడింది. మరోవైపు బంగాళాఖాతంలో ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తా మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల వర్షాలు దండిగా  పడతాయని భావిస్తున్నారు. ఇలా ఉండగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల  ట్రాఫిక్  స్తంభించింది.

ఇండోనేసియా ఓపెన్ విజేత 'సైనా

జకార్తా, జూన్ 17: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌ ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ప్రపంచ మూడో ర్యాంకర్ జురుయ్ లీ (చైనా)ను 13-21, 22-20, 21-19 తేడాతో ఓడించింది.  సైనా 2009, 2010లోనూ ఇండోనేసియా ఓపెన్ చాంపియన్ గా నిలిచింది. ఈ ఏడాది స్విట్జర్లాండ్, థాయిలాండ్, ఇండోనేసియా టైటిల్స్ గెల్చుకోవడం ద్వారా సైనా నెహ్వాల్ సత్తా చాటింది.

Friday, June 15, 2012

కొత్త రాష్ట్రపతి ప్రణబ్ ?

న్యూఢిల్లీ,జూన్ 15;  యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేరు ఖరారయింది. ఆయన పేరును కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ అధికారికంగా ప్రకటించారు. ఈనెల 24న ప్రణబ్ ముఖర్జీ మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు.

ఓదార్పు దొరికింది...

హైదరాబాద్,జూన్ 15;  ప్రతిష్టాత్మకంగా జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. 18 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ 15 గెల్చుకుని సత్తా చాటింది. నర్సన్నపేట, పాయకరావుపేట, పోలవరం, మాచర్ల, పత్తిపాడు, ఒంగోలు, ఉదయగిరి, తిరుపతి, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, అనంతపురం అర్బన్, రాయదుర్గం, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో వైఎస్సార్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది.నెల్లూరు లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కూదా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఘన విజయం సాధించారు.కాగా, అధికార కాంగ్రెస్ రెండు స్థానాల్లో-(నర్సాపురం, రామచంద్రాపురం లలో గెలుపొందింది. పరకాల సీటును టీఆర్‌ఎస్ గెల్చుకుంది. తెలుగుదేశం పార్టీ కి ఒక్క స్థానం కూదా దక్కకపోవదం గమనార్హం.    వైఎస్సార్ జిల్లా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి అత్యధిక మెజారిటీ సాధించారు. ఆయన 56891 ఓట్ల భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఎం. రాంప్రసాదరెడ్డిపై విజయ ఢంకా మోగించారు. శ్రీకాంత్‌రెడ్డికి 90978 ఓట్లు, రాంప్రసాదరెడ్డికి 34087 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం 25344 ఓట్లు దక్కించుకున్నారు. మరోవైపు హోరాహోరీగా సాగిన వరంగల్ జిల్లా పరకాల స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి భిక్షపతి 1562 ఓట్ల స్వల్ప మెజారిటీలో గెలుపొందారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ గట్టి పోటీ ఇవ్వడంతో ఆయనకు అత్యల్ప మెజారిటీ దక్కింది. నెల్లూరు లోక్‌సభ స్థానానికి పోటీచేసిన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి 291745 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి టి. సుబ్బిరామిరెడ్డిపై ఘన విజయం సాధించారు.  తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి 18117 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆయనకు 39723 ఓట్లు వచ్చాయి. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచిన చిరంజీవికి 15 వేలు మెజారిటీ మాత్రమే వచ్చింది. 18 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 9 సీట్లలో రెండోస్థానం, మరో 9 నియోజకవర్గాల్లో మూడో స్థానంలో నిలిచింది. అనంతపురం అర్బన్, రాయదుర్గం, ఎమ్మిగనూరు, ఉదయగిరి, ఒంగోలు, మాచర్ల, పత్తిపాడు, పోలవరం, పాయకరావుపేట నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. పరకాల, తిరుపతి, ఆళ్లగడ్డ, రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, నర్సాపురం, రామచంద్రాపురం, నర్సన్నపేటల్లో మూడో స్థానానికి పరిమితమయింది.


జగన్ పార్టీ జైత్ర యాత్ర....

 హైదరాబాద్,జూన్ 15; జాతీయ స్థాయిలో ఉత్కంఠ రేపిన  ఉప ఎన్నికలలో అంచనాలకు అనుగుణం గానే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ  ఆథిక్యంలో దూసుకు పోతోంది. నెల్లూరు లోఅక్ సభ స్థానం తో పాటు 15 అసెంబ్లీ స్థానలలో జగన్ పార్టీ   ఆధిక్యంలో కొనసాగుతుండగా రెండు  చోట్ల  కాంగ్రెస్, పరకాలలో తెరాస ముందంజలో ఉన్నాయి.  టి.డి.పి ఇంకా జాడ లేదు.    2014 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది.  సాయంత్రానికి  పూర్తి ఫలితాలు వెలువడతాయి.   

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రమాదంలో 11మంది మృతి

విశాఖపట్నం,జూన్ 15; విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోరప్రమాదంలో గాయపడ్డవారి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రమాదంలో ఇప్పటికే 11మంది మృత్యువాతపడ్డారు. మరో 8మంది మృత్యువుతో పోరాడుతున్నారు. వీరంతా విశాఖలోని సెవెన్ హిల్స్, కేర్, న్యూకేర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్టీల్ మెల్ట్‌షాప్ (ఎస్‌ఎంఎస్) విభాగం ఏజీఎం ఎంవీఎస్ శర్మ, జీఎం డీఎస్ కల్సీలను గురువారం మరింత మెరుగైన చికిత్సకోసం విమానంలో ముంబై తరలించారు. రంజన్ భట్టాచార్య (ఏజీఎమ్), ఎల్. శ్రీనివాసరావు, పి.నారాయణరాజు, కె.శ్రీనివాసరావు, సీహెచ్.ప్రభాకరరావు, మురళీధర్‌రాజు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  ఐదుగురి మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. మిగిలినవారి మృతదేహాలను వారి బం దువులు వచ్చే దాకా కేజీహెచ్ మార్చురీలోనే భద్రపరిచారు. ప్రమాద ఘటన  పై ఉన్నతస్థాయి కమిటీతో దర్యాప్తు చేయనున్నట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బేణి కుమార్ ప్రసాద్ వర్మ తెలిపారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించడానికి వచ్చిన మంత్రి  విలేకర్లతో మాట్లాడారు. దర్యాప్తు కమిటీకి సెయిల్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్.ఆర్.జైన్ చైర్మన్‌గా ఉంటారని చెప్పారు. మెకాన్ చైర్మన్ కె.కె.మెహ్రోత్రా, ఢిల్లీ, కాన్నూర్ ఐఐటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతులను సభ్యులు గా నియమించారు. ఈ కమిటీ 30 రోజుల్లో నివేదిక ఇస్తుందని చెప్పారు. ప్రమాదంలో మృతి చెందిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.20 లక్షలు, కాంట్రాక్టు కార్మికులకు అదనంగా రూ.10 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న బాధిత కుటుంబాలను బేణితోపాటు సీఎం కిరణ్ పరామర్శించారు.





 .

Thursday, June 14, 2012

వైభవంగా రామ్ చరణ్ , ఉపసానల పెళ్ళి

 హైదరాబాద్ జూన్ 14; సినిమా సెట్టింగ్ ను తలపించే వేదికపై,  వేల సంఖ్యలో అతిధుల సమక్షంలో టప్రముఖ యువహీరో రామ్ చరణ్ తేజ, ఉపసానల వివాహం గురువారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని టెంపుల్ ట్రీ ఫామ్ హౌస్ ఈ వేడుకకు వేదిక అయ్యింది. ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ దంపతులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు . వివాహ వేడుకకు వచ్చిన అతిథులను చిరంజీవి, అల్లు అరవింద్ దగ్గరుండి ఆహ్వానించారు. ఇక వేదిక దగ్గర నాగబాబు, పవన్‌ కళ్యాణ్‌, బన్నీల హడావుడి  కనిపించింది. పెళ్లికి రెండుమూడ్రోజుల ముందు నుంచే రోజుకో కార్యక్రమాన్ని చేపట్టిన వధూవరుల కుటుంబాలు ... పెళ్లిని కూడా కనివినీ ఎరగని రీతిలో జరిపించాయి. పెళ్లి మండపం వద్ద టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ సినీ తారల సందడి కనిపించింది.

బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు

ముంబయిజూన్ 14; బంగారం  ధర  గురువారం ఆల్ టైమ్ రికార్డు స్థాయిని నమోదు చేసుకుంది.  దేశీయంగా 99.9 శాతం స్వచ్ఛమైన 24 క్యారెట్ల నాణ్యత కలిగిన పది గ్రాముల బంగారం ధర రూ.30.430కి చేరగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.29.500కి పెరిగింది. అలాగే వెండి ధర కిలో రూ.55.700 కి చేరింది. 

29 నుంచి నాటా మహాసభలు...

న్యూయార్క్,జూన్ 14; నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా)- 2012 మహాసభలను జూన్ 29 నుంచి జూలై 1 వరకు టెక్సాస్ రాష్ట్రంలో హ్యూస్టన్ నగరంలోని జార్జీ ఆర్ బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతాయని నాటా అధ్యక్షుడు ఏవీఏన్ రెడ్డి  వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా అమెరికాలోని అతిరథ మహారధులంతా ఈ వేడుకలకు హాజరవుతారని తెలిపారు. తెలుగు సిని రంగ పరిశ్రమకు చెందిన దిగ్గజాలైన న టీనటులు, దర్శక నిర్మాతలు ఈ సభల్లో పాల్గొంటారన్నారు. అలాగే తెలుగు సిని రంగంలోని స్వర మాంత్రికులు మణిశర్మ, కోటి, వందేమాతరం శ్రీనివాస్‌లు ఒక వేదికపై సంగీత విభావరి ఇస్తారన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సభల్లో సాహిత్య చర్చతోపాటు యువతియువకులు, మహిళలు కోసం ప్రత్యేకంగా సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విజయ రహాస్యంతో ముందుకు దుసుకెళ్తున్న, ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లోని తెలుగు పారిశ్రామిక వేత్తలతో సదస్సును నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నృత్యం, చిత్రకళ, పాటలు, వాద్య సంగీతం, సేవా రంగంలో విశేష కృషి చేసిన 16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్న యువతి యువకులకు టి. సుబ్బిరామి రెడ్డి లలిత కళా పరిషత్ ఇంటర్నేషనల్ (ఇండియా) పేరిట అవార్డులు ప్రదానం చేస్తామని చెప్పారు.

Tuesday, June 12, 2012

ముగిసిన ఉప ఎన్నికలు...15న జాతకాలు...

హైదరాబాద్, జూన్ 12;  రాష్ట్రంలోని 18 శానససభా స్థానాలు, ఓ లోకసభ స్థానాల్లో స్వల్ప చెదురుమదురు ఘర్షణలు మినహా ఉప ఎన్నికల పోలింగ్  ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ ప్రధాన పార్టీలైన కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ ల కార్య కర్తల మధ్య  స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి.  దాదాపు 70 శాతం పోలింగ్ జరిగినట్టు ఎన్నికల సంఘం తెలిపింది.  ఈ నెల 15 న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.   అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. 
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకే మెజారిటీ సీట్లు :లగడపాటి
కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఎప్పటిలాగే ఉప ఎన్నికల ఫలితాలపై తన అంచనాలు చెప్పారు. ఈ ఉప ఎన్నికల్లో మెజారిటీ సీట్లు వైయస్ జగన్‌కు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకే వస్తాయని ఆయన చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 12 నుంచి 16 సీట్లు గెలుచుకుంటుందని ఆయన చెప్పారు. వైయస్ జగన్ అన్ని అస్త్రాలను ఈ ఎన్నికల్లో వాడడం, తాము కాస్తా ఆలస్యంగా ఎదురుదాడికి పూనుకోవడం అందుకు కారణమని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీకి ఒకటి నుంచి మూడు సీట్లు వస్తాయని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీకి సున్నా నుంచి 2 సీట్లు వస్తాయని, తెలుగుదేశం పార్టీకి ఒక్క సీటు రాకపోయినా ఆశ్చర్యం లేదని ఆయన అన్నారు. పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు. నెల్లూరు లోకసభ స్థానం గురించి అంచనా ఈ నెల 14వ తేదీన చెప్తానని ఆయన అన్నారు.    

Monday, June 11, 2012


                            కేంద్ర ఎన్నికల సంఘం నూతన ప్రధానాధికారి వి. ఎస్. సంపత్. ఇంతవరకు 
                                           ఈ పదవిలో ఉన్న ఎస్.వై. ఖురేషీ పదవీ విరమణ చేశారు.  

జగన్ కు నార్కో టెస్ట్ లపై 14న విచారణ...

హైదరాబాద్, జూన్ 11:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని నార్కో టెస్టులకు అనుమతించాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)  కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వైయస్ జగన్ తమ విచారణలో పెదవి విప్పడం లేదని, పూర్తి వివరాలు తెలియజేయడం లేదని కాబట్టి నార్కో టెస్టులకు అనుమతించాలని కోర్టును సిబిఐ కోరింది. అయితే, దీనికి  జగన్మోహన్ రెడ్డి తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నార్కో టెస్టులు సైంటిఫిక్‌గా రుజువు కాలేదని చెప్పారు. నార్కో టెస్టులకు అనుమతి కోరడం ద్వారా సిబిఐ సుప్రీం కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తోందని జగన్ తరఫు న్యాయవాదులు అన్నారు. కోర్టు ఇరువురి వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను 14వ తేదికి వాయిదా వేసింది.

నిత్యానంద స్వామి గల్లంతు...

చెన్నై, జూన్ 11:  సెక్స్ స్కాండల్‌లో ఇరుక్కున్న నిత్యానంద స్వామీ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. బెంగళూరు సమీపంలోని బిడది ధ్యానపీఠం ఆశ్రమంలో సోదాలు నిర్వహించి, ఆ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. బిడది ఆశ్రమం స్వాధీనంతో పాటు సెక్స్ స్కాంలో నిత్యానంద పొందిన బెయిల్ పిటిషన్ రద్దుకు హోంశాఖ ప్రయత్నాలు చేస్తోంది. నిత్యానంద స్వామి ఘటనపై కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సదానంద గౌడ సీరియస్ అయ్యారు. రెండు రోజుల్లో నిత్యానందను అరెస్టు చేస్తామని చెప్పారు. నిత్యానంద పరారీ నేపథ్యంలో బిడదిలోని ఆయన ఆశ్రమానికి తాళాలు వేయాలని ఆదేశించారు. ఆయనపై దర్యాఫ్తునకు ఆదేశాలు జారీ చేశారు. ఆశ్రమంలో ఏఏ వస్తువులు ఉన్నాయో ఆరా తీయాలని సూచించింది. నిత్యానంద స్వామి అమాయక మహిళల పై అత్యాచారం చేశాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.  వారం రోజుల క్రితం ఓ నటి తనను నిత్యానంద బలవంతంగా రేప్ చేశారని ఆరోపించింది. ఆమెను నిత్యానంద దాదాపు పలుమార్లు రేప్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఆరోపణలు ఖండించేందుకు నిత్యానంద నాలుగు రోజుల క్రితం బిడది ఆశ్రమంలో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్‌లో ఓ విలేకరి అడిగిన ప్రశ్నతో నిత్యానందకు కోపం వచ్చింది. తన అనుచరులతో రిపోర్టర్‌ను . బయటకు గెంటివేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత విలేకరులు ఆందోళనకు దిగారు. రిపోర్టర్ పైన దాడి కేసులో నిత్యానందతో పాటు ఆయన శిష్యుల పైన కేసు నమోదయింది. పోలీసులు అశ్రమంలోని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. శిష్యులను అరెస్టు చేయడంతో నిత్యానంద అదృశ్యమయ్యాడు. నాలుగు రోజులుగా ఆయన ఎవరికీ కనిపించడం లేదు.  పలు ప్రాంతాలలో ఆయన కోసం పోలీసులు గాలించారు. కాని నిత్యానంద ఆచూకి మాత్రం లభించలేదు. 

ఫ్రెంచ్ ఓపెన్ విజేత రఫెల్ నాదల్



పారిస్,జూన్ 11: రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు. జోకోవిచ్ పై 6-4,6-3,2-6,7-5 తేడాతో నాదల్ విజయం సాధించాడు. నాదల్ ఏడవ సారి ఈ టైటిల్ ని గెలుచుకున్నాడు. ప్రైజ్ మనీగా నాదల్ కు 8 కోట్ల 67 లక్షల రూపాయలు లభిస్తాయి. నాదల్ కు  ఇది 11వ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఏడు ఫ్రెంచ్ ఓపెన్, రెండు వింబుల్డన్, ఒక ఆస్ట్రేలియా, ఒక యుఎస్ టైటిల్స్ నాదల్ గెలుచుకున్నాడు.

Sunday, June 10, 2012

                     ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు  ఎస్పీ అభ్యర్థిగా
                    ఏకగ్రీవంగా ఎన్నికైన ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య  డింపుల్ యాదవ్  

ముగిసిన ప్రచారం...ఓటరు తీర్పుకు రంగం సిద్ధం..

హైదరాబాద్,జూన్.10;  రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రచారం పర్వం   శని వారం సాయంత్రం  5 గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్ లాల్ విలేకరులతో మాట్లాదుతూ,  ఇంటింటి ప్రచారాన్ని పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.  12వ తేది అర్ధరాత్రి వరకు ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలలో మద్యం దుకాణాలను బంద్ చేస్తారని చెప్పారు. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటల తరువాత స్థానికేతరులు ఉండరాదని ఆదేశించారు. హోటళ్లు, అతిథి గృహాలు, ఫక్షన్ హాల్స్ అన్నింటినీ పోలీసులు తనిఖీ చేస్తున్నారని చెప్పారు. 12వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓటు వేయడానికి ప్రతి ఓటరు గుర్తింపు కార్డు గానీ, స్లిప్ గానీ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు స్లిప్ లు ఇస్తారని భన్వర్ లాల్ చెప్పారు.ఉప ఎన్నికలు జరిగే 12 జిల్లాలలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 15న ఓట్లను లెక్కింపు జరుగుతుందని ఆయన చెప్పారు.
 అభ్యర్థులకు షాడో బృందా లు
ఉప ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు షాడో బృందా లను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ఉప ఎన్నికలలో మొత్తం ఓటర్లు 46,13,589 మంది ఉన్నట్లు తెలిపారు. నరసన్నపేట, పోలవరంలలో అతితక్కువగా బరిలో ఆరుగురు అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. అత్యధికంగా  ఒంగోలు బరిలో 23 మంది ఉన్నారు.
 ప్రధాన పార్టీ అభ్యర్థులు
నరసన్నపేట నియోజకవర్గంలో  ప్రధాన పార్టీ అభ్యర్థులు ధర్మాన కృష్ణ దాస్ (వైఎస్‌ఆర్‌సీపీ), రాందాస్ (కాంగ్రెస్), స్వామిబాబు (టీడీపీ) పోటీలో ఉన్నారు. పాయకరావుపేటలో  ప్రధాన పార్టీ అభ్యర్థులు గొల్ల బాబూరావు (వైఎస్‌ఆర్‌సీపీ), సుమన (కాంగ్రెస్), చెంగల వెంకట్రావు (టీడీపీ) పోటీలో ఉన్నారు. రామచంద్రపురంలో  ప్రధాన పార్టీ అభ్యర్థులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్ (వైఎస్‌ఆర్‌సీపీ), తోట త్రిమూర్తులు (కాంగ్రెస్), చిక్కాల రామచంద్రరావు (టీడీపీ) బరిలో ఉన్నారు. నర్సాపురంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు ప్రసాదరాజు (వైఎస్‌ఆర్‌సీపీ), సుబ్బారాయుడు(కాంగ్రెస్), సత్యనారాయణరావు (టీడీపీ) పోటీలో ఉన్నారు. పోలవరంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు తెల్లం బాలరాజు( వైఎస్‌ఆర్‌సీపీ), పార్వతి(కాంగ్రెస్), శ్రీనివాస్ (టీడీపీ) బరిలో ఉన్నారు. ప్రత్తిపాడులో ప్రధాన పార్టీ అభ్యర్థులు సుచరిత  (వైఎస్‌ఆర్‌ సీపీ), సుధాకర్‌బాబు(కాంగ్రెస్), కందుకూరి వీరయ్య (టీడీపీ) పోటీలో ఉన్నారు. మాచర్లలోఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (వైఎస్‌ఆర్‌సీపీ), లక్ష్మారెడ్డి (కాంగ్రెస్), మధు (టీడీపీ) పోటీలో ఉన్నారు. ఒంగోలులో   బాలినేని శ్రీనివాస రెడ్డి (వైఎస్‌ఆర్‌సీపీ), పార్వతమ్మ (కాంగ్రెస్), జనార్దన్(టీడీపీ) పోటీలో ఉన్నారు. ఉదయగిరిలోమేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (వైఎస్‌ఆర్ సీపీ), విజయరామిరెడ్డి (కాంగ్రెస్), వెంకటరామారావు (టీడీపీ) పోటీలో ఉన్నారు. అనంతపురంలో  గుర్నాథ రెడ్డి (వైఎస్‌ఆర్ సీపీ), ముర్షీదా బేగం (కాంగ్రెస్),   శ్రీనివాస్  (టీడీపీ) పోటీలో ఉన్నారు. రాయదుర్గంలో  కాపు రామచంద్రా రెడ్డి(వైఎస్‌ఆర్‌సీపీ), వేణుగోపాల్‌రెడ్డి(కాంగ్రెస్), దీపక్‌రెడ్డి (టీడీపీ) బరిలో ఉన్నారు. పరకాలలో కొండా సురేఖ(వైఎస్‌ఆర్‌సీపీ), సమ్మారావు(కాంగ్రెస్), ధర్మారెడ్డి(టీడీపీ) పోటీలో ఉన్నారు. ఎమ్మిగనూరులో ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి (వైఎస్‌ఆర్‌సీపీ), రుద్రగౌడ్ (కాంగ్రెస్), బీవీ మోహన్‌రెడ్డి (టీడీపీ) పోటీలో ఉన్నారు. ఆళ్లగడ్డలో భూమా శోభానాగి రెడ్డి (వైఎస్‌ఆర్‌సీపీ), ప్రతాప్‌రెడ్డి (కాంగ్రెస్), రాంపుల్లా రెడ్డి ( టీడీపీ) పోటీలో ఉన్నారు. రాజంపేటలో  ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి (వైఎస్‌ఆర్‌సీపీ), మల్లికార్జున రెడ్డి (కాంగ్రెస్), బ్రహ్మయ్య( టీడీపీ) రంగంలో ఉన్నారు. రాయచోటిలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి (వైఎస్‌ఆర్‌సీపీ), రాంప్రసాద్‌రెడ్డి (కాంగ్రెస్), బాలసుబ్రహ్మణ్యం (టీడీపీ) బరిలో ఉన్నారు. రైల్వేకోడూరులోశ్రీనివాసులు (వైఎస్‌ఆర్‌సీపీ), ఈశ్వరయ్య (కాంగ్రెస్), అజయ్‌బాబు ( టీడీపీ) పోటీలో ఉన్నారు. తిరుపతిలో  భూమన కరుణాకర్‌ రెడ్డి ( వైఎస్‌ఆర్‌సీపీ), వెంకటరమణ (కాంగ్రెస్), కృష్ణమూర్తి (టీడీపీ) రంగంలో ఉన్నారు.
ఇక నెల్లూరు లోక్ సభ నియోజకవర్గంలో  ప్రధాన పార్టీ అభ్యర్థులు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి(వైఎస్‌ఆర్‌సీపీ), టి.సుబ్బరామి రెడ్డి(కాంగ్రెస్), వేణుగోపాల్‌ రెడ్డి(టీడీపీ) పోటీలో ఉన్నారు. 

Saturday, June 9, 2012

బాబు తో ' కోలా' టం...

చంద్రబాబు విదేశీ ఖాతాల భాగోతం  

హైదరాబాద్,జూన్ 9:  తనకు కోట్లలో లాటరీ వచ్చినట్లు గతంలో పలువురిని మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న కోలా కృష్ణమోహన్ అనే వ్యక్తి -చంద్రబాబుకు, అతని కుటుంబ సభ్యులకు విదేశాల్లోని బ్యాంకు ఖాతాల్లో వేల కోట్ల రూపాయలు ఉన్నట్లు ఆరోపించారు. 2003లో చంద్రబాబు చాలా విదేశీ ఖాతాలను క్లోజ్ చేసినట్లు ఆయన తెలిపారు. సింగపూర్‌లోని ఒక బ్యాంకులో చంద్రబాబుకు 15 వేల కోట్ల రూపాయల డాలర్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు విదేశీ ఖాతాల వివరాలను రెండు రోజుల్లో హైకోర్టుకు తెలుపుతానని ఆయన చెప్పారు. మరో పది రోజుల్లో మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరిన్ని వివరాలు చెబుతానని ఆయన అన్నారు. గతంలో తనపై చంద్రబాబు రెండుసార్లు హత్యా ప్రయత్నం చేయించారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు తనకు ఏమైనా జరిగితే చంద్రబాబు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తనకు లాటరీ వచ్చినట్లు తెలిసి చంద్రబాబు తనను పార్టీలోకి ఆహ్వానించారని, మచిలీపట్నం లోకసభ సీటు ఇస్తానని చెప్పారని ఆయన అన్నారు. చంద్రబాబుకు తాను 1999లో ఐదు కోట్ల పది లక్షల రూపాయలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. పది లక్షల రూపాయలు చెక్ రూపంలో ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఆ చెక్కును నగదు రూపంలోకి మార్చుకున్నట్లు ఆయన తెలిపారు. కోటి రూపాయల నగదు చంద్రబాబుకు ఇంట్లోనే ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మిగిలిన నాలుగు కోట్ల రూపాయలను లండన్‌లోని మిడ్‌ల్యాండ్స్ బ్యాంక్ ఖాతా నుంచి సింగపూర్ బ్యాంకులోని చంద్రబాబు ఖాతాలోకి మార్చినట్లు ఆయన తెలిపారు. లండన్‌లోని తన ఖాతా నెంబరు 433846 958001గా ఆయన తెలిపారు. సింగపూర్‌లోని డ్యూషే బ్యాంకులో సి. నాయుడు. నారా అనే పేరుతో 0204049121100 నెంబరుతో ఖాతా ఉన్నట్లు కోలా కృష్ణమోహన్ చెప్పారు. సింగపూర్ బార్‌లేస్ బ్యాంకులో చంద్రబాబుకు మరో ఖాతా ఉన్నట్లు ఆయన తెలిపారు. లండన్‌లోని నార్థ్ వెస్ట్ బ్యాంకులో కూడా ఖాతా ఉన్నట్లు ఆయన చెప్పారు. స్విట్జర్లాండ్‌లోని క్రెడిట్ నూయిస్ బ్యాంకులో కూడా చంద్రబాబుకు ఖాతా ఉందని చెప్పారు. 2003లో కొన్ని ఖాతాలను మూసేసినప్పటికీ ఇంకా అనేక ఖాతాల్లో వేల కోట్ల రూపాయలు ఉన్నాయని ఆయన చెప్పారు.చంద్రబాబు వల్లనే తాను అనేక కేసుల్లో ఇరుక్కున్నట్లు ఆయన తెలిపారు. 2003లో తనపై చంద్రబాబు మూడు సార్లు హత్యా ప్రయత్నం చేయించారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ తన వద్ద 25 లక్షల రూపాయలు తీసుకున్నట్లు కోలా కృష్ణమోహన్ తెలిపారు.

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా షరపోవా

పారిస్,జూన్ 9: ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా షరపోవా నిలిచింది. ఫైనల్లో సారా ఎరానీపై 6-3, 6-2 తేడాతో షరపోవా గెలుపొందింది. ఆమె తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకుంది. షరపోవాకు 8 కోట్ల 67లక్షల రూపాయల ఫ్రైజ్ మనీ లభిస్తుంది.

Monday, June 4, 2012

రాజ్యసభ సభ్యుడిగా సచిన్ ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ,జూన్ 4:  : సచిన్ టెండుల్కర్ సోమవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.  రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ తన ఛాంబర్ లో సచిన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సచిన్ సతీమణి అంజలి, ఐపీఎల్ చీఫ్ రాజీవ్ శుక్లా తదితరులు హాజరయ్యారు. ఎంపీగా ప్రమాణం చేసిన  సచిన్ ను  కేంద్రమంత్రి నారాయణస్వామి శాలువకప్పి సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు సచిన్ ను అభినందించారు. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తొలి క్రికెటర్ సచిన్ కావటం విశేషం.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...