పరకాలపై బిజెపి, తెరాసల చెలగాటం...జేఏసీ కి సంకటం
హైదరాబాద్ ,మే 16: : వరంగల్ జిల్లా పరకాల శానససభ నియోజకవర్గం అభ్యర్థిని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించింది. పరకాలకు బిక్షపతిని తమ అభ్యర్థిగా తెరాస అధికారికంగా ప్రకటించింది. బిజెపి కూడా పోటీకి సిద్ధమవుతుండడంతో ఈ రెండు పార్టీల్లో తెలంగాణ రాజకీయ జెఎసి ఏ పార్టీకి మద్దతు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా, బిజెపి, తెరాసల తీరు పట్ల తెలంగాణ జేఏసీలోని మెజారిటీ సభ్యులు అసహనం ప్రదర్శిస్తున్నారు. రాజకీయ పార్టీల నుంచి దూరం జరిగి స్వతంత్రంగా ఎదుగుదామని, అందుకు పరకాల ఉప ఎన్నికనే వేదిక చేసుకుందామని జేఏసీ నాయకత్వానికి ప్రతిపాదించారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వానికే వారంతా మద్దతు పలుకుతున్నారు. అభ్యర్థుల ఖరారుపై ఏ దశలోనూ తమను సంప్రదించని ఆయా పార్టీల అధినాయకత్వాలు, ఓటమిపాలైతే మాత్రం నిందిస్తున్నాయని మెజారిటీ సభ్యులు అన్నట్లు తెలుస్తోంది. ఏమైనా, మెజార్టీ ప్రజలు కోరుకున్న పార్టీకే మద్దతు ఇవ్వాలని జేఏసీ అభిప్రాయ పడుతున్నట్టు సమాచారం.
Comments