Tuesday, January 21, 2014

మహానటుని మహాభినిష్క్రమణం...

హైదరాబాద్, జనవరి 22:
మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు  మరిలేరు. మంగళవారం తెల్లవారు ఝామున  2 గంటల సమయంలో ఆయన  హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న అక్కినేని తెల్లవారుజాము 1.30కు తీవ్ర అస్వస్థతతో గురి కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన  ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి చాలావరకు విషమించింది. వైద్యులు  అన్నిరకాలుగా ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. ఆఖరి క్షణాల్లో కుమారుడు, సినీ నటుడు నాగార్జునతో పాటు కుటుంబ సభ్యులంతా ఆయనతోనే ఉన్నారు. అక్కినేని తన సుదీర్ఘ నట జీవితంలో 256 సినిమాల్లో నటించారు. దాదాసాహెబ్ ఫాల్కే నుంచి పద్మవిభూషణ్ దాకా పలు అవార్డులు అందుకున్నారు. తాను కేన్సర్ బారిన పడినట్లుగా గత ఏడాది అక్టోబర్ 19న ఆయన మీడియా సమావేశం లో  చెప్పారు. ఆత్మబలంతో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించిన అక్కినేని  1924 సెప్టెంబర్ 20 న కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురం లో జన్మించారు.  చిన్ననాటినుండే నాటకరంగంవైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో నాయిక (ఆడ) పాత్రలను పోషించారు.  1940 లో విడుదలైన "ధర్మపత్ని" ఆయన  మొదటి చిత్రం. అయితే పూర్తి స్థాయి కథా నాయకుడిగా నటించిన మొదటి చిత్రం "శ్రీ సీతారామ జననం" (1944). ఆ చిత్రంలో రాముని పాత్రతో ప్రారంభించిన నటజీవితం బాలరాజు, కీలుగుర్రం, లైలామజ్ను, దేవదాసు, విప్రనారాయణ, దొంగరాముడు, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ, మాయాబజార్, తోడికోడళ్ళు, బాటసారి, అనార్కలి, మూగమనసులు, మంచిమనసులు, ఆత్మబలం, అంతస్తులు, ఇద్దరు మిత్రులు, అమరశిల్పి జక్కన, దసరా బుల్లోడు, బంగారు బాబు, ప్రేమ నగర్, భక్త తుకారాం, సెక్రెటరీ, మహకవి క్షేత్రయ్య, ప్రేమాభిషేకం, బహుదూరపు బాటసారి, సీతారామయ్య గారి మనవరాలు, సూత్రధారులు, కాలేజీ బుల్లోడు, శ్రీ రామదాసు మొదలైన చిత్రాల్లోని పాత్రలతో అప్రతిహతంగా కొనసాగింది.   మట్టి మనుషులు, ఒకే ఒక్కడు టీవీ సీరియల్స్ లో కూడా ఆయన నటించారు. "సుడిగుండాలు", "మరో ప్రపంచం" వంటి సందేశాత్మక చిత్రాలను శ్రీ ఆదుర్తి సుబ్బారావుతో "చక్రవర్తి చిత్ర" పతాకంపై నిర్మించారు. గుడివాడలోని కళాశాలకు భూరి విరాళమిచ్చినందుకు ఆ కళాశాలకు  అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఎ. ఎన్. ఆర్. కాలేజీ గా పేరు పెట్టారు. తాను చదువుకోలేనందుకే పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్ధులకు ఉపకారవేతనాలు, విరాళాలు ఏర్పాటు చేశారు. అక్కినేనితో అన్నపూర్ణ వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది.వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. భార్య పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు.అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ ద్వారా.. కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్లు సుమంత్, అఖిల్ సహా పలువురు నటీనటుల్నీ, దర్శకుల్నీ పరిచయం చేశారు.అన్నపూర్ణ 28.12.2011 న మృతి చెందారు. నాగేశ్వర రావు మ్ర్టితో తెలుగు సినీ పరిశ్రమలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది.

Sunday, January 19, 2014

ఇందుకే విడాకులా..!!?

ఇటీవల నెల్సన్ మండేలా మెమోరియల్ కార్యక్రమంలో డెన్మార్క్ ప్రధాని ధోర్నింగ్ ష్మిడ్ట్‌తో ఒబామా ...

ఓటమితో ఐదు వన్ డేల సీరీస్ ను ప్రారంభించిన టీమిండియా..

నేపియర్, జనవరి 19 : భారత్-న్యూజిలాండ్  మద్య  ఐదు వన్ డేల సీరీస్ లో భాగంగా నేపియర్‌లో ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీం ఇండియా 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 293 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లకు గానూ 48.4 ఓవర్లలో 268 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయ్యింది. అత్యధికంగా విరాట్ కోహ్లీ 123 పరుగులు చేసి టీమ్‌కు అండగా నిలిచాడు. అయినా ఓటమి తప్పలేదు.
భారత్ స్కోర్ వివరాలు : శర్మ : 3, థావన్ : 32, కోహ్లీ : 123, రహానే : 7, రైనా : 18, కెప్టెన్ ధోనీ : 40, జడేజా : 0, ఆశ్విన్ : 12, కుమార్ : 6, ఇషాంత్ శర్మ : 5, షమీ (నాటౌట్) : 7, ఎగట్రాస్ : 15.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిల్యాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసి, 293 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది.
న్యూజిల్యాండ్ స్కోర్ వివరాలు : గుప్తిల్‌-8, రైడర్‌-18, విలియమ్‌సన్‌-71, టేలర్‌-55, మెక్‌కల్లమ్‌-30, అండర్సన్‌-68 నాటౌట్‌, రాంచీ : 30, ఎన్ఎల్ మెకల్లామ్ : 2, సౌతీ (నాటౌట్) : 3, ఎక్స్‌ట్రా : 7.


Monday, January 13, 2014

నటి అంజలీదేవి కన్నుమూత....

చెన్నై,జనవరి 13:  సిని9ఇ  నటి అంజలీదేవి (86) కన్నుమూశారు. అనారోగ్యంతో గత వారం రోజులుగా చెన్నైలోని విజయ హాస్పటల్ లో చికిత్స  పొందుతున్న    ఆమె సోమవారం   తుది శ్వాస విడిచారు.  అవయవ దానం కోసం అంజలీ దేవి భౌతికకాయాన్ని చెన్నై రామచంద్రా మెడికల్ కళాశాలకు పంపారు. 1928 ఆగస్ట్ 24న తూర్పుగోదావరి జిల్లా పెద్దపురంలో అంజలీదేవి జన్మించారు. ఆమె అసలు పేరు అంజనీ కుమారి. అనార్కలీగా, సీతగా..  పలుపాత్రలకు ఆమె జీవం పోశారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావుల సరసన అత్యధిక సినిమాల్లో ఆమె  హీరోయిన్‌గానే కాకుండా వారికి తల్లిగా కూడా కొన్ని సినిమాల్లో నటించడం  విశేషం. 'గొల్లభామ' సినిమాతో అంజలీదేవి చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆదినారాయణరావును  వివాహం చేసుకున్నారు. ‘లవకుశ’ సినిమాలోని సీత పాత్ర ప్రేక్షకులకు దగ్గరయ్యారు.  సువర్ణ సుందరి, అనార్కలి, కీలుగుర్రం, భక్తతుకారాం, బడిపంతులు, శ్రీ షిర్డిసాయిబాబా మహత్యం, చెంచులక్షి తదితర 500 పైగా చిత్రాల్లో ఆమె నటించారు.  హిందీ చిత్ర సీమలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె హిందీలో 28 చిత్రాల్లో నటించారు.  27 చిత్రాలకు నిర్మాణ సారథ్య బాధ్యతలు చేపట్టారు. 1955లో అనార్కలి చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకోగా, 1957లో సువర్ణ సుందరి చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు, 1958లో చెంచులక్ష్మి చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును, 1959లో జయభేరి చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు.సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను అంజలీదేవికి 2005లో రఘుపతి వెంకయ్య అవార్డు, 2006లో రామినేని అవార్డు, 2008లో ప్రతిష్టాత్మకమైన అక్కినేని నాగేశ్వరరావు అవార్డులు లభించాయి. 1994లో  ’పోలీస్‌ అల్లుడు’  చివరి సినిమా.

 

Tuesday, January 7, 2014

అసెంబ్లీకి పంపిన విభజన బిల్లు ఒట్టొట్టిదే...కేంద్ర హోం శాఖ

న్యూఢిల్లీ, జనవరి 7 : ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ నుంచి ఈనెల 23వ లేదీ లోపల టి. బిల్లు కేంద్రానికి వచ్చినా రాకపోయినా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుందని కేంద్ర హోంశాఖ   రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి  రాసిన లేఖ లో స్పష్టం చేసినట్టు సమాచారం. టి. బిల్లుపై శాసనసభలో సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలకు  పార్లమెంట్‌లోనే సమాధానం చెబుతామని,   ఫిబ్రవరి 3వ తేదీ నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా బిల్లు ప్రవేశపెడతామని కేంద్రహోంశాఖ తెలిపింది. ఒక వేళ రాష్ట్రపతి ఒక నెలరోజులు గడువు ఇస్తే మాత్రం చెప్పలేమని హోంశాఖ తెలిపింది.  ఫిబ్రవరి మూడవ తేదీ నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. బిల్లుపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరుగుతుందని, రాష్ట్ర శాసనసభకు  పంపింది ముసాయిదా బిల్లు మాత్రమేనని  హొం శాఖ తెలిపింది. పార్లమెంటులో ప్రవేశపెట్టేదే తుది బిల్లు అని కూడా ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం. తుది బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుందని వివరించింది.

Sunday, January 5, 2014

హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య...

సినీ నటుడు హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారు.  హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన  ప్లాట్‌లో ఉరి వేసుకున్న  ఆయనను హుటాహుటిన  ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.  కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమంటూ ఓ లేఖ దొరికినట్టు సమాచారం . ఉదయ్ కిరణ్  తొలి సినిమా   'చిత్రం' కాగా నువ్వునేను, మనసంతానువ్వే, శ్రీరాం చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 'నువ్వునేను' సినిమాలో నటనకు గాను 2011లో ఫిలింఫేర్ అవార్డు పొందారు.  ఉదయ్‌కిరణ్ తమిళం తో పాటు  మొత్తం 19 సినిమాలలో నటించారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వార్త  సినీ పరిశ్రమ వర్గాలను,  అభిమానులను  తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.

జిఎస్ ఎల్ వి-డి5 ప్రయోగం సక్సెస్...

 నెల్లూరు,జనవరి 5:  శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్  నుంచి  జిఎస్ ఎల్ వి-డి5 రాకెట్ ను ఆదివారం సాయంత్రం 4:18 గంటలకు  విజయవంతం గా ప్రయోగించారు. ఈ రాకెట్ ద్వారా  జిశాట్ -14 సమాచార  ఉపగ్రహాన్ని ప్రయోగించారు.  భారత అంతరిక్ష ప్రస్థానంలో ఇది  మరో కీలక ప్రయోగం . ఈ ప్రయోగాన్ని గతేడాది ఆగస్టు 19నే చేపట్టాల్సి ఉండగా, రాకెట్ రెండో దశలో ఇంధన లీకేజీ కారణంగా ఆఖరి గంటలో వాయిదా పడింది. ఇస్రో ఇంతవరకూ ఏడు జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు చేపట్టింది. రెండే  విజయవంతం అయ్యాయి. జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లో కీలక దశ అయిన అప్పర్ క్రయోజెనిక్ దశను ఇస్రో స్వదేశీయంగానే తయారుచేసింది. జీఎస్‌ఎల్‌వీ  డీ-5 పొడవు: 49.13 మీటర్లు,,, బరువు: 414.75 టన్నులు ...ప్రయోగం ఖర్చు: రూ.205 కోట్లు  (రాకెట్‌కు రూ.160 కోట్లు, ఉపగ్రహానికి రూ.45 కోట్లు) ... జీశాట్-14 బరువు:1,982 కిలోలు... పనిచేసే కాలం: 12 ఏళ్లు.

Friday, January 3, 2014

రాహుల్ కు పొగడ్త...మోడీకి తెగడ్త...ప్రధాని 'ప్రె(తు)స్ ' కాన్ ఫరెన్స్ !

న్యూఢిల్లీ, జనవరి 3:  గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ  ప్రధానమంత్రి కావడం దేశానికి వినాశకరం అన్నది తన అభిప్రాయమని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. గుజరాత్‌లో జరిగిన మారణకాండ మరోసారి ఈ దేశంలో జరగాలని కోరుకోవడం లేదని ఆయన  ఢిల్లీలో  విలేకరుల సమావేశంలో అన్నారు.  గత పదేళ్లలో ప్రధాన మంత్రి  ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడడం ఇది మూడవ సారి. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి తమను తాము నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని మన్ మోహన్ పేర్కొన్నారు.  అవినీతి ప్రధానమైన అంశమని, దీనిని కేజ్రీవాల్  సమర్థవంతంగా ప్రజల ముందు కు తీసుకు వెళ్ళారని అన్నారు. తాము అధికారంలో ఉన్నంత వరకు సంస్కరణలు కొనసాగిస్తామని చెప్పారు.  తనకు కాంగ్రెసు పార్టీ నుండి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నుండి ఎప్పుడూ అనూహ్య మద్దతు లభించిందన్నారు. పదేళ్లలో ఎప్పుడూ కాంగ్రెసు పార్టీ, ప్రభుత్వం మధ్య విభేదాలు రాలేదన్నారు. రెండు అధికార కేంద్రాలున్నాయన్నది అవాస్తవమని కొట్టి పారేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఇబ్బందులు సహజమన్నారు.  2014 ఎన్నికల తర్వాత ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి యూపిఏ నాయకత్వం వహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. అవినీతిపై తనను ఎప్పుడు ఎవరు ప్రశ్నించలేదన్నారు. పార్టీ యువ నాయకత్వం కొత్తతరం ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణం గా పనిచేస్తోందని తెలిపారు. రాహుల్ సమర్థుడైన నాయకుడని ప్రశంసించారు.





తథా సభ..యథా వాయిదా...

హైదరాబాద్, జనవరి 3: అసెంబ్లీ రెండో విడత శీతాకాల సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమైన వెంటనే వాయిదా పడ్డాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీమాంధ్ర ఎమ్మెల్యేలు, తెలంగాణ బిల్లుపై చర్చ జరపాలంటూ తెలంగాణ ఎమ్మెల్యేలు సభలో నిరసనకు దిగారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. సభ్యుల నిరసనల మధ్యే వివిధ పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించి, ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. అయితే సభలో రభస కొనసాగడంతో స్పీకర్ సభను అరగంటపాటు వాయిదా వేశారు. తరవాత కూడా గంద్రగోళం కొనసాగడం తో సభ ను రేపటికి వాయిదా వేశారు. శాసన మండలి కూడా ఇదే తరహాలో రేపటికి వాయిదా పడింది.  

Thursday, January 2, 2014

రాష్ట్ర ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి

హైదరాబాద్, జనవరి 2 : ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. జనవరి నెల వేతనం నుంచి  నగదు రూపంలో మధ్యంతర భృతి చెల్లిస్తారు. మార్చిలో పదవ పీఆర్సీని ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళతామని ఉద్యోగ సంఘాల నేతలకు  ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

బలం నిరూపించుకున్న ఆప్...

న్యూఢిల్లీ,జనవరి 2 : ఢిల్లీ శాసనసభలో    ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన బలం నిరూపించుకుంది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో నెగ్గింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీకి  మద్దతు పలికారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిన విషయం తెలిసిందే. బిజెపి సభ్యులు విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. 37 మంది సభ్యుల మద్దతుతో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఆప్ కు చెందిన 28 సభ్యులు, కాంగ్రెస్ కు చెందిన 8, ఒక జెడియు సభ్యుడు మద్దతు పలికారు.

శ్రీధర్‌బాబు రాజీనామా

హైదరాబాద్,జనవరి 2 : మంత్రి శ్రీధర్‌బాబు తన  పదవికి రాజీనామా చేశారు. శాసనసభ వ్యవహారాలశాఖ నుంచి తనను తప్పించినందుకు ఆగ్రహం తో ఉన్న  శ్రీధర్ బాబు తన సన్నిహితులతో సుదీర్ఘ మంతనాల అనంతరం రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపారు. వాస్తవానికి నిన్ననే  రాజీనామాకు సిద్ధ మయ్యారు. అయితే సహచర సీనియర్ మంత్రులు జానారెడ్డి, పొన్నాల తదితరులు రాజీనామా చేయొద్దని వారించడంతో కొంత సంశయంలో పడ్డారు. తెలంగాణ ఏర్పాటు తుది దశకు చేరిన తరుణంలో రాజీనామా చేస్తే అసెంబ్లీలో విభజన బిల్లు చర్చ పై ప్రభావం చూపుతుందని చెప్పివారు  శ్రీధర్‌బాబును బుజ్జగించారు. కానీ శ్రీధర్‌బాబు మాత్రం తన పట్ల సీఎం వ్యవహరించిన తీరును జీర్జించుకోలేక రాజీనామా చేశారు.
 

Wednesday, January 1, 2014

సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రానున్న నేనొక్కడినే' సినిమా   థియేటర్ ట్రైలర్ బుధవారం విడుదల అయింది.ఇందులో చిన్నప్పటి మహేష్‌బాబు పాత్రను ఆయన  తనయుడు గౌతమ్ పో షించాడు.

అగస్టా వెస్ట్ లాండ్ తో ఒప్పందం రద్దు...

న్యూఢిల్లీ, జనవరి 1:  భారత య వైమానిక దళానికి 12 వీవీఐపీ హెలికాప్టర్లను సరఫరా చేయడానికి ఆంగ్లో-ఇటాలియన్ కంపెనీ అగస్టా వెస్ట్ లాండ్ తో గతంలో కుదిరిన భారీ ఒప్పందాన్ని భారత్ రద్దుచేసుకుంది. రూ. 3,600 కోట్ల విలువైన ఈ ఒప్పందం కుదరడానికి ఆ కంపెనీ కొంతమంది వ్యక్తులకు రూ. 360 కోట్లు లంచం ముట్టజెప్పిందని ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2010లో కుదిరిన ఈ ఒప్పందం కోసం భారత వైమానిక దళం మాజీ అధిపతి ఎస్.పి. త్యాగి తదితరులకు భారీ మొత్తంలో లంచాలు ముట్టజెప్పారని ఆరోపణలు వచ్చాయి.ఈ కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది.  ఈ తరుణంలో  బుధవారం ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీల మధ్య జరిగిన  సమావేశం అనంతరం ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. కాగా, మొత్తం 12 హెలికాప్టర్లకు గాను ఇప్పటికే మూడింటిని అగస్టా వెస్ట్ లాండ్ సంస్థ భారత్ కు పంపేసింది. ఇప్పుడు ఈ కంపెనీతో ఆర్బిట్రేషన్ కు వెళ్లాలని భారత్ నిర్ణయించుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

శాఖల మార్పుపై సంజాయిషీ చెప్పాలా,,,! సి.ఎం.

హైదరాబాద్, జనవరి 1: మంత్రుల శాఖల  మార్పుపై తానెవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి  స్పష్టం చేశారు. సీఎంగా తనకు శాఖలను మార్పు చేసే అధికారం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో 9.5 శాతం ప్రభుత్వ రెవెన్యూ తగ్గిందని అందుకే శ్రీధర్‌బాబుకు వాణిజ్య పన్ను శాఖను అప్పగించినట్లు ముఖ్యమంత్రి  తెలిపారు. జనవరి 23 వరకు అసెంబ్లీలో చర్చ జరగడంపైనే తన దృష్టి అని, సమైక్యం కోరుకునే ఎమ్మెల్యేలు చర్చలో పాల్గొనాలని, బంతి వేశాకే ఎలా ఆడాలో నిర్ణయిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.  భవిష్యత్‌పై తనకెప్పుడూ అంచనాలు లేవని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని తెలంగాణ నుంచే తనకు ఎక్కువగా లేఖలు వచ్చాయని సీఎం తెలిపారు జగన్ మీడియాతో మాట్లాడినంత మాత్రాన సమైక్యవాదం వినిపించినట్లు కాదని సీఎం అన్నారు. అసెంబ్లీలో చర్చ సజావుగా జరిగితేనే ఏ ప్రాంతాలకు లాభం, నష్టం జరిగిందో వివరించవచ్చునని ఆయన అన్నారు.
కొత్తశాఖ పై ఇప్పుడే స్పందించను-శైలజానాథ్
కొత్తగా అప్పగించిన మంత్రిత్వ శాఖ గురించి ఇప్పడే స్పందించనని, రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోదని సమైక్యంగానే ఉంటుందని మంత్రి శైలజానాథ్ స్పష్టం చేశారు.
వాణిజ్య పన్నులు నాకొద్దు-శ్రీధర్ బాబు
వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పదవికి అర్హులైన వారు ఎంతో మంది మంత్రివర్గంలో ఉన్నారని ,అలాంటి వారికి  ఆ శాఖ అప్పగిస్తే బాగుండేదని మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతలు చేపట్టే ప్రసక్తి లేదని పష్టం చేశారు.  సహచర మంత్రులతో చర్చించి తర్వాత  తన భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని శ్రీధర్ బాబు ఈ సందర్భంగా వెల్లడించారు.




ఒక్కసారిగా 215 రూపాయలు పెరిగిన నాన్ సబ్సిడీ సిలిండర్ల ధర...

హైదరాబాద్, జనవరి 1:  వంట  గ్యాస్ ధర మరింత పెరిగింది. నాన్ సబ్సిడీ సిలిండర్ల ధరను ప్రభుత్వం ఒక్కసారిగా 215 రూపాయలు పెంచేసింది. అంటే, ఏడాదికి తొమ్మిది సిలిండర్లు దాటితే  పదో సిలిండర్ నుంచి ఒక్కోటీ రూ. 1327.50 పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ ధర  1112.50 రూపాయలు గా ఉంది. దీంతోపాటు సబ్సిడీ సిలెండర్‌ ధరను కూడా స్వల్పంగా  పెంచారు. రాయితీ పోను హైదరాబాద్‌లో  సిలెండర్‌ ధర రూ.441కు  చేరుకుంది. ఇది ఇప్పటివరకు రూ. 411.50 గా ఉంది.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...