Thursday, February 27, 2014

హైదరాబాద్ ఆదాయం మొత్తం తెలంగాణకే.... ప్రత్యేక హోదాతో సీమాంధ్రకు 90 శాతం కేంద్ర నిధులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 : హైదరాబాద్ నుంచి వచ్చిన ఆదాయం మొత్తం తెలంగాణకే చెందుతుందని, సీమాంధ్రకు వెళ్లదని కేంద్రం మంత్రి జైరాం రమేష్ పేర్కొన్నారు.  ఎన్నికల కోసమే రాష్ట్రాన్ని విభజించారని వస్తున్న ఆరోపణలను ఖండించారు. తెలంగాణ డిమాండ్ 60 ఏళ్ళ నుంచి ఉందని, 1969, 70లో తెలంగాణ, జైఆంధ్ర ఉద్యమాలు వచ్చాయని ఆయన అన్నారు. 2004లోనే తెలంగాణపై కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, 2009 ఎన్నికల్లో తెలంగాణపై వైఎస్ హామీ ఇచ్చారని జైరాం రమేష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుపై 2013లో సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. విభజన నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదని ఆయన స్పష్టం చేశారు. పదేళ్లపాటు చర్చలు జరిపామని, తెలంగాణ బిల్లు రాజ్యాంగబద్ధంగా రూపొందించినట్లు జైరాం రమేష్ తెలిపారు. తాము సీమాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. చారిత్రక, రాజకీయ కారణాలతో విడదీసినా తెలుగు వారంతా ఒక్కటే అన్నారు. సీమాంధ్రకు ఆరు సూత్రాల పథకం అమలు చేస్తామని ప్రధాని ప్రకటించారని  జైరాం రమేష్  చెప్పారు. ప్రత్యేక హోదాతో సీమాంధ్రకు 90 శాతం నిధులు కేంద్రం ఇస్తుందని ఆయన చెప్పారు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందన్నారు. పోలవరంను బహుళార్ధక సాధక ప్రాజెక్టుగా కేంద్రం పూర్తి చేస్తుందని, రెండు రాష్ట్రాల్లో 371డి కొనసాగుతుందని, రాష్ట్రస్థాయి ఉద్యోగులకు ఆప్షన్స్ ఉంటాయని జైరాం రమేస్ స్పష్టం చేశారు.  అపాయింటెడ్ డే ప్రకటించడానికి భారీగా కసరత్తు జరగాల్సి ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటుకు మూడు నెలలు పట్టిందని  ఆయన గుర్తు చేశారు.  ఐదేళ్లలో సీమాంధ్రకు కేంద్రం నుండి యాభైవేల కోట్ల రూపాయలు వస్తాయని జైరాం రమేష్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు తొంబై శాతం నిధులు కేంద్రం ఇస్తుందన్నారు. రాష్ట్రంలో 84వేల మంది ఉద్యోగుల విభజన ఉంటుందన్నారు. సీమాంధ్రకు ఐఐటి, ఎయిమ్స్, సూపర్ స్పెషల్ ఆసుపత్రులు వస్తాయని జైరాం రమేష్ పేర్కొన్నారు.  ఇప్పుడున్న ప్రాజెక్టులు యథాతథంగా ఉంటాయని, తెలంగాణ విషయంలో కోర్టుకు వెళ్లినా ఇబ్బందులు ఏమీ ఉండవన్నారు.  ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు డిపిఆర్ హోదా లేదని, అందుకే జాతీయ ప్రాజెక్టుగా గుర్తించలేకపోయామని జైరాం రమేష్  పేర్కొన్నారు.
కేసీఆర్ పై విమర్శ..
 సామాజిక తెలంగాణ కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యమని, కేసీఆర్ అధికారంలోకి వస్తే దొరల రాజ్యమవుతుందని ఆయన ఘాటుగా విమర్శలు చేశారు. జాగో బాగో నినాదాలతో కేసీఆర్ సీమాంధ్ర  ప్రజలను రెచ్చగొట్టారని, ఆయన చేసిన వ్యాఖ్యలతో సీమాంధ్ర ప్రజలు భయాందోళనలకు గురయ్యారని జైరాం రమేస్ టీ. జేఏసీ నేతలతో అన్నారు. కాంగ్రెస్‌లో విలీనం కాకపోతే టీఆర్ఎస్ పార్టీ కూడా మరో ఆమ్ఆద్మీ పార్టీ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధి జాతీయ పార్టీలతోనే సాధ్యమని జైరాం రమేష్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కోసం ప్రయత్నిస్తామని ఆయన టీ.జేఏసీ నేతలకు హామీ ఇచ్చారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరండని టీ.జేఏసీ నేతలను ఈ సందర్భంగా ఆయన ఆహ్వానించారు.

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రాములమ్మ...

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 : మెదక్ జిల్లా ఎంపీ విజయశాంతి  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్ దిగ్విజయ్ సింగ్‌తో కలిసి ఆమె సోనియా గాంధిని ఆమె నివాసంలో కలుసుకున్నారు. కండువా కప్పి విజయశాంతిని  సోనియా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కల సాకారమైందని, గతంలో చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీలో చేరానని, పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రజలు సంతోషంగా ఉండాలని, రెండు ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.ఎవరైనా, ఏ నాయకుడైనాసరే ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండాలని విజయశాంతి కేసీఆర్‌ పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ కోసం అందరం కష్టపడ్డామని, ఈ నేపథ్యంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని ఆమె సూచించారు. అధిష్టానం ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని విజయశాంతి స్పష్టం చేశారు.

Friday, February 21, 2014

రోమింగ్ దౌర్భాగ్యం కూడా..

హైదరాబాద్,ఫిబ్రవరి 21:
రాష్ట్ర విభజన జరుగుతున్నందున తెలంగాణా, సీమాంధ్ర రాష్ట్రాల మధ్య ఫోన్‌కాల్స్‌కు రోమింగ్ వర్తిస్తుందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లో ఉన్న బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ మేనేజర్ కార్యాలయం ఇక తెలంగాణ పరిధిలోని పది జిల్లాలకు సేవలు అందిస్తుందని,  సీమాంధ్రులు తెలంగాణకు వెళితే రోమింగ్ చార్జీలు పడతాయని బీఎస్ఎన్ఎల్ వర్గాలు  పేర్కొన్నాయి.   సీమాంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ 13 జిల్లాలకు ఒక బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ నియమితులవుతారు. 

సీమాంధ్ర కు ' నవరత్న ' మర్దనా...!

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 21: ఆంధ్ర-తెలంగాణా రాష్ట్రాల మధ్య అధికారుల  పంపిణీపై కేంద్ర సిబ్బంది-శిక్షణ వ్యవహారాల శాఖ రెండు అధికారిక కమిటీలను నియమించింది. ఒక కమిటీ అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీ చూస్తుందని... రెండో కమిటీ రాష్ట్ర స్థాయి అధికారుల విభజన పూర్తి చేస్తుందని జీవోఎం సభ్యుడు, కేంద్ర మంత్రి జైరాం రమేశ్  తెలిపారు.   విభజన వల్ల సీమాంధ్రకు ఎంతో లాభం చేకూరిందని.  ప్రధాని ప్రకటించిన ఆరు ఆంశాల ప్యాకేజీ, హోంమంత్రి ప్రకటించిన మూడు అంశాల ప్యాకేజీతో ---నవరత్న ప్యాకేజీ---- ద్వారా సీమాంధ్ర
సీమాంధ్రకు ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించడం  వల్ల కేంద్రం నుంచి 90 శాతం గ్రాంట్లు, పది శాతం రుణాలు లభిస్తాయని ఆయన అన్నారు. సాధారణంగా అయితే రాష్ట్రాలకు 70 శాతం రుణాలు, 30శాతం గ్రాంట్లు లభిస్తాయని తెలిపారు.  ఇది కేవలం బీజేపీ నేతల ఒత్తిడి వల్ల తీసుకున్న నిర్ణయంకాదని,  ఎంపీలు, మంత్రులు రాహుల్ గాంధీని కలిసినప్పుడు తీసుకున్న నిర్ణయమని ఆయన చెప్పారు.  ప్రణాళికా సంఘంలో డిప్యూటీ చైర్మన్ ఆధ్వర్యంలో సీమాంధ్ర కోసం ప్రత్యేక విభాగం పనిచేస్తుందని చెప్పారు. పోలవరంను బహుళార్థ సాధక ప్రాజెక్టుగాగుర్తించి కేంద్రమే పూర్తి చేస్తుందని తెలిపారు. ముంపు ప్రాంతాలు, సహాయ పునరావాస ప్రాంతాలు సీమాంధ్రకే ఇచ్చి పోలవరం ప్రాజెక్టును నిరాఘాటంగా చేయడానికి వీలుగా త్వరలో ఆర్డినెన్స్ జారీ చేస్తామన్నారు. హంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరు నగరి, వెలుగోడు ప్రాజెక్టుల నిర్మాణం అనుకున్న ప్రకారమే పూర్తవుతాయని చెప్పారు.
ఇజ కొత్త రాజధాని   విషయంలో విభజన నోటిఫికేషన్ వెలువడిన వెంటనే  నిపుణుల కమిటీని నియమిస్తామని, ఈ కమిటీ ఆరు నెలల్లో రాజధాని ఎక్కడ నిర్మించాలో చెబుతుందని జైరాం రమేశ్ చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం అవసరమైతే అటవీ భూమిని డీనోటిఫై చేస్తామన్నారు. 'అప్పాయింట్ డే' నుంచి రెండు రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంత్రులు, డీజీపీలు, సీఎస్‌లు ఉంటారని తెలిపారు. ప్రస్తుతానికి 'అప్పాయింట్ డే'పై నిర్ణయం తీసుకోలేదని... గతంలో నోటిషికేషన్, అప్పాయింట్ డే మధ్య మూడు నెలల వరకు సమయం పట్టిందని చెప్పారు. కృష్ణా, గోదావరి నదుల యాజమాన్యం కోసం ప్రత్యేక నదీ బోర్డులను ఏర్పాటు చేస్తామని, వీటికి చైర్మన్లుగా కేంద్ర ప్రభుత్వ అధికారులే ఉంటారని ఆయన చెప్పారు.
  ప్రాంతానికి ఊహించని ప్రయోజనాలు చేకూరతాయని జైరాం రమేశ్ వివరించారు.

ప్రత్యేక హోదా ప్రయోజనాలు... !

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 20: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ గురువారం రాజ్యసభలో ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంటే ఏమిటి? దానివల్ల లభించే ప్రయోజనాలేమిటి? అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  1969లో తొలిసారి రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది.   ఐదు అంశాల ఆధారంగా ప్రత్యేక హోదా కల్పిస్తారు.-కొండ ప్రాంతాలు, ఆవాసానికి కష్టసాధ్యమైన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు,-తక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతాలకు,- దేశ సరిహద్దుల్లో అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన ప్రాంతాలు ఉన్న, విదేశాలతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలకు-ఆర్థికంగా, మౌలిక సదుపాయాల పరంగా, సామాజికంగా బాగా వెనకబడిన రాష్ట్రాలకు ..ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం ఉంది.
- 1969 నాటికి అసోం, జమ్ము-కశ్మీర్, నాగాలాండ్ రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక ప్రతిపత్తి ఉండేది. ప్రస్తుతం పదకొండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. అవి.. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము-కాశ్మీర్. - 2000 సంవత్సరంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసిన ఎన్డీయే సర్కారు ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించింది. దీనికి కారణం..ఉత్తరాఖండ్ కూడా వేరే దేశం (టిబెట్ )తో సరిహద్దు పంచుకోవడం. దీనికితోడు ఆ రాష్ట్రమంతా పర్వత ప్రాంతమయం.
ఈ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వనరుల కేటాయింపులో అత్యధిక వాటా లభిస్తుంది.  ఆ రాష్ట్రాలకు పరిశ్రమలు, ఉత్పాదక సంస్థలను తరలించేందుకు, తిరిగి ఏర్పరచేందుకు వీలైన విధంగా చెప్పుకోదగిన రీతిలో ఎక్సైజ్ సుంకం మినహాయింపులు లభిస్తాయి. దీనివల్ల  పరిశ్రమలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఉద్యోగావకాశా లు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. జీవన ప్రమాణాలు పెరుగుతాయి. పేదరికం తగ్గుతుంది.  కేంద్రం ప్రణాళికా వ్యయానికి అందించే స్థూల బడ్జెటరీ మద్దతులో 30 శాతం లభిస్తుంది. అలాగే  ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రణాళికా సాయంలో 90 శాతం మేర గ్రాంట్ల రూపంలోనూ.. మిగతా 10 శాతాన్ని రుణాల రూపేణా అందిస్తారు. మామూలు రాష్ట్రాలకు ఈ వాటా 70-30 శాతంగా ఉంటుంది.  నిర్దిష్ట కాలపరిమితి వరకే ప్రత్యేక హోదా ఉంటుందని ప్రకటించిన రాష్ట్రాలకు.. ఆ కాలపరిమితి ముగిసిన తర్వాత ఇంకా ఆ హోదా అవసరమని కేంద్రం భావిస్తే  మరింత పొడిగించే అవకాశం ఉంది. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలా..? వద్దా..? అన్న విషయాన్ని ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రణాళికా సంఘం సభ్యులతో కూడిన జాతీయ అభివృద్ధి మండలి నిర్ణయిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రణాళికా సంఘం, ఆర్థిక సంఘం కీలక పాత్ర పోషిస్తాయి. కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల పంపిణీని ఈ రెండు సంఘాలు పర్యవేక్షిస్తాయి. రాష్ట్ర ప్రణాళికల కోసం ఉద్దేశించిన నిధులను కేంద్ర సహాయం కింద ప్రణాళికా సంఘం ఆయా రాష్ట్రాలకు కేటాయిస్తుంది.  కేంద్ర సాయం మూడు రకాలుగా ఉంటుంది. సాధారణ కేంద్ర సాయం (ఎన్‌సీఏ), అదనపు కేంద్ర సాయం (ఏసీఏ), ప్రత్యేక కేంద్ర సాయం (ఎస్‌సీఏ). ఎన్‌సీఏ కేటగిరీ కింద అందించే మొత్తం సాయంలో 30 శాతం గ్రాంట్ల రూపంలో అందుతుంది. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు తమ అవసరాల మేర రుణాలు పొందే స్వేచ్ఛ ఉంటుంది. 90 శాతం గ్రాంట్లు, 10 శాతం రుణాల ఫార్ములాను కేంద్ర ప్రాయోజిక పథకాలు, విదేశీ సాయంతో నడిచే పథకాలకు వర్తింపజేస్తారు.
 ప్రస్తుతం రాష్ట్ర విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక, మౌలిక సదుపాయాల్లో వెనుకబాటుతనం, ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉండటం వంటి కారణాలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రత్యేక హోదా కల్పించారు.

Thursday, February 20, 2014

ఎన్నికల తర్వాతే ' విభజన' అమలు...?

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 20:  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సభాపరంగా సంపూర్ణమైంది.  ఇక రాష్ట్రపతి సంతకం  ఆ తరువాత  నోటిఫికేషన్ వెలువడగానే ఒక భాష, రెండు రాష్ట్రాలు , ఒక జాతి... రెండు రాష్ట్రాలు అమలులోకి వస్తాయి.  పది జిల్లాలతో నవ తెలంగాణ... పదమూడు జిల్లాలతో 'సరికొత్త' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆవిర్భవిస్తాయి.  మంగళవారం అరకొర చర్చ, అంతులేని గందరగోళం మధ్య లోక్‌సభలో ఆమోదం పొందిన 'ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2014' పై... గురువారం నిరంతర నిరసనలు,  గందరగోళం మధ్యే చర్చ, మూజువాణీ ఓటింగ్‌తో రాజ్యసభ సైతం ఆమోదముద్ర వేసింది. సీమాంధ్ర ఎంపీలతోపాటు... తృణమూల్ సభ్యులు వెల్‌లో నిరసనలతో హోరెత్తించారు. ఈ నిరసనల మధ్యే బిల్లును, ఆ తర్వాత అధికారిక సవరణలను మూజువాణీ ఓటుద్వారా ఆమోదించారు. బిల్లును లోక్‌సభ 'మమ' అనిపిస్తే.. రాజ్యసభ మాత్రం సుదీర్ఘంగా చర్చించి రాత్రి మూజువాణీ ఓటుతో ఆమోదించింది. రాష్ట్రానికి చెందిన ఎంపీలను సస్పెండ్ చేసి, పెద్దగా చర్చ లేకుండానే విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపితే... పెద్దల సభ మాత్రం తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. చర్చ తర్వాతే బిల్లుకు ఆమోదం తెలిపింది. సభలో ఆందోళన చేస్తున్న వారిలో ఒక్క ఎంపీని కూడా సస్పెండ్ చేయలేదు. అన్ని పార్టీలూ చర్చలో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. అధికార, ప్రతిపక్షాల మధ్య పలు విడతల్లో జరిగిన చర్చలు, కుదిరిన రాజీ ఒప్పందాల నేపథ్యంలో... బిల్లు ఆమోదానికి బీజేపీ రాజ్యసభలోనూ పూర్తిగా సహకరించింది. సీమాంధ్ర కోణంలో బీజేపీ అభ్యర్థనపూర్వకంగా చేసిన కొన్ని ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకరించింది. అందులో భాగంగానే... ఆంధ్రప్రదేశ్‌కు (సీమాంధ్ర) ఐదేళ్లపాటు 'ప్రత్యేక కేటగిరీ' హోదా ప్రకటించింది. ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో స్వయంగా ఈ ప్రకటన చేశారు. ప్రత్యేక కేటగిరీ హోదా పదేళ్లపాటు ఉండాలని బీజేపీ నేత వెంకయ్య డిమాండ్ చేయగా... 'పదేళ్లు కాదు, ఐదేళ్లే' అని హోంమంత్రి షిండే స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అమలైన తొలి సంవత్సరం... ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు ఏర్పడితే దానిని కేంద్రమే భరిస్తుంది. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, శాంతిభద్రతల నిర్వహణ అధికారాన్ని గవర్నర్‌కు అప్పగించడానికి రాజ్యాంగ సవరణ అవసరంలేదని న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ స్పష్టం చేశారు. .  ఉభయ సభల్లో బిల్లు గట్టెక్కగానే... తెలంగాణ వాదులు మరోమారు సంబరం చేసుకున్నారు.
తెలుగు వారిగా కలిసి ఉందాం-కె.సి.ఆర్.
'భౌగోళికంగానే విడిపోయాం. తెలుగు వారిగా కలిసి ఉందాం. కలిసి అభివృద్ధి చెందుదాం.. హైదరాబాద్‌లోని తెలుగు వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు'... అని టీఆర్ఎస్ అధిపతి కేసీఆర్, టీ-జేఏసీ అధ్యక్షుడు కోదండరాం తదితరులు హామీ ఇచ్చారు.
  ఎన్నికల తర్వాతే 'అప్పాయింట్ డే  ?
పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందడంతో... ఇక రాష్ట్రపతి ఇవ్వబోయే 'అప్పాయింట్ డే' (రాష్ట్ర విభజన అమలులోకి వచ్చే తేదీ)పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆదాయ వనరులు, ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపిణీ వంటివన్నీ సంతృప్తికరంగా పూర్తి చేసేందుకు కావాల్సినంత సమయముండేలా చూసుకొని... అప్పాయింట్ డే నిర్ణయిస్తారు. మరోవైపు... ఇప్పటికిప్పుడు విభజన అమలులోకి వస్తే... రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అందువల్ల, ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరిపి, ఆ తర్వాత 'అప్పాయింట్ డే' ప్రకటిస్తారని తెలుస్తోంది.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...