Tuesday, December 31, 2013

న్యూజిలాండ్‌కు భారత జట్టు: యువీకి ఉద్వాసన

న్యూఢిల్లీ, జనవరి 1: న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లే వన్డే క్రికెట్ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సెలెక్షన్ కమిటీ  ఎంపిక చేసింది. యువరాజ్ సింగ్‌కు ఉద్వాసన పలికారు. బౌలర్ మోహిత్ శర్మ స్థానంలో వరుణ్ అరోన్‌కు స్థానం కల్పించారు.  న్యూజిలాండ్‌తో భారత్ ఐదు వన్డే మ్యాచ్ లు ఆడుతుంది. నేపియర్‌లో జనవరి 19వ తేదీన జరిగే మ్యాచ్ తో వన్డే మ్యాచ్ల సిరీస్ ప్రారంభమవుతుంది. వన్డే సిరీస్  తర్వాత రెండు టెస్టు మ్యాచ్ లు జరుగుతాయి. తొలి టెస్టు ఫిబ్రవరి 6వ తేదీన ప్రారంభమవుతుంది.
వన్డే జట్టు: ఎంఎస్ ధోనీ (కెప్టెన్) శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్యా రహనే, అంబటి రాయుడు, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఈశ్వర్ పాండే, స్టార్ట్ బిన్నీ, వరుణ్ అరోన్
టెస్టు జట్టు: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్యా రహనే, రవీంద్ర జడేజా, జహీర్ ఖాన్, మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, అంబటి రాయుడు, భువనేశ్వర్ కుమార్, ఆర్ అశ్విన్, ఉమేష్ యాదవ్, వృద్ధిమాన్ సాహా, ఈశ్వర్ పాండే
వార్తా ప్రపంచం వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు...

కేబినెట్ లో కీలక మార్పు:శైలజానాథ్ కు శాసన సభా వ్యవహారాలు

హైదరాబాద్, డిసెంబర్ 31: రాష్ట్ర కేబినెట్ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకూ శాసన సభా వ్యవహారాల శాఖ బాధ్యతలు చూస్తున్న శ్రీధర్ బాబును ఆ శాఖ నుంచి తప్పించి   మంత్రి శైలజా నాథ్ కు అప్పగించారు.  ఇంతవరకు సి.ఎం. చేతిలో ఉన్న శ్రీధర్ బాబును  వాణిజ్య పన్నుల శాఖను  శ్రీధర్ బాబుకు  అప్పగించారు.   రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో కేబినెట్ లో అకస్మిక మార్పు విమర్శలకు తావిస్తోంది. సమైక్య నినాదం వినిపిస్తున్న శైలజా నాథ్ కు శాసన సభా వ్యవహారాల శాఖను అప్పగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగు భాషాభివృద్ధి శాఖ ను  వట్టి వసంత్ కుమార్‌కు అప్పగించారు.
 

Sunday, December 22, 2013

భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు డ్రా....

జొహన్నెస్‌బర్గ్, డిసెంబర్ 22:  ఉత్కంఠభరితంగా సాగిన భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు డ్రాగా ముగిసింది. భారీ విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని దగ్గరగా వచ్చినప్పటికీ విజయాన్ని అందుకోలేపోయింది. చివర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సఫారీ టీమ్ అతిపెద్ద లక్ష్యాన్ని ఛేదించే అవకాశాన్ని కోల్పోయింది. టీమిండియా నిర్దేశించిన 458 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఛేధించే క్రమంలో దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి 450 పరుగులు చేసింది. డీవిలియర్స్(103), డూఫ్లెసిస్(134) సెంచరీలతో చెలరేగడంతో సఫారీ జట్టు అతిపెద్ద లక్ష్యాన్ని ఛేదనకు చేరువగా వచ్చింది. 197 పరుగులకే నాలుగు వికెట్లు పడిన జట్టును వీరిద్దరూ సెంచరీలతో ఆదుకుని  గెలుపుబాటలోకి తీసుకొచ్చారు.  చివరి ఓవర్లలో ధోని సేన సమిష్టిగా రాణించి ఆతిథ్య జట్టును కట్టడి చేసి మ్యాచ్ డ్రాగా ముగించింది. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టాడు. జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీశారు.

Sunday, December 8, 2013

సఫారీలకే వన్ డే సీరీస్...

డర్బన్, డిసెంబర్ 8: వరసగా రెండో వన్డేలోనూ ఓటమితో భారత్ మూడు  వండేల   సీరీస్ ను  దక్షిణాఫ్రికాకు సమర్పించుకుంది.  ఆదివారం  రెండో వన్డేలో భారత్ 134 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్దింగ్ ఎంచుకోవడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సఫారీలు 281 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందుంచారు. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే చుక్కెదురైంది. శిఖర్ థావన్ (0) కే వెనుదిరగడంతో భారత్ పతనం ప్రారంభమైంది. మిగతా భారత్ ఆటగాళ్లు కోహ్లి (0), రోహిత్ శర్మ(19),ధోని(19), జడేజా (26), సురేష్ రైనా(36) పరుగులు చేశారు. భారత్ 35.1ఓవర్లలో 146 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో త్సోసిబా నాలుగు వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించగా, స్టెయిన్ కు మూడు, మోర్కెల్ కు రెండు వికెట్లు దక్కాయి. 

రాజస్థాన్ కా వసుంధరా రాణీ ...


అహో...ఇది ఆంధ్రాను చీల్చిన పాపమా...


ఘనమైన చరిత్రకు దౌర్భాగ్యపు ముగింపు...


విజయ మూ(మో)డీ... !


అపూర్వ విజయం....కేజ్రీవాల్

న్యూఢిల్లీ, డిసెంబర్ 8 :  ఢిల్లీ ప్రజలు తమకు అందించిన విజయాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కైవసం చేసుకుని, ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్‌పై 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన  కేజ్రీవాల్  మీడియాతో మాట్లాడుతూ, ఇది చరిత్రాత్మక విజయమని, అవినీతికి, అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అని   పేర్కొన్నారు.  ఈ ఎన్నికల్లో అవినేతీ ప్రధానాంశమైందని అన్నారు. రాజకీయ ఉద్దండులను సామాన్యుడు దెబ్బతీశాడని కేజ్రీవాల్ అన్నారు. అవినీతి, ధరల పెరుగుదలకు తాము వ్యతిరేకమని , అందుకే ప్రజలు  పట్టం కట్టారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. సమర్థవంతంగా ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు తాము సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. 

పాఠాలు నేర్చుకుంటాం...

న్యూఢిల్లీ, డిసెంబర్ 8 :   నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఎన్నో కారణాలున్నాయని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ఎన్నికల ఫలితాలు తమకు తీవ్ర నిరాశను కలగించాయని, ఓటమిని అంగీకరిస్తున్నామని చెప్పారు. ఈ ఫలితాలు తమకు హెచ్చరికలాంటివని అన్నారు.  కుమారుడు రాహుల్ గాంధీతో కలసి విలేకరులతో మాట్లాడుతూ,  కాంగ్రెస్ ఓటమికి గల కారణాలను విశ్వేషించాల్సివుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఓటమికి స్థానిక పరిస్థితులతో పాటు ధరల పెరుగుదల ఒక కారణమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సరైన సమయంలో ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తుందని సోనియా చెప్పారు. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సివుందని రాహుల్ అన్నారు. ప్రజల అభిప్రాయాలకనుగుణంగా పనిచేసే సత్తా కాంగ్రెస్ కుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నాయకులు తగువిధంగా పనిచేయలేదని రాహుల్ వ్యాఖ్యానించారు.

కాషాయ ప్రభంజనం లో కొట్టుకుపోయిన కాంగ్రెస్...

న్యూఢిల్లీ, డిసెంబర్ 8 :  ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో, నాలుగు రాష్ట్రాలకు ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో 4 రాష్ట్రాల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సీట్లు సాధించగా, ఒక్క ఢిల్లీలో మ్యాజిక్ ఫిగర్‌కు మూడు సీట్ల దూరంలో బీజేపీ ఉంది. కాగా నాలుగు రాష్ట్రాల్లోనూ  ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్  సింగ్ చెప్పారు. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ ప్రజలు తమ పార్టీని ఆదరించారని, ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.తమ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆకర్షణ, ప్రచారం పార్టీకి కలిసొచ్చిందని రాజ్ నాథ్  అన్నారు 
ఎన్నిలక ఫలితాలు :
ఢిల్లీ, మొత్తం స్థానాలు 70 : బీజేపీ : 32, అమ్ అద్మీపార్టీ (ఏఏపీ) : 28, కాంగ్రెస్ 58, ఇతరులు : 2.
మధ్యప్రదేశ్, మొత్తం స్థానాలు 230 : బీజేపీ : 165, కాంగ్రెస్ 58, బీఎస్పీ : 4, ఇతరులు : 3.
రాజస్థాన్, మొత్తం స్థానాలు 199 : బీజేపీ : 162, కాంగ్రెస్ 21, ఇతరులు : 16.
ఛత్తీస్‌గడ్, మొత్తం స్థానాలు 90 : బీజేపీ : 49, కాంగ్రెస్ 39, బీఎస్పీ : 1, ఇతరులు : 1.
కాగా, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మరో రాష్త్రం మిజోరాం ఫలితాలు సోమవారం వెలువడతాయి.
కాషాయ ప్రభంజనం లో కొట్టుకుపోయిన కాంగ్రెస్...

Thursday, December 5, 2013

దక్షిణాఫ్రికా నల్ల సూరీడు అస్తమయం...

జోహెన్నెస్బర్గ్, డిసెంబర్ 5: దక్షిణాఫ్రికా నల్ల సూరీడుగా పేరొందిన నెల్సన్ మండేలా(95) గురువారం అర్థరాత్రి కన్నుమూశారు. నల్ల జాతీయుల హక్కుల కోసం 27 ఏళ్లు జైళ్లో గడిపిన మండేలా 1994-99 వరకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా  పనిచేశారు.ఆయనకు 1993లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. 2001 లో మండేలాకు గాంధీ అంతర్జాతీయ పురస్కారం లభించింది.  జాతి వివక్షతకు వ్యతిరేకంగా జరిపే పొరాటాలకు, వర్ణ సమానతకు నెల్సన్ మండేలా సంకేతంగా నిలిచారు.  జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో జరిగిన ఒక మారణకాండకు సంబంధించి 27 సంవత్సరాల పాటు "రోబెన్" అనే ద్వీపంలో జైలు శిక్షననుభవించారు. మహాత్మా గాంధీ బోధించిన శాంతియుత విధానాలు, అహింస, శత్రువును సంస్కారయుతంగా ఎదుర్కొనే పద్ధతి తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని మండేలా పలుసార్లు పేర్కొన్నారు. 

విభజన దిశగా మరో ముందడుగు...10 జిల్లాల తెలంగాణాకు కేంద్ర కేబినెట్‌ ఓ.కె.

న్యూఢిల్లీ, డిశంబర్ 5: :  రాష్ట్ర విభజనపై సుదీర్ఘ ఉత్కంఠకు తెరదించుతూ.. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ‘ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2013’ ముసాయిదాను గురువారం ఆమోదించింది. హైదరాబాద్ నగరాన్ని జీహెచ్‌ఎంసీ పరధిలో పదేళ్లకు మించని కాలానికి ఉమ్మడి రాజధానిగా చేస్తూ.. అందులో శాంతిభద్రతల బాధ్యతలను గవర్నర్‌కు అప్పగిస్తూ.. కృష్ణా, గోదావరి నదులపై నియంత్రణ బోర్డులను ఏర్పాటు చేస్తూ.. ఆస్తులు, అప్పుల పంపకానికి సవివరమైన విధివిధానాలను నిర్దేశిస్తూ రూపొందించిన ఈ బిల్లును శుక్ర, శనివారాల్లో రాష్ట్రపతికి పంపిస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే వెల్లడించారు. బిల్లుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ అభిప్రాయం తీసుకోవాలని రాష్ట్రపతిని కోరతామని.. ఆయన ఆ బిల్లును అసెంబ్లీకి పంపిస్తారని ఆయన చెప్పారు. అసెంబ్లీ నుంచి బిల్లు వచ్చిన తర్వాత తిరిగి కేంద్ర
విభజన ఇలా..
కేబినెట్‌లో చర్చించి తుది బిల్లును ఖరారు చేసి పార్లమెంటులో ప్రవేశపెడతామని తెలిపారు. గురువారం సాయంత్రం ఐదు గంటలకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ నివాసంలో  మూడు గంటలకు పైగా సుదీర్ఘంగా కొనసాగిన కేంద్ర కేబినెట్  సమావేశానికి.. కేంద్రమంత్రులైన ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా హాజరుకాలేదు. రాష్ట్ర విభజనపై తన అధ్యక్షతన ఏర్పాటయిన జీవోఎం ఏడు సార్లు సమావేశమైందని.. రాష్ట్రంలోని అన్ని పార్టీలతో పాటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇరు ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులతో కూడా చర్చలు జరిపిందని షిండే పేర్కొన్నారు. జీవోఎంకు 11 అంశాలపై వచ్చిన 18 వేల వినతులను పరిశీలించామని తెలిపారు. తమకు ఇచ్చిన 11 మార్గదర్శకాలకు అనుగుణంగా మంత్రివర్గానికి సిఫారసులు చేశామని చెప్పారు.
విభజన తర్వాత తెలంగాణలో 10 జిల్లాలు, మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలు ఉంటాయని షిండే ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ప్రాంతం ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాల కాలానికి మించకుండా ఉంటుందని చెప్పారు. ఉమ్మడి రాజధానిలో నివసించే వారి ప్రాణ, ఆస్తి, స్వాతంత్య్రాల భద్రతను కాపాడే ప్రత్యేక బాధ్యతను తెలంగాణ గవర్నర్‌కు అప్పగించనున్నట్లు వెల్లడించారు. ఈ అంశంలో గవర్నర్‌కు సహకారం అందించడానికి ఇద్దరు సలహాదారులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుందని తెలిపారు.విభజన తర్వాత.. ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధానిని గుర్తించటానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని.. ఇది 45 రోజుల్లో సిఫారసులు సమర్పిస్తుందని వెల్లడించారు. కొత్త రాజధాని నిర్మాణానికి, రెండు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందన్నారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వనరుల పంపిణీ విషయంలో ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాలు సూచించడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రమేయంతో ఓ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, ఆస్తులు, అప్పులతో పాటు బొగ్గు, విద్యుత్, చమురు, సహజవాయువుల పంపిణీకి అనుసరించాల్సిన విధానాలను రూపొందించామన్నారు. విద్య, ఉద్యోగాల్లో సమాన అవకాశాల కల్పనకు వీలుగా రాజ్యాంగంలోని 371డీ అధికరణ రెండు రాష్ట్రాల్లోనూ కొనసాగుతుందని చెప్పారు. ఉన్నత విద్యా సంస్థలు, వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే ఐదేళ్ల పాటు కొనసాగించనున్నామన్నారు.ఇరు రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని, మౌలిక సదుపాయాల కల్పనకు సహకారం అందిస్తుందని, ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ సంస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...