Saturday, December 19, 2015

నటుడు రంగనాథ్ ఇకలేరు...డిప్రెషన్ తో ఆత్మహత్య !

హైదరాబాద్,డిసెంబర్ 19; ప్రముఖ సినీ నటుడు రంగనాథ్‌ శనివారం సాయంత్రం మృతిచెందారు. హైదరాబాదు కవాడిగూడలో ఉన్న తన నివాసంలో ఆయన కన్నుమూశారు. సూమారు 300కు పైగా చిత్రాల్లోనటించిన ఆయన, పలు చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు.  50కు పైగా చిత్రాల్లో ప్రతినాయకుడిగా పాత్ర పోషించారు. మొగుడ్స్-పెళ్లామ్స్ చిత్రానికి దర్శకత్వం వహించారు. పలు సీరియళ్ళలో కూడా ఆయన నటించారు.చెన్నై నగరంలో 1949లో జన్మించిన రంగనాథ్‌. 1969లో బుద్ధిమంతుడు సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించారు. చందన (1974) చిత్రంలో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చారు.  టీసీగా పనిచేస్తూ సినీరంగలోకి ప్రవేశించిన రంగనాథ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చాలాకాలం కిందటే ఆయన భార్య ప్రమాదవశాత్తు గాయపడి మంచానికి పరిమితం కాగా, ఎన్నో ఏళ్ళపాటు ఆమెను చనిపోయేవరకు చంటిబిడ్డలా చూసుకున్నారు. ఆమె మరణం తర్వాత రంగనాథ్ ఎంతో కుంగిపోయినప్పటికీ అత్యంత మనోనిబ్బరంతో ఆ వేదన నుంచి బయటపడి కవితా రచనలో నిమగ్నమయ్యారు.  కాగా రంగనాథ్ ఒంటరితనం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు. అనుమానం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 


Thursday, December 10, 2015

రజని వరద విరాళం 10 కోట్లు

చెన్నై, డిసెంబర్ 10; తమిళసూపర్‌స్టార్ రజనీకాంత్ చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. వరదల్లో నిరాశ్రయులైన బాధితులకు భారీ మొత్తంలో రూ.10కోట్లు విరాళాన్ని ప్రకటించారు. బాధితుల సహాయార్థం ప్రకటించిన విరాళాన్ని తమిళనాడు సీఎం సహాయనిధికి చెక్ రూపంలో పంపించారు. చెన్నైలో వచ్చిన భారీ వరదలతో నిరాశ్రయులైన వేలాదిమంది త్వరగా యధాస్థితికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నెల 12న రజినీకాంత్ 65వ పడిలోకి అడుగుపెడుతున్నారు. 

కె.సి. ఆర్ . కెటిఆర్ లకు ఇ.సి. నోటీసులు


హైదరాబాద్,డిసెంబర్  10;తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు ఈసీ నోటీసులిచ్చింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు ఈసీ నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో ఖమ్మం జిల్లా నేతలకు కేసీఆర్‌ హామీలు ఇవ్వడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సచివాలయంలో మంత్రి కేటీఆర్ కొందరికి పార్టీ కండువాలు కప్పడాన్ని తప్పుబట్టింది. 

Wednesday, December 9, 2015

అమరావతికి రైలు వ్యవస్థ పై దృష్టి ...

విజయవాడ, డి సెంబరు 9: ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా దూరప్రాంత రైల్వే వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని కేంద్రంగా రైల్వే వ్యవస్థ ఎలా ఉండాలన్న దానిపై ఫీజిబిలిటీ రిపోర్టు ఇవ్వాలని ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్ డీఎంఆర్‌సీ)ను ప్రభుత్వం కోరింది. భవిష్యత్తులో అమరావతి జనాభా 2 లక్షలకు మించనున్న నేపథ్యంలో రాజధానికి సులభంగా వచ్చిపోయే రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం రైల్వే వ్యవస్థపై అధ్యయనం చేస్తోంది. రాజధానికి రావాలన్నా, వెళ్లాలన్నా.. అటు గుంటూరు రైల్వే స్టేషనకు కానీ, ఇటు విజయవాడ రైల్వే స్టేషనకు వెళ్ళాల్సి వుంటుంది.  ఇది కొంత అసౌకర్యంగా ఉంది. అమరావతిలోనే రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేస్తే నేరుగా రాజధానికి చేరుకోవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన.  విజయవాడ వయా తాడేపల్లి, మంగళగిరిల మీదుగా రాజధానికి కనెక్టివిటీ లైన్ కు సంబంధించి కూడా ఎలా చేస్తే బాగుంటుందో నివేదిక కోరింది. 

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...