Sunday, January 3, 2021

పూరీ ఆలయంలో దర్శనాలు పునప్రారంభం

 పూరీ,జవవరి 3; కొవిడ్​ వల్ల మూతపడిన పూరీ జగన్నాథ ఆలయం ఆదివారం తిరిగి తెరుచుకుంది. దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా టెస్టు రిపోర్ట్​ సమర్పించాల్సి ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.నెగెటివ్​ వస్తేనే దర్శనానికి వెళ్లనిస్తారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న 'మహా ప్రాసాదం'లోకి మాత్రం ఎవ్వరినీ అనుమతించేది లేదని  పూరీ జిల్లా కలెక్టర్​బల్వంత్​ సింగ్​ స్పష్టం చేశారు. ఆలయంలో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం గతనెల 23న ఈ పుణ్య క్షేత్రాన్ని తెరిచారు. డిసెంబర్​ 26-31 వరకు పూరీ మున్సిపాలిటీ నివాసితులకు దర్శనానికి అనుమతించారు. నేటి నుంచి సామాన్య భక్తుల కోసం ఆలయాన్ని తెరిచారు.

దేశం లో కొవిడ్ రికవరీ 96.16%- 18,177 కొత్త కేసులు -217 మరణాలు

 న్యూఢిల్లీ,జనవరి 3; భారత్‌లో గత 24 గంటల్లో 9,58,125 కరొర్నా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,177 కొత్త కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,23,965కి చేరింది. ఇక కొత్తగా 20,923 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో.. రికవరీల సంఖ్య 99,27310కు చేరింది. దీంతో రికవరీ రేటు 96.16 శాతానికి చేరింది.మరోవైపు గడిచిన 24 గంటల్లో 217 మంది మరణించగా.. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,49,435కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 2,47,220కు తగ్గింది. మరణాల రేటు 1.45 శాతంగా కొనసాగుతోంది. కాగా బ్రిటన్‌ రకం కరోనాతో దేశంలో ఇప్పటి వరకు 29 మంది ఆస్పత్రుల్లో చేరారు.

భారత్ లో రెండు వ్యాక్సీన్లు రెడీ..

హైదరాబాద్, జనవరి ౩; కొవిడ్‌ నిరోధానికి హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాకు షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతినిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఐసీఎంఆర్‌, పుణె ఎన్‌ఐవీ సహకారంతో భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. అలాగే ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకా అత్యవసర వినియోగానికి కూడా డీసీజీఐ ఆమోద ముద్ర వేసింది. ఈ రెండు టీకాలకు అత్యవసర వినియోగ అనుమతిని ఇవ్వాలని ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కు ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) సిఫార్సు చేసింది. దానికనుగుణంగా డీసీజీఐ తుది అనుమతులను జారీ చేసింది. 

తెలంగాణ లో కొత్తగా 394 కరోనా కేసులు - ముగ్గురు మృతి

హైదరాబాద్,జనవరి 3: తెలంగాణ లో కొత్తగా 394 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు మరణించారు. కొత్త కేసులలో 81జీహెచ్​ఎంసీ పరిధిలో ఉన్నాయి. ఇప్పటి వరకు 2,87,502 మంది కరోనా బారిన పడ్డారు. తాజా మరణాలతో  ఇప్పటివరకు 1,549 మంది మహమ్మారికి బలయ్యారు.కరోనా నుంచి కోలుకొని మరో 574 మంది బాధితులు ఇళ్లకు చేరారు. దీనితో మొత్తం 2,80,565 మంది కొవిడ్​ కోరల్లోంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,388 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.హోం ఐసోలేషన్‌లో 3,210 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

Saturday, January 2, 2021

ఎ.పి. లో 238 కొత్త కేసులు- ముగ్గురు మృతి

విజయవాడ, జనవరి 2:ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో కొత్తగా 238 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ  అయిందని ఏపీ వైద్యారోగ్యశాఖ శనివారం తెలిపింది. కరోనా వల్ల పశ్చిమ గోదావరిలో ఇద్దరు, చిత్తూరు లో ఒక్కరు మొత్తం ముగ్గురు మరణించారు.  రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 882850కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3194కు చేరగా..ఇప్పటి వరకు 872545 మంది కోలుకున్నారు. కరోనా వల్ల ఇప్పటి వరకు 7111 మంది చనిపోయారు. 

కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బూటా సింగ్ మృతి

 న్యూఢిల్లీ, జనవరి 2;  కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బూటా సింగ్(86) తుది శ్వాస విడిచారు. రాజస్థాన్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన బూటా సింగ్..కేంద్ర హోం మంత్రిగా, బిహార్ గవర్నర్‌గా పనిచేశారు.జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌గా కూడా బూటా సింగ్ పనిచేశారు. 

పాపం.. నెమళ్ళు

జైపూర్, జనవరి 2; రాజస్థాన్​లోని నాగౌర్ జిల్లాలో 53 నెమళ్లు అనుమానస్పద రీతిలో మృతి చెందాయి. మరో 26 గాయపడ్డాయి. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు.మృతిచెందిన నెమళ్లను నాగౌర్ జిల్లా ఎస్పీ దీద్వన సంజయ్ గుప్తా, అటవీ శాఖ అధికారుల సమక్షంలో ఖననం చేశారు. కొద్ది రోజుల క్రితం జోధ్​పుర్ జిల్లా ఝలావాడ్​ లో ఇలాగే 100 కాకులు నేల రాలాయి. ఈ ఘటనకు బర్డ్​ ఫ్లూ కారణమని నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హై-సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ లాబోరేటరీ నిర్ధారించింది.

కొవాగ్జిన్‌కూ గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ,జనవరి 2; భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌కు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ -సీడీఎస్‌సీవో- నియంత్రణలోని నిపుణుల బృందం షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలని భారత ఔషధ నియంత్రణ సంస్థ -డీసీజీఐ-కు సిఫార్సు చేసింది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు డీసీజీఐకు సిఫార్సు చేసిన మరుసటి రోజే కొవాగ్జిన్‌కూ -సీడీఎస్‌సీవో- గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం గమనార్హం

తొలి విడతలో మూడు కోట్ల మందికి ఉచిత కరోనా టీకా

 న్యూఢిల్లీ,జనవరి 2:: దేశవ్యాప్తంగా తొలివిడతలో మూడు కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.  . ఢిల్లీలో పలు ప్రదేశాల్లో వ్యాక్సిన్ డ్రైరన్ జరుగుతున్న తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. తొలివిడత వ్యాక్సినేషన్‌లో భాగంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన కోటి మంది వైద్యారోగ్య సిబ్బందికి, రెండు కోట్ల ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఉచితంగా టీకా ఇస్తామని చెప్పారు. తదుపరి 27 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఎలా అందించాలనే దానిపై నిర్ణయానికి వస్తాంస్ని తెలిపారు. కొవిషీల్డ్‌ టీకా అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిపుణుల బృందం ఆమోదం తెలిపిన తరుణంలో కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.



గంగూలీ కి స్వల్పంగా గుండె పోటు ..

కోల్కతా, జనవరి 2;  బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీకి గుండెపోటు వచ్చింది. కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్‌ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు.   ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, క్రిటికల్ కేరింగ్ యూనిట్‌ లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు. ఆయనకు  యాంజియోప్లాస్టీ చేస్తారని సమాచారం.


రామతీర్ధం...రణక్షేత్రం

విజయనగరం,జనవర్ 2; ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం రాజకీయ రణక్షేత్రం  గా మారింది.  గ్రామంలోని బోడికొండపై ఉన్న ఆలయంలో కోదండరాముని విగ్రహం శిరస్సు ధ్వంసం కావడం... అది సమీపంలోని కొలనులో దొరకడం... రాజకీయ దుమారం లేపింది. తెలుగుదేశం, బి జె పి సహా ప్రతిపక్షాలన్నీ జగన్ పాలనపై విమర్శల వర్షం కురిపించగా... అధికార పార్టీ నేతలు అందుకు దీటుగా బదులిచ్చారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, వై సి పి ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి రామతీర్థం సందర్శనకు తరలివచ్చారు. రామతీర్థానికి వస్తున్న చంద్రబాబు కాన్వాయ్‌ను అడుగడుగునా అడ్డుకున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా.... చంద్రబాబు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆ తర్వాత తిరిగి బయల్దేరిన చంద్రబాబు కాన్వాయ్ ను నెల్లిమర్ల-రామతీర్థం కూడలి వద్ద పోలీసులు నిలిపివేశారు. చంద్రబాబు అక్కడ్నుంచి నడుచుకుంటూ రామతీర్థం బయల్దేరారు. కాగా, బోడికొండ వద్ద వై సి పి ఎంపీ విజయసాయిరెడ్డి రాకతో... అక్కడ పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఆయన... కొండపైకి వెళ్తుండగా... తెలుగుదేశం,వై సి పి, బిజెపి కార్యకర్తలు ఎదురుపడి.... పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో మూడు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఘటనాస్థలాన్ని పరిశీలించి విజయసాయిరెడ్డి కిందకు దిగుతుండగాఆయన వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి... రాయి విసిరారు. 

 

బ్రిటన్​ నుంచి వచ్చే ప్రయాణికులకు మార్గదర్శకాలు

న్యూఢిల్లీ,జనవరి. 2; బ్రిటన్​ నుంచి భారత్​కు వచ్చే ప్రయాణికులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది  యూకే నుంచి బయలుదేరడానికి 72 గంటల ముందు నిర్వహించిన పరీక్షలో నెగెటివ్‌గా తేలిన కొవిడ్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది. పాజిటివ్‌గా తేలిన వ్యక్తితో ప్రయాణించిన అదే వరసలోని ప్రయాణికులు, అటూ ఇటూ మూడు వరసల్లో ఉన్నవారికి సంస్థాగత క్వారంటైన్ తప్పనిసరి చేసింది.. జనవరి 8 నుంచి 30 మధ్యలో ఆ దేశం నుంచి భారత్‌కు వచ్చేవారికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.  ప్రయాణికులే పరీక్షలకయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. 

మాజీ ఎమ్మెల్యే వెంకట నరసయ్య మృతి

ఖమ్మం,జనవరి 2: మధిర మాజీ శాసనసభ్యులు కట్టా వెంకట నరసయ్య హైదరాబాద్ కింస్  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం  ఉదయం మరణించారు.  ఆయన వయసు 87 సంవత్సరాలు.2004లో సీపీఎం తరఫున కట్టా వెంకటనర్సయ్య ఎమ్మెల్యేగా గెలిచారు.





 


హైదరాబాద్​, మహబూబ్​నగర్​ జిల్లాల్లో ఏడు చోట్ల డ్రై రన్‌

హైదరాబాద్,జనవరి 2; తెలంగాణాలో  కొవిడ్‌ టీకా పంపిణీకి ముందస్తు సన్నాహాల్లో భాగంగా హైదరాబాద్​, మహబూబ్​నగర్​ జిల్లాల్లోని ఏడు చోట్ల  శనివారం డ్రై రన్‌ నిర్వహించారు. హైదరాబాద్‌ జిల్లాలో తిలక్‌నగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నాంపల్లిలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి, సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి, సికింద్రాబాద్​లోని గాంధీ ఆసుపత్రి ఎంపిక చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా కేంద్ర ఆసుపత్రి, ప్రైవేటులో నేహ షైన్‌ ఆసుపత్రిని ఎంపిక చేశారు. ఒక్కో కేంద్రంలో 25-30 మంది చొప్పున ఆరోగ్య సిబ్బందిని, సాధారణ పౌరులను ఎంపిక చేసి ఈ కార్యక్రమంలో భాగస్థులను చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 10 వేల మంది వాక్సినేటర్‌లు సిద్ధంగా ఉండగా రోజుకు 10 లక్షల డోస్‌లు ఇచ్చే సామర్థ్యం ప్రభుత్వం  వద్ద ఉందని  మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...