Thursday, July 2, 2015

డిజిటల్ ఇండియాకు పెట్టుబడుల వెల్లువ...

న్యూఢిల్లీ, జూలై 2; కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డిజిటల్ ఇండియాకు దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. డిజిటల్ ఇండియాకు వచ్చే ఐదేండ్లలో రూ.4.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు టెలికం  దిగ్గజాలు ప్రకటించాయి. ఈ పెట్టుబడుల్లో సగం దేశీయ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ పెడుతున్నట్లు ప్రకటించడం విశేషం.   దేశీయ సాంకేతిక రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రూ.2.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. డిజిటల్ ఇండియాలో భాగంగా దేశీయంగా వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు, మొబైళ్ల తయారీ కోసం ఈ నిధులు వెచ్చించనున్నట్లు ప్రధాని అధ్యక్షతన జరిగిన డిజిటల్ ఇండియా వీక్ కార్యక్రమంలో ముకేశ్ పేర్కొన్నారు. డిసెంబర్ నాటికి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ పూర్తి స్థాయిలో టెలికం సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. ఈ భారీ పెట్టుబడులతో డిజిటల్ రంగంలో సుమారు 5 లక్షల మందికి ఉపాధి లభించనున్నదన్నారు.  అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ కూడా భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. డిజిటల్, క్లౌడ్ ఆధారిత సర్వీసులు, టెలికం రంగంలో వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు అనిల్ అంబానీ చెప్పారు.డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా రూ.40 వేల కోట్ల పెట్టుబడితో ఎల్‌సీడీ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్టెరిలైట్ టెక్నాలజీస్ అధినేత అగర్వాల్ చెప్పారు. దీంతో 50 వేల మందికి ఉపాధి లభించనున్నదన్నారు. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీసులకోసం వినియోగించే అప్టికల్ ఫైబర్లను సంస్థ  తాయారు చేస్తోంది.  ఈ ప్రాజెక్టును జమ్ము కశ్మీర్‌లో తొలుత ప్రారంభించినట్లు చెప్పారు. కాగా, ఇండియాలో ఐడియా.. బ్రాడ్‌బ్యాండ్, వై-ఫై సర్వీసులు, నెట్‌వర్కింగ్ సర్వీసులను పెంచుకునేందుకుగాను వచ్చే ఐదేండ్లలో 700 కోట్ల డాలర్లు(రూ.54 వేల కోట్లు) పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు ఆదిత్యా బిర్లా గ్రూపు చీఫ్ కుమార మంగళం బిర్లా డిజిటల్ ఇండియా వీక్ కార్యక్రమంలో చెప్పారు. ఈ పెట్టుబడుల్లో భాగంగా డిజిటల్ ఇండియాకోసం 200 కోట్ల నిధులు ఖర్చు చేయనున్నదన్నారు. టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ కూడా భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. డిజిటల్ ఇండియాలో భాగంగా వచ్చే ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు లేక 1600 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు. 


బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...