Tuesday, June 12, 2012

ముగిసిన ఉప ఎన్నికలు...15న జాతకాలు...

హైదరాబాద్, జూన్ 12;  రాష్ట్రంలోని 18 శానససభా స్థానాలు, ఓ లోకసభ స్థానాల్లో స్వల్ప చెదురుమదురు ఘర్షణలు మినహా ఉప ఎన్నికల పోలింగ్  ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ ప్రధాన పార్టీలైన కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ ల కార్య కర్తల మధ్య  స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి.  దాదాపు 70 శాతం పోలింగ్ జరిగినట్టు ఎన్నికల సంఘం తెలిపింది.  ఈ నెల 15 న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.   అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. 
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకే మెజారిటీ సీట్లు :లగడపాటి
కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఎప్పటిలాగే ఉప ఎన్నికల ఫలితాలపై తన అంచనాలు చెప్పారు. ఈ ఉప ఎన్నికల్లో మెజారిటీ సీట్లు వైయస్ జగన్‌కు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకే వస్తాయని ఆయన చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 12 నుంచి 16 సీట్లు గెలుచుకుంటుందని ఆయన చెప్పారు. వైయస్ జగన్ అన్ని అస్త్రాలను ఈ ఎన్నికల్లో వాడడం, తాము కాస్తా ఆలస్యంగా ఎదురుదాడికి పూనుకోవడం అందుకు కారణమని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీకి ఒకటి నుంచి మూడు సీట్లు వస్తాయని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీకి సున్నా నుంచి 2 సీట్లు వస్తాయని, తెలుగుదేశం పార్టీకి ఒక్క సీటు రాకపోయినా ఆశ్చర్యం లేదని ఆయన అన్నారు. పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు. నెల్లూరు లోకసభ స్థానం గురించి అంచనా ఈ నెల 14వ తేదీన చెప్తానని ఆయన అన్నారు.    

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...