Tuesday, June 19, 2012

పాక్ ప్రధాని గిలానీపై సుప్రీం అనర్హత వేటు...

ఇస్లామాబాద్,  జూన్ 19:పాకిస్థాన్ లో తీవ్ర రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది. పాక్ ప్రధాని గిలానీని ఆ పదవికి  అనర్హుడిగా పాక్ సుప్రీంకోర్టు తేల్చడంతో రాజ్యంగ సంక్షోభంలో కూరుకుపోయింది. ఏప్రిల్ 26 నుంచి ప్రధాని పదవి ఖాళీగా ఉందని పాక్ సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది. కోర్టును అవమానించిన కేసులో గిలానీ దోషి అని పాక్ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం పాక్ ప్రధాని పదవి పోస్టు ఖాళీగా ఉన్నట్టేనని సుప్రీంకోర్టు తెలిపింది. పాక్ అధ్యక్షుడు అసఫ్ అలీ జర్దారీ అవినీతి ఆరోపణలకు సంబంధించి గిలానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గత ఏప్రిల్ నెలలో సుప్రీం కోర్టు గిలానీపై కోర్టు ధిక్కారణ కేసును నమోదు చేసింది. ఈ కేసును విచారించిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం గిలానీని వెంటనే తొలగించాలని అధ్యక్షుడు జర్దారీని ఆదేశించింది. గిలానీ స్థానంలో నూతన నియామకం చేపట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. పాకిస్తాన్ సుప్రీం కోర్టు తీర్పును పాకిస్తాన్ పీపుల్సా పార్టీ స్వాగతించింది.  కొత్త నేతను ఎన్నుకుంటామని ప్రకటించింది.   

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...