ఫ్రెంచ్ ఓపెన్ విజేత రఫెల్ నాదల్
పారిస్,జూన్ 11: రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు. జోకోవిచ్ పై 6-4,6-3,2-6,7-5 తేడాతో నాదల్ విజయం సాధించాడు. నాదల్ ఏడవ సారి ఈ టైటిల్ ని గెలుచుకున్నాడు. ప్రైజ్ మనీగా నాదల్ కు 8 కోట్ల 67 లక్షల రూపాయలు లభిస్తాయి. నాదల్ కు ఇది 11వ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఏడు ఫ్రెంచ్ ఓపెన్, రెండు వింబుల్డన్, ఒక ఆస్ట్రేలియా, ఒక యుఎస్ టైటిల్స్ నాదల్ గెలుచుకున్నాడు.

Comments