Saturday, June 23, 2012

మళ్లీ అంతరిక్షానికి సునీతావిలియమ్స్

వాషింగ్టన్ ,జూన్ 23:  2006 లో ఏకంగా ఆరు నెలల పాటు అంతరిక్షంలో గడిపి 2006 లో ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్న భారత-అమెరికన్ సునీతావిలియమ్స్.  మరోసారి అంతరిక్షానికి పయనమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే జూలై 14న మొదలవనున్న ఈ యాత్రకు తుది ఏర్పాట్లు జరుగుతున్నాయని నాసా తెలిపింది. ఈ యాత్రలో భాగంగా సునీత ఫ్లైట్ ఇంజినీర్ గా బాధ్యతలు నిర్వహించనున్నారని నాసా పేర్కొంది. మరికొంత మంది తోటి ఫ్లైట్ ఇంజినీర్లతో ఆమె రెండు సార్లు స్పేస్ వాక్ చేయనున్నారని తెలిపింది. కల్పనాచావ్లా తరువాత అంతరిక్షయానానికి నాసా ఎంపిక చేసిన భారత సంతతికి చెందిన రెండో మహిళ సునీతా విలియమ్స్. అంతరిక్షయానం చేసిన మహిళలకు సంబంధించి ఆమె మూడు రికార్డులను కలిగి ఉన్నారు. అత్యధికంగా 195 రోజులపాటు యాత్రలో పాల్గొనడం, నాలుగు సార్లు స్పేస్ వాక్ చేయడం, 29 గంటల 17 నిముషాల పాటు స్పేస్ వాక్ లో పాల్గొనడం ఆమె సాధించిన ఘనత. అమెరికా నావల్ అకాడమీ నుంచి 1987లో పట్టభద్రురాలైన సునీత.. 1998లో ఆస్ట్రొనాట్ గా నాసా తరఫున ఎంపికయ్యారు. ఈ మధ్య కాలంలో అమెరికా నావీ అధికారిగా వివిధ విభాగాల్లో సేవలు అందించారు. ఆమె ఫ్లోరిడా ఇన్ స్టిట్యూట్ నుంచి 1995లో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...