Tuesday, June 26, 2012

కేంద్రమంత్రి పదవికి వీరభద్ర సింగ్ రాజీనామా

న్యూఢిల్లీ,,జూన్ 26:  కేంద్రమంత్రి పదవికి వీరభద్ర సింగ్ మంగళవారం రాజీనామా చేశారు. వీరభద్ర సింగ్ పైన అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామా కోసం విపక్షాల నుండి తీవ్ర ఒత్తిడి వచ్చింది. తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు పంపించారు. . తాను యాభై ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నానని చెప్పారు. కేంద్రానికి చెడ్డ పేరు రాకూడదనే  తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన నిజాయితీని నిరూపించుకునేందుకే రాజీనామా చేసినట్లు చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయపరంగా పోరాటం చేస్తానన్నారు. తనపై ఆరోపణల కోసం చూపిన ఆధారాలు అన్ని కల్పితమైనవని చెప్పారు. సిడి ప్రామాణికాబద్దమైనది కాదన్నారు. సిడిలోని వాయిస్‌ తనది కాదన్నారు. ప్రస్తుతం లఘు, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్న వీరభద్ర సింగ్ 1989లో హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విషయంలో కొందరు పారిశ్రామికవేత్తలతోపాటు ఐఎఎస్ అధికారి మహిందర్ లాల్‌తో లంచం, ఇతర అవినీతి పరమైన లావాదేవీలపై  జరిపిన సంభాషణలు రికార్డైయ్యాయి.  వీరభద్ర సింగ్, ఆయన భార్యపై కుట్ర, అవినీతి సంబంధించిన కేసులు నమోదు చేయాలని సిమ్లాలోని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల క్రిందట జరిగిన ఈ వ్యవహారంలో మంత్రి, ఆయన భార్య ప్రతిభాసింగ్‌ల నేరాలకు కచ్ఛితమైన సాక్ష్యాధారాలు లభించిన నేపథ్యంలో ఐపిసి సెక్షన్ 120 బి(కుట్ర), అవినీతి నిరోధక చట్టంలోని 7,11,13 సెక్షన్‌ల ప్రకారం ప్రత్యేక న్యాయమూర్తి బిఎల్ సోని కేసు నమోదుకు ఆదేశించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...