Sunday, June 24, 2012

బోరు బావిలో చిన్నారి మృతి

రోదిస్తున్న మహి తల్లి...
గుర్గాన్,జూన్ 24: బోరు బావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి మహిని రెస్క్యూ టీం ఆదివారం బయటకు తీసింది. అయితే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పుట్టిన రోజు సందర్భంగా అడుకుంటానని వెళ్లిన ఆమె కొంతదూరంలో ఉన్న బోరుబావిలో పడిపోయింది. ఆమెను రక్షించేందుకు ఆర్మీయే రంగంలోకి దిగింది. 86 గంటల తర్వాత రెస్క్యూ టీం చిన్నారిని బయటకు తీసింది.  బోరు బావి నుండి బయటకు తీసిన తర్వాత ఆమెకు ఆరోగ్య పరీక్షలు జరిపేందుకు అధికారులు వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఆమెను  పరీక్షించిన వైద్యులు మహి మృతి చెందినట్లు చెప్పారు. చిన్నారిని ప్రాణాలతో ఉంచేందుకు బావిలోకి ఆక్సిజన్ పంపించారు. మహిని కాపాడేందుకు ఆర్మీ ఇంజనీర్లు, జాతీయ భద్రతా దళం కమెండోలు, పోలీసులు, గుర్గావ్ మెట్రో రైలు ఇంజనీర్లు  మొత్తం వందమందికి పైగా రంగంలోకి దిగారు. ఆ బోరు బావికి ఎనిమిది అడుగుల దూరంలో మరో బోరు బావిని తవ్వారు. కానీ దురదృష్టవశాత్తూ ఆ రెండింటి మధ్య సొరంగం తవ్వుతుండగా పెద్ద రాయి అడ్డు వచ్చింది.దాంతో శనివారం మరో సొరంగం తవ్వారు. మళ్లీ రాయి వచ్చినా.. దానిని డ్రిల్లింగ్ మెషీన్లతో పగలగొట్టేందుకు ప్రయత్నించి చేతులెత్తేశారు. దీంతో ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్‌కు చెందిన ప్రత్యేక నిపుణులతో మరో బోరు బావి తవ్వారు.చివరికి  ఎంతో ప్రయాస మీద మహిని బయటకు తెచ్చినా ఫలితం లేకపోయింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...