రాజేశ్ ఖన్నాకు సీరియస్...
ముంబై ,జూన్ 20: నిన్నటితరం బాలీవుడ్ సూపర్‌స్టార్ రాజేశ్ ఖన్నా(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొన్ని రోజులుగా ఆహారం తీసుకోవడం లేదు. మాజీ భార్య డింపుల్ కపాడియా ప్రస్తుతం రాజేశ్ ఖన్నా బాగోగులు చూసుకుంటున్నారు. ‘రాజేశ్‌జీ ఆరోగ్యం బాగోలేదు. గత నాలుగైదు రోజులుగా ఆయన ఆహారం తీసుకోవడం లేదు. అసలు ఆహారం ఆయన నోట్లోకే వెళ్లడం లేదు’ అని రాజేశ్ మేనేజర్ అశ్విన్ మీడియాకు తెలిపారు. డింపుల్, ఆమె కూతురు రింకేలు దగ్గరుండి రాజేశ్‌కు సపర్యలు చేస్తున్నారని చెప్పారు. గత ఏప్రిల్‌లోనూ రాజేశ్ ఖన్నా ఇలాగే అనారోగ్యానికి గురయ్యారు. చివరిసారిగా ఇటీవల ఆయన ఓ టీవీ యాడ్‌లో కనిపించారు. ‘కాకా’గా సుపరిచితుడైన రాజేశ్ ఖన్నా హిందీ చిత్రసీమలో తొలి సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందారు. 1966లో ‘ఆఖ్‌రీ ఖత్’ చిత్రంతో రాజేశ్ సినీ జీవితం ప్రారంభమైంది. 1960, 70ల్లో ‘ఆరాధన’, ఆనంద్’, ‘బావర్చి’, ‘రాజ్’ వంటి సూపర్ హిట్లతో ఆయన బాలీవుడ్‌ను ఒక ఊపు ఊపారు. 150కి పైగా చిత్రాల్లో నటించారు.

Comments