10 వేల జనాభా వరకు మద్యం షాపు లైసెన్స్ ఫీజు రూ.32.5 లక్షలు
హైదరాబాద్ ,జూన్ 18: నూతన మద్యం విధానాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. మద్యం విధానంలో 6 స్లాబ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 10 వేల జనాభా వరకు షాపు లైసెన్స్ ఫీజు రూ.32.5లక్షలుగా, 10 వేల నుంచి 50 వేల జనాభా ఉంటే లైసెన్స్ ఫీజు రూ.34లక్షలుగా, 50 వేల నుంచి 3 లక్షల జనాభా ఉంటే లైసెన్స్ ఫీజు రూ.42లక్షలుగా నిర్ణయించింది. ఇంకా 3 నుంచి 5లక్షల జనాభా ఉంటే లైసెన్స్ ఫీజు రూ.46లక్షలుగా, 5 నుంచి 20లక్షలు జనాభా ఉంటే లైసెన్స్ ఫీజు 64 లక్షలు, జనాభా 20లక్షల కంటే ఎక్కువగా ఉంటే ఫీజు రూ.1.04 కోట్లుగా నూతన మద్య విధానంలో వెల్లడించింది.
Comments