అమెరికాలో బెంగళూర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
బెంగళూర్,జూన్ 27: బెంగళూర్‌కు చెందిన 26 ఏళ్ల పవన్ కుమార్ అంజయ్య అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అమెరికాలో మరణించాడు. కంపెనీ అసైన్‌మెంట్‌పై అమెరికా వెళ్లిన ఈ సాఫ్త్ట్ వేర్ ఇంజనీర్ న్యూజెర్సీలోని హోటల్ గదిలో గత వారం ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఓ అమెరికా మహిళ హత్య కేసులో అతను నిందితుడు కూడా. కాగ్నిజెంట్‌లో పనిచేస్తున్న అంజయ్య మత్తుపదార్థాలను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల మరణించినట్లు అనుమానిస్తున్నారు. కాగా, డానిల్లే మెహమాన్ అనే 26 ఏళ్ల టీచర్, నాలుగేళ్ల బాలుడి తల్లి హత్య కేసులో పోలీసులు పవన్ కోసం ఇప్పటి వరకు గాలిస్తున్నారు. డెలవర్ లోని దేవెయ్ బీచ్ హోటల్ గదిలో ఆమె శవం జూన్ 18వ తేదీన కనిపించింది. ఆమె శరీరంపై పలు గాయాలున్నాయి. ఆమెతో పవన్ గడిపినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ వచ్చే వారం బెంగళూర్ తిరిగి రావాల్సి ఉంది.
Comments