Thursday, June 14, 2012

29 నుంచి నాటా మహాసభలు...

న్యూయార్క్,జూన్ 14; నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా)- 2012 మహాసభలను జూన్ 29 నుంచి జూలై 1 వరకు టెక్సాస్ రాష్ట్రంలో హ్యూస్టన్ నగరంలోని జార్జీ ఆర్ బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతాయని నాటా అధ్యక్షుడు ఏవీఏన్ రెడ్డి  వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా అమెరికాలోని అతిరథ మహారధులంతా ఈ వేడుకలకు హాజరవుతారని తెలిపారు. తెలుగు సిని రంగ పరిశ్రమకు చెందిన దిగ్గజాలైన న టీనటులు, దర్శక నిర్మాతలు ఈ సభల్లో పాల్గొంటారన్నారు. అలాగే తెలుగు సిని రంగంలోని స్వర మాంత్రికులు మణిశర్మ, కోటి, వందేమాతరం శ్రీనివాస్‌లు ఒక వేదికపై సంగీత విభావరి ఇస్తారన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సభల్లో సాహిత్య చర్చతోపాటు యువతియువకులు, మహిళలు కోసం ప్రత్యేకంగా సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విజయ రహాస్యంతో ముందుకు దుసుకెళ్తున్న, ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లోని తెలుగు పారిశ్రామిక వేత్తలతో సదస్సును నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నృత్యం, చిత్రకళ, పాటలు, వాద్య సంగీతం, సేవా రంగంలో విశేష కృషి చేసిన 16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్న యువతి యువకులకు టి. సుబ్బిరామి రెడ్డి లలిత కళా పరిషత్ ఇంటర్నేషనల్ (ఇండియా) పేరిట అవార్డులు ప్రదానం చేస్తామని చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...