Friday, June 29, 2012

ఎంసెట్ ఫలితాల విడుదల; జులైలో కౌన్సెలింగ్

హైదరాబాద్ ,జూన్ 29:  ఎంసెట్ - 2012 ఫలితాలను ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు.  ఎంసెట్ ఇంజనీరింగ్, మెడిసిన్ విభాగాల్లో తొలి పది టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలను కూడా వెల్లడించారు. ఇంజనీర్ విభాగంలో 73.18 శాతం అభ్యర్థులు అర్హత సాధించగా, మెడిసిన్ విభాగంలో 88.57 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. ఎంసెట్‌కు సంబందించి మార్కులతో పాటు ర్యాంకుల వివరాలను కూడా అందించారు. ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి జులైలో కౌన్సెలింగ్ జరుగుతుందని, ఆగస్టులో తరగతులు ప్రారంభమవుతాయని దామోదర రాజనర్సింహ చెప్పారు. మెడిసిన్ విభాగం టాప్ పది ర్యాంకర్లలో బాలురు పది మంది ఉన్నారు. ఇంజనీరింగ్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన నితీష్ చంద్ర  149 మార్కులతో  ఫస్ట్ ర్యాంకు సాధించాడు. మెడిసిన్ విభాగంలో హైదరాబాదుకు చెందిన రెడ్డి విజయకేతన్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు.
ఇంజనీరింగ్ విభాగంలో టాప్ ర్యాంకర్లు
1. చింతా నితీష్ చంద్ర - 149 (రంగారెడ్డి జిల్లా)
2. ఎవిబి మనోజ్ కుమార్ - 148 (విశాఖపట్నం)
3. నల్లమిల్లి రూపేష్ - 147 (విజయవాడ)
4. ధీరజ్ రెడ్డి - 146 (హైదరాబాద్)
5. సాయికుమార్ రెడ్డి - 146 (విజయవాడ)
6. మంద మకరందు - 146 (విజయవాడ)
7. ప్రభాకర్ వరణ్ - 146 (విజయవాడ)
8. ఆకుల శ్రీనితీష్ - 144 (విజయవాడ)
9. అనీలా యాదవ్ - 144 (నిజామాబాద్)
10. సుష్మ - 143 (విశాఖపట్నం
మెడిసిన్ విభాగంలో టాప్ ర్యాంకర్లు
1. రెడ్డి విజయకేతన్ - 155 మార్కులు (హైదరాబాద్)
2. సుంకర లోకేంద్ర పవన్ కుమార్ - 154 (విజయవాడ)
3. డివిఆర్ సాయి - 153 (ప్రకాశం జిల్లా)
4. కె. నరేష్ బాబు - 152 (వరంగల్)
5. దాసరి ఉత్తేజ్ - 152 (విజయవాడ)
6. బొబ్బిలి సవ్యసాచి - 152 (విజయవాడ)
7. భరద్వాజ - 152 (నెల్లూరు)
9. కె అక్షయ్ - 152 (హైదరాబాద్)
10. గడ్డం వినూత్న - 152 (రంగారెడ్డి జిల్లా)

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...