ఎన్సీపి కి సంగ్మా రాజీనామా

 రాష్ట్రపతి పదవికి పోటీకే నిర్ణయం.,.

న్యూఢిల్లీ,జూన్ 20:  రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ఎన్సీపి నేత పిఎ సంగ్మా ఆ పార్టీకి బుధవారం రాజీనామా చేశారు.  తాను అనివార్య పరిస్థితులలోనే రాజీనామా చేసినట్లు పిఏ సంగ్మా చెప్పారు. ఆత్మగౌరవం కోసం రాజీనామా చేశానని చెప్పారు. పోటీ నుండి తగ్గేది లేదన్నారు. కాగా,  సంగ్మా రాజీనామాను   ఎన్సీపి అధినేత శరద్ పవార్ ఆమోదించారు.సంగ్మా మేఘాలయలో శాసనసభ్యుడిగా ఉన్నారు. సంగ్మా గతంలో లోకసభ స్పీకర్‌గా పని చేశారు. రాష్ట్రపతి బరిలో ఉన్న సంగ్మాకు ఇప్పటికే బిజెడి, ఎఐడిఎంకే మద్దతు ప్రకటిస్తున్నాయి. అయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించి సంగ్మాను బరిలో నుండి తప్పిద్దామన్న పార్టీకి ఆయన కౌంటర్ ఇస్తూ రాజీనామా చేయడం గమనార్హం. పవార్ కూడా దానిని వెంటనే ఆమోదించడం విశేషం. పిఎ సంగ్మా కూతురు అ.గాథా సంగ్మా కేంద్రమంత్రిగా ఉన్నారు. సంగ్మా మొండిగా పార్టీకి రాజీనామా చేసి మరీ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధపడిన నేపథ్యంలో  అగాథాపై ఎన్సీపి ఏం నిర్ణయం తీసుకోనుందో  వేచి చూడాలి.


Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు