Sunday, June 17, 2012

చల్లబడిన రాష్ట్రం..

విశాఖపట్టణం, జూన్ 17:  నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి. అనంతపురం మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఇవి రాయలసీమలో పూర్తిగానూ, తెలంగాణలోని మహబూబ్‌నగర్, దక్షిణ కోస్తాలో బాపట్లను తాకినట్లు  తుపాను హెచ్చరిక కేంద్రం అధికారులు ధ్రువీకరించారు. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్ర మంతటా రుతుపవనాలు వ్యాపించి పూర్తిస్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
రుతుపవనాల రాకతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే తగ్గుముఖం పట్టాయి. ఆకాశం మేఘావృతం కావటం, అక్కడక్కడా జల్లులు పడుతుండటంతో వాతావరణం చల్లబడింది. మరోవైపు బంగాళాఖాతంలో ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తా మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల వర్షాలు దండిగా  పడతాయని భావిస్తున్నారు. ఇలా ఉండగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల  ట్రాఫిక్  స్తంభించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...