రాజ్యసభ సభ్యుడిగా సచిన్ ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ,జూన్ 4: : సచిన్ టెండుల్కర్ సోమవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ తన ఛాంబర్ లో సచిన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సచిన్ సతీమణి అంజలి, ఐపీఎల్ చీఫ్ రాజీవ్ శుక్లా తదితరులు హాజరయ్యారు. ఎంపీగా ప్రమాణం చేసిన సచిన్ ను కేంద్రమంత్రి నారాయణస్వామి శాలువకప్పి సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు సచిన్ ను అభినందించారు. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తొలి క్రికెటర్ సచిన్ కావటం విశేషం.

Comments