Sunday, June 10, 2012

ముగిసిన ప్రచారం...ఓటరు తీర్పుకు రంగం సిద్ధం..

హైదరాబాద్,జూన్.10;  రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రచారం పర్వం   శని వారం సాయంత్రం  5 గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్ లాల్ విలేకరులతో మాట్లాదుతూ,  ఇంటింటి ప్రచారాన్ని పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.  12వ తేది అర్ధరాత్రి వరకు ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలలో మద్యం దుకాణాలను బంద్ చేస్తారని చెప్పారు. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటల తరువాత స్థానికేతరులు ఉండరాదని ఆదేశించారు. హోటళ్లు, అతిథి గృహాలు, ఫక్షన్ హాల్స్ అన్నింటినీ పోలీసులు తనిఖీ చేస్తున్నారని చెప్పారు. 12వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓటు వేయడానికి ప్రతి ఓటరు గుర్తింపు కార్డు గానీ, స్లిప్ గానీ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు స్లిప్ లు ఇస్తారని భన్వర్ లాల్ చెప్పారు.ఉప ఎన్నికలు జరిగే 12 జిల్లాలలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 15న ఓట్లను లెక్కింపు జరుగుతుందని ఆయన చెప్పారు.
 అభ్యర్థులకు షాడో బృందా లు
ఉప ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు షాడో బృందా లను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ఉప ఎన్నికలలో మొత్తం ఓటర్లు 46,13,589 మంది ఉన్నట్లు తెలిపారు. నరసన్నపేట, పోలవరంలలో అతితక్కువగా బరిలో ఆరుగురు అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. అత్యధికంగా  ఒంగోలు బరిలో 23 మంది ఉన్నారు.
 ప్రధాన పార్టీ అభ్యర్థులు
నరసన్నపేట నియోజకవర్గంలో  ప్రధాన పార్టీ అభ్యర్థులు ధర్మాన కృష్ణ దాస్ (వైఎస్‌ఆర్‌సీపీ), రాందాస్ (కాంగ్రెస్), స్వామిబాబు (టీడీపీ) పోటీలో ఉన్నారు. పాయకరావుపేటలో  ప్రధాన పార్టీ అభ్యర్థులు గొల్ల బాబూరావు (వైఎస్‌ఆర్‌సీపీ), సుమన (కాంగ్రెస్), చెంగల వెంకట్రావు (టీడీపీ) పోటీలో ఉన్నారు. రామచంద్రపురంలో  ప్రధాన పార్టీ అభ్యర్థులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్ (వైఎస్‌ఆర్‌సీపీ), తోట త్రిమూర్తులు (కాంగ్రెస్), చిక్కాల రామచంద్రరావు (టీడీపీ) బరిలో ఉన్నారు. నర్సాపురంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు ప్రసాదరాజు (వైఎస్‌ఆర్‌సీపీ), సుబ్బారాయుడు(కాంగ్రెస్), సత్యనారాయణరావు (టీడీపీ) పోటీలో ఉన్నారు. పోలవరంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు తెల్లం బాలరాజు( వైఎస్‌ఆర్‌సీపీ), పార్వతి(కాంగ్రెస్), శ్రీనివాస్ (టీడీపీ) బరిలో ఉన్నారు. ప్రత్తిపాడులో ప్రధాన పార్టీ అభ్యర్థులు సుచరిత  (వైఎస్‌ఆర్‌ సీపీ), సుధాకర్‌బాబు(కాంగ్రెస్), కందుకూరి వీరయ్య (టీడీపీ) పోటీలో ఉన్నారు. మాచర్లలోఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (వైఎస్‌ఆర్‌సీపీ), లక్ష్మారెడ్డి (కాంగ్రెస్), మధు (టీడీపీ) పోటీలో ఉన్నారు. ఒంగోలులో   బాలినేని శ్రీనివాస రెడ్డి (వైఎస్‌ఆర్‌సీపీ), పార్వతమ్మ (కాంగ్రెస్), జనార్దన్(టీడీపీ) పోటీలో ఉన్నారు. ఉదయగిరిలోమేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (వైఎస్‌ఆర్ సీపీ), విజయరామిరెడ్డి (కాంగ్రెస్), వెంకటరామారావు (టీడీపీ) పోటీలో ఉన్నారు. అనంతపురంలో  గుర్నాథ రెడ్డి (వైఎస్‌ఆర్ సీపీ), ముర్షీదా బేగం (కాంగ్రెస్),   శ్రీనివాస్  (టీడీపీ) పోటీలో ఉన్నారు. రాయదుర్గంలో  కాపు రామచంద్రా రెడ్డి(వైఎస్‌ఆర్‌సీపీ), వేణుగోపాల్‌రెడ్డి(కాంగ్రెస్), దీపక్‌రెడ్డి (టీడీపీ) బరిలో ఉన్నారు. పరకాలలో కొండా సురేఖ(వైఎస్‌ఆర్‌సీపీ), సమ్మారావు(కాంగ్రెస్), ధర్మారెడ్డి(టీడీపీ) పోటీలో ఉన్నారు. ఎమ్మిగనూరులో ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి (వైఎస్‌ఆర్‌సీపీ), రుద్రగౌడ్ (కాంగ్రెస్), బీవీ మోహన్‌రెడ్డి (టీడీపీ) పోటీలో ఉన్నారు. ఆళ్లగడ్డలో భూమా శోభానాగి రెడ్డి (వైఎస్‌ఆర్‌సీపీ), ప్రతాప్‌రెడ్డి (కాంగ్రెస్), రాంపుల్లా రెడ్డి ( టీడీపీ) పోటీలో ఉన్నారు. రాజంపేటలో  ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి (వైఎస్‌ఆర్‌సీపీ), మల్లికార్జున రెడ్డి (కాంగ్రెస్), బ్రహ్మయ్య( టీడీపీ) రంగంలో ఉన్నారు. రాయచోటిలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి (వైఎస్‌ఆర్‌సీపీ), రాంప్రసాద్‌రెడ్డి (కాంగ్రెస్), బాలసుబ్రహ్మణ్యం (టీడీపీ) బరిలో ఉన్నారు. రైల్వేకోడూరులోశ్రీనివాసులు (వైఎస్‌ఆర్‌సీపీ), ఈశ్వరయ్య (కాంగ్రెస్), అజయ్‌బాబు ( టీడీపీ) పోటీలో ఉన్నారు. తిరుపతిలో  భూమన కరుణాకర్‌ రెడ్డి ( వైఎస్‌ఆర్‌సీపీ), వెంకటరమణ (కాంగ్రెస్), కృష్ణమూర్తి (టీడీపీ) రంగంలో ఉన్నారు.
ఇక నెల్లూరు లోక్ సభ నియోజకవర్గంలో  ప్రధాన పార్టీ అభ్యర్థులు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి(వైఎస్‌ఆర్‌సీపీ), టి.సుబ్బరామి రెడ్డి(కాంగ్రెస్), వేణుగోపాల్‌ రెడ్డి(టీడీపీ) పోటీలో ఉన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...