Friday, June 15, 2012

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రమాదంలో 11మంది మృతి

విశాఖపట్నం,జూన్ 15; విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోరప్రమాదంలో గాయపడ్డవారి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రమాదంలో ఇప్పటికే 11మంది మృత్యువాతపడ్డారు. మరో 8మంది మృత్యువుతో పోరాడుతున్నారు. వీరంతా విశాఖలోని సెవెన్ హిల్స్, కేర్, న్యూకేర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్టీల్ మెల్ట్‌షాప్ (ఎస్‌ఎంఎస్) విభాగం ఏజీఎం ఎంవీఎస్ శర్మ, జీఎం డీఎస్ కల్సీలను గురువారం మరింత మెరుగైన చికిత్సకోసం విమానంలో ముంబై తరలించారు. రంజన్ భట్టాచార్య (ఏజీఎమ్), ఎల్. శ్రీనివాసరావు, పి.నారాయణరాజు, కె.శ్రీనివాసరావు, సీహెచ్.ప్రభాకరరావు, మురళీధర్‌రాజు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  ఐదుగురి మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. మిగిలినవారి మృతదేహాలను వారి బం దువులు వచ్చే దాకా కేజీహెచ్ మార్చురీలోనే భద్రపరిచారు. ప్రమాద ఘటన  పై ఉన్నతస్థాయి కమిటీతో దర్యాప్తు చేయనున్నట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బేణి కుమార్ ప్రసాద్ వర్మ తెలిపారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించడానికి వచ్చిన మంత్రి  విలేకర్లతో మాట్లాడారు. దర్యాప్తు కమిటీకి సెయిల్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్.ఆర్.జైన్ చైర్మన్‌గా ఉంటారని చెప్పారు. మెకాన్ చైర్మన్ కె.కె.మెహ్రోత్రా, ఢిల్లీ, కాన్నూర్ ఐఐటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతులను సభ్యులు గా నియమించారు. ఈ కమిటీ 30 రోజుల్లో నివేదిక ఇస్తుందని చెప్పారు. ప్రమాదంలో మృతి చెందిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.20 లక్షలు, కాంట్రాక్టు కార్మికులకు అదనంగా రూ.10 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న బాధిత కుటుంబాలను బేణితోపాటు సీఎం కిరణ్ పరామర్శించారు.





 .

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...