Tuesday, June 19, 2012

డీజీపీగా దినేష్‌ రెడ్డి నియామకం చెల్లదని క్యాట్‌ తీర్పు

హైదరాబాద్ ,  జూన్ 19:  రాష్ట్ర డీజీపీగా దినేష్‌ రెడ్డి నియామకం చెల్లదని కేంద్ర పరిపాలన ట్రిబ్యూనల్‌ (క్యాట్‌) ఆదేశించింది. ఆయన నియామకం చెల్లదని  ప్రకటించింది. కొత్త డీజీపీ ఎంపిక కోసం మళ్లీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర సర్కారుకు సూచించింది. డీజీపీగా దినేష్‌ రెడ్డి నియామకాన్ని సీనియర్‌ ఐపీఎస్ అధికారి గౌతం కుమార్‌ క్యాట్‌లో సవాల్‌ చేశారు. దినేష్‌ రెడ్డి 1977 బ్యాచ్‌కు చెందిన అధికారి. సీనియర్‌ అయిన తనను కాదని దినేష్‌ రెడ్డిని డీజీపీగా నియమించడాన్ని గౌతమ్‌ కుమార్‌ వ్యతిరేకించారు. డీజీపీ నియామకం కోసం రూపొందించిన సీనియార్టీ లిస్టులో మొదటి పేరు గౌతం కుమార్‌ది, ఆ తర్వాత స్థానాల్లో హైదరాబాద్‌ మాజీ పోలీసు కమిషనర్‌ బల్వీందర్‌ సింగ్‌, కెఆర్ నందన్‌ ఉన్నారు. అయితే పదవీ కాలం ఎక్కువ లేకపోవడంతో డీజీపీగా బాధ్యతలు చేపట్టేందుకు నందన్‌ విముఖత చూపారు. కాగా 2010 ఆగస్టు 31న రాష్ట్ర డీజీపీగా దినేష్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. సెప్టెంబర్‌ 2013 వరకూ ఆయన పదవీ కాలం ఉంది.
ఐపీఎస్‌ఉమేష్‌పై సస్పెన్షన్‌ వేటు
ఐపీఎస్‌ అధికారి ఉమేష్‌కుమార్‌ ను  సస్పెండ్  చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత మూడు రోజులుగా ఉమేష్‌ అందుబాటులో లేని కారణంగా క్రమశిక్షణ చర్య కింద ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఎంపీ సంతకం ఫోర్జరీ కేసులో ఉమేష్‌ నిందితుడుగా ఉన్నారు. ఇటీవల ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...