Sunday, November 9, 2014

హ్యాట్రిక్ గెలుపుతో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా...

హైదరాబాద్,నవంబర్ 9;  శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ ను టీమిండియా కైవశం చేసుకుంది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా  ఇక్కడ జరిగిన మూడో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ ను చేజిక్కించుకుంది.  243 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా సునాయాసంగా  గెలుపొందింది. కేవలం నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా 44.1 ఓవర్లో  లక్ష్యాన్ని సాధించింది.  శ్రీలంక బౌలర్లలో కులశేఖర, పెరీరా, దిల్షాన్ లకు తలో వికెట్టు దక్కింది.
  ఆరు వేల పరుగుల క్లబ్‌లో విరాట్‌ కోహ్లీ
ఈ మ్యాచ్ లో విరాట్‌ కోహ్లీ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడంతోపాటు తన కెరీర్‌లో 6 వేల పరుగుల మైలు రాయిని దాటాడు. 51 పైచిలుకు సరాసరితో విరాట్‌ కోహ్లీ అత్యంత వేగంగా ఈ క్లబ్‌లో చేరిన ఆటగాడు. కోహ్లీకిది 32వ అర్ధ సెంచరీ కావడం విశేషం. ప్రముఖ వెస్టిండీస్‌ ఆటగాడు రిచర్డ్స్‌ కంటే ముందుగా ఆరు వేల పరుగుల క్లబ్‌లో చేరుకున్న వ్యక్తి విరాట్‌ కోహ్లీ. ప్రపంచలో ఈ ఘనత సాధించిన వ్యక్తి కూడా విరాట్‌ కోహ్లీ. విరాట్‌ తర్వాత వేగంగా ఆరు వేల పరుగులు సాధించిన వారిలో వివ్‌ రిచర్డ్స్‌, సౌరబ్‌ గంగూలీ, దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీడెవిలియర్స్‌, ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూహెడెన్‌ ఉన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...