Thursday, November 20, 2014

చలి, మంచుతో అధ్వాన్నమైన అమెరికా జీవనం ...


Upstate New York Gets Another Blast of Snow న్యూయార్క్ , నవంబర్‌ 20 : ఆలాస్కా నుంచి హవాయి వరకు... అమెరికాలోని 50 రాష్ట్రాలు చలితో గజ గజ లాడుతున్నాయి. పలు ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా మొత్తం అన్ని రాష్ట్రాలు గజగజలాడిపోతున్నాయి. . హవాయి సహా అన్ని రాష్ట్రాల్లోనూ మైనస్ డిగ్రీల్లోనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అమెరికాలో 1976 తర్వాత నవంబర్ నెలలో ఈ స్థాయి అత్యల్ప టెంపరేచర్ నమోదవ్వడం ఇదే ప్రథమం .న్యూయార్క్ పశ్చిమ ప్రాంతంలోని ఎరీ కౌంటీలో 60 అంగుళాలమేర మంచు పేరుకుపోయింది. ఈ కౌంటీలో... అత్యవసర పరిస్థితి ప్రకటించారు. గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తుండటంతో జనం ఆందోళన చెందుతున్నారు.మంచు తీవ్రత పెరగడంతో పలు హైవేలను మూసివేశారు. అమెరికా ఉత్తర, తూర్పు రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 48 రాష్ట్రాల్లో మంచు తీవ్రంగా కురుస్తోంది. దీని ప్రభావం... 23 కోట్లమందిపై పడింది. బఫెలో ప్రాంతం పూర్తిగా మంచులో కూరుకుపోయింది. కాగా చలి, మంచు వల్ల ఇంతవరకు 8 మరణాలు నమోదయ్యాయి. 



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...