Thursday, November 20, 2014

కృష్ణా డెల్టాకు లిఫ్ట్ ద్వారా గోదావరి జలాలు ... ఎ.పి. సర్కార్ యోచన

విజయవాడ,  నవంబర్‌ 20 : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందే గోదావరి జలాలను లిఫ్ట్‌ ద్వారా కృష్ణా డెల్టాకు ఇవ్వబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ‘పోలవరం బ్యారేజి నిర్మాణానికి ముందే ఒక ఎత్తిపోతల పథకం నిర్మించి దాని ద్వారా కృష్ణా బ్యారేజికి గోదావరి జలాలను మళ్ళించాలని నిర్ణయించాం. కాల్వల నిర్మాణం ఇప్పటికే పూర్తయినందువల్ల గోదావరి జలాలను తరలించడానికి ఎక్కువ సమయం పట్టదు. ఈ నీటిని పెన్నా డెల్టా వరకూ తరలించవచ్చు. దీని ద్వారా కృష్ణా జలాల్లో కొంత ఆదా అవుతాయి. ఈ నీటిని శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి రాయలసీమకు తరలిస్తాం. ఈ రకంగా ఇటు కృష్ణా డెల్టా అవసరాలు, అటు రాయలసీమ అవసరాలు తీరతాయి’ అని ఆయన వివరించారు. గురువారం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విస్తృత సమావేశం లో చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ కు గల సుదీర్ఘ  తీర ప్రాంతం దవల్ల పోర్టులు ఈ రాష్ట్ర దశ...దిశ మార్చబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. 
రాష్ట్రంలోని   ప్రతి జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలో గతంలోనే ఒక ప్రణాళిక ప్రకటించాం. దాని అమలుకు కట్టుబడి ఉన్నాం’ అని ఆయన తెలిపారు. వచ్చే మే నెల నాటికి తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా చేస్తామని ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రెండు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ నిలదొక్కుకోవడంతోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తుందని ఆయన చెప్పారు. 



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...