Sunday, November 9, 2014

మోడీ కొలువులో కొత్తగా 21 మంది...దత్తన్నకు స్వతంత్ర హోదా ...సహాయమంత్రిగా సుజనా


న్యూఢిల్లీ, నవంబర్ 9; కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 21 మంది మంత్రులు రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారం చేసారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మనోహర్ పారికర్ , సురేష్ ప్రభాకర్ ప్రభు, జేపీ నడ్డా, బీరేంద్రసింగ్, బండారు దత్తాత్రేయ, రాజీవ్ ప్రతాప్ రూడీ, డాక్టర్ మహేష్ శర్మ, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, రాంకృపాల్ యాదవ్, హరిబాయ్ చౌదరి, సన్వర్లాల్ జాట్, మోహన్ కుందారియా, మోహన్ జీ బాయ్, గిరిరాజ్ సింగ్, హన్స్రాజ్ అహిర్, రాంశంకర్, సుజనా చౌదరి, జయంత్ సిన్హా, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, బాబుల్ సుప్రియో, సాధ్వి నిరంజన్ జ్యోతి, విజయ్ సంప్లా... ప్రమాణ స్వీకారం చేసిన వారిలో వున్నారు. వీరిలో నలుగురు కేబినెట్ మంత్రులుగా, ముగ్గురు స్వతంత్ర హోదా కలిగిన మంత్రులుగా , 15 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కేంద్ర సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. టీడీపీ నాయకుడు సుజానా చౌదరి తొలిసారిగా కేంద్ర కేబినెట్ లో దక్కించుకున్నారు. పారిశ్రామికవేత్తగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన తర్వాత రాజకీయాలవైపు అడుగులు వేశారు. చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటూ టీడీపీలో వడివడిగా ఎదిగారు. రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్ లో అడుగుపట్టిన ఆయన కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇప్పటివరకు పత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ ఆయనకు మంత్రి పదవి దక్కడం విశేషం.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ కేంద్ర సహాయమంత్రి (స్వతంత్ర హోదా)గా ప్రమాణ స్వీకారం చేశారు.హైదరాబాద్ నగర రాజకీయాల్లో తనదైన మార్కుతో కార్యకర్తలతో సత్సంబంధాలున్న బండారు దత్తాత్రేయ గతంలో ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయ్ ప్రభుత్వంలో 1999 నుంచి 2004 సంవత్సరాల మధ్య పట్ణణాభివృద్ధి, రైల్వేశాఖా మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్నారు. దత్తాత్రేయ పాతబస్తీలోని గౌలిగూడలో ఓ నిరుపేద కుటుంబంలో 1947 జూన్ 12 తేదిన జన్మించారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌లో ప్రవేశించిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ రాజకీయనేతగా స్థాయికి ఎదిగారు. 




No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...