Sunday, November 16, 2014

ఐదో వన్డేలోను భారత్‌ గెలుపు....సిరీస్ క్లీన్ స్వీప్

 రాంచీ, నవంబర్ 16;  భారత్‌, శ్రీలంక మధ్య ఝార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన ఐదో వన్డేలో భారత్‌ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది.తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 286 పరుగులు చేసింది. శ్రీలంక కెప్టెన్‌ మాథ్యూస్‌ (139 నాటౌట్‌) శతకంతో శ్రీలంక భారీ పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్‌ ఈ లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి 48.4 ఓవర్లలోనే ఛేదించింది. భారత్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లి (139 నాటౌట్‌: 126 బంతుల్లో 12ఫోర్లు, 3 సిక్స్‌లు) మరోసారి ఛేదనలో సత్తా చాటుతూ అజేయ శతకంతో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.ప్రస్తుతం ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి తనలోని ఈ శైలిని మరింత మెరుగుపరుచుకున్నాడు. సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించడంలో ధోనీని మురిపించాడు. 14 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను నాయకుడిగా ముందుండి నడిపించాడు. రాయుడి(59)తో కలిసి మూడో వికెట్‌కు 136 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో భారత్‌ వరుసగా మూడు వికెట్లు కోల్పోయి ఒత్తిడి పెరిగిన సమయంలో కోహ్లి జోరు పెంచి సాధించాల్సిన పరుగుల రన్‌రేట్‌ పెరగకుండా జాగ్రత్త తీసుకున్నాడు. అక్షర్‌ పటేల్‌(17నాటౌట్‌)తో సమన్వయం చేసుకుంటూ జట్టును అజేయ శతకంతో గెలిపించాడు.1982 తర్వాత శ్రీలంకను భారత్‌ క్లీన్‌ స్వీప్‌ చేయడం ఇదే తొలిసారి. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 139 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, శ్రీలంక కెప్టెన్‌ మాథ్యూస్‌ సైతం 139 పరుగులతో నాటౌట్‌గా నిలవడం విశేషం.
ఐదు వన్డేల సిరీస్‌లో అద్భుతంగా రాణించిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో మొత్తం 329 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకం, రెండు అర్థ సెంచరీలు ఉన్నాయి. కాగా, ఐదో వన్డేలో అద్భుత ఆల్‌రౌండర్‌ ప్రదర్శన చేసిన శ్రీలంక కెప్టెన్‌ మాథ్యూస్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కింది. తొలుత బ్యాటింగ్‌లో శతకం(139 నాటౌట్‌)గా నిలవడమే గాకుండా బౌలింగ్‌లోనూ రాణించి 2 వికెట్లు తీశాడు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...