Tuesday, November 25, 2014

టి. పారిశ్రామిక విధానం సిద్ధం ... ఇక అనుమతులు వేగవంతం

హైదరాబాద్,నవంబర్ 25; దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యుత్తమ పారిశ్రామిక విధానం తెలంగాణలో అమలు కానుంది . శాసన సభా వ్యవహారాల   శాఖ మంత్రి హరీష్‌రావు అసెంబ్లి  లో నూతన పారిశ్రామిక విధానం ప్రవేశపెట్టారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికెట్ సిస్టమ్ పేరుతో సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.  ఇందులో భాగంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయనున్నారు. పరిశ్రమల అనుమతుల కోసం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కమిటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీ పనిచేయనుంది. కమిటీ నెలరోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇవ్వనుంది. మెగా ప్రాజెక్టుల అనుమతుల కోసం సీఎస్ అధ్యక్షతన పెట్టుబడుల సదుపాయాల బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు బిల్లులో పేర్కొన్నారు. మెగా ప్రాజెక్టు కోసం బోర్డు ద్వారా 15 రోజులోల తాత్కాలిక అనుమతులు లభించనున్నాయి. దరఖాస్తుదారునికి ఇబ్బంది కలుగకుండా అధికార యత్రాంగం పనిచేయనుంది. అనుమతుల వేగవంతానికి సమిష్టి దరఖాస్తు పద్దతిని అవలంభించనున్నారు. రాష్ట్రస్థాయి పరిశ్రమల శాఖ అదనపు డైరెక్టర్ హోదా స్థాయి నోడల్ ఏజెన్సీ, జిల్లా నోడల్ ఏజెన్సీగా జిల్లా పారిశ్రామిక కేంద్రం పనిచేయనుంది. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...