Wednesday, November 19, 2014

రణభూమిగా మారిన సత్ లోక్ ఆశ్రమం ... ఆచూకి లేని గురు రామ్ పాల్

Rampal Lives in 12-Acre Ashram, Owns BMWs, Mercsన్యూఢిల్లీ, నవంబర్‌ 18: హర్యానాలోని బర్వాలాలోగల వివాదాస్పద ‘గురు రామ్‌పాల్‌’ దుర్భేద్య దుర్గంలాంటి ‘సత్‌లోక్‌’ ఆశ్రమంలో మంగళవారం హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిపై గురువుతోపాటు ఆయన అనుచరులపై పోలీసులు 3కేసులు నమోదుచేశారు. కోర్టు ధిక్కారం కేసులో ఆయన అరెస్టుకు హైకోర్టు నాన్‌-బెయిలబుల్‌ వారంట్‌ జారీచేసింది. ఆయనను అరెస్టు చేసేందుకు ఆశ్రమం వద్దకు వెళ్ళిన  పారామిలిటరీ బలగాలపై బాబా కమాండో దళం   గా ప్రకటించుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో దాడికి దిగారు. యాసిడ్‌ సీసాలు, పెట్రోలు బాంబులు, రాళ్లు విసిరారు. అటుపైన పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. మరోవైపు దట్టమైన పొగల నడుమ నుంచి కాల్పుల శబ్దాలు కూడా వినిపించాయి. ఈ సంఘటనలలో 100 మంది పోలీసులు, పలువురు మీడియా ప్రతినిధులుసహా 200మందికిపైగా గాయపడ్డారు. 
బాబాను కచ్చితం గా అరెస్ట్‌చేసి, హైకోర్టులో హాజరుపరుస్తామని డీజీపీ చెప్పారు. ఆశ్రమంలోకి వెళ్లేందుకు ప్రహరీని కూల్చగా తమను అడ్డుకునేందుకు ఏర్పాటుచేసిన ఎల్పీజీ డంప్‌ కనిపించిందని, వేలసంఖ్యలో మహిళలు, పిల్లలను మానవ కవచాలుగా వాడుకుంటున్నారని ఆయన తెలిపారు . ఆశ్రమంలో  ఇంకా 5వేల మందికిపైగానే భక్తులు చిక్కుకున్నట్లు డీజీపీ వెల్లడించారు. ఆశ్రమం లోపల కొన్ని మృత దేహాలు ఉన్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు. అయితే పోలీసుల కాల్పుల్లో ఎవరూ మరణించలేదని ఆయన స్పష్టం చేసారు? బాబా రామ్‌పాల్‌ ఆశ్రమంలోనే ఉన్నారని ఆయన వెల్లడించారు. 
కాగా స్వామీజీ రామ్‌పాల్‌ను అరెస్టు చేస్తామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తెలిపారు. రామ్‌పాల్‌ అరెస్టయ్యే వరకు ఆశ్రమం వద్ద ఆపరేషన్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం రామ్‌పాల్‌పై చర్యలు ఉంటాయని వెల్లడించారు. రామ్‌పాల్‌పై దేశద్రోహం కేసు కింద చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...