Friday, November 14, 2014

టి.ఆర్.ఎస్. పై మజ్లిస్ కు భ్రమలు తొలగుతున్నాయా!

హైదరాబాద్ న వంబెర్ 14;  టి.ఆర్.ఎస్. సర్కారు మీద మిత్రపక్షం మజ్లిస్ కు భ్రమలు తొలగి పోయినట్టున్నాయి. మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్  తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి ప్రభుత్వం పై నిప్పులు కురిపిస్తూనే వున్నారు. శుక్రవారం నాడు కూడా అక్బరుద్దీన్ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బడ్జెట్ మీద చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే తెలంగాణ కోసం ఉద్యమం ఎందుకు చేశారా అనిపిస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం కోరానని చెప్పారు. అయితే, ఇంత వరకు సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్టానికి విద్యుత్ సమస్యలాగే ఆర్థిక సమస్య కూడా ఉందన్నారు. మరి ఆ సమస్యని ఎందుకు బహిర్గతం చేయడం లేదన్నారు. ప్రభుత్వం కొన్ని అంశాలను ఉద్దేశపూర్వకంగానే దాస్తోందని చెప్పారు. శ్వేతపత్రాలు ఇచ్చేందుకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో చెప్పాలన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...