Tuesday, November 18, 2014

కేపిటల్‌ రీజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆధారిటీకి ఎ.పి. క్యాబినెట్ ఆమోదం... ఇక ఎన్.టి.ఆర్. వైద్యసేవగా ఆరోగ్యశ్రీ...

హైదరాబాద్‌, నవంబర్‌ 18 : ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేపిటల్‌ రీజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆధారిటీకి (సీఆర్‌డీఏ) మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. సీఆర్‌డీఏకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. వైస్‌ ఛైర్మన్‌గా మున్సిపల్‌ శాఖ మంత్రి ఉంటారు. కేపిటల్‌ సిటీ, కేపిటల్‌ రీజయన్‌ అనే రెండు విభాగాలతో సీఆర్‌డీఏ పనిచేస్తుంది. 29 గ్రామాల పరిధిలో నూతన రాజధానిని నిర్మించనున్నారు.

సీఆర్‌డీఏ కోసం ఆర్డినెన్స్‌ జారీ చేయాలా? లేక చట్టం చేయాలా? అన్న దానిపై రైతులతో సమావేశం అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు. ఆరోగ్యశ్రీ పేరును ఎన్టీఆర్‌ వైద్యసేవగా మార్చాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్‌ సేవకింద రూ. 2.50 లక్షల నగదు రహిత వైద్యం అందిస్తారు. మంగపేట, బెరైటీస్‌ గనుల లీజును మంత్రివర్గం రద్దు చేసింది. బెరైటీస్‌ గనుల లీజులో భారీ అక్రమాలు జరిగాయని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. దీనిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించనుంది. గత ప్రభుత్వం జారీ చేసిన మైనింగ్‌ లీజులను రద్దు చేసి గ్లోబల్‌ టెండర్లను పిలవాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇసుక పాలసీలపై కూడా చర్చ జరిగింది. ఇసుక అమ్మకాల్లో మార్పులకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...