Saturday, November 8, 2014

ఎ.పి. రాజధాని సరిహద్దులు ఖరారు...


హైదరాబాద్‌, నవంబర్‌ 8 : రైతులు తనపై నమ్మకముంచి రాజధాని నిర్మాణానికి సహకరించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం రాజధాని భూసమీకరణపై మంత్రివర్గ ఉప సంఘంతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణంలో మొదటి లబ్దిదారులు రైతులు, బడుగు బలహీన వర్గాల వారే అవుతారని స్పష్టం చేశారు. అందరికీ న్యాయం చేసే బాధ్యత తనది అని బాబు హామీ ఇచ్చారు. 
 రాజధాని నిర్మాణంలో ప్రతి పౌరుడి పాత్ర ఉండాలని, అందరికీ ఒకటే పాలసీ ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. భూమి ఎంత కావాలన్నది భవిష్యత్‌ నిర్ణయిస్తుందన్నారు. రైతులు, రైతు కూలీలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. రూ.వంద ఆదాయం వచ్చే వారికి రూ.1000 వచ్చేలా చేస్తామని, రాజధాని పరిధిలో ఇళ్లు లేని వారికి పక్కా ఇళ్లు నిర్మాస్తామని భరోసా ఇచ్చారు. 
 
 రాజధానికి భూములిచ్చే రైతులకు రూ.లక్షన్నర వరకు ఒకేసారి రుణమాఫీ చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. భూములమ్ముకునే రైతులకు ఆదాయపన్ను మినహాయింపుపై కేంద్రంతో చర్చిస్తామని తెలిపారు. ఏడాదిలో రైతులకు హక్కు పత్రం అందజేస్తామని బాబు చెప్పారు. తమకు వచ్చిన వాటాను అమ్ముకునే సౌకర్యాన్ని సైతం కల్పిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అలాగే ఏపీ రాజధాని సరిహద్దులను చంద్రబాబు వెల్లడించారు.
- తూర్పు : ఆటోనగర్‌ - ప్రకాశం బ్యారేజీ(10 కిలోమీటర్లు)
- పడమర : బోరుపాలెం రింగ్‌రోడ్డు(6 కిలోమీటర్లు)
- ఉత్తరం : బోరుపాలెం- ప్రకాశం బ్యారుజీ(18 కిలోమీటర్లు)
- దక్షిణం : ఆటోనగర్‌ 16 కిలోమీటర్లు రింగ్‌రోడ్డు వరకు ఉంటుందని చంద్రబాబు తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...