Wednesday, November 5, 2014

లక్షా 637 కోట్లతో తెలంగాణ తొలి బడ్జెట్ ...

హైదరాబాద్ ,నవంబర్ 5; తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ ను అసెంబ్లీలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ లక్షా 637 కోట్లతోప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా బడ్జెట్ ను రూపొందించామని, ఇది కేవలం 10 నెలల బడ్జెట్ మాత్రమేనని వివరించారు. అమరుల సంక్షేమానికి రూ. 100 కోట్లు కేటాయించారు.  459 మంది అమరవీరులకు ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల పరిహారం అందించనున్నామని తెలిపారు. 
48648 కోట్ల ప్రణాళిక వ్యయాన్ని, 51989 కోట్ల రూపాయల ప్రణాళికేతర వ్యయాన్ని, 301 కోట్ల రెవెన్యూ మిగులు అంచనా, 17398 కోట్ల రూపాయల ఆర్దిక లోటును బడ్జెట్ లో ప్రతిపాదించారు . ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కోటిన్నర చొప్పున మొత్తం 234  కోట్లు కేటాయించారు . రాష్ట్ర సంక్షేమం కోసం రూ. 500 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు. సీఎం హామీలు, ప్రజా ప్రతినిధుల వినతుల కోసం ప్రత్యేక నిధి ని వెచ్చిస్తారు .వృద్ధులు, వితంతువులకు రూ. 1000, వికలాంగులకు రూ. 1500 ఫించన్లు ఇస్తున్నామని  ఆర్దిక మంత్రి ప్రకటించారు. చేనేత, బీడీ, గీత కార్మికుల పెన్షన్లు కూడా పెంచడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువుల ఫించన్ల కోసం రూ. 1315.77 కోట్లను, వికలాంగుల పెన్షన్ల కోసం రూ. 367.75 కోట్లను ఈ బడ్జెట్‌లో కేటాయించామని స్పష్టం చేశారు. ఫించన్లను నవంబర్ 8 నుంచి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. 
రహదారుల అభివృద్ధికి రూ.10వేల కోట్లు, మండల కేంద్రాల నుంచి జిల్లాలకు డబుల్ రోడ్లకు రూ.400 కోట్లు; విద్యుత్ రంగానికి మొత్తం రూ.3241 కోట్లు; 6, 000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కోసం జెన్ కోలో రూ.1000 కోట్ల పెట్టుబడి; 9, 000 చెరువుల అభివృద్ధికి రూ.2వేల కోట్ల కేటాయించారు. తెలంగాణలో దెబ్బతిన్న 45, 000 చెరువులను పునరుద్ధరణ; రైతులకు సోలార్ పంపు సెట్ల కోసం రూ.200 కోట్లు ప్రత్యేకించారు . 
  గృహ నిర్మాణానికి  రూ.1000 కోట్లు కేటాయించారు.

బీసీల సంక్షేమానికి రూ.2022 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి రూ.1030 కోట్లు; ఎస్సీల సబ్ ప్లాన్ కు రూ.7579 కోట్లు, ఎస్టీల సబ్ ప్లాన్ కు రూ.4559 కోట్లు; మహిళా శిశు సంక్షేమానికి రూ.221 కోట్లు, ఐసిడీఎస్ పథకానికి రూ.1103 కోట్లు; 2014-19 వరకు ఎస్సీల అభివృద్ధి కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వ లక్ష్యం; కళ్యాణ లక్ష్మీ (ఎస్సీ) పథకానికి రూ.150 కోట్లు, కళ్యాణ లక్ష్మీ (ఎస్టీ) పథకానికి రూ.80కోట్లు కేటాయించారు 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...