Sunday, November 23, 2014

డిసెంబర్‌ నుంచి ఆన్‌లైన్‌ భవిష్యనిధి ఉపసంహరణ

న్యూఢిల్లీ, నవంబర్‌ 23: దేశంలోని 5 కోట్లమందికిపైగా భవిష్యనిధి (పీఎఫ్‌) చందాదారులకు శుభవార్త. వారంతా ఎంతోకాలం నుంచీ ఎదురుచూస్తున్న ఆన్‌లైన్‌ భవిష్యనిధి ఉపసంహరణ విధానాన్ని డిసెంబర్‌ నుంచి అమలు చేయనున్నట్లు ‘ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ’ (ఈపీఎఫ్‌వో) ప్రకటించింది.   ఇప్పటివరకు    ఉద్యోగం మారడం లేదా విరమణ తర్వాత దరఖాస్తులను నేరుగా సమర్పించుకోవాల్సి వ స్తోంది. ఆ తర్వాత నెలలోగా క్లెయిమ్‌ పరిష్కా రం కావాల్సి ఉన్నా వివిధ కారణాలవల్ల రెండుమూడు నెలలు పడుతున్న సందర్భాలున్నాయి. ఆన్‌లైన్‌ పద్ధతి అమలులోకి వస్తే పీఎఫ్‌, బ్యాంకు ఖాతాలతో ఆధార్‌ అనుసంధానం చేసుకున్న చందాదారులకు దరఖాస్తు చేసిన మూడు రోజుల్లోనే ఖాతా బదిలీ లేదా నగదు జమ పూర్తయిపోతుంది. బయో మెట్రిక్  ప్రాతిపదికగల ఆధార్‌ అనుసంధానం వల్ల ఎలాంటి మోసాలకు, అవినీతికి తావుండదని ఒక అధికారి పేర్కొన్నారు. ఈ దిశగా ఇప్పటికే ఆధార్‌, బ్యాంకు ఖాతాల అనుసంధానంతో విశిష్ట ఖాతా సంఖ్య (యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌-యూఏఎన్‌) జారీచేసిన నేపథ్యంలో ఆన్‌లైన్‌ విధానం అమలు సులభతరం కానుంది. యూఏఎన్‌ ఉండటం వల్ల ఉద్యోగి ఎన్ని సంస్థలు మారినా, రిటైరయ్యేదాకా ఒకే ఖాతా సంఖ్య కొనసాగే వెసులుబాటు కూడా కలిగింది. ఇక ఆన్‌లైన్‌ పద్ధతిని అమలులోకి తెచ్చాక ఈ ఆర్థిక సంవత్సరం (2015 మార్చి 31)లోగా 20-30 శాతం పీఎఫ్‌ క్లెయిములను పరిష్కరించాలని ఈపీఎఫ్‌వో యోచిస్తోంది. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో ఖాతా బదిలీసహా 1.21 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...